RV - అక్షర దర్బార్

కేదారి దంపతులది ఆత్మహత్య!
కేదారి దంపతులది ఆత్మహత్య!
- అవమానంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న దంపతులు
- మంటల్లో తీవ్రంగా గాయపడిన కేదారి నిన్న రాత్రి మృతి
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు ఆయన భార్య మృతి
- హనుమకొండలో విషాదం

అక్షరదర్బార్, హనుమకొండ: మంటల్లో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లింగాల కేదారి ఫుడ్ కోర్టు యజమాని కేదారి భార్య లింగాల పుష్పలత మృతి చెందారు. ఆమె కొద్ది సేపటి క్రితం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. హనుమకొండ అదాలత్ జంక్షన్ వద్ద గల లింగాల కేదారి ఫుడ్ కోర్టు యజమాని కేదారి, ఆయన భార్య పుష్పలత బుధవారం రాత్రి మంటల్లో తీవ్రంగా గాయపడగా కేదారి ఆస్పత్రికి తరలించే క్రమంలో మరణించగా ఆయన భార్య పుష్పలత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే అగ్ని ప్రమాదం వల్ల చెలరేగిన మంటల్లో తీవ్రంగా గాయపడి లింగాల కేదారి, ఆయన భార్య పుష్పలత మృతి చెందలేదని, ఈ దంపతులది ఆత్మహత్య అని తెలిసింది. ఇంటి అద్దె బకాయి కోసం చెల్లించాలని ఇంటి ఓనరు తాళం వేయడంతో అవమాన భారం భరించలేక హోటల్ యజమాని లింగాల కేదారి ఆయన భార్య పుష్పలత ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పుటించుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.  ఇంటికి తాళం వేశానని, వచ్చి మీ తల్లిని తీసుకెళ్లాలని ఇంటి ఓనర్ లింగాల కేదారి కొడుకుతో మాట్లాడినట్లు ఉన్న ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లింగాల ఫుడ్ కోర్టు యజమాని కేదారి, ఆయన భార్య మృతి చెందడం హనుమకొండలో విషాదాన్ని నింపింది. కేదారి దంపతుల మృతిపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలిసింది.

ప్రశ్నించటమే నా బలం
ప్రశ్నించటమే నా బలం

- విద్యార్థి దశ నుంచే ప్రజా ఉద్యమాల్లో ఉన్న.. నిర్బంధాలే నన్ను నిలబెట్టాయి
- అప్పట్లో నా రాజకీయ గురువు సుధాకర్ గాంధీ
- కాంగ్రెసే నా శ్వాస.. పార్టీ కోసం ఆర్థికంగా రాజకీయంగా నష్టపోయా
- అయినా పార్టీ అధిష్టానాన్ని ఏనాడూ ధిక్కరించలే
- పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల మధ్య ఉంటా.. కష్టాలు వస్తే పారిపోయే రకం కాదు
- ప్రశ్నించకపోతే సమస్యలు పరిష్కారం కావు.. ప్రజల పక్షాన నిలబడటమే నా పునాది
- పీఏసీఎస్ నుంచి ఆయిల్ ఫెడ్ వరకు అడుగడుగునా రైతు సంక్షేమమే నా ధ్యేయం
- గ్రేటర్ వరంగల్ మేయర్ స్థానంతో పాటు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉంటా
- డీలిమిటేషన్ తర్వాతే నియోజకవర్గంపై నిర్ణయం
- రిజర్వేషన్ నాకు కలిసి రాకపోతే బరిలోకి నా కూతురు నిఖితారెడ్డి
- డిజిటల్ మీడియా చిట్ చాట్ లో సీనియర్ కాంగ్రెస్ నేత, ఆయిల్ ఫెడ్ తాజా మాజీ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి

అక్షరదర్బార్, హనుమకొండ

మాది టేకులగూడెం విలేజ్. కాంగ్రెస్ కుటుంబం. నాన్న సర్పంచ్ గా పనిచేశారు. ప్రజలు యునాన్మస్ గా ఎన్నుకున్నరు. నేను విద్యార్థి దశ నుంచే ప్రజల కోసం పనిచేశా. ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న. అనేక నిర్బంధాలను ఎదుర్కొంటూ ఎదిగినవాడిని. కష్టాలు వచ్చినప్పుడు పారిపోయే వ్యక్తిని కాదు. పదవులు ఉన్నా లేకపోయినా, గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజల మధ్యే ఉంటున్న. నిరంతరం పార్టీ కోసం పనిచేస్తున్నానని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌ కార్పొరేషన్‌ తాజా మాజీ చైర్మన్‌ జంగా రాఘవరెడ్డి అన్నారు. ఒక మాట మాత్రం స్పష్టంగా చెబుతున్నా.. జంగా అంటే ఒక వ్యక్తి మాత్రమే కాదు.. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నాకంటూ ప్రత్యేక ఓటు బ్యాంకు ఉంది. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌, పాలకుర్తి, వరంగల్‌ పశ్చిమ, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో నాకంటూ ప్రత్యేకంగా పనిచేసే కార్యకర్తల బలం, ఓటు బ్యాంకు ఉందని ఆయన చెప్పారు. ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపులో నా పాత్ర కీలకంగా ఉంటుందని జంగా పేర్కొన్నారు. తెలంగాణ డిజిటల్‌ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌లో రాఘవరెడ్డి మాట్లాడారు. తన రాజకీయ ప్రస్థానం, ప్రజా ఉద్యమాల్లో అనుభవాలు, కాంగ్రెస్‌ పార్టీతో అనుబంధం, రైతుల కోసం చేసిన కార్యక్రమాలు, గ్రేటర్‌ వరంగల్‌ రాజకీయాలు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్యం తదితర అంశాలపై జంగా తన మనసులోని మాటలను పంచుకున్నారు. ఆయన ఏమన్నారంటే.. రాఘవరెడ్డి మాటల్లో..

- నిర్బంధాల నుంచే నా రాజకీయ ప్రస్థానం

మొదటి నుంచీ మాది కాంగ్రెస్‌ పార్టీ కుటుంబమే. అయితే నేను పాఠశాల దశ నుంచే విద్యార్థి రాజకీయాల్లోకి వచ్చిన. ప్రజల కోసం పనిచేయడం ప్రారంభించా. ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్న క్రమంలో అప్పటి ప్రభుత్వాల నుంచి అనేక నిర్బంధాలను ఎదుర్కొన్నా. పోలీసుల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. ఆ నిర్బంధాలు, ప్రజా ఉద్యమాలే నన్ను నాయకుడిగా తీర్చిదిద్దాయి. విద్యార్థి దశలో నా రాజకీయ గురువు సుధాకర్‌గాంధీ. ఆయన వల్లే నేను ప్రజా ఉద్యమాల్లోకి వచ్చా. ప్రజల సమస్యలపై ప్రశ్నించడం నేర్చుకున్నా. ప్రశ్నించకుండా ఉంటే సమస్యలు పరిష్కారం కావు. ప్రజల కోసం ప్రశ్నించినప్పుడే ప్రజలు మన వెంట నడుస్తారు. అదే నమ్మకంతో ఇన్నేళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నా. నిర్బంధాలు, కేసులు, కష్టాలు వచ్చినప్పుడల్లా వెనక్కి వెళ్లకుండా మరింత బలంగా పనిచేశా. ప్రజల మధ్య ఉండటం, ప్రజల సమస్యలపై పోరాడటం నా రాజకీయ జీవితానికి మొదటి నుంచీ పునాది.

- రెండుసార్లు ఏకగ్రీవంగా గెలిచా

కాంట్రాక్టర్‌గా, వ్యాపారవేత్తగా పనిచేస్తూనే రాజకీయాల్లోకి వచ్చా. సీరియస్‌ పొలిటిషియన్‌గా మారిన తర్వాత కాజీపేట దర్గా పీఏసీఎస్‌ చైర్మన్‌గా రెండుసార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యా. ఆ తర్వాత ఉమ్మడి వరంగల్‌ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా పనిచేశా. ఆ సమయంలో జిల్లా రైతులకు మేలు చేసేలా అనేక కార్యక్రమాలు చేపట్టా. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడంతోపాటు వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేశా. డీసీసీబీని మరింత బలోపేతం చేయడానికి కూడా పనిచేశా. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆయిల్‌ఫెడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టా. రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ సాగును పెంచేందుకు అహర్నిశలు పనిచేశా. రైతులకు దీర్ఘకాలికంగా ఆదాయం వచ్చేలా ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహించా. తెలంగాణవ్యాప్తంగా ఆయిల్‌పామ్‌ సాగు పెరిగింది. రైతులకు అది ఎంతో లాభదాయకమైన పంటగా మారుతోంది. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే నా లక్ష్యం. ఏ పదవిలో ఉన్నా రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలన్నదే నా ఆలోచన.
- ప్రత్యేకంగా పనిచేసే సైన్యం
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా జనగామ, స్టేషన్‌ఘనపూర్‌, పాలకుర్తి, వరంగల్‌ పశ్చిమ, వర్ధన్నపేటలో నాకు ప్రత్యేకంగా పనిచేసే సైన్యం ఉంది. నాకంటూ ఓటు బ్యాంకు ఉంది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల గెలుపులో నా పాత్ర కూడా ఉంటుంది. జంగా అంటే ఒక వ్యక్తి కాదు.. వివిధ నియోజకవర్గాల్లో ప్రజలతో నాకు ఉన్న అనుబంధం, కార్యకర్తల బలం కలిసిన రాజకీయ శక్తి.

- గ్రేటర్‌ మేయర్‌ రేసులో ఉన్నా

అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటూ పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్‌ నాయకుడిగా కాంగ్రెస్‌ పార్టీ నన్ను గుర్తిస్తుందన్న నమ్మకం నాకు ఉంది. పార్టీపై నాకు చాలా విశ్వాసం ఉంది. గ్రేటర్‌ వరంగల్‌ ప్రజలు కూడా నన్ను ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారన్న నమ్మకం ఉంది. రానున్న గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో మేయర్‌ రేసులో ఉన్నా. నాకు రిజర్వేషన్ కలిసి రాకపోతే నా కూతురు డాక్టర్‌ నిఖితారెడ్డి బరిలో ఉంటుంది. గ్రేటర్‌ వరంగల్‌ ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనేక దశాబ్దాలుగా పనిచేస్తున్నా. వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నా. మహిళలు, కార్మికులు, రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులు.. ఇలా అన్ని వర్గాల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నా. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. ఇప్పటికే క్షేత్రస్థాయిలో సీరియస్‌గా పనిచేస్తున్నా. ప్రజల్లో ఉండటం నాకు కొత్త కాదు. పదవి ఉన్నప్పుడే ప్రజల దగ్గరకు వెళ్లే రాజకీయ నాయకుడిని కాదు. పదవి ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యే ఉంటా.

- వచ్చే అసెంబ్లీ ఎన్నికలే నా టార్గెట్‌

దేశవ్యాప్తంగా జరుగుతున్న అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా తెలంగాణలో కూడా నియోజకవర్గాల రూపురేఖలు మారే అవకాశం ఉంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల స్వరూపం కూడా మారవచ్చు. డీలిమిటేషన్‌ అంశాన్ని నేను ఆసక్తిగా గమనిస్తున్నా. నియోజకవర్గాల పునర్విభజన ఎలా జరుగుతుందనే దానిపైనే నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది ఆధారపడి ఉంటుంది. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా బరిలో ఉంటా. ఎక్కడి నుంచి అనేది డీలిమిటేషన్‌ తర్వాత నిర్ణయించుకుంటా. కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు కూడా నా పట్ల సానుకూలంగా ఉన్నారన్న నమ్మకం ఉంది. అనేక ఎన్నికల్లో పార్టీ పెద్దలు, అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి పనిచేశా. ఎక్కడా ధిక్కరించలేదు. ఈ క్రమంలో సీనియర్‌ నాయకుడిగా రాజకీయంగా, ఆర్థికంగా చాలా నష్టపోయా. అయినా పార్టీని వీడలేదు. పార్టీ కోసం పనిచేస్తూనే ఉన్నా. వేచి చూస్తున్న. పార్టీ మారే వ్యక్తిని కాదు. నాది ఆ క్యారెక్టర్ కాదు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నాకు మంచి అవకాశం ఇస్తుందన్న నమ్మకం ఉంది. డీలిమిటేషన్ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవేళ రిజర్వేషన్ నాకు కలిసి రాకపోతే నా బిడ్డ నిఖితారెడ్డి బరిలోకి దిగుతది.

- ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిందే

రాజకీయాలతో పాటు పాత్రికేయ రంగం కూడా కొంత కలుషితమైందన్న బాధ నాకు ఉంది. ఒకప్పుడు రాజకీయాల్లో నైతిక విలువలకు ప్రాధాన్యం ఉండేది. ఇప్పుడు పవర్‌ పాలిటిక్స్‌, మనీ పాలిటిక్స్‌ పెరిగిపోయాయి. దీంతో ప్రజా ప్రయోజనాలు వెనక్కి వెళ్లి వ్యక్తిగత ప్రయోజనాలే ముందుకు వస్తున్నాయి. ప్రజల కోసం పనిచేయాల్సిన రాజకీయ వ్యవస్థలో వ్యక్తిగత ప్రయోజనాలు పెరగడం మంచిది కాదు. ఇదే సమయంలో పాత్రికేయ రంగంలోనూ కొన్ని మార్పులు వస్తున్నాయి. ఏదేమైనా పత్రికలు ప్రతిపక్ష పాత్ర పోషించాలి. జర్నలిస్టులు ప్రజల పక్షాన ఉండాలి. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావాలి. ప్రజల కోసమే రాయాలి. ప్రభుత్వాలు తప్పు చేస్తే ప్రశ్నించాలి. ప్రజలకు సంబంధించిన అంశాలను నిర్భయంగా రాయాలి. అలా అయితేనే ప్రభుత్వాలు, ఇతర వ్యవస్థలు కూడా ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసే పరిస్థితి ఉంటుంది. ప్రజా ప్రయోజనాల పరిరక్షణ బాధ్యతలో జర్నలిస్టుల పాత్ర చాలా కీలకం.

హైకమాండ్ ను బ్లాక్‌మెయిల్‌ చేశారు
హైకమాండ్​ ను బ్లాక్‌మెయిల్‌ చేశారు
- పట్టుబట్టి నన్ను బర్తరఫ్‌ చేయించారు
- సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ ఆరోపణలు
- తన కుమార్తె వ్యాఖ్యలకు నన్నెలా బాధ్యురాలిని చేస్తారని నిలదీత
- రాజీనామా చేయమని నన్నెవరూ అడగలేదని వివరణ
- అధిష్ఠానానికి ఇచ్చిన లేఖను మీడియాకు ఇచ్చిన కొండా సురేఖ

అక్షరదర్బార్, హైదరాబాద్: మంత్రివర్గం నుంచి తనను బర్తరఫ్‌ చేయాలన్న నిర్ణయంపై వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ స్పందించారు. గురువారం హైదరాబాదులో మీడియాతో మాట్లాడిన ఆమె తనని మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయడాన్ని ఖండించారు. నిర్ణయానికి ముందు తన వివరణ తీసుకోవాల్సిందని అన్నారు. తన కుమార్తె వ్యాఖ్యలకు తననెలా బాధ్యురాలిని చేస్తారని ప్రశ్నించారు. తన కుమార్తె స్వతంత్ర మహిళ అని, ఆమె వ్యాఖ్యలు ఆమెవేనని పేర్కొన్నారు. మీడియాకు ఇచ్చిన నోట్‌లో ఊరు, పేరు లేదు.

- రేవంత్‌ రెడ్డి పట్టుబట్టి
ఉరిశిక్ష పడిన ఖైదీని కూడా చివరి కోరిక అడుగుతారన్న కొండా సురేఖ తనను మాత్రం ఏ వివరణ అడగకుండానే తొలగించారని, తనను ఇలా ఏకపక్షంగా తొలగించటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తనను తొలగించడం అధిష్ఠానానికి కూడా ఇష్టం లేదన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి పట్టుబట్టి తనని బర్తరఫ్‌ చేయిస్తున్నారని, 'బర్తరఫ్‌ చేస్తారా? నన్ను వెళ్లిపోమ్మంటారా' అని అధిష్ఠానాన్ని బ్లాక్‌మెయిల్‌ చేశారని ఆమె ఆరోపించారు.

- కక్షగట్టి వేధించారు
తన మీద, తన మాజీ ఓఎస్‌డీ మీద కుట్రలు చేస్తున్నారని, దీని వెనక వేం నరేందర్‌రెడ్డి, పొంగులేటి, కొండల్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, మరికొందరు ఉన్నారన్నారు. అందరూ కలిసి కావాలని కక్షగట్టి నన్ను, సుమంత్‌ కుటుంబాన్ని వేధించారని విమర్శించారు. సుమంత్‌పై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
- సీఎంపై నేను విమర్శలు చేయలేదు
"సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీపై నేను ఎలాంటి విమర్శలు చేయలేదు. ఒకప్పుడు మల్లు రవి కూడా కాంగ్రెస్‌ను తిట్టారు. మాజీ సీఎం రోశయ్య, జైపాల్‌రెడ్డి కూడా ఇందిరాగాంధీని తిట్టారు. నా కుమార్తె వ్యాఖ్యలకు నాపై చర్యలు తీసుకోవటం బాధాకరం. రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ పదవి తెచ్చుకున్నారని తిట్టినవారికి పదువులు ఇచ్చారు. నన్ను తొలగించినందుకు ఏమీ బాధపడటం లేదు. కారణం చెప్పకుండా తొలగించడమే చాలా బాధాకరం. బీసీ మహిళను ఇలా అవమానకరంగా తొలగించటం బాధాకరం. కారణం చెప్పకుండా తొలగించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. కారణం చెప్పాల్సిన బాధ్యత సీఎం, ఏఐసీసీపై ఉంది" అని కొండా సురేఖ అన్నారు.
- వివక్ష చూపారు
మంత్రిగా తనకు ఎలాంటి అధికారాలు లేకుండా చేశారని, తన ప్రమేయం లేకుండానే తన శాఖలో నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. తనకు తెలియకుండా తన ఓఎస్‌డీ సుమంత్‌ను తప్పించారని, అభివృద్ధి విషయంలో తన నియోజకవర్గంపై వివక్ష చూపారని విమర్శించారు. తన శాఖలోని అంశాలపై కడియం శ్రీహరి జోక్యం చేసుకున్నారని, తన శాఖలోని అధికారులతో కడియం సమీక్షలు నిర్వహించారని తెలిపారు.

- ప్రజల్లో వ్యతిరేకత ఉంది
మంత్రులందరూ సంతోషంగా ఉన్నారా? గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పాలని సురేఖ కోరారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ సంతోషంగా లేరనే విషయం అందరికీ తెలుసనని తెలిపారు. ఇప్పటికైనా అందరూ బయటికి వచ్చి ధైర్యంగా మాట్లాడాలని సూచించారు. ప్రజలకు సేవ, అభివృద్ధి చేయలేకపోతున్నామనే బాధ అందరిలో ఉందని, పనుల జరగాలంటే ఎవరివద్దకు వెళ్లాలో తెలియని స్థితిలో ఎమ్మెల్యేలు ఉన్నారని ఆరోపించారు. ఇస్తామన్న హామీలు నెరవేర్చకపోవటం వల్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని స్పష్టం చేశారు.

- ఎమ్మెల్యేగా కొనసాగుతా?
క్షేత్రస్థాయి పరిస్థితిపై ప్రభుత్వం సర్వే చేయించుకుంటే మంచిదని సూచించారు. తాను పునరాలోచించుకోమని చెప్పనని, పార్టీ తీరు మారాల్సిన అవసరం ఉందని తెలిపారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే చాలా మార్పులు చేసుకోవాలని, రేవంత్‌ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని హితువు పలికారు. తనవైపు ఒక వేలు చూపితే రేవంత్‌రెడ్డి వైపు నాలుగువేళ్లు చూపుతాయని ఎద్దేవా చేశారు. ప్లాన్‌-బిపై ఇంకా ఏమీ ఆలోచించుకోలేదనిఎమ్మెల్యేగా కొనసాగుతానని, కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు.

- ఇంకా ఆలోచించుకోలేదు
తన కుమార్తె వ్యాఖ్యలను తాను ఖండించాల్సిన అవసరం లేదన్న సురేఖ తన కుమార్తె వ్యక్తిగత అభిప్రాయాన్ని తప్పుపట్టే అధికారం తనకు లేదని స్పష్టం చేశారు. అధిష్ఠానానికి తాను ఇచ్చిన లేఖను మీడియాకు ఇస్తున్నానని, భవిష్యత్ కార్యాచరణపై ఇంకా ఆలోచించుకోలేదని తెలిపారు. జగ్గారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై ఏం నిర్ణయం తీసుకున్నారని ఆమె నిలదీశారు.

- రేవంత్‌ రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలి
తాను తప్పు చేయలేదని, తనకు పశ్చాత్తాపం లేదని కొండా సురేఖ వెల్లడించారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. వైఎస్‌ఆర్‌ తర్వాత రేవంత్‌ రెడ్డినే ఎక్కువ అభిమానించానని, రేవంత్‌ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు, సీఎం కావాలని తానే ముందు కోరుకున్నానని పేర్కొన్నారు.

- సంతోషంగా ఉంది
తనపై కక్షపూరితంగా చర్యలు తీసుకున్నారని భావిస్తున్నానన్న కొండా సురేఖ తన వల్ల ముగ్గురు బీసీ మహిళలకు పదవులు రావటం సంతోషకరమని తెలిపారు. తన కోసం చిన్నారెడ్డిపై వేటు వేయటం సరికాదని అభిప్రాయపడ్డారు.
"నన్ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయడాన్ని ఖండిస్తున్నా. రాజీనామా చేయమని నన్నెవరూ అడగలేదు. నా వివరణ వినకుండా నేరుగా తొలగించటం సరికాదు. నిర్ణయానికి ముందు నా వివరణ తీసుకోవాల్సింది. నా కుమార్తె వ్యాఖ్యలకు నన్నెలా బాధ్యురాలిని చేస్తారు?. నేను తప్పు చేయలేదు. నాకు పశ్చాత్తాపం లేదు. సీఎం రేవంత్‌ రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలి. వైఎస్‌ఆర్‌ తర్వాత రేవంత్‌రెడ్డినే ఎక్కువ అభిమానించాను. రేవంత్‌ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు, సీఎం కావాలని నేనే ముందు కోరుకున్నా. నాపై కక్షపూరితంగా చర్యలు తీసుకున్నారని భావిస్తున్నా. భవిష్యత్ కార్యాచరణపై ఇంకా ఆలోచించుకోలేదు. నా వల్ల ముగ్గురు బీసీ మహిళలకు పదవులు రావటం సంతోషకరం. నా కోసం చిన్నారెడ్డిపై వేటు వేయటం సరికాదు" అని సురేఖ అన్నారు.

నో కాంప్రమైజ్
నో కాంప్రమైజ్

- ఫేమ్ కోసం కాదు.. ఫలితం కోసం పనిచేస్తా

- గంజాయిపై స్పెషల్ నిఘా పెట్టాం.. రంగంలోకి 'సంఘమిత్ర'లు
- గంజాయి సరఫరాదారులపై రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నాం
- పక్కా సమాచారం ఇస్తే తక్షణ దాడులు నిర్వహిస్తాం
- మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టాం
- సైబర్ బాధితులకు త్వరిత న్యాయం.. నేరాల అదుపునకు పెట్రోలింగ్
- రౌడీయిజానికి నో ఛాన్స్.. సీసీ కెమెరాల పర్యవేక్షణ ఎస్ఐలదే
- కాలనీల్లో నిఘా పటిష్టం.. నేరస్తుల ఆట కట్టిస్తాం
- ఏరియాను బట్టి యాక్షన్ ప్లాన్.. కేయూ, హసన్ పర్తిలో భూ వివాదాలపై దృష్టి
- భూ సమస్యల్లో ఏకపక్ష జోక్యం వద్దు.. ఎస్ఓపీ దాటితే చట్టపరమైన చర్యలు
- ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నాం
- ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సైతం సిద్ధం.. ఇప్పటికే వాట్సాప్ ఎఫ్ఐఆర్ లు
- చట్టంపై నమ్మకంతో విధులు.. నేరాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం
- వరంగల్ పోలీసింగ్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది
- డిజిటల్ మీడియా చిట్ చాట్ లో వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేతారెడ్డి

అక్షరదర్బార్, హనుమకొండ

వరంగల్‌ ప్రాంతంలో నేను తొలిసారిగా పూర్తిస్థాయిలో విధులు నిర్వహిస్తున్న. గతంలో ఒకసారి వచ్చి 15 రోజులు డ్యూటీ చేశాను. వరంగల్‌కు చారిత్రాత్మక నేపథ్యం ఉంది. అంతేకాదు వరంగల్ పోలీసింగ్ కూ ప్రత్యేక గుర్తింపు ఉంది. హైదరాబాద్‌ తర్వాత రాష్ట్రంలో ప్రధాన నగరంగా వరంగల్ ఎదిగింది. ఒకవైపు అర్బన్‌ ప్రాంతం, మరోవైపు రూరల్‌ ప్రాంతాలు ఉండటంతో కమిషనరేట్‌లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. హైదరాబాద్‌ పూర్తిగా అర్బన్‌ కావడంతో అక్కడి పోలీసింగ్‌కు, వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసింగ్‌కు తేడా ఉంటుంది. రెండు ప్రాంతాల పరిస్థితులను బ్యాలెన్స్‌ చేస్తూ ముందుకెళ్లాల్సి ఉంటుందని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేతారెడ్డి అన్నారు. డిజిటల్ మీడియా ప్రతినిధుల చిట్ చాట్ లో ఆమె మాట్లాడారు. ఏమన్నారంటే సీపీ శ్వేతారెడ్డి మాటల్లోనే..

- గంజాయిపై ప్రత్యేక నిఘా
నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాలను పట్టిపీడిస్తున్న గంజాయిపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టాం. మత్తు పదార్థాల వినియోగం, సరఫరాను అరికట్టేందుకు పోలీసులతో పాటు సమాజ భాగస్వామ్యాన్ని పెంచుతున్నాం. ఇందులో భాగంగా మహిళా సంఘాల సహకారం తీసుకుంటున్నాం. మత్తు పదార్థాల వల్ల కుటుంబాలు, యువతపై పడుతున్న ప్రభావాన్ని తల్లులుగా మహిళలకు బాగా అర్థమవుతుంది. అందుకే వారిని భాగస్వాములను చేస్తున్నామన్నాం. మహిళా సంఘాల సభ్యులకు ‘సంఘమిత్రలు’గా నామకరణం చేసి గంజాయి, ఇతర నేరాలపై అవగాహన కల్పిస్తున్నాం. తాజాగా జనగామలో జిల్లా వ్యాప్తంగా మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించి, గంజాయికి అలవాటు పడిన వారిని గుర్తించడం, మత్తు పదార్థాల ప్రభావం, సమాజంలో జరుగుతున్న నేరాలపై వారికి అవగాహన కల్పించడం జరిగింది. ప్రతి గ్రామంలో మహిళా సంఘాలు అందుబాటులో ఉండటంతో గంజాయి వినియోగం, సరఫరాపై క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించేందుకు ఇది దోహదపడుతుంది.
- రౌడీషీట్ ఓపెన్..
గంజాయి కేసుల్లో పదేపదే పట్టుబడుతున్న వారిపై నిఘా పెంచడంతో పాటు అవసరమైన చోట రౌడీషీట్లు ఓపెన్‌ చేస్తున్నాం. అయితే గంజాయి సరఫరాపై ప్రజల నుంచి పక్కా సమాచారం రావడం లేదు. ‘ఇక్కడ ఉందట.. వాళ్లు తాగుతున్నారట’ అనే సాధారణ సమాచారం కాకుండా, సరఫరా చేసే వ్యక్తులు, ప్రాంతాలు, వాహనాలు తదితరాలపై పక్కా సమాచారం అందిస్తే తక్షణమే దాడులు నిర్వహించి చర్యలు తీసుకుంటాం. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతాం.

- సైబర్‌ క్రైం.. మిల్స్‌ కాలనీపై ప్రత్యేక దృష్టి
వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో సైబర్‌ నేరాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. సైబర్‌ కేసులను ప్రాపర్‌గా ఇన్వెస్టిగేట్‌ చేసి, బాధితులకు న్యాయం జరిగేలా కేసుల పరిష్కారంపై దృష్టి సారించాం. మరోవైపు క్రైం ఇష్యూలు ఎక్కువగా నమోదవుతున్న మిల్స్‌ కాలనీ పోలీస్‌స్టేషన్‌పై ప్రత్యేక ఫోకస్‌ పెట్టాం. అక్కడ అదనపు ఎస్‌ఐని నియమించి క్రైం కంట్రోల్‌, పెట్రోలింగ్‌, నిఘాను మరింత బలోపేతం చేస్తున్నాం.

- రౌడీయిజానికి నో ఛాన్స్‌
రౌడీయిజాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోం. నేర చరిత్ర కలిగిన వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచడంతో పాటు అవసరమైన చోట చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. నగరంలోని కాలనీలు, ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాల పనితీరుపైనా దృష్టి సారించాం. సీసీ కెమెరాల నిర్వహణ, పనితీరును పరిశీలించే బాధ్యతను సంబంధిత పోలీస్‌స్టేషన్ల ఎస్‌ఐలకు అప్పగించాం. కాలనీ సమావేశాలు నిర్వహించి కెమెరాలను సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం.

- ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు ప్రాధాన్యం
వరంగల్‌ నగరంలో ట్రాఫిక్‌ సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ట్రాఫిక్‌ అనేది నిరంతరం ఉండే సమస్య. పోలీసుల చర్యలతో పాటు వాహనదారులు, ప్రజల సహకారం కూడా అవసరం. ముఖ్యంగా యూటర్న్‌లు, ఫ్రీ లెఫ్ట్‌లు, రోడ్డు సేఫ్టీ అంశాలపై దృష్టి సారిస్తున్నాం. కరుణాపురంలో వైన్స్‌కు పెద్ద పర్మిట్‌ రూమ్‌ ఉండటంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌లు, ప్రమాదాలు చోటుచేసుకుంటున్న దృష్ట్యా ఎక్సైజ్‌ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో మూడు యూటర్న్‌లను మూసివేసినం. దీంతో ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్‌ సాఫీగా సాగుతోంది.

- ప్రజల సేఫ్టీ.. శాఖల సమన్వయంతో చర్యలు
ప్రజల సేఫ్టీనే పోలీసింగ్‌లో ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాం. ట్రాఫిక్‌, ఫ్రీ లెఫ్ట్‌లు, ఫుట్‌పాత్‌ ఆక్రమణలు వంటి సమస్యలను ఒక్కసారిగా కాకుండా విడతల వారీగా పరిష్కరించుకుంటూ వెళ్తామన్నాం. పోలీసు శాఖ ఒక్కటే అన్ని సమస్యలను పరిష్కరించలేదు. మున్సిపల్‌ కార్పొరేషన్‌, ఎక్సైజ్‌, రెవెన్యూ తదితర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటికే కార్పొరేషన్‌ అధికారులతో సమావేశం నిర్వహించాం. అధికారులు చర్యలు తీసుకున్నా ప్రజల భాగస్వామ్యం లేకుండా సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యం కాదు.

- స్టేషన్ల వారీగా క్రైం మ్యాపింగ్‌
కమిషనరేట్‌ పరిధిలోని ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో నమోదవుతున్న కేసుల స్వభావాన్ని ప్రత్యేకంగా పరిశీలిస్తున్నాం. మిల్స్‌ కాలనీ, మట్వాడ, ఇంతేజార్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో క్రైం కేసులు ఎక్కువగా ఉంటే, కేయూ, హసన్‌పర్తి ప్రాంతాల్లో భూ వివాదాలకు సంబంధించిన కేసులు అధికంగా నమోదవుతున్నాయి. స్టేషన్‌ వారీగా క్రైం ప్యాటర్న్‌ను గుర్తించి, ఆయా ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా నివారణ చర్యలు చేపడుతున్నాం.

- భూ వివాదాల్లో ఎస్‌ఓపీనే ప్రామాణికం
భూ సమస్యల పరిష్కారంలో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం, పోలీస్‌ శాఖ రూపొందించిన ప్రత్యేక స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ)ను పక్కాగా అమలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించిన. భూ వివాదాల్లో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా జోక్యం చేసుకోకుండా ఎస్‌ఓపీ ప్రకారం వ్యవహరించాల్సి ఉంటుంది. నేను కూడా ఎస్‌ఓపీని తప్పనిసరిగా పాటిస్తాను. నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు ఉంటాయి.

- సాంకేతిక వినియోగం...
పరిపాలనా, పోలీసింగ్ పటిష్టత కోసం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వినియోగానికి సన్నద్ధంగా ఉన్నాం. రాష్ట్ర స్థాయిలో తీసుకునే నిర్ణయాలను బట్టి ఏఐ వంటి సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించి ప్రజలకు విస్తృతమైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. ఇప్పటికే వాట్సప్ ఎఫ్ఐర్ లు స్వీకరిస్తున్నం.
- ఫేమ్‌ కోసం కాదు.. ఫలితం కోసం
పోలీసు అధికారిగా పేరు, ఫేమ్‌ కోసం పనిచేయను. చట్టాన్ని నమ్మి, దాని ప్రకారమే విధులు నిర్వర్తిస్తా. నాకు చట్టపై నమ్మకం ఉంది. అలాగే శిక్ష పడే వరకు వేచి చూసే ఓపిక కూడా ఉంది. పోలీసింగ్‌ అంటే ప్రభావవంతంగా ఉండటంతో పాటు దాని ఫలితం ప్రజలకు కనిపించాలన్నదే నా లక్ష్యం. ప్రజలకు భద్రత కల్పించడం, నేరాలను నియంత్రించడం, సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం చూపించడంపైనే నా దృష్టి ఉంటుంది.

నో కాంప్రమైజ్
నో కాంప్రమైజ్

- ఫేమ్ కోసం కాదు.. ఫలితం కోసం పనిచేస్తా

- గంజాయిపై స్పెషల్ నిఘా పెట్టాం.. రంగంలోకి 'సంఘమిత్ర'లు
- గంజాయి సరఫరాదారులపై రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నాం
- పక్కా సమాచారం ఇస్తే తక్షణ దాడులు నిర్వహిస్తాం
- మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టాం
- సైబర్ బాధితులకు త్వరిత న్యాయం.. నేరాల అదుపునకు పెట్రోలింగ్
- రౌడీయిజానికి నో ఛాన్స్.. సీసీ కెమెరాల పర్యవేక్షణ ఎస్ఐలదే
- కాలనీల్లో నిఘా పటిష్టం.. నేరస్తుల ఆట కట్టిస్తాం
- ఏరియాను బట్టి యాక్షన్ ప్లాన్.. కేయూ, హసన్ పర్తిలో భూ వివాదాలపై దృష్టి
- భూ సమస్యల్లో ఏకపక్ష జోక్యం వద్దు.. ఎస్ఓపీ దాటితే చట్టపరమైన చర్యలు
- ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నాం
- ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సైతం సిద్ధం.. ఇప్పటికే వాట్సాప్ ఎఫ్ఐఆర్ లు
- చట్టంపై నమ్మకంతో విధులు.. నేరాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం
- వరంగల్ పోలీసింగ్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది
- డిజిటల్ మీడియా చిట్ చాట్ లో వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేతారెడ్డి

అక్షరదర్బార్, హనుమకొండ

వరంగల్‌ ప్రాంతంలో నేను తొలిసారిగా పూర్తిస్థాయిలో విధులు నిర్వహిస్తున్న. గతంలో ఒకసారి వచ్చి 15 రోజులు డ్యూటీ చేశాను. వరంగల్‌కు చారిత్రాత్మక నేపథ్యం ఉంది. అంతేకాదు వరంగల్ పోలీసింగ్ కూ ప్రత్యేక గుర్తింపు ఉంది. హైదరాబాద్‌ తర్వాత రాష్ట్రంలో ప్రధాన నగరంగా వరంగల్ ఎదిగింది. ఒకవైపు అర్బన్‌ ప్రాంతం, మరోవైపు రూరల్‌ ప్రాంతాలు ఉండటంతో కమిషనరేట్‌లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. హైదరాబాద్‌ పూర్తిగా అర్బన్‌ కావడంతో అక్కడి పోలీసింగ్‌కు, వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసింగ్‌కు తేడా ఉంటుంది. రెండు ప్రాంతాల పరిస్థితులను బ్యాలెన్స్‌ చేస్తూ ముందుకెళ్లాల్సి ఉంటుందని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేతారెడ్డి అన్నారు. డిజిటల్ మీడియా ప్రతినిధుల చిట్ చాట్ లో ఆమె మాట్లాడారు. ఏమన్నారంటే సీపీ శ్వేతారెడ్డి మాటల్లోనే..

- గంజాయిపై ప్రత్యేక నిఘా
నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాలను పట్టిపీడిస్తున్న గంజాయిపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టాం. మత్తు పదార్థాల వినియోగం, సరఫరాను అరికట్టేందుకు పోలీసులతో పాటు సమాజ భాగస్వామ్యాన్ని పెంచుతున్నాం. ఇందులో భాగంగా మహిళా సంఘాల సహకారం తీసుకుంటున్నాం. మత్తు పదార్థాల వల్ల కుటుంబాలు, యువతపై పడుతున్న ప్రభావాన్ని తల్లులుగా మహిళలకు బాగా అర్థమవుతుంది. అందుకే వారిని భాగస్వాములను చేస్తున్నామన్నాం. మహిళా సంఘాల సభ్యులకు ‘సంఘమిత్రలు’గా నామకరణం చేసి గంజాయి, ఇతర నేరాలపై అవగాహన కల్పిస్తున్నాం. తాజాగా జనగామలో జిల్లా వ్యాప్తంగా మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించి, గంజాయికి అలవాటు పడిన వారిని గుర్తించడం, మత్తు పదార్థాల ప్రభావం, సమాజంలో జరుగుతున్న నేరాలపై వారికి అవగాహన కల్పించడం జరిగింది. ప్రతి గ్రామంలో మహిళా సంఘాలు అందుబాటులో ఉండటంతో గంజాయి వినియోగం, సరఫరాపై క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించేందుకు ఇది దోహదపడుతుంది.
- రౌడీషీట్ ఓపెన్..
గంజాయి కేసుల్లో పదేపదే పట్టుబడుతున్న వారిపై నిఘా పెంచడంతో పాటు అవసరమైన చోట రౌడీషీట్లు ఓపెన్‌ చేస్తున్నాం. అయితే గంజాయి సరఫరాపై ప్రజల నుంచి పక్కా సమాచారం రావడం లేదు. ‘ఇక్కడ ఉందట.. వాళ్లు తాగుతున్నారట’ అనే సాధారణ సమాచారం కాకుండా, సరఫరా చేసే వ్యక్తులు, ప్రాంతాలు, వాహనాలు తదితరాలపై పక్కా సమాచారం అందిస్తే తక్షణమే దాడులు నిర్వహించి చర్యలు తీసుకుంటాం. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతాం.

- సైబర్‌ క్రైం.. మిల్స్‌ కాలనీపై ప్రత్యేక దృష్టి
వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో సైబర్‌ నేరాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. సైబర్‌ కేసులను ప్రాపర్‌గా ఇన్వెస్టిగేట్‌ చేసి, బాధితులకు న్యాయం జరిగేలా కేసుల పరిష్కారంపై దృష్టి సారించాం. మరోవైపు క్రైం ఇష్యూలు ఎక్కువగా నమోదవుతున్న మిల్స్‌ కాలనీ పోలీస్‌స్టేషన్‌పై ప్రత్యేక ఫోకస్‌ పెట్టాం. అక్కడ అదనపు ఎస్‌ఐని నియమించి క్రైం కంట్రోల్‌, పెట్రోలింగ్‌, నిఘాను మరింత బలోపేతం చేస్తున్నాం.

- రౌడీయిజానికి నో ఛాన్స్‌
రౌడీయిజాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోం. నేర చరిత్ర కలిగిన వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచడంతో పాటు అవసరమైన చోట చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. నగరంలోని కాలనీలు, ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాల పనితీరుపైనా దృష్టి సారించాం. సీసీ కెమెరాల నిర్వహణ, పనితీరును పరిశీలించే బాధ్యతను సంబంధిత పోలీస్‌స్టేషన్ల ఎస్‌ఐలకు అప్పగించాం. కాలనీ సమావేశాలు నిర్వహించి కెమెరాలను సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం.

- ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు ప్రాధాన్యం
వరంగల్‌ నగరంలో ట్రాఫిక్‌ సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ట్రాఫిక్‌ అనేది నిరంతరం ఉండే సమస్య. పోలీసుల చర్యలతో పాటు వాహనదారులు, ప్రజల సహకారం కూడా అవసరం. ముఖ్యంగా యూటర్న్‌లు, ఫ్రీ లెఫ్ట్‌లు, రోడ్డు సేఫ్టీ అంశాలపై దృష్టి సారిస్తున్నాం. కరుణాపురంలో వైన్స్‌కు పెద్ద పర్మిట్‌ రూమ్‌ ఉండటంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌లు, ప్రమాదాలు చోటుచేసుకుంటున్న దృష్ట్యా ఎక్సైజ్‌ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో మూడు యూటర్న్‌లను మూసివేసినం. దీంతో ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్‌ సాఫీగా సాగుతోంది.

- ప్రజల సేఫ్టీ.. శాఖల సమన్వయంతో చర్యలు
ప్రజల సేఫ్టీనే పోలీసింగ్‌లో ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాం. ట్రాఫిక్‌, ఫ్రీ లెఫ్ట్‌లు, ఫుట్‌పాత్‌ ఆక్రమణలు వంటి సమస్యలను ఒక్కసారిగా కాకుండా విడతల వారీగా పరిష్కరించుకుంటూ వెళ్తామన్నాం. పోలీసు శాఖ ఒక్కటే అన్ని సమస్యలను పరిష్కరించలేదు. మున్సిపల్‌ కార్పొరేషన్‌, ఎక్సైజ్‌, రెవెన్యూ తదితర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటికే కార్పొరేషన్‌ అధికారులతో సమావేశం నిర్వహించాం. అధికారులు చర్యలు తీసుకున్నా ప్రజల భాగస్వామ్యం లేకుండా సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యం కాదు.

- స్టేషన్ల వారీగా క్రైం మ్యాపింగ్‌
కమిషనరేట్‌ పరిధిలోని ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో నమోదవుతున్న కేసుల స్వభావాన్ని ప్రత్యేకంగా పరిశీలిస్తున్నాం. మిల్స్‌ కాలనీ, మట్వాడ, ఇంతేజార్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో క్రైం కేసులు ఎక్కువగా ఉంటే, కేయూ, హసన్‌పర్తి ప్రాంతాల్లో భూ వివాదాలకు సంబంధించిన కేసులు అధికంగా నమోదవుతున్నాయి. స్టేషన్‌ వారీగా క్రైం ప్యాటర్న్‌ను గుర్తించి, ఆయా ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా నివారణ చర్యలు చేపడుతున్నాం.

- భూ వివాదాల్లో ఎస్‌ఓపీనే ప్రామాణికం
భూ సమస్యల పరిష్కారంలో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం, పోలీస్‌ శాఖ రూపొందించిన ప్రత్యేక స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ)ను పక్కాగా అమలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించిన. భూ వివాదాల్లో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా జోక్యం చేసుకోకుండా ఎస్‌ఓపీ ప్రకారం వ్యవహరించాల్సి ఉంటుంది. నేను కూడా ఎస్‌ఓపీని తప్పనిసరిగా పాటిస్తాను. నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు ఉంటాయి.

- సాంకేతిక వినియోగం...
పరిపాలనా, పోలీసింగ్ పటిష్టత కోసం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వినియోగానికి సన్నద్ధంగా ఉన్నాం. రాష్ట్ర స్థాయిలో తీసుకునే నిర్ణయాలను బట్టి ఏఐ వంటి సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించి ప్రజలకు విస్తృతమైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. ఇప్పటికే వాట్సప్ ఎఫ్ఐర్ లు స్వీకరిస్తున్నం.
- ఫేమ్‌ కోసం కాదు.. ఫలితం కోసం
పోలీసు అధికారిగా పేరు, ఫేమ్‌ కోసం పనిచేయను. చట్టాన్ని నమ్మి, దాని ప్రకారమే విధులు నిర్వర్తిస్తా. నాకు చట్టపై నమ్మకం ఉంది. అలాగే శిక్ష పడే వరకు వేచి చూసే ఓపిక కూడా ఉంది. పోలీసింగ్‌ అంటే ప్రభావవంతంగా ఉండటంతో పాటు దాని ఫలితం ప్రజలకు కనిపించాలన్నదే నా లక్ష్యం. ప్రజలకు భద్రత కల్పించడం, నేరాలను నియంత్రించడం, సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం చూపించడంపైనే నా దృష్టి ఉంటుంది.

పోరాటమే నా పునాది
పోరాటమే నా పునాది

- చదువు అబ్బకపోయేది.. ఒక్కో సెక్షన్ లో రెండేసి సార్లు చదివిన
- సీకేఎం కాలేజీలో ఏబీవీపీతో జరిగిన గొడవలో కత్తిపోట్లు
- అప్పట్లో పబ్లిక్ గార్డెన్ వద్ద ఉన్న కిన్నెరా హోటల్ మా అడ్డా
- ఎన్ఎస్ యూఐ, ఏబీవీపీ పేర్లతో కిషన్ పురలో కార్యాలయం ఉండేది
- ఆర్ట్స్ కాలేజీలో చేరిన రెండు నెలలకే నన్ను నాపై దాడి చేశారు
- డిగ్రీ ఫస్ట్ ఇయర్ లోనే ఎన్ఎస్ యూఐ ప్రెసిడెంట్ ను అయిన
-  ఐదుగురం పోటీ పడితే యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవి నాకు దక్కింది
- విజయవాడ సమరభేరి సభకు కార్యకర్తలతో తరలి వెళ్లా
- మొదట కాంగ్రెస్ పార్టీ సిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన
- 2014లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకమై 11 ఏళ్లు కొనసాగా
- ఎన్నికల్లో పోటీ చేయాలి.. అసెంబ్లీలో కూర్చోవాలనే కోరిక ఉండేది
- తొలిసారి 2004లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించగా పొత్తులో మందాడికి దక్కింది
- 2009లో పార్టీ టికెట్ వచ్చినట్టే వచ్చి చేజారింది
- రాజకీయాల్లో నా గురువు హయగ్రీవ చారి.. మా హెడ్ తోకల దేవేందర్ రెడ్డి
- నాపై మొత్తం 54 కేసులు ఉన్నాయి
- కొందరు డ్రగ్స్ కు అడక్ట్ అయితున్నట్లు నేను కాంగ్రెస్ పార్టీకి అడక్ట్ అయ్యా
- పార్టీ మారాలని ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఒప్పుకోలే.. వేరే కండువా మెడలో ఊహించుకోలే
- 2023 ఎన్నికల్లో గెలిచి లక్ష్యాన్ని ముద్దాడ
- నాకు ఏ పదవి వచ్చినా బోనస్సే
- వరంగల్ బ్రాండ్ పెంచటమే లక్ష్యం
- నా రాజకీయ వారసురాలుగా బిడ్డ
- పార్టీ ఆదేశిస్తే కార్పొరేషన్ ఎన్నికల బరిలో ఉంటది
- జీడబ్ల్యూఎంసీ పరిధిలో డివిజన్లు 80 కి పెరిగే అవకాశం
- మేయర్ సహా డివిజన్లలో రిజర్వేషన్లు మారే ఛాన్స్
- డిజిటల్ మీడియా ప్రతినిధులతో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చిట్ చాట్

అక్షరదర్బార్, హనుమకొండ

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాటల్లో..
మా అమ్మన్నాన్న జయమాల-నరేందర్‌రెడ్డి. తొర్రూరు ప్రాంతంలోని దాట్లలో ఉండేవారు. అక్కడ మా కుటుంబానికి ఇప్పటికీ భూములు ఉన్నాయి. మా తండ్రికి పెళ్లైన తరువాత కొద్ది రోజులకే హన్మకొండకు వచ్చారు. నేను మిషన్‌ హాస్పిటల్ లో పుట్టాను. ఇద్దరం అన్నదమ్ములం. నేను పెద్దోడిని, తమ్ముడు అమరేందర్ రెడ్డి. అతడు ఇప్పుడు వరంగల్ క్రెడాయి అధ్యక్షుడు. ‘మాది రాజకీయ కుటుంబం కాదు. ఇంతకుముందు మా కుటుంబంలో ఎవరూ పాలిటిక్స్‌లో లేరు.

- స్కూల్‌లోనే పోరాటానికి బీజం..
సెయింట్‌ జాన్స్‌ స్కూల్‌లో నా విద్యాభ్యాసం ప్రారంభమైంది. ఆ తర్వాత గౌతమ్‌ ప్రాక్టిసింగ్‌ స్కూల్‌లో ఇంగ్లిష్‌ మీడియంలో చదివించేందుకు మా తండ్రి చేర్పించారు. ఏడు లేదంటే ఎనిమిదో తరగతిలో ఉన్న సమయంలో జరిగిన ఓ సంఘటన నాకు స్కూల్లో మంచి గుర్తింపు తెచ్చింది. ఆగస్టు 15న పాఠశాలలో జెండా వందనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అదే సమయంలో ముగ్గురు వ్యక్తులు వచ్చి త్రివర్ణ పతాకం వద్దని, బ్లాక్‌ జెండా పెడతామన్నారు. దీనికి ప్రిన్సిపాల్‌ అంగీకరించకపోవడంతో చిన్నపాటి పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో ప్రిన్సిపాల్‌ కిందపడగా నేను వెంటనే స్పందించి వారితో ఫైటింగ్‌కు వెళ్లాను. ఆ ఘటన తర్వాత స్కూల్లో తన క్రేజ్‌ పెరిగిపోయింది. నాకు మంచి ఇమేజ్‌ వచ్చింది. ‘సార్లు నన్ను ప్రత్యేకంగా చూస్తుంటే నాకు భలే అనిపించేది'. అయితే చదువుపై మాత్రం చిన్నప్పటి నుంచే ఆసక్తి లేదు. స్కూల్‌ బంద్‌ కొట్టి సినిమాలకు వెళ్లేవాడిని. మాకు సత్యనారాయణ అనే మంచి టీచర్‌ ఉండేవారు. మేము థియేటర్‌కు వెళ్లిన విషయం తెలుసుకొని అక్కడికే వచ్చి క్లాస్‌రూమ్‌కు తీసుకొచ్చేవారు.

- చదువు అబ్బలేదు..
నాకు చిన్నప్పటి నుంచి చదువు అబ్బలేదు. బలవంతంగా చదివినప్పటికీ కష్టంగా పాస్‌ అయ్యేవాడిని. ఒకసారి పరీక్షలో సున్నా మార్కులు రావడంతో మా తండ్రి తల్లి ముందు తిడుతూ.. ‘వీడు చదవడు.. బర్లు కాయడానికి పంపిస్తా’ అని అన్నారు. తండ్రి నిజంగానే బర్లు కాయడానికి పంపిస్తారని భావించి నేను అందుకు సిద్ధమయ్యా. అది చూసిన తండ్రి మళ్లీ నన్ను తిట్టారు. డిగ్రీలో లెక్చరర్లు ఎంత కష్టపడ్డా నేను పాస్‌ కాలేదు. నేను.. వాళ్లు ఎంత ప్రయత్నించినా పాస్‌ కాకపోయాను. నాకు పుస్తకం అంటేనే పడకపోయేది’.

- ఇంటర్‌లోనే రాజకీయ రగడ..
హన్మకొండ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఇంటర్ చదవిన. మా స్నేహితులు సీకేఎం కాలేజీలో ఎన్‌ఎస్‌యూఐ తరఫున బ్యానర్లు కట్టేందుకు వెళ్లగా వారిపై ఏబీవీపీ కార్యకర్తలు అక్కడ దాడి చేశారు. వారిని బురదలో పడేసి తొక్కారు. దీంతో మరుసటి రోజు నేను 18 మందితో సీకేఎం కాలేజీకి వెళ్లా. అక్కడ ఏబీవీపీకి చెందిన వారు చాలా మంది ఉన్నారు. వెనక్కి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఘర్షణకు దారి తీసి కత్తిపోట్లు జరిగాయి. ఆ ఘటన అప్పట్లో పత్రికల్లో సంచలనం సృష్టించింది. మాపై కేసులు నమోదయ్యాయి. నా లైఫ్ లో అది ఫస్ట్ కేసు. అప్పట్లో బస్వరాజు సారయ్య పోలీస్‌స్టేషన్‌లో మాట్లాడి కొట్టకుండా చేశారు.

- కిన్నెర హోటల్‌ మా అడ్డా..
పబ్లిక్‌ గార్డెన్‌ సమీపంలోని కిన్నెర హోటల్‌ వద్ద ఎన్‌ఎస్‌యూఐ, ఏబీవీపీ కార్యకర్తల అడ్డా ఉండేది. కోహినూర్‌ హోటల్‌ మరో సంఘం అడ్డా ఉండేది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అప్పట్లో హన్మకొండ కిషన్ పురలో లో ఎన్‌ఎస్‌యూఐ, ఏబీవీపీ బోర్డుతో కార్యాలయం ఉండేది. మేము కార్యాలయంలో బియ్యం బస్తాలు తెచ్చి పెట్టుకునేవాళ్లం. అప్పట్లో రామకృష్ణ పరమహంస అనే డీఎస్పీ రాత్రి సమయంలో కార్యాలయం వద్దకు నలుగురు పోలీసులను సెక్యూరిటీగా పంపేవారు. ‘అప్పుడు యుద్ధ వాతావరణం లెక్క ఉండేది’. 12వ డివిజన్‌ కార్పొరేటర్‌ పదవికి కాంగ్రెస్‌ నుంచి ఎర్ర ప్రకాశ్‌రెడ్డి, మరో పార్టీ నుంచి రావు అమరేందర్‌రెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల ప్రచారంలోనూ ఫైటింగ్‌ జరిగింది. అదే సమయంలో నాపై తొలిసారి రాజకీయ కేసు నమోదైంది. ఆ కేసును కూడా బస్వరాజు సారయ్యే డీల్‌ చేశారు.

- డిగ్రీలోనే ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా..
1988లో ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలో డిగ్రీలో చేరాను. అందులో సీటు రావడం కూడా పెద్ద మిస్టరీ. కాలేజీలో చేరిన రెండు మూడు నెలలకే నాపై దాడి జరిగింది. అప్పట్లో వడ్డెపల్లి ప్రాంతానికి చెందిన వారంటే భయం ఉండేది. నేను మాత్రం మామూలుగానే ఒక టీం మెయింటెయిన్‌ చేసేవాడిని. అది కొందరికి నచ్చలేదు. నాపై దాడి చేస్తే రివెంజ్‌ తీర్చుకుంటానన్న విషయం వారికి కూడా తెలుసు. రెండు మూడు రోజులు ఓపిక పట్టిన తర్వాత గ్రౌండ్‌లో దొరికిన వారిని దొరికినట్టుగా హాకీ స్టిక్స్‌తో కొట్టాను. ఆ ఘటన తర్వాత డిగ్రీ ఫస్టియర్‌లోనే నాకు ఎన్‌ఎస్‌యూఐ కాలేజీ అధ్యక్ష పదవి ఇచ్చారు. ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా విద్యార్థుల సమస్యలపై నిలదీసేవాడిని. దీంతో కాలేజీ నుంచి నన్ను బయటకు పంపేందుకు శతవిధాలా ప్రయత్నాలు జరిగాయి.

- యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాజకీయ మలుపు..
నా రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవే. యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పీవీ రంగారావు నన్ను ప్రోత్సహించారు. దేవేందర్‌రెడ్డితో పోటీ ఉన్నప్పటికీ ఆయన వర్గాన్ని కాదని నాకు అవకాశం ఇచ్చారు. విజయవాడలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సమరభేరి సభ ఏర్పాటు చేసినప్పుడు నేను 102 వాహనాలను ఏర్పాటు చేశాను. అందులో 100 సుమోలు, రెండు బస్సులు ఉన్నాయి. వాటికి నా ఫొటోతో ఫ్లెక్సీలు పెట్టించాం. ఇక నా స్నేహితుడు గోల్డ్‌స్మిత్‌ విజయవాడలో ఉండేవాడు. అతనికి ఫోన్‌ చేసి భోజనాలు, వాటర్‌ ప్యాకెట్లు ఏర్పాటు చేయాలని, నాలుగు బ్యానర్లు కూడా చేయించి కట్టాలని చెప్పాను. అయితే నేను చెప్పినదానికంటే రెట్టింపు ఏర్పాట్లు చేశాడు. జంబో పూలదండ, కటౌట్లు కూడా ఏర్పాటు చేశాడు. నా వెంట రమేశ్‌బాబు, వినోద్‌కుమార్‌, అజీజ్‌ఖాన్‌ వచ్చారు. అయితే నా దోస్తు ఎంత బిల్లు పంపిస్తాడో అని భయపడ్డ. కానీ ఏమీ పంపలేదు.

- ‘పని చేసే అధ్యక్షుడు’..
ఆ తర్వాత నన్ను సిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా, పుల్లా భాస్కర్‌ను అధ్యక్షుడిగా ప్రకటించారు. అప్పటి జిల్లా ఇన్‌చార్జి రఘువీరా రెడ్డి నన్ను ‘పని చేసే అధ్యక్షుడు’ అని సరదాగా పిలిచేవారు. నాకు హయగ్రీవాచారి రాజకీయ గురువు. మాకు తోకల దేవేందర్‌రెడ్డి హెడ్. వారి శిష్యుడిని. సిటీ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎనిమిదేళ్లు పనిచేశాను. 2005లో లైబ్రరీ చైర్మన్‌గా పని చేశాను. 2014లో పొన్నాల లక్ష్మయ్య పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నేను డీసీసీగా పనిచేశాను. కాకతీయ ఆటో యూనియన్‌, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ తదితర సుమారు 20 సంఘాలకు గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను.

- 2004 నుంచే టికెట్‌ వేట..
అసెంబ్లీ టికెట్‌ కోసం 2004లోనే అడిగాను. అప్పట్లో టీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ పొత్తులో హనుమకొండ సీటు టీఆర్‌ఎస్‌కు వెళ్లడంతో మందాడి సత్యనారాయణరెడ్డి బరిలో దిగారు. 2009లో, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కూడా వరంగల్ పశ్చిమ నుంచి దయాసాగర్‌కు టికెట్‌ కేటాయించారు. 2014లో పార్టీ ఎర్రబెల్లి స్వర్ణకు అవకాశం ఇచ్చింది. 2018లో మహాకూటమి అభ్యర్థిగా రేవూరి ప్రకాశ్‌రెడ్డి పోటీ చేశారు.

- 2009లో టికెట్‌ కన్ఫాం.. చివర్లో కోత..
2009లో రాహుల్‌గాంధీ యూత్‌ కాంగ్రెస్‌ కోటాలో తనకు టికెట్‌ ఖరారైంది. బక్క జడ్సన్‌ నా ఫోన్‌ నుంచి దరఖాస్తు చేయగా జితేందర్‌సింగ్‌ నుంచి ‘మీకు టికెట్‌ కన్ఫాం’ అంటూ మెసేజ్‌ వచ్చింది. ఆ మెసేజ్‌ అర్థం కాక ఆ నంబర్‌కు ఫోన్‌ చేస్తే ఢిల్లీలోని నంబర్‌ అని తెలిసింది. వెంటనే ఢిల్లీ వెళ్లి టికెట్‌ విషయాన్ని కన్ఫాం చేసుకున్న. యూత్‌ కోటాలో తనతో పాటు ఏడుగురికి టికెట్లు కేటాయించినప్పటికీ ఢిల్లీలో జరిగిన మంతనాల తర్వాత తన టికెట్‌ తీసేశారు. ‘ఇదేంటని అడిగితే వైఎస్‌ నా భుజంపై చేయి వేసి చెప్పకనే చెప్పారు'.

- 2023లో టికెట్‌ కోసం మళ్లీ పోరాటం..
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో కుట్రలను ఛేదించి టికెట్‌ తెచ్చుకున్న. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వచ్చిన తర్వాత పీసీసీ అధ్యక్షుడయ్యారని, ఆయనను కలిసి టికెట్‌ ఇస్తే కష్టపడి పనిచేస్తానని చెప్పాను. ‘2004 నుంచి టికెట్‌ చేజారిపోతోంది. నేను కష్టపడి పనిచేసే సమయానికి వేరే వాళ్లు రావడం పరిపాటిగా మారింది. నాకు టికెట్‌ కన్ఫాం చేస్తే నా పనిలో నేను ఉంటానని చెప్పా’. సర్వే రిపోర్టు వచ్చిన తర్వాత చెబుతానని రేవంత్‌రెడ్డి చెప్పారు. సర్వే రిపోర్టు రాగానే ముందుకు వెళ్లాలని ఎన్నికలకు ఏడాది ముందే సూచించారు. ఫస్ట్‌ లిస్ట్‌లో తన పేరు రావాల్సి ఉన్నప్పటికీ కొందరు అడ్డుకున్నారు. అధిష్ఠానం వద్ద తనపై ఏవేవో చెప్పారని, దీంతో రీ-సర్వేలు, స్పాట్‌ సర్వేలు నిర్వహించిన తర్వాత చివరకు తనకు టికెట్‌ ఇచ్చారు.

- సొంత పార్టీలోనూ తొక్కే ప్రయత్నం..
రాజకీయ జీవితంలో ప్రత్యర్థుల నుంచే కాకుండా సొంత పార్టీలోనూ తనను తొక్కే ప్రయత్నాలు జరిగాయి. ‘వీడు వస్తే మాకు రాజకీయ భవిష్యత్ ఉండదు’ అని అనుకునే వాళ్లు కూడా ఉన్నారు. సొంత పార్టీలోనే నన్ను తొక్కే ప్రయత్నాలు చేశారు. అయినా నేను వెనక్కి తగ్గలేదు’.

- పార్టీ మారుమని ప్రలోభాలు..
నాపై కేసులు పెట్టి వేధించిన సందర్భాల్లో పార్టీ మారితే కేసులన్నీ మాఫీ చేస్తామని చాలా ప్రలోభాలు పెట్టారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ, సొంత పార్టీ కాంగ్రెస్‌లోనూ కొట్లాటలు ఉన్నాయంటూ పార్టీ మారాలని రాత్రిళ్లు ఇంటికి వచ్చి మరీ కొందరు అడిగేవారు. నాపై ఇప్పటికీ 54 కేసులు ఉన్నాయి. మర్డర్‌ కేసులోనూ ఇరికించారు. కుటుంబంలో విషాదం జరిగిన సమయంలో కూడా కేసుల కారణంగా తప్పించుకుని తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ‘ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి.. నేను పార్టీ మారను అని చెప్పా. నా మెడలో కాంగ్రెస్‌ కండువా తప్ప మరో కండువాను నేను ఊహించుకోలేదు’. మర్డర్‌ కేసులో ఇరికించిన సమయంలో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాలో మాదిరిగా పోలీసులకు చిక్కకుండా తిరిగాను. ఆ ఘటనలను ఎన్నటికీ మరిచిపోలేను.

- ‘వేస్ట్‌ గాళ్ల వల్లే ఆ పార్టీ బతుకుతోంది’
పార్టీ మారమనే ఒత్తిళ్ల నేపథ్యంలో ఒక పెద్దమనిషి తన గురించి చేసిన వ్యాఖ్య గుర్తొస్తుంది. ‘ఇలాంటి వేస్ట్‌ గాళ్ల వల్లనే ఆ పార్టీ ఇంకా బతుకుతోంది’ అని ఆ పెద్దమనిషి అన్నారు. అది తిట్టు లాంటి పొగడ్తగా భావించాను.

- రాహుల్‌ నుంచి నేరుగా ఫోన్‌..
ఒక రోజు కారులో హైదరాబాద్‌కు వెళ్తుండగా రాహుల్‌గాంధీ నుంచి ఫోన్‌ వచ్చింది. ఢిల్లీకి రావాలని పిలిచారు. దేశవ్యాప్తంగా పది జిల్లాలను ఎంపిక చేస్తే తెలంగాణ నుంచి నన్ను ఒక్కరినే సమావేశానికి పంపించారు. సమావేశంలో నాకు 45 నిమిషాల సమయం ఇచ్చారు. డీసీసీలకు మరిన్ని అధికారాలు ఇవ్వాలని అప్పుడే సూచించాను. ఇప్పుడు రాహుల్‌గాంధీ వాటిని అమలు చేస్తున్నారు. మరోసారి రాహుల్‌గాంధీ, కొప్పుల రాజు ఆన్‌లైన్‌లో డీసీసీ సమావేశం నిర్వహించారు. అందులో మాట్లాడమన్న వారే మాట్లాడాలని నిబంధన ఉండేది. అప్పుడు రాహుల్‌గాంధీ ‘నాయిని రాజేందర్‌రెడ్డి జీ మాట్లాడండి’ అని తనను పిలవడం ఎంతో గర్వంగా అనిపించింది.

- మానాన్నను డబ్బులు అడగడం మానేశా..
ఇంటర్‌లో ఉన్న సమయంలో చదువు అబ్బడం లేదని, బిజినెస్‌ చేసుకుంటానని డబ్బులు ఇవ్వాలని తండ్రిని అడిగాను. ఆయన డబ్బులు ఇవ్వనని చెప్పారు. అప్పటి నుంచి తండ్రిని డబ్బులు అడగడమే మానేశా.

- ‘నాకు పిల్లనియ్యలే’..
తాను రఫ్‌గా ఉండేవాడిని. నాపై రెండు కేసులు నమోదవడంతో ‘నరేందర్‌రెడ్డి పెద్ద కొడుకుపై మర్డర్‌ కేసు అయిందట’ అంటూ ప్రచారం జరిగింది. దీంతో చుట్టాలు, పక్కాలు కూడా అదే విషయాన్ని మాట్లాడుకునేవారు. అప్పట్లో పట్టింపులు ఎక్కువగా ఉండేవి. కేసులు ఉన్నాయనే కారణంతో నాకు పిల్లను ఇవ్వడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు.

- అప్పటి రాజకీయాలు వేరు..
ప్రస్తుతం రాజకీయాల్లో విలువలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. అప్పట్లో రాజకీయ ప్రత్యర్థులను కూడా గౌరవించుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు వ్యక్తిగత విమర్శలు ఎక్కువయ్యాయి. దీనికి ఉదాహరణగా నర్సంపేట ఎమ్మెల్యేగా పనిచేసిన ఓంకార్‌ ఘటన. ఓంకార్‌పై ఫైరింగ్ జరగడంతో ఆయన్ను ఎంజీఎంకు తీసుకొచ్చారు. నర్సంపేట నుంచి ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. అప్పటికే రాజకీయాల్లో హత్యలు కూడా జరిగేవి. హయగ్రీవాచారిని ప్రత్యర్థులు ‘హత్యలాచారి’ అని పిలిచేవారు. అయినప్పటికీ హయగ్రీవాచారి ఎంజీఎంకు వెళ్లి ఓంకార్‌ను పరామర్శించారు. అంతా మా మీద దాడి చేస్తారనుకున్నాం. కానీ అంత మంది ఆయనను చూసి దారి ఇవ్వడం గొప్పగా అనిపించింది.  ‘అప్పుడు అలాంటి రాజకీయ వాతావరణం ఉండేది. ఇప్పుడు ఎవరో పోటీకి వస్తాడేమోనని ముందే శత్రువుగా చూస్తున్నారు’.
- పావలా ఇడ్లీ నుంచి వెయ్యి రూపాయల ఇడ్లీ వరకు..
నా రాజకీయ ప్రస్థానంలో ఎదురైన అనుభవాలన్నీ గొప్పవే. పోరాటంలో ఉన్న సమయంలో పావలా ఇడ్లీ తిన్నాను. ఇప్పుడు వెయ్యి రూపాయల ఇడ్లీ తినే స్థాయికి వచ్చాను. కానీ అప్పుడున్న రాజకీయ సంస్కారం ఇప్పుడు లేదు’.

- వరంగల్‌ బ్రాండ్‌ పెంచడమే లక్ష్యం..
నా నియోజకవర్గ పరిధికే పరిమితం కాకుండా వరంగల్‌ బ్రాండ్‌ను పెంచే పనులకు ముఖ్యమంత్రి వద్ద నిధులు అడిగాను. అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, మామునూరు ఎయిర్‌పోర్టు, రింగ్‌రోడ్డు వంటి పనులు చేపట్టాలని కోరాను. రూ.500 కోట్లతో వాటర్‌ సప్లై పైప్‌లైన్‌ను మెరుగుపరుస్తున్నాం. రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ పనులు ప్రారంభించాం. ఐటీఐ కాలేజీకి రూ.30 కోట్లు తీసుకొచ్చా. కాజీపేట బ్రిడ్జి పనులు తాను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాతే వేగం పుంజుకున్నాయి. త్వరలోనే పనులు పూర్తి చేస్తాం. కాజీపేట బస్టాండ్‌ కూడా మంజూరు చేయించా. త్వరలోనే నా నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటన ఉంటుంది.

- ‘నాకు ఏది వచ్చినా బోనస్సే’
అసెంబ్లీలో కూర్చోవాలనే కోరిక ఉండేది. అది నెరవేరింది. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కావాలని అడిగాను. ‘నాకు పార్టీ పని చేయడం అంటే ఇష్టం. అందుకే నేను పార్టీ పదవి అడిగాను. పెద్దలు ఏ పదవి ఇచ్చినా నాకు బోనస్సే’.

- బిడ్డకు టికెట్‌ ఇస్తే.. బరిలోకి
నా రాజకీయ వారసురాలు బిడ్డ. నా బిడ్డ గోదాదేవి మంచి డాక్టర్. ఆమె 2014లో కాంగ్రెస్‌ సభ్యత్వం తీసుకుంది. ప్రస్తుతం ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో కీలకంగా పనిచేస్తోంది. 240 మంది బీఎల్‌ఓలు, 240 బీఎల్‌ఏలను సమన్వయం చేసింది. ప్రత్యేక వింగ్‌ ఏర్పాటు చేసి వరంగల్‌ పశ్చిమలో ఎస్‌ఐఆర్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఓట్లు కోల్పోకుండా పనిచేస్తోంది. రానున్న కార్పొరేషన్‌ ఎన్నికల్లో పార్టీ ఆదేశిస్తే గోదాదేవి తప్పకుండా పోటీ చేస్తుంది.

- కార్పొరేషన్‌ రిజర్వేషన్లు మారొచ్చు..
డిసెంబర్‌ లేదా జనవరిలో గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ రిజర్వేషన్లు మారే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల నేపథ్యంలో మరోసారి మేయర్ రిజర్వేషన్లలో మార్పులు జరిగే అవకాశం ఉంది. కార్పొరేషన్ పరిధిలో డివిజన్ల పునర్విభజన కూడా జరగనుంది. డివిజన్ల సంఖ్య 66 నుంచి 80కి కూడా పెరిగే అవకాశం ఉంది. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడం ఖాయం.

పాలిటిక్స్ లో 'దయన్న' మార్క్
పాలిటిక్స్ లో
'దయన్న' మార్క్

- స్కూల్ ప్రెసిడెంట్ ఎన్నికల నుంచి కేసీఆర్ కేబినెట్ దాకా..

- మా నాన్నకు నన్ను డాక్టర్ ను చేయాలనే కోరిక ఉండేది
- నాకు మాత్రం చదువు కంటే ఎక్కువ రాజకీయాలపై ఇష్టం ఉండే
- కక్షసాధింపు చర్యలతో కాంగ్రెస్ పై కసి పెరిగింది
- వ్యవసాయంలో నష్టం రావడంతో మొదట కాంట్రాక్టర్ గా మారా
- 1982లో మొదటిసారి నాలుగు జీపులతో వెళ్లి ఎన్టీఆర్ ను కలిసిన
- తెలుగుదేశం పార్టీ జెండా రూపకల్పనలో నేను ఒకడిని
- 1983లో ఫస్ట్ టైం టీడీపీ అభ్యర్థిగా వర్ధన్నపేట నుంచి పోటీ చేసిన
- 1985లో హనుమకొండ నుంచి వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్న
- టీడీపీకి మెజార్టీ లేకపోయినా వ్యక్తిగత ఇమేజ్ తో డీసీసీబీ చైర్మన్ గా గెలిచా
- 1994లో వర్ధన్నపేట నుంచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టా
- సీతక్కను రాజకీయాల్లోకి తీసుకొచ్చా.. ఆమెను, రేవూరి, చల్లాను ప్రోత్సహించా
- నేనంటే ఎన్టీఆర్ కు గౌరవం ఉండేది.. ఆయన, చంద్రబాబు నాతో డిస్కస్ చేసేవారు
- 1994 ఎన్నికల్లో ఎంసీపీఐతో పొత్తు చర్చలు
- నేను వరంగల్ నుంచి ఎంపీగా గెలవడం ఒక చరిత్ర
- వైఎస్సార్ పట్టుబట్టి వర్ధన్నపేటను రిజర్వ్ చేయించారు
- తర్వాత సర్వేలో అనుకూలమని తేరటంతో పాలకుర్తికి..
- తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న.. చంద్రబాబు నుంచి లెటర్ తెచ్చిన
- అప్పట్లోనే కేసీఆర్ నన్ను అభిమానించేది
- పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసి అవార్డులు తీసుకున్న
- ప్రత్యేక దృష్టి సారించి ఎంజీఎం హాస్పిటల్ రూపురేఖలు మార్చా
- రాజకీయాల్లో ఆస్తులు అమ్ముకున్న.. సంపాదించుకోలేదు
- పార్టీలకతీతంగా పనులు చేస్తా.. అన్ని పార్టీల నేతలు గౌరవిస్తారు
- గత ఎన్నికల్లో ఓడిపోతానని ఆరు నెలల ముందే తెలుసు
- నేను ఎక్కడ అవకాశం వచ్చినా పోటీ చేస్తా. వారసులను దింపే ఆలోచన లేదు
- డిజిటల్ మీడియా చిట్ చాట్ లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

అక్షరదర్బార్, హనుమకొండ

మా నాన్న రాజకీయాల్లో ఉండేవాడు. ఆయనకు నన్ను డాక్టర్ ను చేయాలనే కోరిక ఉండేది. నాకు మాత్రం చిన్నప్పటినుంచే రాజకీయాలంటే ఇష్టం. మొదట వ్యవసాయం చేసిన. మిరప తోట సాగు చేస్తే నష్టం వచ్చింది. దాంతో కాంట్రాక్టర్ గా మారాను. ఎక్కువగా ఆర్ అండ్ బీ పనులు చేసిన. ఆ తర్వాత ఎన్టీఆర్ పిలుపుతో 1982లో తెలుగుదేశం పార్టీలో చేరాను. ఎన్టీఆర్ కు నేనంటే గౌరవం ఉండేది. పార్టీ పొలిట్ బ్యూరోలో, త్రీ మెన్ కమిటీలో నాకు అవకాశం కల్పించారు. 1983 ఎన్నికల్లో తొలిసారి వర్ధన్నపేట నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయా. 1985 ఎన్నికల్లో హనుమకొండ నుంచి అవకాశాన్ని పోగొట్టుకున్న. తర్వాత మా పార్టీలో మెజార్టీ లేకపోయినా డీసీసీబీ చైర్మన్ గా ఎన్నికయ్యా. 1994లో వర్ధన్నపేట నుంచి గెలిచి ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగు పెట్టా. అలా వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచాను. నేను ఎంపీగా గెలవడం ఒక చరిత్ర. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసి అవార్డులు తీసుకున్న. గత ఎన్నికల్లో ఓడిపోతానని ఆరు నెలలు ముందే నాకు తెలుసని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. నేను పార్టీలకతీతంగా పనులు చేస్తా. అన్ని పార్టీల నేతలు నన్ను గౌరవిస్తారు. రాజకీయాల్లో ఆస్తులు అమ్ముకున్న కానీ సంపాదించుకోలేదని ఆయన చెప్పారు. ప్రజలను మోసం చేసే, నష్టం కలిగించే నేతలు కాకుండా నీతి నిజాయితీపరులు పదవుల్లో ఉండాలని కోరుకుంటానని ఎర్రబెల్లి అన్నారు. డి లిమిటేషన్ తో స్థానాలు మారడం పక్కా.. నేను ఎక్కడ అవకాశం వచ్చినా పోటీ చేస్తా. అంతేకానీ రాజకీయాల్లోకి వారసులను దింపే ఆలోచన లేదని దయాకర్ రావు స్పష్టం చేశారు. గురువారం హనుమకొండ రాంనగర్ లోని తన నివాసంలో ఎర్రబెల్లి డిజిటల్ మీడియా చిట్ చాట్ లో తన అనుభవాలను పంచుకున్నారు. ఏమన్నారంటే ఆయన మాటల్లోనే..

- రాజకీయాలపై చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్
నేను 1956 జూలై 4న పర్వతగిరిలో పుట్టిన. మా అమ్మానాన్నలు ఆదిలక్ష్మి-జగన్నాథరావు. స్థానిక పాఠశాలలోనే చదువుకున్న. రాజకీయాలంటే నాకు చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ ఉండేది. పదో తరగతిలో స్కూల్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేసిన. నాకు పోటీగా బొల్లం సంపత్ కుమార్ అనే మిత్రుడు ఉండే. నేను ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పరిస్థితి ఉన్నా.. నేను చేసిన ఓ తుంటరి పని వల్ల ఓడిపోయిన”. “నాకు 18 ఏళ్లకే పెండ్లి అయింది. కేసీఆర్ మామ కేశవరావు దగ్గరుండి సంబంధం చూసి పెండ్లి చేసిండ్లు. నాకు ఒక కూతురు, ఒక కొడుకు”.

- మా నాన్నే రాజకీయాల్లో ఉండేవాడు..
మా నాన్న ఎర్రబెల్లి జగన్నాథరావు రాజకీయాల్లోనే ఉండేవాడు. పర్వతగిరి సర్పంచ్‌గా ఆరుసార్లు ఎన్నికయ్యాడు. అప్పుడు సమితిలు ఉండేవి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఐదు సమితులు ఉండేవి. మా నాన్న సంగెం సమితి ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తే కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత పోరు వల్ల టాస్ వేయాల్సి వచ్చింది. అందులో మా నాన్న ఓడిపోయాడు. ఆ తర్వాత ఓడీసీఎంఎస్ చైర్మన్‌గా పోటీ చేస్తే కాంగ్రెస్‌లోని లొల్లి వల్ల చైర్మన్ పదవి రాలేదు. వైస్ చైర్మన్ పదవి దక్కింది. ఆ తర్వాత వరంగల్ ల్యాండ్ బ్యాంక్ చైర్మన్ అయ్యాడు.

- నన్ను డాక్టర్ చేయాలనేది నాన్న కల
మా నాన్న నన్ను డాక్టర్ చేయాలని అనుకున్నాడు. పట్టుబట్టి ఎల్‌బీ కాలేజీలో బైపీసీ గ్రూపులో చేర్పించాడు. కాకతీయ మెడికల్ కాలేజీకి దగ్గరలోనే ఉంటుందని.. అక్కడ డాక్టర్లను చూసైనా నాకు డాక్టర్ కావాలనే ఆశ కలుగుతుందని అనుకున్నాడు. కానీ నాకు సదువు అంతగా అబ్బలేదు. దీంతో అగ్రికల్చర్ బీఎస్సీ చదివించాడు. చదువుకునే రోజుల్లో జయశంకర్ సార్ ఇంట్లో నెల రోజుల పాటు ఉన్న. తెలంగాణ ఉద్యమం చేసిన రోజుల్లో దుర్గా టాకీస్ తగలబెట్టిన కేసులో కూడా ఉన్న. కానీ మైనర్‌ను అని ఆ కేసు నుంచి తీసేశారు.

- 15 ఎకరాల్లో మిర్చి.. అక్కడి నుంచి కాంట్రాక్టర్‌గా..
వ్యవసాయం అంటే నాకు చాలా ఇష్టం ఉండేది. ఒకసారి 15 ఎకరాల్లో మిర్చి వేసిన. తెగులు వచ్చి బాగా లాస్ వచ్చింది. అక్కడి నుంచి కాంట్రాక్టర్‌గా మారి పనులు చేసిన. ఆర్‌అండ్‌బీ పనులు ఎక్కువగా చేసేవాడిని. రంగశాయిపేట, తీగరాజుపల్లి రోడ్డు నేనే వేసిన.

- కాంగ్రెస్ కక్షే నాలో కసి పెంచింది
తన తండ్రి రాజకీయ జీవితంలో కాంగ్రెస్ చేసిన కక్షసాధింపు చర్యలే తనలో రాజకీయ కసి పెంచాయి. 1982లో ఎన్టీఆర్ పార్టీ పెడుతున్నాడని తెలిసింది. ఆయన చెన్నై నుంచి హైదరాబాద్‌కు వస్తున్నాడని తెలిసి నాలుగు జీపుల్లో కార్యకర్తలను తీసుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లి నిలబడ్డా. ఎన్టీఆర్ ట్రైన్ దిగగానే.. ‘జై ఎన్టీఆర్.. జై ఎన్టీఆర్..’ అంటూ నినాదాలు చేశా. ఆయన నన్ను.. నా వెనక ఉన్న జనాన్ని చూసి ఎక్కడి నుంచి వచ్చావు బాబు అంటూ పలకరించాడు. కారులో ఆయనతోపాటు తీసుకెళ్లాడు. ఓ హోటల్‌లో టిఫిన్ చేసి.. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో పార్టీ ఏర్పాటుపై మీటింగ్ ఉంటుందని, రావాలని చెప్పాడు.

- పార్టీ జెండా రూపకల్పనలో నేను..
టీడీపీ పార్టీ ఏర్పాటు, జెండా రూపకల్పన కోసం ఎన్టీఆర్ పర్వతగిరి ఉపేందర్‌ను కన్వీనర్‌గా, యూత్ తరఫున నన్ను ఎంపిక చేశారు. నేను చురుగ్గా ఉండడంతో ఎన్టీఆర్ నన్ను ప్రత్యేకంగా అభిమానించేవాడు.

- వరంగల్‌లో ఎన్టీఆర్ సభ..
ఎన్టీఆర్‌ను వరంగల్‌కు తీసుకురావాలనే ఆలోచన వచ్చింది. దోనెపుడి రమేశ్‌బాబు, నేను కలిసి సభా సన్నాహక సమావేశం నిర్వహించినం. రెండు వందల మందికిపైగా ఎన్టీఆర్ అభిమానులు వచ్చారు. ఎన్టీఆర్‌తో వరంగల్‌లో బహిరంగ సభతోపాటు కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించాలని నిర్ణయించాం. బహిరంగ సభకు స్టేజీ, మైక్‌ల కోసం రూ.5 వేలు.. కార్యకర్తల సమావేశానికి రూ.2 వేలు అవుతాయని నిర్ణయించారు. డబ్బులు పెట్టిన వాళ్లే సభకు అధ్యక్షత వహించాలని చెప్పారు. కానీ ఎవరూ ముందుకు రాలేదు. నేను సభ ఖర్చు పెట్టుకుంటే.. కార్యకర్తల సమావేశం ఖర్చు రమేశ్‌బాబు పెట్టుకున్నారు. 1982లో ఇస్లామియా గ్రౌండ్‌లో నిర్వహించిన బహిరంగ సభ భారీ సక్సెస్ అయింది. ఆ సభ నుంచే ఎన్టీఆర్ నన్ను జిల్లా కన్వీనర్‌గా.. రమేశ్‌బాబును పట్టణ అధ్యక్షుడిగా ప్రకటించాడు.

- మూడు అసెంబ్లీ.. ఒక ఎంపీ టికెట్..
1983 ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపు సందర్భంగా ఎన్టీఆర్ నన్ను పిలిచి టికెట్లు ఎంచుకోవాలని అడిగారు. మూడు అసెంబ్లీ, ఒక ఎంపీ టికెట్ ఇస్తే గెలుస్తామని చెప్పిన. నాకు వరంగల్ లేకపోతే వర్ధన్నపేట కావాలని పట్టుబట్టిన. ఆయన నాలుగు బీ-ఫారాలు ఇచ్చారు. అప్పుడు టీడీపీ నుంచి వరంగల్‌లో నిలబడే అభ్యర్థి దొరకలేదు. బండా ప్రకాశ్, గుండా ప్రకాశ్, భూపతి కృష్ణమూర్తి.. ఇలా నలుగురైదుగురిని అడిగితే కొత్త పార్టీ నుంచి పోటీ చేసేందుకు విముఖత చూపించారు. చివరకు బండారు నాగభూషణరావును అడిగితే రెండు రోజులు తిప్పుకున్నడు. ఆ తర్వాత ఒకే అన్నాడు. ఆయన ఆ ఎన్నికల్లో గెలిచిండు. పార్టీ అధికారంలోకి వచ్చింది. మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలని అడిగితే మాచర్ల సత్యనారాయణ బీసీ అని ఆయనకు ఇవ్వాలని సూచించిన.

- అది ఓడిపోయే సీటని బీ-ఫారం వెనక్కిచ్చిన..
1985 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ పొత్తులో వర్ధన్నపేట బీజేపీకి కేటాయించారు. నాకు వర్ధన్నపేటలోనే పోటీ చేయాలని కోరిక. కానీ పొత్తులో ఆ సీటు వెళ్లిపోవడంతో ఎన్టీఆర్ హనుమకొండ నుంచి పోటీ చేయమని బీ-ఫారం ఇచ్చారు.” “నేను బీ-ఫారం తీసుకొని మెట్లు దిగుతుంటే పార్టీ నాయకుడు ఒకరు చూసి.. ‘ఎక్కడ ఇచ్చారు’ అని అడిగాడు. హన్మకొండ అని చెప్పిన. ఆయన నవ్వుతూ.. ఓడిపోయే సీటు నీకు ఇచ్చారు అన్నాడు. అప్పుడే వెనక్కి పోయి.. నాకు వద్దని చెప్పి వెంకటేశ్వర్ రావుకు ఇప్పించిన. ఆయన పోటీ చేసి గెలిచాడు. “ఆ తర్వాత ఎన్టీఆర్ నాపై ఉన్న అభిమానంతో జిల్లా పరిషత్ చైర్మన్ అవకాశం కల్పించాడు. అయితే ఎడబోయిన బస్వారెడ్డి పోటీకి రావడంతో అదీ వదులుకున్న.”

- తొలి విజయం.. డీసీసీబీ చైర్మన్‌గా..
ఎన్టీఆర్ దృష్టిలో నేను ఉండడంతో మళ్లీ 1987లో డీసీసీబీ చైర్మన్‌కు పోటీ చేయాలని చెప్పారు. పర్వతగిరి పీఏసీఎస్ డైరెక్టర్‌గా ఎన్నికయ్యా. కానీ డైరెక్టర్ల సంఖ్యాబలం టీడీపీకి ఎక్కువగా లేదు. కాంగ్రెస్ బలం ఎక్కువగా ఉంది. అయినా నాకున్న వ్యక్తిగత సంబంధాలతో చైర్మన్‌గా ఎంపికయ్యా. ఎన్నికల్లో ఓడిపోయినా.. పదవులు లేకపోయినా పార్టీలో కీలకంగా ఉండేవాడిని. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, త్రీమెన్ కమిటీలో మెంబర్‌గా ఉండేవాడిని.

- వర్ధన్నపేట నుంచి హ్యాట్రిక్..
1994లో వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయం సాధించిన. 1999లో, 2004లో జరిగిన ఎన్నికల్లోనూ ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించా. అయితే 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలవటం ఒక చరిత్ర.

- వైఎస్ మంత్రి పదవి ఆఫర్ చేశాడు..
ఆ సమయంలో కాంగ్రెస్ హవా నడుస్తోంది. వైఎస్‌తోనూ నాకు ప్రత్యేక బంధం ఉంది. ఆయన నన్ను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించాడు. మంత్రి పదవి కూడా ఆఫర్ చేశాడు. కానీ నేను పోలేదని దయాకర్ రావు చెప్పాడు. అప్పుడే ఆయన నాతో ఓ మాట అన్నాడు.. నిన్ను వర్ధన్నపేటలోనే కాదు.. వరంగల్‌లో ఎంపీగానూ పోటీ చేయకుండా చేస్తానన్నారు. ఆ తర్వాత జరిగిన డీలిమిటేషన్‌లో వర్ధన్నపేట ఎస్సీకి.. వరంగల్ ఎంపీ కూడా ఎస్టీకి పోయింది. వర్ధన్నపేట వదిలిపెట్టాలని ఢిల్లీలో అడిగిన కుదరలేదు. వైఎస్ ఇంట్రెస్ట్ ప్లీజ్ అని నా రిక్వెస్ట్ ను రిజెక్ట్ చేశారు.

- మాస్క్ వేసుకొని పాలకుర్తిలో సర్వే..
జనరల్ సీట్లు ఉన్న వరంగల్‌తో పాటు పాలకుర్తిలో కూడా సర్వే చేసుకున్న. వరంగల్‌లోనూ గెలుస్తానని వచ్చింది. అయినా పాలకుర్తికి వెళ్లిన. ముఖానికి మాస్క్ వేసుకొని కూలీలతో, ప్రజలతో మాట్లాడి అభిప్రాయాలు సేకరించాను. మీ దగ్గర కొత్తగా ఎవరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అడిగితే.. దయాకర్ వస్తున్నడట అని చెప్పారు. ఆయన మంచోడని.. గెలిపించుకుంటామని చెప్పడంతో నేను అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్న. అక్కడ నాకు ప్రజల మద్దతు పుష్కలంగా వచ్చింది. 2009 ఎన్నికల్లో పాలకుర్తి నుంచి ఘన విజయం సాధించిన. 2014లో కూడా గెలిచి.. టీడీపీ నుంచి వరుసగా ఐదుసార్లు శాసనసభకు ఎన్నికైన.”

- కేసీఆర్ మంత్రి పదవి ఇస్తానంటే వద్దన్న..
2014లో టీడీపీ నుంచి గెలిచిన తర్వాత 10 మంది ఎమ్మెల్యేలతో కలిసి టీఆర్ఎస్‌లో చేరాను. కేసీఆర్‌తో నాకు అంతకుముందే సన్నిహిత సంబంధం ఉండేది. పార్టీలో చేరిన వెంటనే నాకు మంత్రి పదవి ఇస్తానన్నాడు. కానీ పార్టీ గుర్తుపై గెలిచిన తర్వాతే మంత్రి పదవి తీసుకుంటానని చెప్పిన. 2018లో ఆరవసారి టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా శాఖల మంత్రిగా నియామకం అయ్యా. నా శాఖల నుంచి మంచి పనులు చేసినం. ఎన్నో అవార్డులు సాధించినం.
- ఆదో వడ్డాణం కథ..
టీడీపీ రోజుల్లో ఎన్టీఆర్ తనకు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించిన సందర్భం. 1994లో ఎమ్మెల్యేగా గెలువగానే నన్ను ఎన్టీఆర్ పిలిచి మంత్రి పదవి ఇస్తానని చెప్పారు. అయితే నేను ఎన్టీఆర్-లక్ష్మీపార్వతి పెళ్లికి నిరాకరించిన. నెల రోజుల పాటు ఆపిన. ఆ తర్వాత ఒక రోజు ఎన్టీఆర్ ఇంటికి వెళ్లితే లక్ష్మీపార్వతి.. ‘నేను నీకు మంత్రి పదవి ఇప్పిస్తానని చెప్పాను కదా.. నాకు ఒక వడ్డాణం చేయించు’ అన్నారు. దీంతో వడ్డాణం లేదు.. ఏమీ లేదు.. మంత్రి పదవి వద్దు అంటూ వచ్చేసిన. ఇది నేను గొప్పగా చెప్పుకోవడం కాదు. ఈ ఘటనను చూసిన అప్పటి ఎన్టీఆర్ డ్రైవర్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు”. ఎన్టీఆర్ దగ్గరకు రెగ్యులర్‌గా వెళ్లేవాళ్లలో నేను, జస్టిస్ రమణ ఇద్దరమే. ఉదయమే ఆయన దగ్గరికి వెళ్లి పార్టీ, ప్రభుత్వ విషయాలు చెప్పేవాళ్లం.

- ఎంతో మందిని టీడీపీలోకి తీసుకొచ్చిన..
“టీడీపీలోకి నేను ఎంతో మందిని తీసుకొచ్చిన. సీతక్కను రాజకీయాల్లోకి తీసుకువచ్చిన. ఆమెను, రేవూరి ప్రకాశ్‌రెడ్డిని, చల్లా ధర్మారెడ్డిని ప్రోత్సహించిన. జిల్లాలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా గంగుల కమలాకర్, విద్యాసాగర్‌రావు, మాగంటి గోపినాథ్‌తోపాటు ఆంధ్రాలో కూడా చాలా మందికి టికెట్లు ఇప్పించిన. ఎన్టీఆర్‌కు ఎంసీపీఐ-యూతో పొత్తు పెట్టుకోవాలని ఆసక్తి ఉండేది. ఆ పార్టీ నేత ఓంకార్‌తో మాట్లాడాలని తనకు చెప్పారు. మూడు నాలుగు సార్లు మాట్లాడిన. రెండు అసెంబ్లీ, ఒక ఎంపీ సీట్లు ఇస్తామని చెబితే ఆయన మూడు అసెంబ్లీ సీట్లు అడిగిండు. దీంతో 1994లో నర్సంపేటలో రేవూరి ప్రకాశ్‌రెడ్డిని నిలబెట్టినం. ఆయన గెలిచిండు.

- ఎంజీఎం అంటే నాకు ప్రత్యేక ఇష్టం..
ఎంజీఎం దవాఖానను డెవలప్ చేయాలని నాకు చాలా కాయస్ ఉండేది. చాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్లతో మాట్లాడి రూ.20 లక్షలు చేసి ఆస్పత్రిలో కొత్త బెడ్లు వేయించిన. కేఎంసీలో చదువుకున్న వాళ్లతో ఉన్న పరిచయాలతో రూ.2 కోట్లు ఆస్పత్రి కోసం తెచ్చి ఆడిటోరియం కట్టించిన. ఎంజీఎంను డెవలప్ చేసిన. ఎంజీఎంను అభివృద్ధి చేసిన తీరుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలోనే నన్ను పొగిడారు.

- అది దుబాయ్ మోడల్..
కేసీఆర్‌కు ఆస్పత్రులు మెరుగ్గా ఉండాలని ఉంటుంది. అందుకే వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో మల్టీలెవల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేపట్టారు. ఆ మోడల్‌ను దుబాయ్ వెళ్లినప్పుడు చూసి.. సేమ్ టు సేమ్ నిర్మాణం మొదలుపెట్టారు.

- ఎంపీగా గెలవడం ఒక చరిత్ర..
2008లో నేను ఎంపీగా గెలవడం ఒక చరిత్ర. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎస్టీలు, రెడ్లు ఎక్కువ మంది ఉండేవారు. కాంగ్రెస్ హవా నడుస్తోంది. ఆ పార్లమెంటు స్థానంలో నేను ఒక్కడినే ఎమ్మెల్యేను. అంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే.” “నేను నిలబడనని చంద్రబాబుకు చెప్పిన. కానీ ఆయన వినలేదు. కాంగ్రెస్ నుంచి రమేశ్వర్ రెడ్డి బరిలో ఉన్నారు. అంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడంతో ఆయనే గెలుస్తారని అనుకున్నారు. కానీ నాకు ప్రతి ఊళ్లో పరిచయస్తులు ఉంటారు. ప్రజలు నాకు బ్రహ్మరథం పట్టారు. ఎవరూ ఊహించని విధంగా గెలిచిన”.

- చంద్రబాబుతో లెటర్ ఇప్పించా
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసినప్పుడు నేను కూడా ఉద్యమంలో పాల్గొన్న. జయశంకర్ సార్ పిలిచి నన్ను చంద్రబాబు నాయుడి నుంచి ఢిల్లీకి లెటర్ రాయించమని చెప్పాడు. బాబు వద్దకు వెళ్లి అడిగితే మొదట నిరాకరించడంతో నేను పది మంది ఎమ్మెల్యేలతో రిజైన్ చేస్తా. తెలంగాణ ఉద్యమం ఊపుమీద ఉందని చెప్పిన. వెంటనే ఆయన తెలంగాణకు అనుకూలంగా లెటర్ ఇచ్చారు.

- అందరూ ‘దయన్న’ అంటరు..
నన్ను ఎక్కడికి పోయినా.. అప్పుడైనా ఇప్పుడైనా అంతా దయన్న.. దయన్న అని పిలుస్తుంటారు. చంద్రబాబు పాదయాత్ర సమయంలో జిల్లాలో ఎక్కడికి వెళ్లినా దయన్న.. దయన్న అంటూ నినాదాలు చేసేవారు. దీన్ని చూసి చంద్రబాబు షాక్ అయ్యాడు. అంతటా దయన్న అంటే.. ఇక్కడ ఒక్కకాడనే ఇలా ఎందుకు అంటున్నారని అడిగాడు. నేను అందరితో కలిసిపోతా. ఉదయం 5 గంటలకు లేచి.. 6 గంటల నుంచే ప్రజలకు అందుబాటులో ఉంటా. వాళ్ల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా. అందుకే అంత అభిమానం.

- రాజకీయాల్లో ఆస్తులు అమ్ముకున్నా..
“మాకు ఒకప్పుడు 500 ఎకరాల వరకు ఉండేది. నేను రాజకీయాల్లో ఆస్తులు అమ్ముకున్నానే కానీ అక్రమంగా సంపాదించుకోలేదు. 200 ఎకరాల వరకు ఇప్పటికీ మా పేరు మీద ఉంటే.. ఇటీవలే కబ్జాలో ఉన్నవారికి రాసి ఇచ్చాం. నాకు సాయం చేయడమే తెలుసు”.

- భార్య సపోర్ట్ పుష్కలం..
నా భార్య ఉషా సపోర్ట్ నాకు పుష్కలంగా ఉంటుంది. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్‌ను ఆమెనే చూసుకుంటుంది.” “ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతాం. కుట్టు మిషన్లు, నిరుద్యోగులకు కోచింగ్, 200 వాటర్ ప్లాంట్లు, డ్రైవింగ్ లైసెన్సులు.. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం”.

- ఎక్కడ అవకాశం వచ్చినా పోటీ చేస్తా..
భవిష్యత్ రాజకీయాలపైనా తనదైన శైలిలో స్పందిస్తూ “డీలిమిటేషన్‌లో స్థానాలు మారడం పక్కా. నేను ఎక్కడ అవకాశం వచ్చినా పోటీ చేస్తా. కానీ రాజకీయాల్లోకి వారసులను దింపే ఆలోచన లేదు”. 2024 ఎన్నికల్లో నేను ఓడిపోతానని ఆరు నెలల ముందే తెలుసు. ఈ విషయం కేసీఆర్‌కు కూడా చెప్పిన. నాకు వేరే స్థానం కావాలని అడిగిన. కానీ అలా జరగలేదు.” ఎన్ని రోజులు దయాకర్ రావే అనే మాట వచ్చింది. అందుకే ఓడిపోయిన.

అవమానం పెంచిన కసి
అవమానం పెంచిన కసి

- ఫినోలెక్స్ కంపెనీ ఎంప్లాయ్ టూ స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్
- కూతురి స్కూల్ అడ్మిషన్.. గ్రీన్ ఉడ్ స్కూలు ఆవిర్భావం
- చలివాగు బ్రిడ్జి పనుల వద్ద మొదలైన రాజకీయ ప్రస్థానం
- యువగర్జనకు పరకాల కోసం వరంగల్ నుంచి స్పెషల్ ట్రైన్
- మొదట ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం రాగా వద్దన్న
- 2009 ఎన్నికల్లో సినిమా సీన్ ను తలపించిన బీఫామ్ ఘటన
- ఓసారి రాజకీయ ప్రత్యర్థుల రాళ్లదాడితో మొక్కజొన్న చేనులో దాక్కున్న
- 2012 ఉప ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసే అవకాశం
- 'ఇంటింటికి మీ చల్లా' కార్యక్రమంతో ప్రజల్లోకి.. నియోజకవర్గంపై పట్టు
- ప్రత్యేక రాష్ట్రం కోసం 41 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు
- 2014 ఎన్నికల్లో విజయం సాధించి లక్ష్యాన్ని ముద్దాడ
- ఓ పొలిటికల్ లీడర్ చేసిన అవమానమే నన్ను ఎమ్మెల్యేను చేసింది
- పదేళ్లలో ఎమ్మెల్యేగా రూ.2,500 కోట్లతో అభివృద్ధి పనులు
- కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ తీసుకరావడం ఆనందాన్నిచ్చింది
- స్వగ్రామం ప్రగతి సింగారాన్ని మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దాను
- కేసీఆర్ భోళా శంకరుడు.. కేటీఆర్, హరీష్ లతో నాది ప్రత్యేక అనుబంధం
- గత ఎన్నికల్లో జరిగిన తప్పులను సరిదిద్దుకొని ముందుకు పోతున్నం
- డీలిమిటేషన్ లో మూడు ముక్కలైనా.. వచ్చే ఎన్నికల్లో పోటీ ఖాయం
- ఈసారి నా కోసం కాదు.. నన్ను నమ్ముకున్న కార్యకర్తల కోసం గెలవాలి
- డిజిటల్ మీడియాతో బీఆర్ఎస్ నేత, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చిట్ చాట్

అక్షరదర్బార్, హనుమకొండ

మాది వ్యవసాయ కుటుంబం. నన్ను కూడా వ్యవసాయంలోనే కొనసాగించాలని మా తండ్రికి ఉండేది. నాకు మాత్రం కొత్తగా ఏదైనా చేయాలనే ఆసక్తి ఉండే. ఆ సమయంలో ఓ ఫ్రెండ్ ద్వారా ఫినోలెక్స్ కంపెనీలో ఎంప్లాయ్ గా చేరాను. మార్కెటింగ్ మేనేజర్ గా పనిచేశాను. తర్వాత నంది పైప్స్, లూబీ ఎలక్ట్రికల్ కంపెనీల డిస్ట్రిబ్యూటర్ తీసుకున్న. ప్రభుత్వ పథకాల అమలుకు పైపులు, మోటార్లను సరఫరా చేసిన. ఈ క్రమంలో కాంట్రాక్ట్ ఫీల్డ్ లోకి అడుగు పెట్టాల్సి వచ్చింది. అనతి కాలంలోనే స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ గా ఎదిగాను. ఇందులో భాగంగా మా ఊరి వద్ద వాగుపై చేపట్టిన వంతెన నిర్మాణానికి సంబంధించి ఓ పొలిటికల్ లీడర్ తనను అవమానపరిచినట్లు మాట్లాడటం వల్ల రాజకీయాల్లోకి వచ్చిన. ఎలాగైనా ఎమ్మెల్యేను కావాలనే కసితో అప్పట్లో తెలుగుదేశం పార్టీలో చేరానని బీఆర్ఎస్ నేత, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చెప్పారు. అనుకోకుండా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తాను ఆటంకాలెన్ని ఎదురైనప్పటికీ అధిగమిస్తూ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్యాన్ని ముద్దాడినట్లు ఆయన తెలిపారు. పదేళ్లు ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో పరకాల శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగెత్తించినట్లు చల్లా చెప్పారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఓటమి ఎదురు కావడానికి పోల్ మేనేజ్మెంట్ లో కొన్ని లోపాలు జరిగాయని గుర్తించినట్లు ధర్మారెడ్డి వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తనను నమ్ముకున్న కార్యకర్తల కోసం మళ్లీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. డీలిమిటేషన్ లో నియోజకవర్గం మూడుముక్కలైనా ఎక్కడో ఒకచోట నుంచి తాను పోటీ చేయడం ఖాయమని చల్లా స్పష్టం చేశారు. హనుమకొండలోని తన నివాసంలో బుధవారం ధర్మారెడ్డి డిజిటల్ మీడియా చిట్ చాట్ లో తన అనుభవాలను పంచుకున్నారు. ఏమన్నారంటే ఆయన మాటల్లోనే..

- ప్రగతిసింగారం నుంచి ప్రస్థానం
స్వగ్రామం శాయంపేట మండలంలోని ప్రగతిసింగారం. మాది వ్యవసాయ కుటుంబం. తల్లి సమ్మక్క, తండ్రి మల్లారెడ్డి. మేం ముగ్గురం అన్నదమ్ములం. నేను పెద్దవాడిని. రెండో తమ్ముడు మరణించాడు, ఇంటర్మీడియట్ కాగానే 18 ఏళ్లకే 1986లో మేనమామ కుమార్తె జ్యోతితో వివాహం జరిగింది. తండ్రి తనను వ్యవసాయంలోనే కొనసాగించాలని భావించినా.. తనకు మాత్రం కొత్తగా ఏదైనా చేయాలనే ఆసక్తి ఉండేది. డిగ్రీ చదువుకుంటున్న సమయంలోనే స్నేహితుడి సహకారంతో ఫినోలెక్స్ కంపెనీలో ‘మార్కెటింగ్ మేనేజర్ గా పనిచేశాను. అప్పట్లో వ్యవసాయ బావులు, పొలాలకు పైప్‌లైన్లు వేసే కార్యక్రమాలు విస్తృతంగా సాగుతుండటంతో ఆ రంగంపై మంచి అవగాహన ఏర్పడింది.
- నంది పైప్స్‌తో వ్యాపారంలోకి
1993లో సొంతంగా నంది పైప్స్, లూబీ ఎలక్ట్రికల్స్ కంపెనీల డిస్ట్రిబ్యూటర్‌ తీసుకున్న. 1994లో అప్పటి టీడీపీ ప్రభుత్వం స్వజలధార, ఆర్ డబ్ల్యూఎస్ ద్వారా గ్రామాలకు నీటి సౌకర్యం కల్పించే పథకాలను అమల్లోకి తేవడంతో పైపులు, మోటార్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఆ కాలంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 80 శాతం పనుల ఆర్డర్లు నేనే తీసుకున్న. పైపులు, మోటార్ల సరఫరాతో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, రాజకీయ నాయకులతో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. అప్పటి నుంచే ఎర్రబెల్లి దయాకర్‌రావుతో సాన్నిహిత్యం ఉంది. తన అమ్మకాల ప్రతిభను గుర్తించిన నంది పైప్స్ సంస్థ 1997లో మారుతి కారును బహుమతిగా ఇచ్చింది.

- కాంట్రాక్టర్‌గా కొత్త మలుపు
1999లో ప్రభుత్వ పనుల్లో కాంట్రాక్టర్లే మెటీరియల్ కొనుగోలు చేయాలనే విధానం రావడంతో నా వ్యాపారంపై ప్రభావం పడింది. సరఫరా చేసిన మెటీరియల్‌కు బిల్లులు సకాలంలో రాకపోవడం, కొందరు డబ్బులు ఎగ్గొట్టడంతో నష్టాలు ఎదురయ్యాయి. అయితే నేను ఇతరులకు సరఫరా చేస్తే బిల్లుల కోసం ఎదురు చూడాల్సి వస్తుందని, స్వయంగా కాంట్రాక్టర్‌గా మారితేనే పరిస్థితి మారుతుందని నిర్ణయించుకున్న. కాంట్రాక్టర్‌గా అడుగుపెట్టి.. 2002లో స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్‌గా ఎదిగాను. చల్లా ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను ప్రారంభించి 2003 నుంచి పెద్ద పెద్ద కాంట్రాక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్ వంటివి, ఇతర ప్రాజెక్టులు చేశాను.

- కూతురు స్కూల్ అడ్మిషన్.. గ్రీన్‌వుడ్ ఆవిర్భావం
తన కుమార్తెను స్కూల్‌లో చేర్పించేందుకు వెళ్లిన సందర్భం విద్యారంగంలోకి తీసుకొచ్చింది. స్కూల్ లో సౌకర్యాలు లేకపోవడంతో అప్పటి ప్రిన్సిపాల్ కు కొత్త పాఠశాల ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని, ఒక భాగస్వామి ఉంటే బాగుంటుందని చెప్పడంతో 2003లో గ్రీన్‌వుడ్ స్కూల్ ను ప్రారంభించడం జరిగింది. ఆరంభం నుంచే పాఠశాలకు మంచి ఆదరణ లభించింది. ఇప్పటి వరకు 23 బ్యాచ్‌లు పదో తరగతి పూర్తి చేసుకున్నయి.

- అవమానం పెంచిన కసి.. రాజకీయాల్లోకి ఎంట్రీ
కాంట్రాక్టర్ గా 2008లో శాయంపేట–ప్రగతిసింగారం మధ్య చలివాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాను. ఆ పనులకు సంబంధించిన బిల్లుల విషయంలో అప్పటి పొలిటికల్ లీడర్ ఒకరు తనను ఇబ్బంది పెట్టాడు. ఒకసారి వాల్ల ఇంటికి వెళ్లినప్పుడు ఎదురైన అవమానం తన జీవితాన్ని రాజకీయాల వైపు మళ్లించింది. “నన్ను అవమానించిన కుటుంబంపైనే ఎన్నికల్లో పోటీ చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నా”. 2009లో పరకాల నుంచి పోటీ చేయాలనే నిర్ణయాన్ని అప్పట్లో ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేం నరేందర్‌రెడ్డితో పాటు చంద్రబాబునాయుడికి వివరించిన. ఆ సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ నాయకుడు తనను చులకనగా మాట్లాడినా.. పరకాల నుంచే పోటీ చేయాలనే నిర్ణయం నుంచి వెనక్కి తగ్గలేదు.
- ఎమ్మెల్సీ అవకాశం వచ్చినా వద్దన్నా..
2009లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం వచ్చినప్పటికీ.. తన లక్ష్యం ప్రత్యక్ష ఎన్నికలేనని పార్టీ అధిష్టానానికి చెప్పి తిరస్కరించిన. అదే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ–టీఆర్ఎస్ పొత్తులో సీట్ల సర్దుబాటులో భాగంగా పరకాల సీటు టీఆర్ఎస్‌కు వెళ్లింది. అప్పుడు టీఆర్ఎస్ నేతలు మా పార్టీ తరఫున పోటీ చేయాలని అడిగినా నేను ఒప్పుకోలేదు.

- బీఫాం కోసం సినిమా తరహా డ్రామా
2009 ఎన్నికల్లో పార్టీ బీఫాం అందజేయాల్సిన ఆఖరి రోజు జరిగిన పరిణామాలు ఇప్పటికీ మర్చిపోలేనివి. చివరి నిమిషంలో పార్టీ నుంచి బీఫాం వస్తుందనే సమాచారం రావడంతో డ్రైవర్‌ను పార్టీ కార్యాలయానికి పంపాను. బీఫాంలతో కారు బయలుదేరిన సమయంలో కాజీపేట ఫాతిమా బ్రిడ్జి వద్ద కొందరు పార్టీ నాయకులు కారును అడ్డుకుని బీఫాంలను తీసుకున్నారు. తనకు రావాల్సిన బీఫాం మరొకరికి వెళ్లింది. మళ్లీ ఫాంలను సరిచేసుకుని వచ్చేలోపే నామినేషన్ కేంద్రం వద్ద గేట్లు మూసివేశారు. పోలీసులు నన్ను బలవంతంగా గేటు బయటికి తీసుకెళ్లగా.. మా డ్రైవర్ గోడ దూకి లోపలికి వచ్చాడు. నిమిషాల తేడాతో బీఫాం అందజేసే అవకాశం కోల్పోయాను. ఆ ఘటన మొత్తం సినిమా క్లైమాక్స్‌ను తలపించింది.

- 2012లో తొలి ఎన్నికల పోరు
పరకాల శాసనసభ నియోజకవర్గానికి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో నాకు పరకాల నుంచి టీడీపీ టికెట్ దక్కింది. పోటీ చేసి 33 వేల ఓట్లు సాధించిన. పార్టీకి చెందిన కొందరు తనకు ప్రతికూల పరిస్థితులు కల్పించడంతో ఓడిపోయాను. ఈ విషయం చంద్రబాబునాయుడికి తెలియడంతో సంబంధిత నాయకులను ఆయన మందలించారు. ఆ సమయంలోనే పరకాల నియోజకవర్గంతో పాటు శాయంపేట మండలంలోని 263 ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు కంప్యూటర్లను అందజేసిన.

- యువగర్జనకు పరకాల కోసం స్పెషల్ ట్రైన్
నందమూరి బాలకృష్ణ రాజకీయ ప్రవేశ సమయంలో 2008లో టీడీపీ గుంటూరులో నిర్వహించిన యువగర్జన సభకు పరకాల నియోజకవర్గం నుంచి ప్రత్యేక రైలును ఏర్పాటు చేయడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. జిల్లా నాయకుడిని తనకు ఒక బోగీ ఇవ్వాలని కోరగా.. ఇంకా తనకు పదవి లేదని, ఇవ్వలేమని చెప్పాడు. దీంతో సభ ఇన్ చార్జ్ ఎర్రం నాయుడు వద్దకు వెళ్లి ప్రత్యేక రైలు ఏర్పాటు చేయడానికి ఎంత ఖర్చవుతుందని తెలుసుకుని.. ఆ మొత్తాన్ని చెల్లించి వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి నుంచి పరకాల నియోజకవర్గ కార్యకర్తల కోసం ప్రత్యేక రైలు వేయించుకున్న. రైలు నిండా కార్యకర్తలను తీసుకెళ్లడమే కాకుండా వారికి భోజనం, తాగునీటి సౌకర్యాలు కల్పించిన. ఈ కార్యక్రమం అప్పట్లో రాజకీయంగా పెద్ద హల్‌చల్ సృష్టించింది.

- ‘ఇంటింటికీ మీ చల్లా’తో ప్రజల్లోకి..
2013 నవంబర్ 22న ‘ఇంటింటికీ మీ చల్లా’ కార్యక్రమాన్ని ప్రారంభించి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను చుట్టివచ్చాను. ఒక్కో గ్రామంలో రెండు మూడు రోజుల పాటు ఉండి, ఉదయం–సాయంత్రం ప్రజలతో మమేకమయ్యాను. ఈ పర్యటన దాదాపు ఏడాది పాటు 2014 ఎలక్షన్ వరకు సాగింది. ప్రతీ ఇంటి పరిస్థితి, గ్రామాల్లోని మౌలిక సమస్యలు, రోడ్లు, కరెంటు, తాగునీరు, పేదరికం వంటి అంశాలను స్వయంగా తెలుసుకున్న. ఒక గ్రామంలో ఆకలితో పస్తులు పడుకున్న డిగ్రీ విద్యార్థినిని చూసిన ఘటన తనను తీవ్రంగా కలచివేసింది. ఈ పాదయాత్ర ద్వారా గ్రామాల అవసరాలపై స్పష్టమైన అవగాహన వచ్చింది. తర్వాత ఎమ్మెల్యేగా చేపట్టిన అభివృద్ధి పనులకు అదే ప్రణాళికగా మారింది.

- మొక్కజొన్న పొలంలో దాక్కున్న
రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత ఎన్నో దాడులు ఎదుర్కొన్న. పొలిటికల్ ప్రత్యర్థులు నన్ను నియోజకవర్గం నుంచి వెళ్లగొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. 2011–12 మధ్య నందిరాంనాయక్ తండాలో ప్రభ బండ్ల ప్రారంభోత్సవానికి వెళ్లిన సమయంలో రాళ్లతో దాడి చేశారు. కొబ్బరికాయ కొట్టేందుకు వంగిన సమయంలోనే దాడి జరగడంతో తాను, కార్యకర్తలు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశాం. కొందరితో కలిసి మొక్కజొన్న చేనులో దాక్కున్న. ఘటనపై సమాచారం అందడంతో భారీగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పట్లో ఈ ఘటన నియోజకవర్గంలో సంచలనం సృష్టించింది. పెద్ది సుదర్శన్‌రెడ్డి వచ్చి తనకు అండగా నిలిచారు. 2009లో కూడా తన వెంట వచ్చిన ఆరు కార్లను ధ్వంసం చేశారు. రాజకీయాల్లో మంచి, చెడు రెండూ ఉంటాయని ముందే నిర్ణయించుకుని వచ్చిన.

- తెలంగాణ కోసం పోరాటం
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో పరకాల నియోజకవర్గంలో ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నడిపాను. టీడీపీలో కొనసాగుతున్నప్పటికీ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడాను. నియోజకవర్గంలో 41 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు నిర్వహించి అన్ని గ్రామాల ప్రజలను భాగస్వాములను చేయడం జరిగింది.

- 2014లో గెలుపు.. టీఆర్ఎస్‌లోకి చేరిక
2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పరకాల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించా. తనపై ఉన్న అభిమానంతో కార్యకర్తలు కష్టపడి గెలిపించారు. ఆ తర్వాత వారి అభీష్టం మేరకు టీఆర్ఎస్‌లో చేరాను.

- ‘పదేళ్లలో రూ.2,500 కోట్ల అభివృద్ధి’
ఎమ్మెల్యేగా పదేళ్ల కాలంలో పరకాల నియోజకవర్గానికి సుమారు రూ.2,500 కోట్ల అభివృద్ధి పనులు తీసుకొచ్చిన. ‘ఇంటింటికీ మీ చల్లా’ పర్యటనలో గుర్తించిన సమస్యల్లో దాదాపు 90 శాతం పరిష్కరించా. ప్రతీ ఎమ్మెల్యేకు రూ.5 కోట్ల నిధులు వచ్చే రోజుల్లోనూ ప్రత్యేకంగా పట్టుబట్టి రూ.35 కోట్ల వరకు నిధులు తీసుకొచ్చి పనులు చేపట్టిన.
తన హయాంలో చేపట్టిన ప్రధాన పనులు..
* 2016లో పరకాల రెవెన్యూ డివిజన్ పునరుద్ధరణ
* కొనాయిమాకుల ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం
* రెండు కొత్త మండలాలు. కార్యాలయాల భవనాలు
* పరకాల ప్రజల చిరకాల కోరిక అయిన 100 పడకల ఆస్పత్రి
* డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు
* బాలురు, బాలికలతో పాటు ఆరు రెసిడెన్షియల్ విద్యాసంస్థలు
* 46 గ్రామాల్లో మహిళా భవనాలు
* 57 గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు
* పరకాల పట్టణంలో డివైడర్, సెంట్రల్ లైటింగ్
* దామెర చెరువులో బోటింగ్
* పాత మార్కెట్ అభివృద్ధి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం
* కంఠాత్మకూరు బ్రిడ్జికి నిధులు
* పల్లె దవాఖానలు, విద్యుత్ సబ్‌స్టేషన్లు

- ‘టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు ఆనందాన్నిచ్చింది..
వరంగల్‌కు ఒకప్పుడు అజంజాహి మిల్ ఎంతటి గుర్తింపు తెచ్చిందో, ఆ స్థాయి ఉపాధి అవకాశాలు కల్పించేలా పరకాల నియోజకవర్గానికి టెక్స్‌టైల్ పార్క్ తీసుకురావడం తనకు అత్యంత ఆనందాన్ని ఇచ్చిన విషయం. “అజంజాహి మిల్ తర్వాత వరంగల్ ప్రాంతానికి అదే స్థాయిలో ఉపాధి కల్పించే పరిశ్రమ రావాలనేది నా ఆలోచన. దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్క్ పరకాల నియోజకవర్గానికి రావడం సంతోషంగా ఉంది”.
- పుట్టిన ఊరికి ప్రత్యేక అభివృద్ధి
నేను పుట్టిన ప్రగతిసింగారం గ్రామాన్ని అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాను. గ్రామ పంచాయతీని మోడల్‌గా తీర్చిదిద్దడంతో పాటు సొంత స్థలంలో రామాలయం నిర్మించిన. ప్రభుత్వ స్థలంతో పాటు ఎకరం భూమిని కొనుగోలు చేసి కమ్యూనిటీ హాల్, గ్రామ ప్రజల కోసం ఫంక్షన్ హాల్ నిర్మించిన. స్కూల్, లైబ్రరీ, ఆస్పత్రి ఏర్పాటు చేశాను.

- రైతులకు అన్యాయం చేయలే
తక్కువ ధరకు భూములను కొనుగోలు చేసి రైతులకు అన్యాయం చేశారని నాపై వస్తున్న వార్తల్లో నిజం లేదు. రాజకీయ లబ్ధి కోసమే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. “ఏ ఒక్క రైతు భూమిని నేను అక్రమంగా తీసుకోలేదు. ప్రభుత్వ, అసైన్డ్ భూముల జోలికే వెళ్లలేదు. నేను కొనుగోలు చేసినవి పట్టా భూములే.. అవి కూడా న్యాయబద్ధంగా అప్పటి ధర ప్రకారం కొనుగోలు చేశా”. తర్వాత కొన్ని కారణాలవల్ల వాటిని అమ్మేసిన. రాజకీయాల్లో ముళ్లకంప, పూలపాన్పు రెండూ ఉంటాయి. కష్టాలు సహజం. తాను ఎప్పుడూ వ్యక్తిగత దూషణలకు వెళ్లలేదు. రాజకీయ ప్రత్యర్థులను రాజకీయంగానే ఎదుర్కొంటా.

- ‘కేసీఆర్ భోళా శంకరుడు’
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉంది. మాట ఇస్తే నిలబెట్టుకునే వ్యక్తి కేసీఆర్. ఆయన మంచి విజన్ ఉన్న నాయకుడు. తనపై కేసీఆర్‌కు ప్రత్యేక అభిమానం ఉండేది. ఆ అనుబంధంతోనే పరకాల నియోజకవర్గానికి అధిక నిధులు తీసుకురాగలిగా. నేను ఎవరిపైనా చాడీలు చెప్పను, వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉంటా. అందుకే కేసీఆర్‌తో పాటు కేటీఆర్, హరీశ్‌రావు తనను అభిమానిస్తారు.

- ‘వచ్చే ఎన్నికల్లో మళ్లీ బరిలో ఉంటా’
వాస్తవానికి గత ఎన్నికల్లో గెలిస్తే రాజకీయాలకు విరామం ఇవ్వాలని భావించా. అయితే ప్రస్తుతం రాజకీయాల్లో కనిపిస్తున్న కక్షపూరిత వాతావరణం, తనను నమ్ముకున్న కార్యకర్తల పరిస్థితిని చూసి మరోసారి పోటీ చేయాలని నిర్ణయించుకున్న. గత ఎన్నికల్లో జరిగిన తప్పులను గుర్తించాను. వాటిని సరిదిద్దుకుని ముందుకు సాగుత. నియోజకవర్గంలోని 109 గ్రామ పంచాయతీల్లో నాకు బలమైన పట్టు ఉంది. పునర్విభజన జరిగినా.. నియోజకవర్గాల సరిహద్దులు మారినా.. ఎక్కడి నుంచి పోటీ చేయాలో నిర్ణయించుకుని వచ్చే ఎన్నికల్లో ఒకచోట నుంచి తప్పకుండా బరిలో ఉంటి. “ఈసారి నా కోసం కాదు.. నన్ను నమ్ముకున్న కార్యకర్తల కోసం గెలవాలి. ప్రజలు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది”.

రూ.1.25 కోట్ల గంజాయి సీజ్
రూ.1.25 కోట్ల గంజాయి సీజ్
- అంతర్‌రాష్ట్ర స్మగ్లర్ అరెస్ట్
- దామెర పోలీసుల భారీ ఆపరేషన్
- 251 కిలోల గంజాయి, బైక్, నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం
- వరంగల్ సీపీ ఎన్ శ్వేత వెల్లడి

అక్షరదర్బార్, హనుమకొండ: గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మత్తు పదార్థాల విక్రయదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా హన్మకొండ జిల్లా దామెర మండలం పులుకుర్తి గ్రామానికి చెందిన అంతర్‌రాష్ట్ర గంజాయి స్మగ్లర్ ముదిగొండ నాగేశ్వర్ రావు (55)ను దామెర పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుడి నుంచి సుమారు రూ.1 కోటి 25 లక్షల విలువైన 251 కిలోల గంజాయి, ఒక ద్విచక్ర వాహనం, రూ. 9,000 నగదు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత మీడియా సమావేశంలో వెల్లడించారు.
- ఇతర రాష్ట్రాలకు రవాణా
ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ పర్యవేక్షణలో దామెర పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు నాగేశ్వర్ రావు సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఒడిశా రాష్ట్రానికి చెందిన రమేష్, సుధాకర్ వద్ద తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసేవాడు. ఆ తర్వాత తనకున్న నెట్‌వర్క్ ద్వారా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఉర్దు, రాందాస్ శేషరావు బీరదార్, అక్లీం, షారుఖ్ ఖాన్, షేక్ అక్బర్, నునావత్ రాజు అనే వ్యక్తుల ద్వారా ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడు ఇచ్చిన పక్కా సమాచారంతో అతని ఇంటిపై దాడి చేసిన పోలీసులు భారీగా నిల్వ ఉంచిన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇది ఏపీలోని విశాఖపట్నం జిల్లా సీలేరు ప్రాంతం నుంచి పులుకుర్తికి రవాణా అయింది. ఈ గంజాయి నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న మిగతా రాష్ట్రాల నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దించినట్లు సీపీ తెలిపారు.
- మత్తు పదార్థాలపై కఠిన చర్యలు
యువత మత్తు పదార్థాల బారిన పడి బంగారు భవిష్యత్తును పాడుచేసుకోకుండా కాపాడేందుకు ప్రత్యేక దృష్టి సారించామని సీపీ ఎన్.శ్వేత తెలిపారు. ఎవరైనా గంజాయి విక్రయించినా, వినియోగించినా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
- పోలీస్ సిబ్బందికి అభినందనలు
ఈ భారీ గంజాయి స్మగ్లింగ్ ముఠాను చాకచక్యంగా పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పరకాల ఏసీపీ సతీష్ బాబు, శాయంపేట సీఐ సుధాకర్ రెడ్డి, ఆత్మకూర్ సీఐ సంతోష్, దామెర ఎస్ఐ వీరభద్రరావు, శాయంపేట ఎస్ఐ పరమేశ్వర్, పరకాల ఎస్ఐ రఘుపతి, ఏఏఓ సల్మాన్ పాషా మరియు దామెర, శాయంపేట స్టేషన్ల కానిస్టేబుళ్లను సీపీ అభినందించారు.

నేను పార్టీకి కండువాను
నేను పార్టీకి కండువాను

- అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చా.. కాంగ్రెస్ తోనే నా ప్రయాణం.. నా శ్వాస
- అడ్డంకులు ఎదురైనా అడుగు ఆపలేదు.. పార్టీకి ఎప్పుడు వెన్ను చూపలేదు
- టికెట్లు ఆశించలేదు.. పదవుల కోసం కాంగ్రెస్ ను వీడలేదు
- కేసీఆర్ పిలిచినా పార్టీని వదిలి వెళ్లలే
- నా రాజకీయంలో రిటైర్మెంట్ ఉండదు
- ఆడపిల్ల గడప దాటని రోజుల్లోనే పీఏసీఎస్ చైర్ పర్సన్ గా తొలి విజయం
- ఒక్కరోజు ప్రచారంతో పీఏసీఎస్ విజయం.. అది కుటుంబం అందించిన ప్రోత్సాహం
- మామ భర్తే నా పొలిటికల్ గురువులు
- వైఎస్సార్ మాట ఇచ్చారు.. మేయర్ పీఠం దక్కింది
- మేయర్ గా ఐదేళ్లు ప్రజలకు సేవ చేయడం సంతృప్తినిచ్చింది
- నగర ప్రజల తాగునీటి కోసం రూ.178 కోట్లు తేవటం మర్చిపోలేనిది
- రాజకీయాల్లో వైఎస్సార్ నా అన్న.. రేవంత్ రెడ్డి నమ్మకమే నా బలం
-  నా పొలిటికల్ భవిష్యత్తు పార్టీ నిర్ణయిస్తుంది
- డిజిటల్ మీడియా చిట్ చాట్ లో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ
- ఇంటి గడప దాటని స్థాయి నుంచి కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా స్వర్ణ రాజకీయ ప్రస్థానం

అక్షరదర్బార్, హనుమకొండ

రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ తన బాల్యం నుంచి రాజకీయ ప్రస్థానం వరకు అనేక ఆసక్తికర విషయాలను సోమవారం హనుమకొండలోని తమ నివాసంలో డిజిటల్ మీడియా చిట్ చాట్ లో పంచుకున్నారు. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలం పాతగూడూరు తమ స్వస్థలమని స్వర్ణ తెలిపారు. తండ్రి హన్మంతరావు లాయర్‌గా ప్రాక్టీస్‌ చేసి, అనంతరం కాంట్రాక్టర్‌గా పనిచేశారని చెప్పారు. తల్లి జయలక్ష్మి. అక్క, చెల్లి, తమ్ముడితో కలిసి కరీంనగర్‌ పట్టణంలో పెరిగానన్నారు. ఇంటర్‌ వరకు కరీంనగర్‌లోనే చదివానని, ఇంటర్‌ సెకండియర్‌లో ఉండగానే వివాహం కావడంతో ఆ తర్వాత చదువును కొనసాగించలేకపోయానని గుర్తు చేసుకున్నారు. అక్క భర్త స్నేహితుడైన వరద రాజేశ్వర్‌రావుతో పరిచయం ద్వారా వివాహ సంబంధం కుదిరిందన్నారు. రాజేశ్వర్‌రావు అప్పట్లో ఏ ఉద్యోగం చేయకపోవడంతో ఇంట్లో కొంత అభ్యంతరం వ్యక్తమైనా, ఆయన మంచివారని చెప్పి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారని తెలిపారు. తన తాతకు ఆ సంబంధంపై అభ్యంతరం ఉంటే, ఆయనకంటే ముందే నువ్వే ‘నో’ చెప్పాలని చెప్పారని గుర్తు చేసుకున్నారు. అయితే తనకు రాజేశ్వర్‌రావు నచ్చారని, తనను కూడా ఆయనకు నచ్చడంతో వివాహం జరిగిందన్నారు.

- రాజకీయాలతో అసలు పరిచయం లేదు..
తమ కుటుంబానికి రాజకీయ నేపథ్యం లేదని స్వర్ణ తెలిపారు. ఆడవాళ్లు గడీల నుంచి బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉండేది కాదని గుర్తు చేసుకున్నారు. పెళ్లి తర్వాత అత్తింట్లో తనకు ఎంతో గౌరవం లభించిందని చెప్పారు. కోడలిని కూడా కూతురిలాగే చూసుకునే సంప్రదాయం తమ అత్తింట్లో ఉందన్నారు. అత్తమామలు కులశేఖర్‌రావు, లక్ష్మీదేవి తనను సొంత బిడ్డలా చూసుకునేవారని తెలిపారు. వారి వృద్ధాప్యంలో ఎంత బిజీగా ఉన్నా సాయంత్రం వారి బాగోగులు చూసుకునేదాన్నని, మరిది, తోటి కోడలు కూడా ఎంతో మంచిగా చూసుకునేవారని గుర్తు చేసుకున్నారు. అత్తింట్లో తనకు లభించిన గౌరవమే రాజకీయంగా ముందుకు సాగే అవకాశాన్ని కూడా కల్పించిందన్నారు.

- రాజకీయ ఓనమాలు నేర్పింది మా వారే..
రాజకీయాల్లోకి రావడం మాత్రం చాలా అనూహ్యంగా, తన ప్రమేయం లేకుండానే జరిగిందని స్వర్ణ తెలిపారు. రాజకీయ ఓనమాలు నేర్పింది తన భర్త వరద రాజేశ్వర్‌రావేనని చెప్పారు. రాజకీయంగా ముందుకు రావడానికి అన్ని విధాలుగా ప్రోత్సహించింది తన మామ కులశేఖర్‌రావేనని తెలిపారు. వరద రాజేశ్వర్‌రావు యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేసేవారని చెప్పారు. ఆ సమయంలో సంజయ్‌ గాంధీ వచ్చిన సందర్భంగా అండాల కొద్దీ పులిహోర తయారు చేశానని, దానిని రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లి ఇచ్చారని గుర్తు చేసుకున్నారు.

- అనుకోకుండా పీఏసీఎస్‌ చైర్మన్‌గా..
తాను రాజకీయాల్లోకి వస్తానని ఏనాడూ అనుకోలేదని స్వర్ణ చెప్పారు. వర్ధన్నపేట పీఏసీఎస్‌ చైర్మన్‌ ఎన్నికలు వచ్చినప్పుడు తన మామ పోటీ చేయాలని సూచించారని తెలిపారు. పిల్లలు చిన్నవాళ్లు కావడంతో రాజకీయాల్లోకి వస్తే ఎలా అని తొలుత అడిగానని చెప్పారు. అయితే మామ కులశేఖర్‌రావు, భర్త వరద రాజేశ్వర్‌రావు పట్టుబట్టి పోటీ చేయించారని తెలిపారు. ఒక్క రోజు మాత్రమే ప్రచారానికి వెళ్లినా భారీ మెజార్టీతో గెలిచానని చెప్పారు. 1991లో తొలిసారి పీఏసీఎస్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టానని తెలిపారు. అనంతరం రాష్ట్రంలో టీడీపీ హవా నడుస్తున్న కాలంలో ఓడీసీఎంఎస్‌ డైరెక్టర్‌ పదవికి బరిలో నిలిపారని, ఆ ఎన్నికల్లో కూడా విజయం సాధించానన్నారు. అయితే చైర్మన్‌ కావాల్సిన సమయంలో సొంత పార్టీలోని వ్యక్తే హ్యాండ్‌ ఇవ్వడంతో ఆ పదవి చేజారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో చైర్మన్‌గా బీరం సంజీవరెడ్డి గెలిచారని తెలిపారు.

- మాది కాంగ్రెస్‌ కుటుంబం..
తమ కుటుంబం మొదటి నుంచి కాంగ్రెస్‌తోనే ఉందని స్వర్ణ స్పష్టం చేశారు. అన్ని పార్టీల నాయకులతో వ్యక్తిగతంగా మంచి అనుబంధాలు ఉన్నప్పటికీ రాజకీయంగా మాత్రం కాంగ్రెస్‌ను వీడలేదన్నారు. వివిధ పార్టీల నుంచి తమ కుటుంబాన్ని పార్టీలోకి రావాలని ఆహ్వానించినా వెళ్లలేదని తెలిపారు. కేసీఆర్‌ సైతం పార్టీలోకి రావాలని పిలిచారని, అయినా కాంగ్రెస్‌ను వీడలేదన్నారు. “ఎన్ని సమస్యలు వచ్చినా కాంగ్రెస్‌లోనే ఉన్నాం. పదవులు ఉన్నా, లేకున్నా పార్టీతో మా ప్రయాణం కొనసాగింది. జీవితం అంతా కాంగ్రెస్‌ పార్టీతోనే” అని స్పష్టం చేశారు.

- తొలి ఎమ్మెల్యే ఎన్నిక.. 10 వేల ఓట్లతో ఓటమి
1985లో వరద రాజేశ్వర్‌రావుకు ఎమ్మెల్యే టికెట్‌ వచ్చిందని గాంధీభవన్‌ నుంచి ఫోన్‌ వచ్చిందని స్వర్ణ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో టికెట్‌ అంటే ఏమిటో కూడా పూర్తిగా అర్థం కాలేదన్నారు. వరద రాజేశ్వర్‌రావు అంటే అప్పటికి రాజకీయంగా పెద్దగా ఎవరికీ తెలియదని, కేవలం మాధవరావు మనుమడు అనే గుర్తింపు మాత్రమే ఉండేదన్నారు. ఆ ఎన్నికల్లో సుమారు 10 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారని తెలిపారు.

- ఓటమి తర్వాతే జనాలతో బంధం..
ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రోజు నుంచే రాజేశ్వర్‌రావు ఉదయం 7 గంటలకు గ్రామాల్లోకి వెళ్లి ప్రజలను కలవడం ప్రారంభించారని స్వర్ణ తెలిపారు. ప్రతి ఒక్కరినీ పలకరించి, వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ ప్రజలతో బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకున్నారని చెప్పారు. మళ్లీ ఎన్నికలు రాగానే రాజేశ్వర్‌రావుకు టికెట్‌ వచ్చిందన్నారు. అయితే ఆ ఎన్నికల్లో భారీ మోసం జరిగిందని స్వర్ణ తెలిపారు. ముందుగా బీ-ఫాం ఇచ్చారని, కానీ ఎన్నికలకు ముందు రోజు మాచర్ల జగన్నాథంను అభ్యర్థిగా ప్రకటించారని చెప్పారు. రాజేశ్వర్‌రావు బీ-ఫాంతో నామినేషన్‌ వేయడంతో చేయి గుర్తు కూడా వచ్చిందన్నారు. పార్టీలోనే ఇద్దరు అభ్యర్థులు ఉండే పరిస్థితి రావడంతో చివరకు సుమారు 5 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారని తెలిపారు. టీ. రాజేశ్వర్ రావు గెలిచారు.  ఆ ఎన్నికలతో రాజకీయంగా తీవ్ర దెబ్బ తగిలిందన్నారు.

- వైఎస్‌ పిలుపుతో ఎమ్మెల్యే బరిలోకి..
పదవులు ఉన్నా లేకున్నా పార్టీ కోసం పనిచేస్తున్న తమ కుటుంబాన్ని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గుర్తించారని స్వర్ణ తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న సమయంలో ఐదు నియోజకవర్గాల సమీక్షను వర్ధన్నపేటలో ఏర్పాటు చేయాలని మా ఆయనకు ఫోన్‌ చేశారని చెప్పారు. డీసీసీ అధ్యక్షుడు చెరుకుపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తన భర్త రాజేశ్వర్‌రావు వైఎస్‌తో కలిసి ఉన్నారని తెలిపారు. ఆ సమయంలో తనను పిలిచి వచ్చే ఎన్నికల్లో నీకు టికెట్‌ ఇస్తానని, నువ్వే పోటీ చేయాలని వైఎస్‌ చెప్పారని గుర్తు చేసుకున్నారు. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో ఎవరు పోటీ చేసినా పార్టీకి నష్టం జరుగుతుందని, ఒకవేళ ఓడిపోయినా తాను చూసుకుంటానని వైఎస్‌ భరోసా ఇచ్చారని తెలిపారు. చెప్పినట్లుగానే టికెట్‌ ఇచ్చారని అన్నారు. అప్పటికే దయాకర్‌రావు బలమైన నాయకుడిగా ఉన్నప్పటికీ పోటాపోటీగా ప్రచారం చేశానని స్వర్ణ చెప్పారు. తీగరాజుపల్లిలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో భారీ బహిరంగ సభ నిర్వహించామని, ఇసుకపోస్తే రాలనంతగా ప్రజలు తరలివచ్చారని తెలిపారు. ఆ సభను ఫెయిల్‌ చేసేందుకు దాడులు జరిగాయని, తన కుమారులను ఇష్టారాజ్యంగా కొట్టారని ఆరోపించారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు ప్రత్యర్థి అభ్యర్థి దయాకర్‌రావు చంద్రబాబుతో సమావేశం పెట్టారని, తన ఓటమి కోసం అనేక కుట్రలు జరిగాయని స్వర్ణ ఆరోపించారు. డిపాజిట్‌ ఓట్లు సాధించడమే కష్టమనుకున్న నియోజకవర్గంలో చివరకు కేవలం 4 వేల ఓట్ల తేడాతో ఓడిపోయానని తెలిపారు.

- మేయర్‌ ప్రకటన.. ఓ యుద్ధమే..
ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయినా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని స్వర్ణ చెప్పారు. వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2005లో వరంగల్‌ మున్సిపల్‌ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో తాను కేవలం కార్పొరేటర్‌గా మాత్రమే పోటీ చేసి గెలిచానని తెలిపారు. అయితే అప్పటికే నగర రాజకీయాల్లో మేయర్‌ పదవిపై తీవ్ర పోటీ నెలకొందన్నారు. పోటీలో ఉన్న ఇద్దరు కీలక నేతల భార్యలు తామే మేయర్‌ అభ్యర్థులమంటూ అప్పట్లో ప్రచారం కూడా చేసుకున్నారని గుర్తు చేసుకున్నారు. తాను మాత్రం ఎక్కడా మేయర్‌ పదవి గురించి ప్రచారం చేయలేదని చెప్పారు. ఎన్నికల తర్వాత తన భర్త వరద రాజేశ్వర్‌రావుతో కలిసి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని కలిశామని తెలిపారు. వైఎస్సార్‌తో తమ కుటుంబానికి ఉన్న సన్నిహిత అనుబంధం, ఆయన చలువతోనే తనకు మేయర్‌ పదవి దక్కిందన్నారు. బలమైన పోటీదారులు ఉన్నప్పటికీ వైఎస్‌ ఇచ్చిన మాటకు కట్టుబడి తనను మేయర్‌గా చేశారని చెప్పారు. అయితే తనను వరంగల్‌ మేయర్‌గా ప్రకటించిన రోజు మాత్రం మున్సిపాలిటీ వద్ద పెద్ద యుద్ధమే జరిగినంత పరిస్థితి ఏర్పడిందని స్వర్ణ గుర్తు చేసుకున్నారు.
- రూ.178 కోట్ల నిధులు..
మేయర్‌గా ఉన్న సమయంలో వరంగల్‌ నగర అభివృద్ధిలో తన కృషి ఎంతో ఉందని స్వర్ణ తెలిపారు. ఎవరూ ఊహించని స్థాయిలో రూ.178 కోట్ల నిధులు తీసుకొచ్చి అనేక అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. ఆ నిధులను తీసుకురావడంలో అప్పటి కేంద్ర మంత్రి దివంగత నేత జయపాల్‌రెడ్డి వంద శాతం సహకరించారని తెలిపారు. ప్రధాన జంక్షన్ల అభివృద్ధి, విస్తరణ, తాగునీటి సరఫరా, స్లమ్‌ ఏరియాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. తన హయాంలో నగర అభివృద్ధికి సంతృప్తికరంగా పని చేశామని తెలిపారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సహకారంతో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని సంకల్పించామని చెప్పారు. మహిళలను లక్షాధికారులను చేయాలనే లక్ష్యంతో డ్వాక్రా గ్రూపులకు వడ్డీ లేని రుణాలు అందించామని తెలిపారు.

- వర్ధన్నపేటతో ప్రత్యేక అనుబంధం
వర్ధన్నపేట నియోజకవర్గంతో తమ కుటుంబానికి ప్రత్యేకమైన అనుబంధం ఉందని స్వర్ణ తెలిపారు. ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా తమ కుటుంబం అండగా ఉంటుందని చెప్పారు. ప్రజలతో, కార్యకర్తలతో మంచి సంబంధాలు కొనసాగించడమే తమ రాజకీయ బలమన్నారు.

- రేవంత్‌తో కలిసి పార్టీ విజయం కోసం..
రేవంత్‌రెడ్డి పాదయాత్ర సమయంలో వరంగల్‌లో తమ కుటుంబాన్ని కలిశారని స్వర్ణ తెలిపారు. తమది కాంగ్రెస్‌ కుటుంబమని, గతంలో తమకు ఉన్న గౌరవం పార్టీకి ఉంటుందని, కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలు చివరి అవకాశమని, ఓడిపోతే భవిష్యత్‌ ఉండదని చెప్పి పార్టీ గెలుపు కోసం పనిచేయాలని కోరారని చెప్పారు. ఆయన సూచన మేరకు పార్టీ విజయం కోసం పనిచేశామని తెలిపారు. కరీంనగర్‌లో ఇన్‌చార్జిగా బాధ్యతలు ఇచ్చినా పార్టీ కోసం పని చేశానన్నారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తాను ఏ పదవీ అడగలేదని చెప్పారు. అయితే తన పనిని గుర్తించి 2023లో వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా నియమించారని తెలిపారు.

- టికెట్‌ రాకపోయినా నిరాశ పడలేదు..
వరంగల్‌ టికెట్‌ వస్తుందని ఆశించానని స్వర్ణ తెలిపారు. అయితే అనుకోని రాజకీయ పరిణామాల్లో కొండా సురేఖ రావడంతో ఆమెకు టికెట్‌ ఇచ్చారని చెప్పారు. టికెట్‌ రాకపోయినా తాను బాధపడలేదన్నారు. తన పార్టీ సేవలను గుర్తించి రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించారని తెలిపారు. ఆ ప్రకటన వెలువడిన సమయంలో తాను ఆస్ట్రేలియాలో ఉన్నట్లు చెప్పారు.

- పదవులు ఆశించం.. పార్టీ కోసం పని చేస్తాం
తమది పదవులను ఆశించే కుటుంబం కాదని స్వర్ణ స్పష్టం చేశారు. పార్టీకి కట్టుబడి పనిచేస్తే పదవులు వాటంతట అవే వస్తాయని అన్నారు. ఇప్పటివరకు తాను ఏ పదవీ అడగలేదని తెలిపారు. సుమారు ఐదు దశాబ్దాలుగా పార్టీకి సేవ చేస్తున్నామని, పదవులు ఉన్నా లేకున్నా కాంగ్రెస్‌తో తమ ప్రయాణం కొనసాగుతూనే ఉందన్నారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటికే 20 జిల్లాల్లో పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేశానని తెలిపారు. మహిళా సంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని చెప్పారు. మహిళలను పార్టీ కార్యక్రమాల్లో మరింత చురుగ్గా భాగస్వాములను చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. మండల కమిటీల ఏర్పాటు పూర్తి చేస్తున్నామని, రానున్న ఎన్నికల్లో మహిళల భాగస్వామ్యం పెంచడంతో పాటు ప్రచారంలో వారిని ముందుండేలా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. జీహెచ్‌ఎంసీ, జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
- ‘నాకు అన్న వైఎస్సారే.. పార్టీకి కండువా నేనే’
తనకు అన్నలు లేరని, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డినే అన్నగా భావిస్తానని స్వర్ణ భావోద్వేగంగా చెప్పారు. “నాకు పార్టీ కండువాలు కాదు.. నేను పార్టీకి కండువా. రాజకీయాల్లో రిటైర్‌మెంట్‌ ఉండదు. ఈ సందర్భంగా డిజిటల్ మీడియా ప్రతినిధులు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారా అని ప్రశ్నించగా.. పార్టీ అవకాశం వస్తే తప్పకుండా బరిలో ఉంటానని చెప్పారు. నాకు ఓపిక ఉన్నంత కాలం పార్టీ కోసం పనిచేస్తా. పదవులు వాటంతట అవే వస్తాయి” అని స్పష్టం చేశారు.

కసితో ఎమ్మెల్యేనయ్య
కసితో ఎమ్మెల్యేనయ్యా

- బిజినెస్ మ్యాన్ ను కావాలనే కాయిస్ ఉండే నాకు
- మా అన్న ఎమ్మెల్యే కావాలన్న టార్గెట్ ఉండేది
- అయితే ఒక్క అవమానం నన్ను అసెంబ్లీకి పంపింది
- 2004 ఎన్నికల్లో కేవలం రూ.91 వేలతో నామినేషన్ వేసిన
- ప్రతి ఎన్నికల్లో నామినేషన్ ఫీజు పొద్దుటూరి గంగారెడ్డి ఇచ్చారు
- 2005లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసిన
- డిప్యూటీ మేయర్ పదవి కోసం కార్పొరేటర్ గా పోటీ చేయమన్నారు
- తర్వాత పార్టీ సిటీ ప్రెసిడెంట్ గా నియమించారు
- మానవ సంబంధాలే నన్ను వరుసగా గెలిపించాయి
- ఐదు ప్రిన్సిపుల్స్ పై ఎమ్మెల్యేగా పనిచేసిన
- కార్మికులు, సహకార సంఘాలే నా బలం
- ఉద్యమకారులకు ఆర్థిక సాయం చేశాను
- ప్రతీకార రాజకీయాలకు దూరం.. ప్రజల సంక్షేమమే నా మంత్రం
- వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్త.. పనితీరుతోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తా
- డిజిటల్ మీడియాతో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ చిట్ చాట్

అక్షరదర్బార్, హనుమకొండ

పొలిటీషియన్ ను కావాలన్న ఆలోచనతో తన ప్రస్థానం ప్రారంభం కాలేదని, మంచి బిజినెస్ మేన్ గా ఎదగాలన్నదే తన కల అని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. అయితే జీవితంలో ఎదురైన ఒక అవమానం తనలో ఎమ్మెల్యే కావాలనే కసిని రగిలించిందన్నారు. ఓటమిని అధిగమించి గెలుపు సాధించడం నుంచి రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం వరకు సాగిన ప్రస్థానాన్ని ఆయన డిజిటల్ మీడియాతో శుక్రవారం చేసిన చిట్‌చాట్‌లో పంచుకున్నారు.

- ఉమ్మడి కుటుంబంలో పెరిగి..
తమది పెద్ద ఉమ్మడి కుటుంబమని, తండ్రి విద్యుత్ శాఖలో ఉద్యోగం చేసేవారని వినయ్ భాస్కర్ తెలిపారు. చిన్నతనంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నామని, అన్నలు, అక్కలు, తమ్ముళ్లతో కలిసి వడ్డేపల్లిలోని ఇంట్లో ఉండేవారమన్నారు. శనివారం వచ్చిందంటే ఇంట్లో సందడి వాతావరణం ఉండేదని గుర్తుచేసుకున్నారు. తాను రాజకీయ నాయకుడు కావాలని ఎప్పుడూ అనుకోలేదని, మంచి బిజినెస్‌మ్యాన్‌గా ఎదగాలనే కోరిక ఉండేదన్నారు. అందుకు తగ్గట్టుగానే కోకాకోలా డీలర్‌షిప్ తీసుకుని, దాన్ని విస్తరించాలనే ఆలోచనతో ఉన్నట్లు చెప్పారు.

- అన్న రాజకీయాల్లో.. తాను బ్యాక్‌ఎండ్‌లో..
మా అన్న దాస్యం ప్రణయ్ భాస్కర్ రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారని, తాను మాత్రం ఆయనకు తెర వెనుక నుంచి సహకరించేవాడినని దాస్యం తెలిపారు. 1984లో ప్రణయ్ భాస్కర్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ప్రజలతో సంబంధాలను బలోపేతం చేసేందుకు పలు సంఘాలను ఏర్పాటు చేశామన్నారు. 1994లో ఆయన విజయం సాధించి మంత్రి అయ్యారని, అప్పటి నుంచి ఏర్పడిన సంఘాలు తమకు ఇప్పటికీ అండగా నిలుస్తున్నాయని చెప్పారు. అయితే ప్రణయ్ భాస్కర్ అకాల మరణం తమ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టిందన్నారు. ఆయన మరణం తర్వాత రాజకీయాలు వద్దనుకుని, కుటుంబం, వ్యాపారంపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

- ఆ ఒక్క ఘటన.. ఎమ్మెల్యేను చేసింది
అన్న మరణం తర్వాత వదిన, పిల్లలు హైదరాబాద్‌కు వెళ్తున్న సమయంలో తల్లిదండ్రులతో కలిసి వెళ్లామని వినయ్ భాస్కర్ తెలిపారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉన్న తన అన్న క్వార్టర్‌కు సీల్ వేసి ఉండటం చూసి బాధ కలిగిందన్నారు. ఈ విషయంపై ఈవో కార్యాలయానికి వెళ్లి అడిగితే అక్కడ ఎదురైన నిర్లక్ష్యపూరిత వైఖరి, అవమానం తనలో కసిని పెంచిందని చెప్పారు. ఆ ఘటన తర్వాతే ఎమ్మెల్యే కావాలనే పట్టుదల బలపడిందన్నారు. ఈవోకు సవాల్ చేసి, ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్లీ వచ్చి కలుస్తానని చెప్పానని, అనుకున్నట్లుగానే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వెళ్లి శాలువా కప్పి స్వీటు ఇచ్చి వచ్చానని గుర్తుచేసుకున్నారు.

- అప్పటి రాజకీయాలు వేరు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం ఇప్పటితో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉండేదని వినయ్ భాస్కర్ అన్నారు. రాజకీయ ప్రత్యర్థుల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత స్థాయిలో సత్సంబంధాలు ఉండేవన్నారు. 1998లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన తనకు వామపక్షాలు, కార్మిక సంఘాలు, యూనియన్లు మద్దతుగా నిలిచాయని చెప్పారు. 2004లో కూడా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టికెట్ ఇస్తానని చెప్పినా, రాజకీయ పరిణామాలు, బీజేపీతో పొత్తు నేపథ్యంలో పరిస్థితులు మారిపోయాయని అన్నారు. మరికొందరు నాయకులతో కలిసి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని నిర్ణయించుకున్న సమయంలో చంద్రబాబు వద్దకు వెళ్లినా, నామినేషన్ వేయొద్దని, నామినేటెడ్ పదవి ఇస్తానని చెప్పారని తెలిపారు. అయినప్పటికీ పోటీ చేయాలన్న నిర్ణయం మార్చుకోలేదన్నారు. సమాజ్‌వాదీ పార్టీ నుంచి పోటీ చేయాలనే ఆఫర్ వచ్చినా, వామపక్షాలు, సంఘాల మద్దతుతో ఇండిపెండెంట్‌గానే పోటీ చేశానన్నారు. తనతో పాటు పోటీ చేస్తామని చెప్పిన కొందరు చివరి సమయంలో వెనక్కి తగ్గినా, తాను నమ్ముకున్న సంఘాలు మాత్రం తన వెంట నిలిచాయని చెప్పారు. 2004 ఎన్నికల్లో కేవలం 1,400 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యానని తెలిపారు.

- 2005లో కేసీఆర్‌ను కలిశా..
ఎన్నికల అనంతరం 2005లో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ను కలిసినట్లు వినయ్ భాస్కర్ తెలిపారు. తొలుత కార్పొరేటర్‌గా పోటీ చేయాలని కేసీఆర్ సూచించారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పట్టు పట్టణంలో కూడా పెరగాలంటే కార్పొరేటర్‌గా పోటీ చేయాలని కేసీఆర్ సూచించడంతో అంగీకరించానన్నారు. తనను నమ్ముకున్న వారికి కొన్ని టికెట్లు ఇప్పించాలని కోరగా అందుకు సహకరించారని, అనంతరం పోటీ చేసి విజయం సాధించానని తెలిపారు. ఆ తర్వాత టీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారని చెప్పారు.

- పార్టీ ఆఫీసు ప్రారంభం రోజే టికెట్‌ కన్ఫాం
టౌన్ అధ్యక్షుడిన అయిన తర్వాత కేయూ జంక్షన్ సమీపంలో పార్టీ కార్యాలయం కోసం భవనాన్ని అద్దెకు తీసుకున్నానని దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. కేసీఆర్ హన్మకొండకు వచ్చినప్పుడు ఆయన చేతుల మీదుగా ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం. అయితే కొందరు తనపై లేనిపోని విషయాలు చెప్పి కేసీఆర్‌ను పార్టీ కార్యాలయానికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తాను స్వయంగా వెళ్లి కార్యాలయానికి రావాలని కోరగా, తొలుత నిరాకరించినా, కార్యాలయం కోసం పడిన కష్టం చెప్పడంతో కేసీఆర్ వచ్చి ప్రారంభించారని తెలిపారు. పార్టీ కార్యాలయ ఏర్పాటును చూసి కేసీఆర్ అభినందించారని, తనకు ఉన్న ప్రజాబలం, గత ఎన్నికల్లో వచ్చిన మద్దతును పరిశీలించిన తర్వాత అక్కడే తనకు పార్టీ టికెట్ ఖరారైందని చెప్పారు.

- ఓటమి నుంచి గెలుపు వరకు..
2004లో ఓడిపోయిన తర్వాత నిరాశ చెందకుండా ప్రజలు, కార్మికులు, వివిధ సంఘాలతో తన సంబంధాలను మరింత బలోపేతం చేసుకున్నట్లు వినయ్ భాస్కర్ తెలిపారు. 44 సంఘాలతో కార్మిక సమాఖ్య ఐక్యవేదికను ఏర్పాటు చేశామని, వారంతా అండగా నిలవడంతో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించానన్నారు. “నేను ఆర్థిక సంబంధాలతో కాదు.. మానవ సంబంధాలతో గెలిచాను” అని ఆయన అన్నారు. అందుకే కార్మిక, సహకార సంఘాలంటే తనకు ప్రత్యేక అభిమానమని, వాటికి ఎప్పుడూ తోడుగా ఉంటానన్నారు.

- ఐదు సూత్రాలు..
తన రాజకీయ, సామాజిక జీవితంలో ఐదు అంశాలను కచ్చితంగా పాటిస్తానని వినయ్ భాస్కర్ తెలిపారు. ఆరోగ్య సమస్యతో ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే అర్ధరాత్రి అయినా స్పందించడం, ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయం చేయడం, పేద విద్యార్థుల ఫీజులకు సహకరించడం, తన క్యాడర్‌కు అన్ని విధాలుగా అండగా నిలవడం, కార్మిక, సహకార సంఘాలకు తోడుగా ఉండడం తన నైజమన్నారు.

- 'కల్పలత’తో విడదీయరాని అనుబంధం..
గతంలో ఉన్న వరంగల్ సెంట్రల్ జైలు ఎదురుగా ఉన్న కల్పలతా సూపర్ బజార్‌తో చిన్ననాటి నుంచే తనకు ప్రత్యేక అనుబంధం ఉందని వినయ్ భాస్కర్ తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాన్ని మూసివేసేందుకు ప్రయత్నాలు జరిగినప్పుడు అడ్డుకున్నానని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కల్పలతాపై ఉన్న అప్పును మాఫీ చేయించడంతో పాటు సభ్యత్వాలను పెంచి, అన్ని వర్గాలతో కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. పెట్రోల్ బంక్ ప్రారంభించి, వచ్చిన సంపదను వినియోగదారులకు చేరేలా లాటరీల ద్వారా బహుమతులు కూడా అందించామని చెప్పారు. అయితే ఇప్పుడు కల్పలతా సూపర్ బజార్‌లో అవినీతి జరిగిందని, దానికి తానే కారణమంటూ కొందరు బురద జల్లుతున్నారని ఆరోపించారు.

- ఉద్యమకారులకు సాయం..
మా అమ్మ ఎప్పుడూ.. చేసిన దానం గుప్తంగా ఉండాలని చెప్పేదని, ఆ మాటను ఇప్పటికీ పాటిస్తున్నానని వినయ్ భాస్కర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో తనతో కలిసి పోరాడి మరణించిన వారి కుటుంబాలకు, కేసుల పాలైన వారికి, గాయపడిన వారికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు సహాయం చేశానన్నారు. ఎంతో మందికి సాయం చేశానని, అది నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదని సాయం పొందిన వారి మనస్సులో ఉంటే చాలన్నారు. అలాగే 833 మంది సభ్యులతో త్రిచక్ర పొదుపు సంఘాన్ని ఏర్పాటు చేయగా అది విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు.

- నో రివేంజ్ పాలిటిక్స్..
తాను ఎప్పుడూ ప్రతీకార రాజకీయాలు చేయలేదని, చిల్లర వ్యాఖ్యలు చేయడం తన పద్ధతి కాదని వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు. కబ్జాలంటూ పేరు బద్నాం చేశారని, వాటికి నేను సరైనా తీరుగా, సమయంలో స్పందించకపోవడం ముప్పుకొచ్చింది. కరోనా సమయంలో రాజకీయ భేదాలు చూడకుండా కాంగ్రెస్ నాయకుల ఇళ్లకు వెళ్లి మందులు, ఇంజెక్షన్లు అందించిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు. తన ఓటమికి గల కారణాలను ఇప్పటికే గుర్తించానని, వాటిని సరిదిద్దుకునే పనిలో ఉన్నానని తెలిపారు. 2029 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ తప్పకుండా ఉంటుందని, అది చిల్లర రాజకీయాలతో కాదు.. తన పనితీరుతోనే ఉంటుందని స్పష్టం చేశారు.

పరకాల కాంగ్రెస్ లో పొలిటికల్ సెగ
పరకాల కాంగ్రెస్‌లో పొలిటికల్ సెగ
- రేవంత్ వ్యాఖ్యలకు కొండా సుస్మిత కౌంటర్
- డైపర్లు వేసుకునే వ్యక్తికి మళ్లీ టికెట్ ఇస్తారా? అని ప్రశ్న
- “పరకాల నాదే.. టికెట్ ఇచ్చేది అధిష్టానమే”నని వ్యాఖ్య
- సీఎం కుర్చీ కాపాడుకోవడానికే రేవంత్ ఆరాటమని ఆరోపణ

అక్షరదర్బార్, గీసుకొండ:
కాంగ్రెస్ పార్టీలో పరకాల అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి తాజా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని మళ్లీ భారీ మెజార్టీతో గెలిపించాలని ఈనెల 16న పరకాలలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరడం ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం రేపుతోంది. సీఎం చేసిన ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత ఘాటుగా స్పందించారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో ఏర్పాటు చేసిన ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళాలో పాల్గొన్న కొండా సుస్మిత మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
- అప్పుడే ఎమ్మెల్యే అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారు?
ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే, అప్పుడే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారని సుస్మిత ప్రశ్నించారు. “పరకాలలో రేవూరి ప్రకాష్ రెడ్డి ఎవరో కూడా చాలామందికి తెలియదు. ఆయన గెలిచారంటే అది కొండా కుటుంబం చేసిన సహకారం వల్లే. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేసేది నేనే” అని ఆమె స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని కాంగ్రెస్‌లో మొదట అడిగింది కొండా దంపతులేనని గుర్తుచేసిన ఆమె, పీసీసీ అధ్యక్షుడయ్యాక రేవంత్ తన మాట మార్చారని ఆరోపించారు. కాంగ్రెస్ గెలిచినా, ఓడినా కొండా మురళికి ఎమ్మెల్యే సీటు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పటివరకు దానిని నెరవేర్చలేదని మండిపడ్డారు.
- డైపర్లు వేసుకునే స్థితిలో ఉన్నవారికి టికెట్ ఇస్తారా?
ఒకవైపు ‘జీన్ జీ’లకు (యువతకు) టికెట్లు ఇస్తామని చెబుతున్న రేవంత్ రెడ్డి, మరోవైపు డైపర్లు వేసుకునే స్థితిలో ఉన్న రేవూరి ప్రకాష్ రెడ్డికి మళ్లీ టికెట్ ఇస్తాననడం ఏంటని సుస్మిత ఎద్దేవా చేశారు. పార్టీలో టికెట్ల కేటాయింపును అధిష్టానం నిర్ణయిస్తుందని, అలాంటప్పుడు పరకాల టికెట్‌పై రేవంత్ రెడ్డి సొంత నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. సీఎం కుర్చీ కాపాడుకోవడానికే రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, పార్టీలో ఆయన ఒక్కడే ఉన్నారా అని నిలదీశారు. బీసీలంటే రేవంత్ రెడ్డికి ఎందుకంత చులకన భావమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
- పొంగులేటిపైనా ఘాటు వ్యాఖ్యలు
ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించిన సుస్మిత, “రేవంత్ రెడ్డితో పాటు ఒక పొంగు ఉంది. ఆ పొంగు ఎక్కువసేపు ఉండదు. అసలు మీరే ముఖ్యమంత్రో లేక ఆయనే ముఖ్యమంత్రో తేల్చుకోండి” అంటూ ఘాటుగా విమర్శించారు. ఇందిరమ్మ ఇండ్ల జాతరలో సీఎం ఫొటోతో పాటు పొంగులేటి ఫొటో పెట్టారని, కానీ ఫ్లెక్సీలలో సమాచార శాఖ మంత్రి ఫొటో వేయలేదని ఆక్షేపించారు. బీసీ నేతల కంటే పొంగులేటికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారా అని ఆమె ప్రభుత్వాన్ని నిలదీశారు.