రాజకీయం - అక్షర దర్బార్

కాంగ్రెస్ ఖాతాలో పరకాల
చైర్మన్‌గా పావుశెట్టి సునీల్ కుమార్
- పరకాల మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం

అక్షరదర్బార్, పరకాల:
ఊహించినట్లే జరిగింది. పరకాల మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంది. కొద్ది రోజుల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలోని 22 వార్డుల్లో కాంగ్రెస్ 13 సీట్లు గెలుచుకోగా, బీఆర్‌ఎస్ 6, బీజేపీ 3 స్థానాలను సాధించాయి. సోమవారం కాంగ్రెస్ కౌన్సిలర్లు క్యాంప్ నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని ముందుగా కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం అధికారులు చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. 7వ వార్డు నుంచి గెలుపొందిన కౌన్సిలర్ పావుశెట్టి సునీల్ కుమార్‌ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. వెంటనే అధికారుల సమక్షంలో భవిష్యత్తు సునీల్ కుమార్ పరకాల మున్సిపాలిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. కౌన్సిలర్లు నూతన చైర్మన్ ను అభినందించారు. వైస్ చైర్ పర్సన్ గా 4వ వార్డు నుంచి గెలిచిన ఏకు దివ్య ఎన్నికయ్యారు. పరకాల మున్సిపాలిటీ చైర్మన్ పదవి అన్ రిజర్వుడ్ అయిన విషయం తెలిసిందే.

చైర్మన్ గా కొమురయ్య
అక్షరదర్బార్, భూపాలపల్లి: ఊహించినట్లుగానే భూపాలపల్లి మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. సునాయాసంగా చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన బుర్ర కొమురయ్య గౌడ్ చైర్మెన్ గా, అంబాల శ్రీనివాస్ వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఈ మున్సిపాలిటీలోని 30 వార్డుల్లో 16 వార్డులను కాంగ్రెస్ గెలుచుకోగా, బీఆర్ఎస్ 10, బీజేపీ 2, సిపిఐ ఒకటి, స్వతంత్రులు ఒకటి గెలుచుకున్న విషయం తెలిసిందే. 16 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లతో పాటు సిపిఐ, స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో కాంగ్రెస్ పార్టీ బలం భూపాలపల్లి మున్సిపాలిటీలో 18 కి పెరిగింది. సోమవారం భూపాలపల్లిలోని మున్సిపాలిటీ కార్యాలయంలో అధికారులు మొదట కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిపారు. ఎన్నికల్లో చైర్మన్ గా బుర్ర కొమురయ్య గౌడ్, వైస్ చైర్మన్ గా అంబాల శ్రీనివాస్ ఎన్నికయ్యారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రతిపాదన మేరకు పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మున్సిపాలిటీ చైర్మన్గా ఎన్నికైన బుర్ర కొమురయ్య గౌడ్ మొదటి నుంచి ఎమ్మెల్యే సత్యనారాయణ రావు వెన్నంటి ఉన్నారని సమాచారం. చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో బీఆర్ హ్యాట్రిక్ మిస్ అయింది. గతంలో వరుసగా రెండుసార్లు ఈ మున్సిపాలిటీ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ దక్కించుకుంది.

కాంగ్రెస్ వశమైన పరకాల
పరకాల మున్సిపాలిటీపై కాంగ్రెస్ విజయకేతనం

13 స్థానాల్లో ఘన విజయం

బీఆర్ఎస్‌కు 6, బిజెపికి 3

17వ వార్డులో ఒకే ఓటుతో కాంగ్రెస్ గెలుపు

మాజీ చైర్మన్ మార్త రాజభద్రయ్యకు ఎదురుదెబ్బ

అక్షరదర్బార్, పరకాల:
పరకాల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడగా కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. మొత్తం 22 వార్డుల్లో కాంగ్రెస్ 13 స్థానాలను కైవసం చేసుకొని ఆధిపత్యాన్ని చాటింది. బిఆర్ఎస్ 6 స్థానాలకు, బిజెపి 3 స్థానాలకు పరిమితమయ్యాయి. ఈనెల 16న జరిగే ఎన్నికల్లో ఈ మునిసిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ పార్టీ దక్కించుకోనుంది. మున్సిపాలిటీ చైర్మన్ గా పావుశెట్టి సునీల్ కుమార్ ఎన్నికయ్యే అవకాశం ఉంది.

వార్డువారీ ఫలితాలు

1వ వార్డు – వెంకట స్వామి దుబాసి (బిఆర్ఎస్)
2వ వార్డు – శ్యామల (బిఆర్ఎస్)
3వ వార్డు – పోరండ్ల మౌనిక (కాంగ్రెస్)
4వ వార్డు – ఏకు దివ్య (కాంగ్రెస్)
5వ వార్డు – గొడుగు రజిత (బిఆర్ఎస్)
6వ వార్డు – రాణి తుమ్మల (బిఆర్ఎస్)
7వ వార్డు – సునీల్ కుమార్ పావుశెట్టి (కాంగ్రెస్)
8వ వార్డు – నల్లెల కుమార్ (కాంగ్రెస్)
9వ వార్డు – బెజ్జంకి పూర్ణాచారి (బిజెపి)
10వ వార్డు – లావణ్య పసుల (కాంగ్రెస్)
11వ వార్డు – గుడెల్లి సాధన్ కుమార్ (కాంగ్రెస్)
12వ వార్డు – ఆకుల లావణ్య (బిజెపి)
13వ వార్డు – మాధవి లత (కాంగ్రెస్)
14వ వార్డు – పడిదల దీప్తి (బిఆర్ఎస్)
15వ వార్డు – విజయ్ కుమార్ (బిజెపి)
16వ వార్డు – బండి శ్రీదర్ (కాంగ్రెస్)
17వ వార్డు – బొచ్చు సుభద్ర (కాంగ్రెస్)
18వ వార్డు – రేగూరి కరుణ (బిఆర్ఎస్)
19వ వార్డు – శ్రీనివాస్ కొయ్యడ (కాంగ్రెస్)
20వ వార్డు – పాలకుర్తి శ్రీనివాస్ (కాంగ్రెస్)
21వ వార్డు – సూదమల్ల రమేష్ (కాంగ్రెస్)
22వ వార్డు – అల్లే దశరథం (కాంగ్రెస్)

ఉత్కంఠ రేపిన 17వ వార్డు

పరకాల మున్సిపాలిటీ 17వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బొచ్చు సుభద్ర కేవలం ఒకే ఓటు తేడాతో బిఆర్ఎస్ అభ్యర్థి శనిగరం రజనీపై విజయం సాధించడం విశేషంగా నిలిచింది. ఈ ఫలితం స్థానికంగా తీవ్ర ఉత్కంఠ రేపింది.

మాజీ చైర్మన్‌కు ఎదురుదెబ్బ

మున్సిపల్ మాజీ చైర్మన్ మార్త రాజభద్రయ్య 11వ వార్డులో ఓటమి పాలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

బిఆర్ఎస్ అంచనాలకు భిన్నంగా ఫలితాలు

ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయం సాధిస్తుందని భావించిన ఆ పార్టీ నాయకులకు ఫలితాలు నిరాశ కలిగించాయి. మరోవైపు కాంగ్రెస్ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించి ప్రతి వార్డులో చురుకైన ప్రచారం నిర్వహించడంతో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది.
పరకాల మున్సిపల్‌పై కాంగ్రెస్ జెండా ఎగరవేయడంతో స్థానిక రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేచింది.

మహారాష్ట్రలో పెను విషాదం
మహారాష్ట్రలో పెను విషాదం
- విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం
- ఘోర విమాన ప్రమాదంలో అజిత్ సహా ఆరుగురు మృతి

అక్షరదర్బార్, ముంబై: మహారాష్ట్ర రాజకీయ ధృవతార, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (66) ఇకలేరు. నేడు (బుధవారం) ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందారు. తన సొంత నియోజకవర్గమైన బారామతిలో ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా సాంకేతిక లోపంతో ఆయన ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
- ఘటన వివరాలు
ముంబై నుంచి బారామతికి బయలుదేరిన చార్టర్డ్ ఫ్లైట్, ల్యాండింగ్‌కు మరికొద్ది నిమిషాల ముందు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి రన్‌వే సమీపంలో కుప్పకూలింది. విమానం భూమిని ఢీకొన్న వెంటనే మంటలు చెలరేగడంతో పరిస్థితి భీభత్సంగా మారింది. విమానంలో ఉన్న అజిత్ పవార్‌తో పాటు మరో ముగ్గురు సిబ్బంది కూడా ఈ ఘటనలో మరణించినట్లు ప్రాథమిక సమాచారం.
- ఆరుసార్లు డిప్యూటీ సీఎంగా రికార్డు
అజిత్ పవార్ మరణం మహారాష్ట్రకు తీరని లోటు. రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత చతురత కలిగిన నాయకుడిగా ఆయనకు పేరుంది. మహారాష్ట్ర చరిత్రలో 6 సార్లు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఏకైక నేత ఆయనే. ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎంతో పాటు రాష్ట్ర ఆర్థిక మంత్రిగా, ఎన్‌సీపీ (NCP) అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బారామతిని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడంలో ఆయన కృషి అనన్యసామాన్యం.
- విషాదంలో రాష్ట్రం
అజిత్ పవార్ మరణవార్త వినగానే మహారాష్ట్ర ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే, కేంద్ర మంత్రులు మరియు పలువురు ప్రముఖులు ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బారామతిలో వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసివేసి నివాళులర్పిస్తున్నారు.

నెలాఖరులోగా 'స్థానిక' షెడ్యూల్
అక్షరదర్బార్, ఖమ్మం:

ఖమ్మం జిల్లా కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని... ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ,  కూసుమంచి మండలం, తిరుమలాయపాలెం మండలం, నేలకొండపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి  ఈరోజు సమావేశం... ఒక్కో మండలం వారీగా సమావేశం నిర్వహించిన మంత్రి.... ఈ సందర్భంగా మంత్రి కామెంట్స్

- ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్

- రేపటి కేబినెట్ సమావేశంలో చర్చించక ఎన్నికల తేదీ పై స్పష్టత ఇస్తాం

- తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు

- అవి పూర్తయిన వెంటనే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు

- ఆయా గ్రామాల్లో నాయకుల మధ్య సఖ్యత ఉండాలి

- నాయకులు ఎవరైనా ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి

- ఎన్నికలకు రావడానికి 15రోజుల గడువు మాత్రమే ఉంది కాబట్టి.... మీ మీ గ్రామాల్లో చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుని ఎన్నికలకు సిద్ధం అవ్వండి

- రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్న అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుంది.

- ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రజల దరిచేర్చడం జరిగింది.

- రాబోవు వారం రోజుల్లోనే అర్హులైన రైతు సోదరులందరికీ గుంట మొదలుకోని ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాల వరకు  రైతు భరోసా, సన్నాలకు రైతు బోనస్ వారి వారి బ్యాంకు ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది.

-  సంక్షేమ పథకాల ఆవశ్యకతను ఆయా గ్రామాల్లో ఉన్న ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక నాయకులదే

- మీ మీ గ్రామాల్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించుకోవడమే కాదు...  వాటి నిర్మాణం పూర్తి చేయించే బాధ్యత కూడా మీరే చూసుకోవాలి

తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు బిగ్ షాక్‌.. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ స‌స్పెన్ష‌న్‌
అక్ష‌ర‌ద‌ర్బార్‌, హైద‌రాబాద్ : ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. తీన్మార్ మ‌ల్ల‌న్న‌ను స‌స్పెండ్ చేస్తూ పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఫిబ్ర‌వ‌రి 5న తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు క‌మిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ వ్య‌తిరేక చ‌ర్య‌ల‌పై మ‌ల్ల‌న్న‌ను క‌మిటీ వివ‌ర‌ణ కోరింది. ఫిబ్ర‌వ‌రి 12వ తేదీలోపు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని మ‌ల్ల‌న్న‌కు క‌మిటీ గ‌డువు ఇచ్చింది. వివ‌ర‌ణ ఇవ్వ‌క‌పోవ‌డంతో తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. వ‌రంగ‌ల్‌-ఖ‌మ్మం-న‌ల్ల‌గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మ‌ల్ల‌న్న ఇటీవ‌ల కాంగ్రెస్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్సీ మల్లన్న కొంతకాలంగా వాయిస్ వినిపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. కులగణన నివేదికను బహిరంగంగా చించివేశారు. అలాగే ఇతర కులాలపై కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. వరంగల్‌లో జరిగిన బీసీ సభలో ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న తీవ్ర పదజాలంతో రెడ్డి కులాన్ని దూషించడంపై పీసీసీకి ఫిర్యాదులు అందాయి. దీంతో మల్లన్న వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపింది.  ఈ నేపథ్యంలోనే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులకు తీన్మార్ మల్లన్న స్పందించకపోవడంతో ఆయనను పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.

బీసీల లెక్క తేలింది.. మొత్తం జ‌నాభాలో స‌గానికిపైగా వీళ్లే.. ఎంత శాతం అంటే ?
కేబినెట్ స‌బ్ క‌మిటీకి నివేదిక అంద‌జేత‌

ఈనెల 5న రాష్ట్ర కేబినెట్ భేటీ

అదేరోజు అసెంబ్లీ ప్ర‌త్యేక‌ స‌మావేశంలో ఆమోద ముద్ర‌

అక్ష‌ర‌ద‌ర్బార్‌, హైద‌రాబాద్‌: రాష్ట్రంలో బీసీల లెక్క తేలింది. మొత్తం జనాభాలో బీసీలు సగానికి పైగా ఉన్నారు. వీరు 55.85 శాతం ఉన్నారని ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో తేలింది. దీంతోపాటు ఎస్సీలు, ఎస్టీలు, ఇతర కులాలకు సంబంధించిన లెక్కలను అధికారులు తేల్చారు. 1500 పేజీలతో సర్వేకు సంబంధించిన వివరాలతో నివేదికను రూపొందించారు. ఈమేర‌కు సమగ్ర కుల సర్వే వివరాల నివేదికను ఆదివారం మధ్యాహ్నం మంత్రివర్గ ఉపసంఘానికి అధికారులు అందజేశారు. కేబినెట్ స‌బ్ క‌మిటీ చైర్మ‌న్ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న సచివాల‌యంలో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ భేటీలో రాష్ట్ర ప్లానింగ్ క‌మిష‌న్ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ సందీప్ సుల్తానియా బృందం కేబినెట్ స‌బ్ క‌మిటీకి కుల గ‌ణ‌న నివేదికను అంద‌జేసింది. కాగా, ఈనెల 5న కేబినెట్ ముందుకు కుల గ‌ణ‌న నివేదిక రానుంది. మంత్రివ‌ర్గ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై చర్చించి, నిర్ణయం తీసుకోనున్నారు. అదే రోజు మధ్యాహ్నం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి, బీసీల రిజర్వేషన్లపై తీర్మానం చేసి.. కేంద్రానికి పంపనున్నారు.

పరువు నష్టం దావా వేస్తా..
కొన్ని దొంగ యూట్యూబ్ ఛానెల్స్ బురద జల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి

కారకులను శిక్షించాలని ముఖ్యమంత్రికి లేఖ రాశా..

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

అక్ష‌ర‌ద‌ర్బార్‌, హనుమకొండ: కొన్ని దొంగ యూట్యూబ్ ఛానెల్స్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మండిప‌డ్డారు. కాంగ్రెస్ పార్టీలోని కొందరు అసమ్మతి ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం అవుతోందని, వారిపై పరువు నష్టం దావా వేస్తానని అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఇంటికి వెళ్లినట్టు జ‌రుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ముఖ్యమంత్రికి, మంత్రులపై అసమ్మతిగా ఉన్నామని నా ప్రమేయం లేకుండా ఫొటోతో ప్రచురించిన తీరును ఖండిస్తున్నానన్నారు. దీని వెనకాల ఉన్నవాళ్లను తప్పకుండా శిక్షించాల్సిందేనన్నారు. ఓ పార్టీ నాయకులు, వారు సంపాదించిన అక్రమ సంపాదనలో కొన్ని కోట్ల రూపాయలతో యూట్యూబ్ ఛానెల్స్ పెట్టి జీతాల రూపంలో ఇస్తూ ప్రభుత్వంపై విషం చల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. కోడిగుడ్డు పై ఈకలు పీకే చర్యలను ఇప్పటికైనా మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు సహచర ఎమ్మెల్యేలు కలుసుకోవడంలో తప్పేముందని, వారేమైన బీఆర్ఎస్, బీజేపీ నేతల ఇంటికి వెళ్లారా అని ప్రశ్నించారు. దీన్ని భూతద్దంలో పెట్టి చూపే ప్రయత్నాలు చేస్తున్నారని. ఇలాంటి విషయాలపై సమగ్ర విచారణ జరిగిపి కారకులను శిక్షించాలని ముఖ్యమంత్రికి లేఖ రాశానన్నారు. ముఖ్యంగా ఆధారాలు లేకుండా చూపించిన కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ పై కోర్టు ద్వారా పరువునష్టం దావాలు వేస్తున్నానని నాయిని స్పష్టం చేశారు.

కొడితే మాములుగా ఉండదు.. రేవంత్ స‌ర్కార్‌కు కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్‌
నమ్మి ఓటేస్తే మంచి గుణపాఠం లభించింది

గంభీరంగా, మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నా..

ఇక లాభంలేదు.. ప్రత్యక్ష పోరాటాలే..

ఫిబ్రవరి చివరిలో భారీ బహిరంగ సభ

అక్ష‌ర‌ద‌ర్బార్‌, ఎర్ర‌వెల్లి : రేవంత్ స‌ర్కార్‌కు బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాను కొడితే మామూలుగా ఉండదని, గట్టిగా కొట్టడం తనకు ఉన్న అలవాటు అని చెప్పారు. తాను గంభీరంగా, మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నానని అన్నారు. ఫిబ్రవరి నెల చివరిలో తెలంగాణలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఇవాళ (శుక్రవారం) జహీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. కోహీర్ , జహీరాబాద్, ఝారసంఘం, మొగుడాంపల్లి మండలాలకు చెందిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. మన విజయం తెలంగాణ ప్రజల విజయం. రాబోయే రోజుల్లో విజయం మనదే. ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కండి అంటూ గులాబీ ద‌ళ‌ప‌తి శ్రేణుల‌కు పిలుపునిచ్చారు.

ప్రాజెక్టులు పడుకున్నాయి

సంగమేశ్వరం, బసవేశ్వరం, కాళేశ్వరం ఎండబెడుతున్నారు. భూములు ధరలు అమాంతం పడిపోతున్నాయి. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్ట్ టెండర్లను.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆపింది. కరోనాలో కూడా రైతుబంధు ఇచ్చి.. రైతుల కోసం మంచి పథకాలు తెస్తే అంతా గంగలో కలిసిపోయింది. గురుకుల హాస్టల్లో తిండి బాగా లేక.. పిల్లలు అనారోగ్యం బారినపడుతున్నారు. బీఆర్ఎస్ రాజకీయాల కోసం పుట్టింది కాదు. ఇక లాభంలేదు.. ప్రత్యక్ష పోరాటాలే. కాంగ్రెస్ పాలనలో రైతుబంధుకి రాంరాం. దళితబంధుకి జైభీమ్‌ చెప్పేశారు. తులం బంగారం పథకం గోవిందా. కాంగ్రెస్‌ పాలనపై అంతటా అసంతృప్తి. అన్నివర్గాలను ముంచిన పార్టీ కాంగ్రెస్. కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్లైంది. కాంగ్రెస్ పాలనపై దండయాత్ర చేద్దాం. తెలంగాణలో ఏ ఒక్క పథకం సరిగ్గా అమలుకావడం లేదు. ఓట్ల కోసం కాంగ్రెస్ ముస్లింలను వాడుకుంది.  అని రేవంత్ ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

దయహృదయాన్ని చాటిన ఎర్రబెల్లి
దయ హృదయాన్ని చాటుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

*అక్షర దర్బార్, తొర్రూరు:*

మహబూబాబాద్ జిల్లాకు వెళుతున్న క్రమంలో తొర్రూరు-పెద్దవంగర మార్గమధ్యలో పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామ శివారు లావుడ్యా తండాకు చెందిన లావుడ్యా ఇస్తారు చిన్న కూతురు ఫిడ్స్ వచ్చి రోడ్డుపై పడిపోగా, అది గమనించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన వాహనాన్ని ఆపి సపర్యాలు చేసి అంబులెన్స్ వాహనానికి ఫోన్ చేసి ఆదుకున్నారు‌.

దేశంలో బ‌లంగా కుల వివ‌క్ష‌..
అన్ని రంగాల్లోనూ వేళ్లూనుకొని ఉంది..
* తెలంగాణ‌లో కుల గ‌ణ‌న దేశానికే ఆద‌ర్శం
* నిజం బ‌య‌ట‌కు రావొద్ద‌నే వాళ్లే అడ్డుకుంటున్నారు
* ఏఐసీసీ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ ..
* హైద‌రాబాద్‌లో మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాలతో స‌మావేశం

అక్ష‌ర‌ద‌ర్బార్, హైద‌రాబాద్‌:  దేశంలో కుల వివ‌క్ష బ‌లంగా ఉంద‌ని, రాజ‌కీయ‌, న్యాయ వ్య‌వ‌స్థ‌లోనూ పాతుకుపోయింద‌ని ఏఐసీసీ (aicc) అగ్ర‌నేత రాహుల్‌గాంధీ (rahul gandhi) అన్నారు. అగ్ర‌కులాల‌కు ఎప్పుడూ కుల వివ‌క్ష క‌న‌ప‌డ‌ద‌ని, దేశం స‌మ‌గ్రంగా అభివృద్ధి చెందాలంటే కుల వివ‌క్ష రూపుమాపాల‌ని రాహుల్ అన్నారు. తెలంగాణ‌లో రేప‌టి నుంచి ప్రారంభంకానున్న కుల గ‌ణ‌న దేశానికే ఆద‌ర్శ‌మ‌ని అన్నారు. ఈ సంద‌ర్బంగా రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆయ‌న అభినందించారు. కుల గ‌ణ‌న ద్వారా ఎవ‌రికీ న‌ష్టం క‌ల‌గ‌కుండా చూడొచ్చ‌ని, అంద‌రికీ స‌మ‌న్యాయం జ‌రుగుతుంద‌ని అన్నారు. నిజం బ‌య‌ట‌కు రావొద్ద‌నే వాళ్లే కుల గ‌ణ‌న‌ను అడ్డుకుంటున్నార‌ని రాహుల్ విమ‌ర్శించారు.

కుల గ‌ణ‌న‌పై అభిప్రాయ సేక‌ర‌ణ‌

ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ మంగళవారం సాయంత్రం హైదరాబాద్ (hyderabad) చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కులగణనకు సంబంధించి మేధావులు, పౌరహక్కుల, ప్రజాసంఘాల నాయకులు, కుల సంఘాలతో బోయిన్‌ పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో నిర్వ‌హించిన సదస్సుకు హాజ‌ర‌య్యారు. మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ ఎన్నికల ప్రచారంలో తలమునకలుగా ఉన్న రాహుల్‌.. అంత బిజీ షెడ్యూల్‌లోనూ కులగణన కార్యక్రమానికి సమయం కేటాయించారు. మంగళవారం సాయంత్రం 4.45 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్‌.. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో బోయిన్‌పల్లిలోని గాంధీ నాలెడ్జ్‌ సెంటర్‌కు వెళ్లారు. టీ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ అధ్యక్షతన సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు సదస్సులో పాల్గొని నేతలతో చర్చించారు. కులగణనపై వారి అభిప్రాయాలు తీసుకున్నారు.

నిన్న కాంగ్రెస్.. నేడు బీఆర్ఎస్
నిన్న కాంగ్రెస్... నేడు బీఆర్ఎస్

అక్షర దర్బార్, పరకాల:
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాల్లో జంపు జిలానీలు ఎక్కువవుతున్నారు. తాము ఉన్న పార్టీని వీడి మరో పార్టీలో చేరడం, తర్వాత కొందరు ఆ పార్టీకి కూడా గుడ్ బై చెప్పి తిరిగి గతంలో తాము పని చేసిన పార్టీ గూటికి చేరటం జరుగుతుంది. పరకాల పట్టణంలో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10వ వార్డు యూత్ నాయకుడు తెల్లారే తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లాడు. బీఆర్ఎస్ నాయకులు గంలాబీ కండువా కప్పి స్వాగతించారు. ఒకరికి మించి ఒకరు ప్రలోభాలకు గురి చేస్తూ యువకులను పార్టీలు మారే విధంగా ప్రధాన రాజకీయ పార్టీల నేతలు కొందరు కృషి చేస్తున్నారని స్థానికులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. పార్టీ మారటం కండువాలను మార్చుకోవడానికి రాజకీయ నేతలు కొందరు ఆరాటపడుతుండటం చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.