క్రైమ్ - అక్షర దర్బార్

ఉద్యోగమంటూ ఘరానా మోసం
ఉద్యోగమంటూ ఘరానా మోసం
- ఏపీకి చెందిన సైబర్ నేరస్తుడి అరెస్ట్

అక్షరదర్బార్, పర్వతగిరి: పీఎం కిసాన్ యోజనలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సైబర్ నేరస్తుడిని పర్వతగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. పర్వతగిరి సర్కిల్ ఇన్ స్పెక్టర్ సంతోష్ తెలిపిన వివరాల ప్రకారం సంఘటన విశేషాలు ఇలా ఉన్నాయి. విజయవాడకు చెందిన మాచర్ల ఆనంద్ సాగర్ అనే వ్యక్తి, పర్వతగిరి మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన కన్నెబోయిన రాజుకు కేంద్ర ప్రభుత్వ ‘పీఎం కిసాన్ యోజన’లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. మాటలు నమ్మిన రాజు నుండి రూ.లక్ష వసూలు చేశాడు. ఎంతకాలమైనా ఉద్యోగం ఇప్పించకపోవడమే కాకుండా, తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు.
- విజయవాడలో అరెస్ట్ - రిమాండ్‌కు తరలింపు
బాధితుడు కన్నెబోయిన రాజు ఫిర్యాదు మేరకు పర్వతగిరి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో విజయవాడలోని నిందితుడు పనిచేస్తున్న ఆఫీసు వద్ద అతడిని పోలీసులు ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని, అతడిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సంతోష్ తెలిపారు.

కేదారి దంపతులది ఆత్మహత్య!
కేదారి దంపతులది ఆత్మహత్య!
- అవమానంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న దంపతులు
- మంటల్లో తీవ్రంగా గాయపడిన కేదారి నిన్న రాత్రి మృతి
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు ఆయన భార్య మృతి
- హనుమకొండలో విషాదం

అక్షరదర్బార్, హనుమకొండ: మంటల్లో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లింగాల కేదారి ఫుడ్ కోర్టు యజమాని కేదారి భార్య లింగాల పుష్పలత మృతి చెందారు. ఆమె కొద్ది సేపటి క్రితం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. హనుమకొండ అదాలత్ జంక్షన్ వద్ద గల లింగాల కేదారి ఫుడ్ కోర్టు యజమాని కేదారి, ఆయన భార్య పుష్పలత బుధవారం రాత్రి మంటల్లో తీవ్రంగా గాయపడగా కేదారి ఆస్పత్రికి తరలించే క్రమంలో మరణించగా ఆయన భార్య పుష్పలత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే అగ్ని ప్రమాదం వల్ల చెలరేగిన మంటల్లో తీవ్రంగా గాయపడి లింగాల కేదారి, ఆయన భార్య పుష్పలత మృతి చెందలేదని, ఈ దంపతులది ఆత్మహత్య అని తెలిసింది. ఇంటి అద్దె బకాయి కోసం చెల్లించాలని ఇంటి ఓనరు తాళం వేయడంతో అవమాన భారం భరించలేక హోటల్ యజమాని లింగాల కేదారి ఆయన భార్య పుష్పలత ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పుటించుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.  ఇంటికి తాళం వేశానని, వచ్చి మీ తల్లిని తీసుకెళ్లాలని ఇంటి ఓనర్ లింగాల కేదారి కొడుకుతో మాట్లాడినట్లు ఉన్న ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లింగాల ఫుడ్ కోర్టు యజమాని కేదారి, ఆయన భార్య మృతి చెందడం హనుమకొండలో విషాదాన్ని నింపింది. కేదారి దంపతుల మృతిపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలిసింది.

నో కాంప్రమైజ్
నో కాంప్రమైజ్

- ఫేమ్ కోసం కాదు.. ఫలితం కోసం పనిచేస్తా

- గంజాయిపై స్పెషల్ నిఘా పెట్టాం.. రంగంలోకి 'సంఘమిత్ర'లు
- గంజాయి సరఫరాదారులపై రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నాం
- పక్కా సమాచారం ఇస్తే తక్షణ దాడులు నిర్వహిస్తాం
- మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టాం
- సైబర్ బాధితులకు త్వరిత న్యాయం.. నేరాల అదుపునకు పెట్రోలింగ్
- రౌడీయిజానికి నో ఛాన్స్.. సీసీ కెమెరాల పర్యవేక్షణ ఎస్ఐలదే
- కాలనీల్లో నిఘా పటిష్టం.. నేరస్తుల ఆట కట్టిస్తాం
- ఏరియాను బట్టి యాక్షన్ ప్లాన్.. కేయూ, హసన్ పర్తిలో భూ వివాదాలపై దృష్టి
- భూ సమస్యల్లో ఏకపక్ష జోక్యం వద్దు.. ఎస్ఓపీ దాటితే చట్టపరమైన చర్యలు
- ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నాం
- ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సైతం సిద్ధం.. ఇప్పటికే వాట్సాప్ ఎఫ్ఐఆర్ లు
- చట్టంపై నమ్మకంతో విధులు.. నేరాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం
- వరంగల్ పోలీసింగ్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది
- డిజిటల్ మీడియా చిట్ చాట్ లో వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేతారెడ్డి

అక్షరదర్బార్, హనుమకొండ

వరంగల్‌ ప్రాంతంలో నేను తొలిసారిగా పూర్తిస్థాయిలో విధులు నిర్వహిస్తున్న. గతంలో ఒకసారి వచ్చి 15 రోజులు డ్యూటీ చేశాను. వరంగల్‌కు చారిత్రాత్మక నేపథ్యం ఉంది. అంతేకాదు వరంగల్ పోలీసింగ్ కూ ప్రత్యేక గుర్తింపు ఉంది. హైదరాబాద్‌ తర్వాత రాష్ట్రంలో ప్రధాన నగరంగా వరంగల్ ఎదిగింది. ఒకవైపు అర్బన్‌ ప్రాంతం, మరోవైపు రూరల్‌ ప్రాంతాలు ఉండటంతో కమిషనరేట్‌లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. హైదరాబాద్‌ పూర్తిగా అర్బన్‌ కావడంతో అక్కడి పోలీసింగ్‌కు, వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసింగ్‌కు తేడా ఉంటుంది. రెండు ప్రాంతాల పరిస్థితులను బ్యాలెన్స్‌ చేస్తూ ముందుకెళ్లాల్సి ఉంటుందని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేతారెడ్డి అన్నారు. డిజిటల్ మీడియా ప్రతినిధుల చిట్ చాట్ లో ఆమె మాట్లాడారు. ఏమన్నారంటే సీపీ శ్వేతారెడ్డి మాటల్లోనే..

- గంజాయిపై ప్రత్యేక నిఘా
నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాలను పట్టిపీడిస్తున్న గంజాయిపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టాం. మత్తు పదార్థాల వినియోగం, సరఫరాను అరికట్టేందుకు పోలీసులతో పాటు సమాజ భాగస్వామ్యాన్ని పెంచుతున్నాం. ఇందులో భాగంగా మహిళా సంఘాల సహకారం తీసుకుంటున్నాం. మత్తు పదార్థాల వల్ల కుటుంబాలు, యువతపై పడుతున్న ప్రభావాన్ని తల్లులుగా మహిళలకు బాగా అర్థమవుతుంది. అందుకే వారిని భాగస్వాములను చేస్తున్నామన్నాం. మహిళా సంఘాల సభ్యులకు ‘సంఘమిత్రలు’గా నామకరణం చేసి గంజాయి, ఇతర నేరాలపై అవగాహన కల్పిస్తున్నాం. తాజాగా జనగామలో జిల్లా వ్యాప్తంగా మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించి, గంజాయికి అలవాటు పడిన వారిని గుర్తించడం, మత్తు పదార్థాల ప్రభావం, సమాజంలో జరుగుతున్న నేరాలపై వారికి అవగాహన కల్పించడం జరిగింది. ప్రతి గ్రామంలో మహిళా సంఘాలు అందుబాటులో ఉండటంతో గంజాయి వినియోగం, సరఫరాపై క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించేందుకు ఇది దోహదపడుతుంది.
- రౌడీషీట్ ఓపెన్..
గంజాయి కేసుల్లో పదేపదే పట్టుబడుతున్న వారిపై నిఘా పెంచడంతో పాటు అవసరమైన చోట రౌడీషీట్లు ఓపెన్‌ చేస్తున్నాం. అయితే గంజాయి సరఫరాపై ప్రజల నుంచి పక్కా సమాచారం రావడం లేదు. ‘ఇక్కడ ఉందట.. వాళ్లు తాగుతున్నారట’ అనే సాధారణ సమాచారం కాకుండా, సరఫరా చేసే వ్యక్తులు, ప్రాంతాలు, వాహనాలు తదితరాలపై పక్కా సమాచారం అందిస్తే తక్షణమే దాడులు నిర్వహించి చర్యలు తీసుకుంటాం. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతాం.

- సైబర్‌ క్రైం.. మిల్స్‌ కాలనీపై ప్రత్యేక దృష్టి
వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో సైబర్‌ నేరాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. సైబర్‌ కేసులను ప్రాపర్‌గా ఇన్వెస్టిగేట్‌ చేసి, బాధితులకు న్యాయం జరిగేలా కేసుల పరిష్కారంపై దృష్టి సారించాం. మరోవైపు క్రైం ఇష్యూలు ఎక్కువగా నమోదవుతున్న మిల్స్‌ కాలనీ పోలీస్‌స్టేషన్‌పై ప్రత్యేక ఫోకస్‌ పెట్టాం. అక్కడ అదనపు ఎస్‌ఐని నియమించి క్రైం కంట్రోల్‌, పెట్రోలింగ్‌, నిఘాను మరింత బలోపేతం చేస్తున్నాం.

- రౌడీయిజానికి నో ఛాన్స్‌
రౌడీయిజాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోం. నేర చరిత్ర కలిగిన వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచడంతో పాటు అవసరమైన చోట చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. నగరంలోని కాలనీలు, ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాల పనితీరుపైనా దృష్టి సారించాం. సీసీ కెమెరాల నిర్వహణ, పనితీరును పరిశీలించే బాధ్యతను సంబంధిత పోలీస్‌స్టేషన్ల ఎస్‌ఐలకు అప్పగించాం. కాలనీ సమావేశాలు నిర్వహించి కెమెరాలను సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం.

- ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు ప్రాధాన్యం
వరంగల్‌ నగరంలో ట్రాఫిక్‌ సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ట్రాఫిక్‌ అనేది నిరంతరం ఉండే సమస్య. పోలీసుల చర్యలతో పాటు వాహనదారులు, ప్రజల సహకారం కూడా అవసరం. ముఖ్యంగా యూటర్న్‌లు, ఫ్రీ లెఫ్ట్‌లు, రోడ్డు సేఫ్టీ అంశాలపై దృష్టి సారిస్తున్నాం. కరుణాపురంలో వైన్స్‌కు పెద్ద పర్మిట్‌ రూమ్‌ ఉండటంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌లు, ప్రమాదాలు చోటుచేసుకుంటున్న దృష్ట్యా ఎక్సైజ్‌ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో మూడు యూటర్న్‌లను మూసివేసినం. దీంతో ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్‌ సాఫీగా సాగుతోంది.

- ప్రజల సేఫ్టీ.. శాఖల సమన్వయంతో చర్యలు
ప్రజల సేఫ్టీనే పోలీసింగ్‌లో ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాం. ట్రాఫిక్‌, ఫ్రీ లెఫ్ట్‌లు, ఫుట్‌పాత్‌ ఆక్రమణలు వంటి సమస్యలను ఒక్కసారిగా కాకుండా విడతల వారీగా పరిష్కరించుకుంటూ వెళ్తామన్నాం. పోలీసు శాఖ ఒక్కటే అన్ని సమస్యలను పరిష్కరించలేదు. మున్సిపల్‌ కార్పొరేషన్‌, ఎక్సైజ్‌, రెవెన్యూ తదితర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటికే కార్పొరేషన్‌ అధికారులతో సమావేశం నిర్వహించాం. అధికారులు చర్యలు తీసుకున్నా ప్రజల భాగస్వామ్యం లేకుండా సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యం కాదు.

- స్టేషన్ల వారీగా క్రైం మ్యాపింగ్‌
కమిషనరేట్‌ పరిధిలోని ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో నమోదవుతున్న కేసుల స్వభావాన్ని ప్రత్యేకంగా పరిశీలిస్తున్నాం. మిల్స్‌ కాలనీ, మట్వాడ, ఇంతేజార్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో క్రైం కేసులు ఎక్కువగా ఉంటే, కేయూ, హసన్‌పర్తి ప్రాంతాల్లో భూ వివాదాలకు సంబంధించిన కేసులు అధికంగా నమోదవుతున్నాయి. స్టేషన్‌ వారీగా క్రైం ప్యాటర్న్‌ను గుర్తించి, ఆయా ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా నివారణ చర్యలు చేపడుతున్నాం.

- భూ వివాదాల్లో ఎస్‌ఓపీనే ప్రామాణికం
భూ సమస్యల పరిష్కారంలో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం, పోలీస్‌ శాఖ రూపొందించిన ప్రత్యేక స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ)ను పక్కాగా అమలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించిన. భూ వివాదాల్లో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా జోక్యం చేసుకోకుండా ఎస్‌ఓపీ ప్రకారం వ్యవహరించాల్సి ఉంటుంది. నేను కూడా ఎస్‌ఓపీని తప్పనిసరిగా పాటిస్తాను. నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు ఉంటాయి.

- సాంకేతిక వినియోగం...
పరిపాలనా, పోలీసింగ్ పటిష్టత కోసం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వినియోగానికి సన్నద్ధంగా ఉన్నాం. రాష్ట్ర స్థాయిలో తీసుకునే నిర్ణయాలను బట్టి ఏఐ వంటి సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించి ప్రజలకు విస్తృతమైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. ఇప్పటికే వాట్సప్ ఎఫ్ఐర్ లు స్వీకరిస్తున్నం.
- ఫేమ్‌ కోసం కాదు.. ఫలితం కోసం
పోలీసు అధికారిగా పేరు, ఫేమ్‌ కోసం పనిచేయను. చట్టాన్ని నమ్మి, దాని ప్రకారమే విధులు నిర్వర్తిస్తా. నాకు చట్టపై నమ్మకం ఉంది. అలాగే శిక్ష పడే వరకు వేచి చూసే ఓపిక కూడా ఉంది. పోలీసింగ్‌ అంటే ప్రభావవంతంగా ఉండటంతో పాటు దాని ఫలితం ప్రజలకు కనిపించాలన్నదే నా లక్ష్యం. ప్రజలకు భద్రత కల్పించడం, నేరాలను నియంత్రించడం, సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం చూపించడంపైనే నా దృష్టి ఉంటుంది.

రూ.1.25 కోట్ల గంజాయి సీజ్
రూ.1.25 కోట్ల గంజాయి సీజ్
- అంతర్‌రాష్ట్ర స్మగ్లర్ అరెస్ట్
- దామెర పోలీసుల భారీ ఆపరేషన్
- 251 కిలోల గంజాయి, బైక్, నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం
- వరంగల్ సీపీ ఎన్ శ్వేత వెల్లడి

అక్షరదర్బార్, హనుమకొండ: గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మత్తు పదార్థాల విక్రయదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా హన్మకొండ జిల్లా దామెర మండలం పులుకుర్తి గ్రామానికి చెందిన అంతర్‌రాష్ట్ర గంజాయి స్మగ్లర్ ముదిగొండ నాగేశ్వర్ రావు (55)ను దామెర పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుడి నుంచి సుమారు రూ.1 కోటి 25 లక్షల విలువైన 251 కిలోల గంజాయి, ఒక ద్విచక్ర వాహనం, రూ. 9,000 నగదు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత మీడియా సమావేశంలో వెల్లడించారు.
- ఇతర రాష్ట్రాలకు రవాణా
ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ పర్యవేక్షణలో దామెర పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు నాగేశ్వర్ రావు సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఒడిశా రాష్ట్రానికి చెందిన రమేష్, సుధాకర్ వద్ద తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసేవాడు. ఆ తర్వాత తనకున్న నెట్‌వర్క్ ద్వారా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఉర్దు, రాందాస్ శేషరావు బీరదార్, అక్లీం, షారుఖ్ ఖాన్, షేక్ అక్బర్, నునావత్ రాజు అనే వ్యక్తుల ద్వారా ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడు ఇచ్చిన పక్కా సమాచారంతో అతని ఇంటిపై దాడి చేసిన పోలీసులు భారీగా నిల్వ ఉంచిన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇది ఏపీలోని విశాఖపట్నం జిల్లా సీలేరు ప్రాంతం నుంచి పులుకుర్తికి రవాణా అయింది. ఈ గంజాయి నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న మిగతా రాష్ట్రాల నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దించినట్లు సీపీ తెలిపారు.
- మత్తు పదార్థాలపై కఠిన చర్యలు
యువత మత్తు పదార్థాల బారిన పడి బంగారు భవిష్యత్తును పాడుచేసుకోకుండా కాపాడేందుకు ప్రత్యేక దృష్టి సారించామని సీపీ ఎన్.శ్వేత తెలిపారు. ఎవరైనా గంజాయి విక్రయించినా, వినియోగించినా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
- పోలీస్ సిబ్బందికి అభినందనలు
ఈ భారీ గంజాయి స్మగ్లింగ్ ముఠాను చాకచక్యంగా పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పరకాల ఏసీపీ సతీష్ బాబు, శాయంపేట సీఐ సుధాకర్ రెడ్డి, ఆత్మకూర్ సీఐ సంతోష్, దామెర ఎస్ఐ వీరభద్రరావు, శాయంపేట ఎస్ఐ పరమేశ్వర్, పరకాల ఎస్ఐ రఘుపతి, ఏఏఓ సల్మాన్ పాషా మరియు దామెర, శాయంపేట స్టేషన్ల కానిస్టేబుళ్లను సీపీ అభినందించారు.

ఏసీబీ వలలో తహశీల్దార్
ఏసీబీ వలలో తహశీల్దార్

- చేర్యాల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

- రూ.70 వేల లంచంతో పట్టుబడిన తహశీల్దార్

సిద్దిపేట జిల్లా చేర్యాల మండల తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. భూమి సంబంధిత పని కోసం వచ్చిన వ్యక్తి నుంచి రూ.70 వేల లంచం తీసుకుంటుండగా తహశీల్దార్ దిలీప్ నాయక్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం.
ఫిర్యాదు మేరకు ముందస్తు ప్రణాళికతో ట్రాప్ నిర్వహించిన ఏసీబీ అధికారులు, అనంతరం కార్యాలయంలో సోదాలు చేపట్టి పలు రికార్డులు, పత్రాలను పరిశీలించారు. లంచం వ్యవహారానికి సంబంధించిన మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. తహశీల్దార్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ప్రాథమిక సమాచారం. పూర్తి వివరాలపై ఏసీబీ అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ ఘటనతో చేర్యాల మండలంలో కలకలం రేగింది.

భర్త హత్యకు భార్య స్కెచ్
భర్త హత్యకు భార్య స్కెచ్
- రూ.4 లక్షల సుపారీ
- సింగారం మాజీ ఉప సర్పంచ్ యాకయ్య హత్య కేసు చేధన
- యాకయ్య మృతి వెనుక అసలు నిజాలు బయటపెట్టిన ఎస్పీ
- భార్యతో సహా ఏడుగురు అరెస్ట్

అక్షరదర్బార్, మహబూబాబాద్:
మహబూబాబాద్ మండలం సింగారం గ్రామంలో ఈ నెల 1వ తేదీ తెల్లవారుజామున జరిగిన మాజీ ఉప సర్పంచ్ యాకయ్య (57) హత్య కేసును మహబూబాబాద్ టౌన్ పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. వివాహేతర సంబంధం, ఆస్తి గొడవలే ఈ దారుణ హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. భర్తను అంతమొందించేందుకు రూ.4 లక్షల సుపారీ మాట్లాడిన భార్య యశోద (53)తో పాటు హత్యకు పాల్పడిన మరో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ శబరిష్ ఈ సంచలన హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
- పరాయి మహిళకు ఆస్తి ఇస్తాడనే భయంతోనే..
పోలీసుల కథనం ప్రకారం.. మృతుడు యాకయ్యకు గ్రామంలోని మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో తన ఆస్తిని ఆ మహిళకు ఎక్కడ రాసిస్తాడోననే భయం భార్య యశోదలో మొదలైంది. దీంతో భర్తను పూర్తిగా వదిలించుకోవాలని నిర్ణయించుకున్న ఆమె, యాకయ్యను హత్య చేసేందుకు రూ.4 లక్షల సుపారీని మాట్లాడి నిందితులతో ఒప్పందం కుదుర్చుకుంది.
- దోపిడీగా చిత్రీకరించే ప్రయత్నం ఫెయిల్..
పథకం ప్రకారం.. ఈ నెల 1వ తేదీ తెల్లవారుజామున దుండగులు యాకయ్యపై ఇనుప రాడ్‌తో దాడి చేసి దారుణంగా కొట్టి చంపారు. అనంతరం ఇదంతా దొంగల పనిగా చిత్రీకరించేందుకు యాకయ్య మెడలోని బంగారు గొలుసును తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు. అయితే రంగంలోకి దిగిన టౌన్ పోలీసులు సాంకేతిక ఆధారాలు, పక్కా సమాచారంతో దర్యాప్తు చేపట్టి అసలు సూత్రధారి భార్య యశోదనే అని గుర్తించారు.
- సామగ్రి సీజ్.. పోలీసులకు అభినందనలు
ఈ కేసులో ప్రధాన నిందితురాలైన భార్య యశోదతో పాటు మరో ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి 7 సెల్‌ఫోన్లు, ఒక ఐరన్ రాడ్, 2 ద్విచక్ర వాహనాలు, మృతుడి మెడ నుంచి దొంగిలించిన 1 బంగారు గొలుసును పోలీసులు సీజ్ చేశారు. కేసును చాకచక్యంగా ఛేదించిన టౌన్ పోలీస్ సిబ్బందిని ఎస్పీ శబరిష్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.

సీఐ, ఎస్సై సస్పెన్షన్
సీఐ, ఎస్సై సస్పెన్షన్

- ఒకే కేసులో సీఐ, ఎస్ఐలను సస్పెన్షన్ చేసిన వరంగల్ సీపీ
- విచారణలో అవినీతి ఆరోపణలు నిజమని తేలటంతో నిర్ణయం

అక్షరదర్బార్, హనుమకొండ: వరంగల్ కమిషనరేట్ పరిధిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారులపై కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ కొరడా ఝలిపిస్తున్నారు. తాజాగా మరో ఇద్దరిపై సస్పెన్షన్ వేటు వేశారు. వెస్ట్ జోన్ పరిధిలోని నర్మెట్ట సర్కిల్ ఇన్ స్పెక్టర్ యం అబ్బయ్య, గతంలో బచ్చన్నపేట ఎస్ఐగా పని చేసి ప్రస్తుతం ఏఆర్ అటాచ్డ్ లో ఉన్న ఎస్ఐ షేక్ హమీద్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్ అయిన అధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణలు నిర్ధారణ కావడంతో ఇరువురు అధికారులను సస్పెండ్ చేస్తునట్లు సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకే కేసులో సీఐ, ఎస్సైపై సీపీ సస్పెన్షన్ వేటు వేయడం కమిషనరేట్ పరిధిలో కలకలం రేపింది.

కల్తీ పచ్చళ్ల తయారీ కేంద్రం గుట్టురట్టు
కల్తీ పచ్చళ్ల తయారీ కేంద్రం గుట్టురట్టు

- టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి.. ఒకరి అరెస్ట్

- రూ. 2.25 లక్షల విలువైన నిల్వలు స్వాధీనం

అక్షరదర్బార్, వరంగల్: వరంగల్ నగరంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఒక అక్రమ, కల్తీ పచ్చడి తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ నకిలీ పచ్చళ్ల దందాను మట్టుబెట్టి, ఒకరిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 2.25 లక్షల విలువైన కుళ్లిపోయిన ఆహార నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.

- ఇల్లే కేంద్రంగా అక్రమ వ్యాపారం

టాస్క్ ఫోర్స్ అధికారుల కథనం ప్రకారం... ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాశీబుగ్గ సాయి వీధిలో ఉన్న ఓ నివాస గృహంలో అక్రమంగా పచ్చళ్లు తయారు చేస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఏసీపీ టాస్క్ ఫోర్స్ ఎ మధుసూదన్ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ బండారి రాజు, ఆర్‌ఎస్‌ఐ ఓ. భాను ప్రకాష్ మరియు సిబ్బంది ఆ గృహంపై ఆకస్మిక దాడి జరిపారు. ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున కుళ్లిపోయిన పచ్చడి ముడిసరుకులు, ప్రమాదకర రసాయనాలతో కూడిన ఆహార పదార్థాలు నిల్వ ఉంచినట్లు గుర్తించారు. ఈ కుళ్లిపోయిన నిల్వలను చిన్న చిన్న ఆకర్షణీయమైన ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసి, స్థానిక కిరాణా దుకాణాలు, హోటళ్లు, ఇతర చిన్న వ్యాపార కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.

- భారీగా కుళ్లిపోయిన సరుకు స్వాధీనం

ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన కాశీబుగ్గ నివాసి అరికెల శ్రీనివాస్ (51) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తయారీ కేంద్రం నుండి దాదాపు 2,100 కిలోల కల్తీ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 750 కిలోల టమోటా ముడిసరుకు, 900 కిలోల మామిడి ముక్కలు, 200 కిలోల నిమ్మకాయలు, 100 కిలోల ఉసిరికాయలు, 150 కిలోల అల్లం-వెల్లుల్లి పేస్ట్ ఉన్నాయి. వీటి మొత్తం విలువ సుమారు రూ.2,25,000 ఉంటుందని అధికారులు అంచనా వేశారు. పట్టుబడిన నిందితుడిని, స్వాధీనం చేసుకున్న సరుకును తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.

- ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

"మార్కెట్లో లభించే బ్రాండ్ లేని, అనుమానాస్పద ఆహార పదార్థాలు, పచ్చళ్లను కొనుగోలు చేసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తక్కువ ధరకు వస్తున్నాయని కొని ఆరోగ్యాలను పాడుచేసుకోవద్దు. నగరంలో ఎక్కడైనా ఇలాంటి అక్రమ నిల్వ కేంద్రాలు లేదా కల్తీ ఆహార పదార్థాల విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలి, సమాచారం ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతాం." అని టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఎ. మధుసూదన్ అన్నారు.

లారీ బీభత్సం.. ఆర్టీవో మృతి
లారీ బీభత్సం.. ఆర్టీవో మృతి

- భూపాలపల్లి ఆర్టీవో కార్యాలయం ముందు ఘోర ప్రమాదం

అక్షరదర్బార్, భూపాలపల్లిక్రైమ్:

గణపురం మండలం చెల్పూర్ వద్ద భూపాలపల్లి - పరకాల ప్రధాన రహదారిపై గల జయశంకర్ భూపాలపల్లి జిల్లా రవాణా అధికారి (ఆర్టీవో) కార్యాలయం ముందు సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న ఆర్టీవో వెంకన్న బొగ్గు లారీ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఓ బొగ్గు లారీ ఆర్టీవో వెంకన్న పైనుంచి దూసుకు వెళ్లింది. నడుముపై నుంచి వెళ్లటం వల్ల తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే సంఘటనా స్థలంలో ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్టీవో సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని భూపాలపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసే అధికారిగా పేరున్న వెంకన్న మృతి పట్ల జిల్లా యంత్రాంగం, రవాణా శాఖ సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీవో కార్యాలయంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. వెంకన్న ఇటీవలే ఈనెల 4న జగిత్యాల నుంచి బదిలీపై భూపాలపల్లి జిల్లా రవాణా అధికారిగా వచ్చారు. వెంకన్న స్వస్థలం మహబూబాబాద్ జిల్లా. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు.

గంజాయి చాక్లెట్ల కలకలం
గంజాయి చాక్లెట్ల కలకలం
- ఒడిశా కేటుగాడి అరెస్ట్
- ఎంజీఎం సర్కిల్ వద్ద పట్టుకున్న పోలీసులు..
- 72 'సెవెన్ మైనర్ వతి' చాక్లెట్లు స్వాధీనం

అక్షరదర్బార్, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు గంజాయి చాక్లెట్ల అక్రమ రవాణాను రట్టు చేశారు. మట్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు భారీగా గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకొని, ఒడిశా రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. మట్వాడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారి ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం సబ్ ఇన్ స్పెక్టర్ (ఎస్‌ఐ) ఎస్ శివకృష్ణ తన సిబ్బంది డి నాగరాజు, బి సత్యనారాయణ, పి రవిలతో కలిసి స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఎంజీఎం సర్కిల్ వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసుల కంటపడ్డాడు. సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని, అతడి వద్ద ఉన్న నలుపు రంగు బ్యాగును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆ బ్యాగులో చాక్లెట్ల రూపంలో ఉన్న గంజాయి పదార్థం బయటపడటంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు.
- ఒడిశా టు మహారాష్ట్ర.. వరంగల్ మీదుగా స్మగ్లింగ్
పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడు ఒడిశా రాష్ట్రం, భద్రక్ జిల్లా, కాన్పాడా గ్రామానికి చెందిన జనార్ధన్ మాలిక్ (వయస్సు 35 ఏళ్లు) గా గుర్తించారు. నిందితుడి వద్ద నిషేధిత పదార్థం దొరకడంతో మట్వాడ పోలీసులు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారి ఆదేశాల మేరకు పంచులు (సాక్షులు), క్లూస్ టీంను సంఘటనా స్థలానికి రప్పించి చట్టపరమైన ప్రక్రియను చేపట్టారు.
పంచుల సమక్షంలో నిందితుడిని విచారించగా అసలు విషయం ఒప్పుకున్నాడు. ఒడిశా రాష్ట్రానికి చెందిన తన పరిచయస్తుడు అంకిత్ పాణిగ్రహి వద్ద నుండి ఈ గంజాయి మిశ్రమ చాక్లెట్లను తక్కువ ధరకు కొనుగోలు చేశానని.. వీటిని మహారాష్ట్రలోని సోలాపూర్ ప్రాంతానికి తరలించి అక్కడ అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకోవాలనే దురాశతో తీసుకెళ్తున్నట్లు నిందితుడు స్వచ్ఛందంగా అంగీకరించాడు.
- ఘాటైన వాసన.. 'క్యానబిస్ సటైవా' గుర్తింపు
నిందితుడి వద్ద లభించిన గోల్డ్ కలర్ కవర్లపై “Seven Minor Vati” అని ముద్రించి ఉంది. పోలీసులు మొత్తం 72 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ కవర్లపై ఉన్న వివరాలను పరిశీలించగా.. అందులో ‘క్యానబిస్ సటైవా’ (గంజాయి) సహా పలు మత్తు పదార్థాలు కలిపి తయారు చేసినట్లు నిర్ధారణ అయింది. పంచులు, పోలీసుల సమక్షంలో వాటిని పరిశీలించగా చాక్లెట్ల నుండి గంజాయికి ఉండే ప్రత్యేకమైన ఘాటైన వాసన రావడంతో వాటిని సీజ్ చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకున్న మట్వాడ ఎస్‌ఐ శివకృష్ణ, పీసీలు నాగరాజు, సత్యనారాయణ, రవిలను ఉన్నతాధికారులు అభినందించారు.

యాక్సిడెంట్ లో ఒకరి మృతి
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

- మృతుడు మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామ నివాసి.

- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న హుజురాబాద్ పోలీసులు.

అక్షరదర్బార్, మొగుళ్లపల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన హుజురాబాద్ మండలం చిలుకూరు ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద బుధవారం సంభవించింది. హుజురాబాద్ పోలీసుల కథనం ప్రకారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన కత్తి నరసయ్య గౌడ్ అనే వ్యక్తి తన సొంత వాహనంలో హుజురాబాద్ నుండి జమ్మికుంట వైపు వస్తున్న క్రమంలో చేల్పూరు ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద అతివేగంగా కారు ను  ఢీకొట్టడంతో కారు నడుపుతున్న నరసయ్య. అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న హుజురాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. రంగాపురం గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి,

కేటుగాళ్ల నల్ల దందా
కేటుగాళ్ల నల్ల దందా

- నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్టు

- 1:3 ఆశచూపి నల్ల కాగితాలతో మోసాలు

- కలర్ ప్రింటర్లతో రూ.100 నోట్ల ముద్రణ

- రూ. 28 లక్షల విలువైన సామాగ్రి, నగదు స్వాధీనం

అక్షరదర్బార్, హనుమకొండ: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ నోట్లను చెలామణి చేస్తున్న, రసాయనాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న భారీ ముఠాను వరంగల్ టాస్క్‌ఫోర్స్, నర్సంపేట పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. మొత్తం ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారిఊ వద్ద నుండి రూ.1,48,000 నగదు, రెండు కార్లు, 13 సెల్ ఫోన్లు, సుమారు రూ. 28 లక్షల విలువైన ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా అరెస్టుకు సంబంధించిన వివరాలను ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ సోమవారం మీడియాకు వెల్లడించారు. నిందితులు రెండు గ్రూపులుగా విడిపోయి నేరాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. నర్సంపేటకు చెందిన ముగ్గురు వ్యక్తులు ల్యాప్‌టాప్, కలర్ ప్రింటర్లను ఉపయోగించి రూ.100 నోట్లను ముద్రించి మార్కెట్‌లో చలామణి చేస్తున్నారు. మిగిలిన ఐదుగురు వ్యక్తులు 1:3 నిష్పత్తిలో (ఒక్క రూపాయికి మూడు రూపాయలు) డబ్బు ఇస్తామని నమ్మిస్తారు. ఇందుకోసం వారు అసలైన రూ.500 నోటును అయోడిన్ టింక్చర్ ద్రావణంలో ముంచి నల్లగా మారుస్తారు. తిరిగి దానిపై 'హైపో' (సోడియం థయోసల్ఫేట్) పోయగానే అది పాత రూపానికి వస్తుంది. ఇది చూసి నమ్మిన బాధితులకు నల్ల కాగితాల కట్టలను ఇచ్చి, అసలు నగదుతో పరారవుతారు.

- నిందితుల వివరాలు

పోలీసుల కథనం ప్రకారం అరెస్టయిన వారిలో శాగంటి కిరణ్ (నర్సంపేట), నీరటి శివ (నర్సంపేట), నీరటి రంజిత్ (నర్సంపేట), గుడికందుల రవి (నర్సంపేట), పోరిక రాజ్‌కుమార్ @ రాజు (ఘన్‌పూర్, ములుగు), తనమాల రాజశేఖర్ (ఖమ్మం), ముదురుకోల యాకంబరం (భువనగిరి), చేను సాయికిరణ్ (కొత్తగూడెం) ఉన్నారు.

- పాత నేరస్థులే..

ఈ ముఠా గతంలో ఘన్‌పూర్, సికింద్రాబాద్ (మోండా మార్కెట్), ఖమ్మం, కొత్తగూడెం, కేయూసీ, సుబేదారీ పరిధిలో అనేక మోసాలకు పాల్పడి జైలుకు వెళ్లినట్లు డీసీపీ అంకిత్ కుమార్ తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఛత్రినాక, నర్సంపేటలలోనూ ఇవే తరహా మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు.

సాహసోపేతంగా ఈ ముఠాను పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూధన్, నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు బాబులాల్, శ్రీనివాస్, ఇతర సిబ్బందిని పోలీస్ కమిషనర్ (సీపీ) ప్రత్యేకంగా అభినందించారు.