వార్తలు - అక్షర దర్బార్

పీడీఎస్ రైస్ పట్టివేత
పీడీఎస్ రైస్ పట్టివేత
- 62 బస్తాల బియ్యం స్వాధీనం
- టాస్క్‌ఫోర్స్ దాడిలో అక్రమ నిల్వ బట్టబయలు

అక్షరదర్బార్, హనుమకొండ: ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసి విక్రయిస్తున్న వ్యక్తిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 62 బస్తాల్లో నిల్వ ఉన్న 31 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ సుమారు రూ.1.08 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. టాస్క్‌ఫోర్స్‌కు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు హనుమకొండలోని గోపాలపూర్ గణేష్‌నగర్‌లో దాడి నిర్వహించారు. అక్కడ అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బండారి రాజ్‌కుమార్ (30) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడు పెద్దపల్లి జిల్లా కల్వశ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామానికి చెందినవాడని, ప్రస్తుతం గోపాలపూర్‌లో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణలో గోపాలపూర్ పరిసర ప్రాంతాల నుంచి తక్కువ ధరకు పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి, అధిక ధరకు ఇతరులకు విక్రయిస్తున్నట్లు నిందితుడు అంగీకరించినట్లు అధికారులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న బియ్యం, నిందితుడిని తదుపరి చర్యల కోసం కేయూసీ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ ఎ మధుసూదన్ తెలిపారు. ఈ దాడిలో టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ బండారి రాజు, సిబ్బంది పాల్గొన్నారు.

గోదావరి జలాలను వృదా చేయొద్దు
గోదావరి జలాలను వృథా చేయొద్దు
- వెంటనే కన్నెపల్లి మోటార్లు ప్రారంభించాలి
- లేకపోతే 50 వేల మంది రైతులతో వచ్చి పంప్‌హౌస్‌ను మేమే ఆన్ చేస్తాం
- కేసీఆర్‌కు వారం రోజులు ప్రాజెక్టు అప్పగించండి.. తెలంగాణకు నీళ్లు అందించి చూపిస్తాం
- రాజకీయ కక్షతో కాళేశ్వరాన్ని నిర్వీర్యం చేస్తున్నారు.. రైతుల జీవితాలతో చెలగాటమాడొద్దు
- కాళేశ్వరం వద్ద కేటీఆర్ ఫైర్.. రేవంత్ సర్కార్‌పై తీవ్ర విరుచుకుపాటు
- పోలీసుల అడ్డంకుల మధ్య కన్నెపల్లి చేరుకున్న కేటీఆర్.. భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు

అక్షరదర్బార్, కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయ కక్షసాధింపుతో నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆదివారం కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గోదావరి జలాలు లక్ష క్యూసెక్కుల చొప్పున ప్రతిరోజూ సముద్రంలో కలిసిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వెంటనే కన్నెపల్లి పంప్‌హౌస్ మోటార్లను ప్రారంభించి తెలంగాణ రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్ నుంచి కన్నెపల్లి పర్యటనకు బయలుదేరిన కేటీఆర్ కాన్వాయ్‌ను పోలీసులు పలు చోట్ల అడ్డుకున్నారు. భారీ పోలీసు బందోబస్తుతో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను నిలిపివేయడంతో బీఆర్ఎస్ నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. జంగావ్ జిల్లా పెంబర్తి, భూపాలపల్లి జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో కాన్వాయ్‌ను కొంతసేపు నిలిపివేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ కేటీఆర్ తన పర్యటనను కొనసాగించి కన్నెపల్లి పంప్‌హౌస్‌కు చేరుకున్నారు.

ముందుగా ఫోర్‌బే బ్రిడ్జిపై నుంచి గోదావరి ప్రవాహాన్ని పరిశీలించిన కేటీఆర్, అనంతరం పంప్‌హౌస్ గేట్లను సందర్శించారు. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లి గోదావరిలో నుంచి వృథాగా సముద్రంలోకి వెళ్తున్న నీటిని పరిశీలించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఘాటుగా విమర్శలు చేశారు.

కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద ప్రస్తుతం 97 మీటర్ల నీటి మట్టం ఉందని, 93 మీటర్ల నీరు ఉన్నా పంపులను ప్రారంభించి తెలంగాణకు సాగునీరు అందించవచ్చని కేటీఆర్ పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం కావాలనే పంపులను ఆన్ చేయడం లేదని ఆరోపించారు. ప్రతిరోజూ లక్ష క్యూసెక్కుల గోదావరి నీరు సముద్రంలో కలుస్తోంది. ఈ నీటిని ఎత్తిపోస్తే రాష్ట్రంలోని లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. రైతుల కళ్ల ముందే నీటిని వృథా చేయడం దారుణం అని అన్నారు.

వెంటనే మోటార్లు ప్రారంభించండి. లేకపోతే తెలంగాణ నలుమూలల నుంచి 50 వేల మంది రైతులతో వచ్చి కన్నెపల్లి పంప్‌హౌస్‌ను మేమే ప్రారంభించి రైతులకు నీళ్లు అందిస్తాం. రైతుల ప్రయోజనాల కోసం ఎలాంటి పోరాటానికైనా వెనుకాడం అని కేటీఆర్ హెచ్చరించారు.

ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వహించే సామర్థ్యం లేకపోతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పది రోజుల పాటు అప్పగించాలని సవాల్ విసిరారు. కేసీఆర్‌కు పది రోజులు ప్రాజెక్టు అప్పగించండి. అన్ని పనులు పూర్తి చేసి తెలంగాణ రైతులకు నీళ్లు అందించి చూపిస్తాం. చేతకాకపోతే పక్కకు తప్పుకోండి అని వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ కక్షతో కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రాజెక్టును వినియోగించకుండా మూసివేయడం రైతులకు చేస్తున్న అన్యాయం. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనే ఆలోచనతో కాళేశ్వరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. రైతుల భవిష్యత్తుతో చెలగాటమాడే హక్కు ఎవరికీ లేదు అని విమర్శించారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి అవగాహనతో మాట్లాడాలని సూచించారు. ముందు ప్రాజెక్టు గురించి తెలుసుకోండి. ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయొద్దు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కాళేశ్వరం నీళ్లే రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి చేరుతున్నాయి. మీ నియోజకవర్గంలోని చివరి గ్రామానికి కూడా కాళేశ్వరం నీరే వెళ్తుంది అని అన్నారు.

మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులపై స్పందించిన కేటీఆర్, రెండు పిల్లర్ల మరమ్మతులకు సుమారు రూ.400 కోట్లు అవసరమని, ఆ మొత్తాన్ని నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టి భరించేందుకు సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం 30 నెలలుగా పనులు ప్రారంభించలేదని ఆరోపించారు. రాజకీయ కక్షతో పనులు నిలిపివేశారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేల్కొని మేడిగడ్డ మరమ్మతులు పూర్తి చేసి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగించాలి  అని డిమాండ్ చేశారు.

పోలవరం ప్రాజెక్టు దశాబ్దాలుగా పూర్తికాలేదని, కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ దూరదృష్టితో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పునర్వ్యవస్థీకరించి గోదావరి-ప్రాణహిత సంగమ ప్రాంతంలో సమగ్ర సర్వేలు నిర్వహించి మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించారని కేటీఆర్ వివరించారు. మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, పర్యావరణ శాఖల నుంచి అన్ని అనుమతులు సాధించి కేవలం నాలుగేళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకాలలో ఒకటైన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని చెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం కాంక్రీట్ నిర్మాణం కాదు.. ఇది తెలంగాణ రైతుల జీవనాడి. ఈ ప్రాజెక్టును నిలిపివేయడం అంటే తెలంగాణ భవిష్యత్తును నిలిపివేయడమే. గోదావరి జలాలను సముద్రంలో కలపడం రైతుల పట్ల చేస్తున్న క్షమించరాని తప్పు అని కేటీఆర్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మాట్లాడుతూ, ప్రభుత్వానికి నిజంగా దమ్ముంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కన్నెపల్లి పంప్‌హౌస్‌కు రావాలి. మేము రెండు రోజులైనా ఇక్కడే ఉంటాం. అందరం కలిసి పంపులను ప్రారంభించి తెలంగాణ రైతులకు నీళ్లు అందిద్దాం. హెలికాప్టర్లలో తిరుగుతూ విమర్శలు చేయడం కాదు.. క్షేత్రస్థాయికి వచ్చి వాస్తవాలు చూడాలి అని సవాల్ విసిరారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు పెద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు పల్లె రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

లంచం అడిగితే నా దృష్టికి తేండి
లంచాలు అడిగితే
నా దృష్టికి తీసుకురండి
- పేదల సంక్షేమంలో రాజీ లేదు.. నియోజకవర్గ అభివృద్ధియే మా లక్ష్యం
- వరంగల్ ఎయిర్‌పోర్ట్ ఆలస్యానికి కేంద్ర ప్రభుత్వమే కారణం
- ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
- అభివృద్ధిపై చర్చకు సిద్ధమని బీజేపీ, బీఆర్ఎస్‌లకు సవాల్
- రూ.2.10 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

అక్షరదర్బార్, హనుమకొండ: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిలో భాగంగా 53వ డివిజన్ పరిధిలోని లష్కర్ నగర్ సింగారం, గోపాల్పూర్ జంక్షన్ ప్రాంతాల్లో సుమారు రూ.2.10 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానికంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి జరిగిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని, లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో ఒక్కో డివిజన్‌కు నామమాత్రంగా నిధులు కేటాయించి చేతులు దులుపుకునేవారని విమర్శించారు. కానీ ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో ప్రతి డివిజన్‌కు రూ.10 కోట్ల నుండి రూ.20 కోట్ల వరకు నిధులు కేటాయించి అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నామని తెలిపారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి కాలనీకి మెరుగైన రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
- లంచాలు అడిగితే వెంటనే నా దృష్టికి తీసుకురండి
రేషన్ కార్డులు, పెన్షన్లు లేదా ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ఎవరైనా రాజకీయ నాయకులు గానీ, అధికారులు గానీ డబ్బులు అడిగితే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పేదలకు సంబంధించిన ప్రతి పథకం పూర్తిగా ఉచితమని, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లబ్ధిదారుల చేతికే నేరుగా ప్రయోజనాలు చేరేలా పారదర్శక వ్యవస్థను అమలు చేస్తున్నామని చెప్పారు. ఎవరైనా లంచాలు ఇచ్చి ప్రోత్సహిస్తే సమాజానికి అన్యాయం చేసినట్లవుతుందని హితవు పలికారు. ఇప్పటికే పెన్షన్లు, రేషన్ కార్డుల అర్హుల జాబితాలను డివిజన్ వారీగా తుది దశకు తీసుకువచ్చామని వెల్లడించారు.
- అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. విపక్షాలకు సవాల్
నియోజకవర్గ అభివృద్ధిపై తాము ఎప్పుడూ చర్చకు సిద్ధమేనని, ఆధారాలు లేకుండా విమర్శలు చేయడం సరికాదని విపక్షాలకు ఎమ్మెల్యే నాయిని స్పష్టం చేశారు. విమర్శలు చేసే ముందు తాము చేసిన పనులేంటో చెప్పాలని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు. వరంగల్ ఎయిర్‌పోర్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే వందల కోట్ల రూపాయలు వెచ్చించి భూసేకరణ పూర్తి చేసి, కేంద్రానికి అప్పగించినా కేంద్రం విమానాశ్రయ అభివృద్ధిని వేగవంతం చేయలేదని విమర్శించారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు వరంగల్‌కు ఎయిర్‌పోర్ట్ తీసుకురాకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక విధానాల పేరుతో లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను సైతం బలహీనపరుస్తూ ప్రైవేటీకరణకు ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు క్షేత్రస్థాయి అభివృద్ధిని పట్టించుకోకుండా కేవలం అనవసర రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారని దుయ్యబట్టారు. ఎవరు అభివృద్ధి చేస్తున్నారో, ఎవరు కేవలం మాటలకే పరిమితమవుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని, వారే సరైన తీర్పు ఇస్తారని అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల అధికారులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

లంచాలు అడిగితే నా దృష్టికి తేండి
లంచాలు అడిగితే
నా దృష్టికి తీసుకురండి
- పేదల సంక్షేమంలో రాజీ లేదు.. నియోజకవర్గ అభివృద్ధియే మా లక్ష్యం
- వరంగల్ ఎయిర్‌పోర్ట్ ఆలస్యానికి కేంద్ర ప్రభుత్వమే కారణం
- ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
- అభివృద్ధిపై చర్చకు సిద్ధమని బీజేపీ, బీఆర్ఎస్‌లకు సవాల్
- రూ.2.10 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

అక్షరదర్బార్, హనుమకొండ: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిలో భాగంగా 53వ డివిజన్ పరిధిలోని లష్కర్ నగర్ సింగారం, గోపాల్పూర్ జంక్షన్ ప్రాంతాల్లో సుమారు రూ.2.10 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానికంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి జరిగిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని, లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో ఒక్కో డివిజన్‌కు నామమాత్రంగా నిధులు కేటాయించి చేతులు దులుపుకునేవారని విమర్శించారు. కానీ ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో ప్రతి డివిజన్‌కు రూ.10 కోట్ల నుండి రూ.20 కోట్ల వరకు నిధులు కేటాయించి అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నామని తెలిపారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి కాలనీకి మెరుగైన రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
- లంచాలు అడిగితే వెంటనే నా దృష్టికి తీసుకురండి
రేషన్ కార్డులు, పెన్షన్లు లేదా ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ఎవరైనా రాజకీయ నాయకులు గానీ, అధికారులు గానీ డబ్బులు అడిగితే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పేదలకు సంబంధించిన ప్రతి పథకం పూర్తిగా ఉచితమని, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లబ్ధిదారుల చేతికే నేరుగా ప్రయోజనాలు చేరేలా పారదర్శక వ్యవస్థను అమలు చేస్తున్నామని చెప్పారు. ఎవరైనా లంచాలు ఇచ్చి ప్రోత్సహిస్తే సమాజానికి అన్యాయం చేసినట్లవుతుందని హితవు పలికారు. ఇప్పటికే పెన్షన్లు, రేషన్ కార్డుల అర్హుల జాబితాలను డివిజన్ వారీగా తుది దశకు తీసుకువచ్చామని వెల్లడించారు.
- అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. విపక్షాలకు సవాల్
నియోజకవర్గ అభివృద్ధిపై తాము ఎప్పుడూ చర్చకు సిద్ధమేనని, ఆధారాలు లేకుండా విమర్శలు చేయడం సరికాదని విపక్షాలకు ఎమ్మెల్యే నాయిని స్పష్టం చేశారు. విమర్శలు చేసే ముందు తాము చేసిన పనులేంటో చెప్పాలని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు. వరంగల్ ఎయిర్‌పోర్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే వందల కోట్ల రూపాయలు వెచ్చించి భూసేకరణ పూర్తి చేసి, కేంద్రానికి అప్పగించినా కేంద్రం విమానాశ్రయ అభివృద్ధిని వేగవంతం చేయలేదని విమర్శించారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు వరంగల్‌కు ఎయిర్‌పోర్ట్ తీసుకురాకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక విధానాల పేరుతో లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను సైతం బలహీనపరుస్తూ ప్రైవేటీకరణకు ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు క్షేత్రస్థాయి అభివృద్ధిని పట్టించుకోకుండా కేవలం అనవసర రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారని దుయ్యబట్టారు. ఎవరు అభివృద్ధి చేస్తున్నారో, ఎవరు కేవలం మాటలకే పరిమితమవుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని, వారే సరైన తీర్పు ఇస్తారని అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల అధికారులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా వెంకన్న
జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా వెంకన్న
- ఆయన స్వస్థలం మరిపెడ
- అదనపు బాధ్యతల నుంచి కలెక్టర్ రిలీవ్

అక్షరదర్బార్, వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన బదిలీ ఉత్తర్వుల మేరకు ప్రస్తుతం హెచ్‌ఎండీఏలో కోర్ అర్బన్ రీజియన్, మెట్రో రైల్ విభాగం జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న టి వెంకన్న ను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ నియమించింది. ఈ మేరకు ఇప్పటి వరకు జీడబ్ల్యూఎంసీ మున్సిపల్ కమిషనర్ పదవికి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయిని ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన కమిషనర్ టి వెంకన్న త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. వెంకన్న స్వస్థలం మహబూబాబాద్ జిల్లా మరిపెడ. 2007లో గ్రూప్-1 అధికారిగా మున్సిపల్ కమిషనర్ గా ఎంపికయ్యారు. ఇప్పటివరకు జీడబ్ల్యూఎంసీ కమిషనర్ గా ఐఏఎస్ అధికారులను నియమించిన ప్రభుత్వం తాజాగా గ్రూప్ -1 అధికారిని నియమించటం చర్చనీయమైంది.

నిషేధిత కలుపు మందు స్వాధీనం
నిషేధిత కలుపు మందు స్వాధీనం

- పరకాలలో విజిలెన్స్ దాడులు..

- 150 లీటర్ల స్పీడ్ పారాక్వాట్ పట్టివేత

అక్షరదర్బార్, పరకాల:
పరకాల పట్టణంలోని ఓ ఎరువులు, పురుగుమందుల దుకాణంలో నిషేధిత కలుపు మందును విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని లక్ష్మీ ఏజెన్సీలో నిల్వ ఉంచిన సుమారు 150 లీటర్ల స్పీడ్ పారాక్వాట్ (పారాకుట్) మందును అధికారులు తనిఖీల సందర్భంగా గుర్తించి పట్టుకున్నట్లు సమాచారం.భూమి సారంపై ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు రైతుల ఆరోగ్యానికి హానికరంగా మారే అవకాశం ఉందన్న కారణాలతో ప్రభుత్వం ఈ మందు విక్రయాలు, వినియోగంపై నిషేధం విధించింది. అయినప్పటికీ కొందరు వ్యాపారులు నిబంధనలను ఉల్లంఘిస్తూ రహస్యంగా విక్రయాలు కొనసాగిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించినట్లు తెలిసింది.పట్టణంలోని ఇతర ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లోనూ సమగ్ర తనిఖీలు చేపడితే మరింత పరిమాణంలో నిషేధిత మందులు బయటపడే అవకాశం ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఘటనపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.

రగిలిన కరీంనగర్
గంగుల క్యాంపు ఆఫీస్ వద్ద ఉద్రిక్తత
- ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి బీజేపీ కార్యకర్తల యత్నం
- కౌశిక్ రెడ్డి కారు, గంగుల క్యాంపు ఆఫీసులోని ఫర్నిచర్ ధ్వంసం
- సంజయ్ పై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ కార్యకర్తల దాడి
- బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులను చదరగొట్టిన పోలీసులు

అక్షరదర్బార్, కరీంనగర్: కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై బీజేపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. గంగుల క్యాంపు ఆఫీస్ ఆవరణలో ఉన్న కౌశిక్ రెడ్డి కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. కమలాకర్ క్యాంపు కార్యాలయంలోని ఫర్నిచర్ తో పాటు ఇతర వస్తువులను కూడా ధ్వంసం చేశారు. గంగుల క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని, ఉమ్మడి గన్ కల్చర్ వ్యాపిస్తుందని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నా పైనా దుండగులురెక్కి నిర్వహిస్తున్నారని, జిల్లాలో శాంతిభద్రతలపై కేంద్ర, రాష్ట్ర మంత్రులు సమీక్ష నిర్వహించాలని అన్నారు. బండి సంజయ్ తంబాకుతో డ్రగ్స్ కలిపి తీసుకుంటున్నారని, కేటీఆర్ డ్రగ్స్ టెస్టుకు సిద్ధమని, సంజయ్ కూడా టెస్టులకు రావాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పై ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారు. బుఆర్ఎస్, బీజేపీ శ్రేణులు గంగుల క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే చర్యలు చేపట్టారు. బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు గంగుల క్యాంపు కార్యాలయం నుంచి భద్రత నడుమ తీసుకెళ్లారు. తనను చంపడానికే బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.

దోషులను వదిలే ప్రసక్తే లేదు
దోషులను వదిలే ప్రసక్తే లేదు
- కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం ఎందుకు మౌనంగా ఉంది?
- సీఎం రేవంత్ రెడ్డి నిలదీత"
- లక్ష ఎకరాలకు కూడా నీళ్లివ్వని కాళేశ్వరం.. రిపేర్లు చేసి తీరుతామని ధీమా

అక్షరదర్బార్, మహదేవపూర్

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో గత ప్రభుత్వం భారీ దోపిడీకి పాల్పడిందని, ఈ కుంభకోణంలో దోషులు ఎంతటి వారైనా శిక్షించి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన ఆయన మొదట మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరంలో శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుని రూ.198 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి అధికారులతో సమీక్ష జరిపిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రాజెక్టు రీడిజైనింగ్ నుంచి మేడిగడ్డ కుప్పకూలే వరకు జరిగిన పరిణామాలపై అగ్నిపరీక్ష లాంటి విమర్శలు చేశారు. 1975లో జలగం వెంగళరావు హయాంలోనే గోదావరి జలాల వినియోగంపై మహారాష్ట్రతో ఒప్పందం జరిగిందని రేవంత్ గుర్తు చేశారు. 2009లో వైఎస్సార్ హయాంలో రూ.38,063 కోట్లతో మొదలైన ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టును, కేసీఆర్ ప్రభుత్వం కేవలం ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసం 'కాళేశ్వరం'గా రీడిజైన్ చేసిందని మండిపడ్డారు. అంచనాలను ఏకంగా రూ.1.50 లక్షల కోట్లకు పెంచి, ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు. "2018 ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకు అద్భుతమంటూ భ్రమలు కల్పించారు. కానీ 2023లో మేడిగడ్డ కుప్పకూలడంతో వీరి పాపం పండింది. ఎన్నికల కోసమే నిజాలను దాచాలని చూసినా, ప్రకృతి వాస్తవాలను బయటపెట్టింది" అని సీఎం అన్నారు. నవంబర్ 2023లో ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చినప్పటికీ, కేసీఆర్ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు.
- హరీశ్ రావు ఢిల్లీ పర్యటనపై అనుమానాలు
మాజీ మంత్రి హరీశ్ రావు రహస్యంగా ఢిల్లీ పర్యటించడంపై ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "విచారణ నుంచి తప్పించుకోవడానికి బీజేపీ నేతల కాళ్లు పట్టుకోవడానికే హరీశ్ ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఎవరెవరిని కలిశారో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. న్యాయవాదులను కలవాల్సిన అవసరం ఏముంది?" అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీలు లోపాయికారీ ఒప్పందంతో ఉన్నాయని, అందుకే తాము పదే పదే లేఖలు రాసినా సీబీఐ విచారణపై కేంద్రం స్పందించడం లేదని విమర్శించారు.
- ప్రాజెక్టుకు రిపేర్లు.. రైతులకు నీరు
కాళేశ్వరం ద్వారా ఇప్పటివరకు కనీసం లక్ష ఎకరాలకు కూడా కొత్తగా నీరు ఇవ్వలేకపోయారని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. నిజానికి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వల్లే రాష్ట్రంలో పంటలు పండుతున్నాయని, అది హరీశ్ రావుకు రాజకీయం తెలియకముందే ఉందన్నారు. ప్రభుత్వం త్వరలోనే నిపుణుల సలహాతో కాళేశ్వరం ప్రాజెక్టుకు రిపేర్లు చేయించి రైతులకు నీరందిస్తుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్ర మంత్రులు  ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డి శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ వంశీకృష్ణ తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

4.45 గంటల పర్యటన
4.45 గంటల పర్యటన
- మధ్యాహ్నం 3 మూడు గంటలకు కాళేశ్వరం చేరుకోనున్న సీఎం
- శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం అనంతరం మేడిగడ్డకు
- సాయంత్రం 6.30 గంటలకు నస్తురుపల్లి వద్ద సభలో రైతు భరోసా నిధుల విడుదల

అక్షరదర్బార్, కాటారం: రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి 20వ తేదీ సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన జిల్లాలో 4.45 గంటల పాటు కొనసాగనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు జిల్లాలోని కాళేశ్వరం చేరుకునే సీఎం రేవంత్ రెడ్డి కాటారం మండలంలోని మస్తురిపల్లి వద్ద జరిగే బహిరంగ సభ ముగిసిన తర్వాత రాత్రి 7:45 గంటలకు హైదరాబాద్ బయలుదేరుతారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటన షెడ్యూల్ ఆదివారం విడుదలైంది. ఆయన పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి..

మధ్యాహ్నం 1.45 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి తమ నివాసం నుంచి బయలుదేరి 2.00 గంటలకు బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 3.00 గంటలకు కాళేశ్వరం ఆలయానికి చేరుకుంటారు.
3.05 నుండి 3.25 గంటల మధ్య శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం చేసి, ఆలయంలో భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు.
3.30 గంటలకు కాళేశ్వరం నుంచి బయలుదేరి 3.45 గంటలకు మహాదేవపూర్ మండలం మేడిగడ్డకు చేరుకుంటారు. అక్కడ 3.45 నుండి 4.30 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజ్ ప్రాంతాన్ని పరిశీలిస్తారు.
4.35 నుండి 5.30 గంటల వరకు అంబట్‌పల్లి గెస్ట్ హౌస్‌లో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం 5.35 నుండి 6.00 గంటల వరకు మీడియా సమావేశంలో పాల్గొంటారు.
6.00 గంటలకు మేడిగడ్డ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 6.30 గంటలకు కాటారం మండలం నస్తూరుపల్లి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ 6.30 నుండి 7.45 గంటల వరకు  రైతు భరోసా పథకం రెండో విడత నిధులను విడుదల చేసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభ ముగిసిన తర్వాత రాత్రి 7.45 గంటలకు నస్తూరుపల్లి నుంచి బయలుదేరి రాత్రి 11.15 గంటలకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకుంటారు.

తహసిల్దార్ల బదిలీ
తహసిల్దార్ల బదిలీ

- పది మంది తహసీల్దార్లు, ముగ్గురు నాయబ్ తహసిల్దార్లను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు

అక్షరదర్బార్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పది మంది తహసీల్దార్లు, ముగ్గురు నాయబ్ తహసీల్దార్లను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్  రాహుల్ శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.  బదిలీ అయిన తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు తమకు కేటాయించిన కొత్త స్థానాల్లో విధుల్లో చేరాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. విధుల్లో చేరిన వెంటనే సంబంధిత చేరిక నివేదికలను సమర్పించాలని స్పష్టంచేశారు. అధికారులు విధుల్లో చేరడంలో ఆలస్యం చేయకుండా, ప్రభుత్వ పరిపాలనా పనులు నిరంతరంగా సాగేందుకు సహకరించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

ఏసీబీ అధికారుల సోదాలు
ఏసీబీ కలకలం

- సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోదాలు

అక్షరదర్బార్, హనుమకొండ:
హనుమకొండ వడ్డేపల్లి వద్ద ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులకు దిగడం సంచలనం సృష్టిస్తుంది. ఈ కార్యాలయానికి చేరుకున్న ఏసీబీ అధికారులు ఆఫీస్ లో నుంచి ఎవరు బయటకు వెళ్లకుండా తలుపులు మూసివేసి సోదాలు నిర్వహిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ ఛాంబర్ లోని కీలక పత్రాలు, రిజిస్ట్రేషన్ ఫైళ్ళు, నగదు నిల్వలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అక్రమ వసూళ్లు లేదా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లలో అక్రమాలు జరుగుతున్నాయనే  సమాచారంతో ఏసీబీ అధికారులు ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తుంది. ఈ దాడుల్లో ఎంత నగదు దొరికింది? ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా? అనే పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మొత్తానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తుండటం ఇక్కడ కలకలం రేపింది.

ఆరబెట్టిన మిర్చి చోరీ
బావి వద్ద అరబెట్టిన మిర్చి మాయం..

మల్లక్కపేట–నాగారం శివారులో చోరీ…

పరకాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

అక్షరదర్బార్, పరకాల:
హన్మకొండ జిల్లా పరకాల మండలం మల్లక్కపేట–నాగారం గ్రామాల శివారులో రైతు అరబెట్టిన మిర్చిని గుర్తు తెలియని దొంగలు అపహరించిన ఘటన చోటుచేసుకుంది. మల్లక్కపేట గ్రామానికి చెందిన దొమ్మటి బాబు అనే రైతు తన మిర్చిని బావి వద్ద అరబెట్టగా, అక్కడి నుంచి సుమారు 5 క్వింటాళ్ల మిర్చిని దొంగలు ఎత్తుకెళ్లినట్లు సమాచారం.
అపహరణకు గురైన మిర్చి విలువ లక్ష రూపాయలకు పైగా ఉంటుందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై బాధితుడు పరకాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఇటీవల మిర్చికి మార్కెట్లో డిమాండ్ పెరగడంతో కొంతమంది ముఠాలు చోరీలకు పాల్పడుతున్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా పుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.
మిర్చి నిల్వలను పొలాల్లో లేదా బావుల వద్ద అరబెట్టే రైతులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఈ ఘటనతో పరిసర గ్రామాల రైతుల్లో ఆందోళన నెలకొంది.