అక్షర దర్బార్

ఖబడ్దార్‌ బీజేపీ నేతలారా..
ఖబడ్దార్‌ బీజేపీ నేతలారా..

పరకాల అభివృద్ధిపై చర్చకు సిద్ధమా!

పరకాల అభివృద్ధిలో చల్లా ధర్మారెడ్డి కృషి మరువలేనిది

అక్షరదర్బార్‌, పరకాల:
తెలంగాణలో ప్రజలకు పరిపాలనను చేరువ చేసేందుకే మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 33 జిల్లాలను ఏర్పాటు చేసి, జిల్లా కలెక్టరేట్లు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ద్వారా మెరుగైన సేవలు అందించారని బీఆర్‌ఎస్‌ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం పరకాల పట్టణంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో వారు మాట్లాడుతూ.. గతంలో జిల్లా కేంద్రాలకు వెళ్లేందుకు ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను తగ్గించేందుకు కొత్త జిల్లాల ఏర్పాటు దోహదపడిందన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ సేవలకు కృతజ్ఞతగా జిల్లా కేంద్రాల్లో ఆయన చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించినట్లు తెలిపారు.

పరకాల అభివృద్ధిలో చల్లా కృషి

పరకాల నియోజకవర్గ అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విశేష కృషి చేశారని బీఆర్‌ఎస్‌ నాయకులు అన్నారు. రహదారుల నిర్మాణం, ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు, వైద్య సదుపాయాల అభివృద్ధి వంటి పలు కార్యక్రమాల ద్వారా ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేశారని పేర్కొన్నారు. రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు, పరకాలలో 100 పడకల ఆసుపత్రి అందుబాటులోకి రావడం ప్రజలకు ఉపయోగకరమని తెలిపారు.

పరకాల అభివృద్ధిపై విమర్శలు చేసే ముందు గతంలో జరిగిన పనులను గుర్తించాలని బీజేపీ నాయకులకు బీఆర్‌ఎస్‌ నేతలు సూచించారు. రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా ప్రజలకు చేసిన అభివృద్ధి పనులపై చర్చించాలని అన్నారు. పరకాల నియోజకవర్గంలో చల్లా ధర్మారెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందించిన సేవలపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
కేసీఆర్‌ నాయకత్వంలో అమలైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గుర్తిస్తున్నారని, పరకాల నియోజకవర్గ అభివృద్ధికి బీఆర్‌ఎస్‌ నిరంతరం కృషి చేస్తుందని నాయకులు తెలిపారు. ప్రజలకు చేసిన అభివృద్ధే తమ బలమని, పరకాల అభివృద్ధే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

aksharadarbar-11-10-2026

aksharadarbar-10-10-2026

రామప్పను రక్షించుకుందాం
రామప్పను రక్షించుకుందాం

- సింగరేణి ఓపెన్ కాస్ట్ తో చారిత్రక రామప్పకు ముప్పు
- కేవలం ఐదు కిమీ దూరంలో 300 మీటర్ల లోతున తవ్వకాలు
- భూగర్భ చీలికలతో రామప్ప సరస్సు నీరు లీకయ్యే ప్రమాదం
- సరస్సు కట్ట తెగితే దిగువ ప్రాంతాలకు పెను ముప్పు
- పునాదిలో ఇసుక కొట్టుకుపోతే ఆలయ స్థిరత్వానికి దెబ్బ
- యునెస్కో గుర్తింపుపై కూడా ప్రభావం పడే అవకాశం
- వినాశకర ఓసీ ప్రతిపాదనపై స్పష్టమైన శాస్త్రీయ అధ్యయనం చేయాలి
- ఓపెన్ కాస్ట్ తవ్వకాల ప్రతిపాదనను నిలిపివేయాలి
- డిజిటల్ మీడియా ప్రతినిధుల చిట్ చాట్ లో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ సభ్యుడు ప్రొఫెసర్ ఎం పాండురంగారావు

అక్షరదర్బార్, హనుమకొండ:
కాకతీయుల అద్భుత శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలిచిన ప్రపంచ వారసత్వ సంపద రామప్ప ఆలయం, వేలాది ఎకరాలకు సాగునీరందించే చారిత్రక రామప్ప సరస్సు మనుగడకు తీవ్ర ముప్పు పొంచి ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సింగరేణి సంస్థ ప్రతిపాదించిన వెంకటాపురం ఓపెన్ కాస్ట్ బొగ్గు గని తవ్వకాల వల్ల ఈ చారిత్రక కట్టడాలకు, పరిసర పర్యావరణానికి భారీ విఘాతం కలిగే అవకాశం ఉందని కాకతీయ హెరిటేజ్ ట్రస్టు సభ్యుడు, వరంగల్ నిట్ విశ్రాంత ప్రొఫెసర్ ఎం పాండు రంగారావు తీవ్ర హెచ్చరిక చేశారు. తెలంగాణ డిజిటల్ మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ లో మాట్లాడిన ఆయన ఓపెన్ కాస్ట్ (ఓసీ) తవ్వకాలతో రామప్ప ప్రాంతానికి రానున్న ముప్పులను విశ్లేషించారు.
- భూగర్భ చీలికలతోనే అసలు ముప్పు!
కేవలం ఆలయానికి, గనికి మధ్య ఉన్న ఐదు కిలోమీటర్ల భౌతిక దూరాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకోకూడదని ప్రొఫెసర్ పాండు రంగారావు తెలిపారు. వెంకటాపురం వద్ద ప్రతిపాదించిన గని ప్రాంతానికి, రామప్ప సరస్సుకు మధ్య స్పష్టమైన భౌగోళిక సంబంధం ఉందని కేహెచ్‌టీ రూపొందించిన పటాలు స్పష్టం చేస్తున్నాయి. భూమి పొరల్లో ఉన్న ప్రధాన, ఉప భ్రంశాలు, పగుళ్లు గని తవ్వకాల బ్లాస్టింగ్‌ల వల్ల క్రియాశీలమైతే భూగర్భ జలాల ప్రవాహంలో ప్రమాదకర మార్పులు చోటుచేసుకుంటాయని ఆయన వివరించారు.
- 300 మీటర్ల లోతుల్లో తవ్వకాలు.. సరస్సు కట్టకు లీకేజీ ప్రమాదం!
ఈ ప్రాంతం ప్రాణహిత-గోదావరి గ్రాబెన్ బేసిన్‌లో భాగంగా ఉండి, ఇసుకరాయి, షేల్, కంకర పొరలతో కూడి ఉంటుంది. సుమారు 300 మీటర్ల లోతు వరకు ఓసీ తవ్వకాలు జరిపితే భూగర్భ జలాల పీడనంలో తీవ్ర వ్యత్యాసాలు వస్తాయి. పీడనం తగ్గడం వల్ల 3 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న రామప్ప సరస్సు నీరు భూగర్భ చీలికల ద్వారా ఓసీ వైపు లీకయ్యే ప్రమాదం ఉంది. కొండలను కలుపుతూ నిర్మించిన ఈ మట్టి కట్టకు నీటి చొరబాటును నిరోధించే 'కట్ ఆఫ్ ట్రెంచ్' లేకపోవడం వల్ల, ప్రవాహ మార్గాలు మారితే కట్ట స్థిరత్వం దెబ్బతిని దిగువ ప్రాంతాల ప్రజలు, పంటలు, ఆస్తులకు ముప్పు వాటిల్లుతుంది.
- ‘పైపింగ్ ఫినామినా’తో ఆలయ పునాదులు గుల్ల!
కాకతీయుల ఇంజినీరింగ్ అద్భుతమైన ఇసుక పెట్టె (సాండ్ బాక్స్) పునాది పద్ధతికి భూగర్భ జలాల మార్పులు ప్రమాదకరంగా మారవచ్చు. జల ప్రవాహాల్లో మార్పుల వల్ల పునాదిలోని ఇసుక, మట్టి రేణువులు కొట్టుకుపోయి అంతర్గత ఖాళీలు ఏర్పడే (‘పైపింగ్ ఫినామినా’) ప్రమాదం ఉందని జీఎస్‌ఐ నివేదికల ఆధారంగా ఆయన స్పష్టం చేశారు. ఆలయంలో ఇప్పటికే రంగమండపం దూలాలకు ఉన్న పగుళ్లు, అసమాన కూర్చువేతల నేపథ్యంలో పేలుళ్ల వల్ల వచ్చే ధ్వని, ప్రకంపనలు పునాది స్థిరత్వాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది.
- జీఎస్‌ఐ నివేదికను సమగ్రంగా పరిశీలించాలి
2023 జూన్ 30 నాటి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) నివేదికలోని 21, 22 పేజీల్లో ఉన్న కీలక వివరాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రొఫెసర్ విజ్ఞప్తి చేశారు. సరస్సు నీటిమట్టం, భూగర్భ జలాల కదలికలు, హైడ్రాలిక్ గ్రేడియంట్‌లో వచ్చే మార్పులు గని ప్రాంతం వరకు విస్తరిస్తాయి. ఈ ఆధారాలను విస్మరించి గని తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం శతాబ్దాల చరిత్రను ముప్పులోకి నెట్టడమే అవుతుంది.
- పేలుళ్ల ప్రకంపనలు.. దీర్ఘకాలిక వినాశనం
ఓపెన్ కాస్ట్ గనిలో పదేపదే నిర్వహించే పేలుళ్ల వల్ల దీర్ఘకాలంలో ఆలయ రాతి నిర్మాణాలు, దూలాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. స్వల్ప ప్రకంపనలే కదా అని తేలిగ్గా తీసిపారేయకుండా నిపుణుల కమిటీతో ఆలయ ప్రస్తుత స్థితిని పూర్తిస్థాయిలో నమోదు చేసి, నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.
- 80 వేల ఎకరాల సాగు నీటికి గండి.. 20 గ్రామాలపై ప్రభావం
రామప్ప సరస్సు కేవలం పర్యాటక ప్రాంతమే కాదు, ఈ ప్రాంత రైతాంగానికి జీవనాధారం. ఈ సరస్సు ద్వారా దాదాపు 30 వేల ఎకరాలకు ప్రత్యక్షంగా, మరో 80 వేల ఎకరాలకు పరోక్షంగా సాగునీరు అందుతోంది. సరస్సు నీటి మట్టం తగ్గినా లేదా కట్ట దెబ్బతిన్నా దాదాపు 20 గ్రామాల ప్రజల జీవనోపాధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
- యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపునకు ప్రమాదం
2021 జులై 25న లభించిన యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు కాకతీయుల ప్రతిభను ప్రపంచ పటంలో నిలిపింది. కేవలం ఆలయాన్ని మాత్రమే కాకుండా దాని చుట్టూ ఉన్న పర్యావరణం, సరస్సు భద్రతను కాపాడడం ప్రభుత్వం బాధ్యత. గని తవ్వకాల వల్ల ఆలయ నిర్మాణ భద్రతకు ముప్పు ఏర్పడితే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుపై ప్రభావం పడే ప్రమాదం ఉంది.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు.. గని పునరాలోచనకు డిమాండ్
సింగరేణి వెంకటాపురం గని ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని కోరుతూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డికి (2025 జనవరి 27న), సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతికి (2026 అక్టోబరు 3న) లేఖలు రాసినట్లు ప్రొఫెసర్ వెల్లడించారు. ఎన్‌వోసీ, పర్యావరణ అనుమతులు, జీఎస్‌ఐ నివేదికలపై స్పష్టత వచ్చే వరకు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, స్వతంత్ర నిపుణుల అధ్యయనం పూర్తయ్యే వరకు ఓసీ గని ప్రతిపాదనను నిలిపివేయాలని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

aksharadarbar-09-10-2026

aksharadarbar-08-10-2026

aksharadarbar-07-10-2026

aksharadarbar-06-10-2026

అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల ఉక్కుపాదం
అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల ఉక్కుపాదం

నడికూడ గుట్టపై నిర్మాణాల కూల్చివేత

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు
రెవెన్యూ అధికారులు

అక్షరదర్బార్,నడికూడ:
నడికూడ మండలంలోని నడికూడ గుట్టపై ప్రభుత్వ భూమిలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు సోమవారం కూల్చివేశారు. తహసిల్దార్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు  ఈ కూల్చివేత చేపట్టగా, గ్రామపంచాయతీ సిబ్బంది సహకరించారు.
ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన వారు స్వచ్ఛందంగా అక్కడి నుంచి తొలగిపోవాలని సూచించారు. లేనిపక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

aksharadarbar-04-10-2026

వృద్ధురాలి హత్య.. దోపిడీ కేసులో నిందితుడి అరెస్ట్
వృద్ధురాలి హత్య.. దోపిడీ కేసులో నిందితుడి అరెస్ట్

పైకప్పు ద్వారా ఇంట్లోకి ప్రవేశం..

కేకలు వేయడంతో ఇనుపరాడ్‌తో దాడి

రెండు బంగారు పుస్తెలు, రక్తపు మరకల దుస్తులు స్వాధీనం

అక్షరదర్బార్,పరకాల:
ఆకులవాడలో వృద్ధ మహిళలపై దాడి చేసి ఒకరిని హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ఘటనకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేరెళ్ల రమేష్‌(38)ను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రెండు బంగారు పుస్తెలు, హత్యకు ఉపయోగించిన ఇనుపరాడ్‌, రక్తపు మరకలున్న దుస్తులను స్వాధీనం చేసుకున్నారు.
పరకాల ఏసీపీ సతీష్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఆకులవాడలో వృద్ధ మహిళలపై దాడి, హత్యకు సంబంధించి పరకాల పోలీస్‌స్టేషన్‌లో క్రైం నంబర్‌ 291/2026 కింద బీఎన్‌ఎస్‌ 103(1), 109(1), 329(4) సెక్షన్లతో కేసు నమోదైంది. ఇన్‌స్పెక్టర్‌ ఏ.ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులను చూసి పరుగులు..

శనివారం వెల్లంపల్లి రోడ్డులోని మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లే మార్గంలో పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. పోలీసులను గమనించి పారిపోయేందుకు ప్రయత్నించడంతో అతడిని పట్టుకుని విచారించారు. అతడు రాంనగర్‌కు చెందిన నేరెళ్ల రమేష్‌(38), సదయ్య కుమారుడు, సెంట్రింగ్‌ కార్మికుడిగా గుర్తించారు.

కేకలు వేయడంతో ఇనుపరాడ్‌తో దాడి..

సెప్టెంబరు 30 అర్ధరాత్రి ఆకులవాడలో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధ మహిళల ఇంట్లోకి పైకప్పు ద్వారా ప్రవేశించినట్లు నిందితుడు విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. తనను చూసి మహిళలు కేకలు వేయడంతో పక్కనే ఉన్న ఇనుపరాడ్‌తో దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో కోడెల సుగుణ మృతి చెందగా.. కోడెల లసుమక్క తీవ్రంగా గాయపడ్డారు.
అనంతరం వారి వద్ద ఉన్న రెండు బంగారు పుస్తెలు, రూ.1,000 నగదును తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. మద్యానికి బానిసై, భార్య తనను విడిచి వెళ్లడంతో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు నిందితుడు చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు.

బంగారు పుస్తెలు.. రక్తపు మరకల దుస్తులు స్వాధీనం

నిందితుడి నుంచి సుమారు 2 గ్రాముల బరువున్న రెండు బంగారు పుస్తెలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.30 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితుడు చూపించిన ప్రదేశంలో హత్యకు ఉపయోగించిన ఇనుపరాడ్‌తో పాటు రక్తపు మరకలున్న ఆకుపచ్చ షర్టు, నీలం రంగు జీన్స్‌ ప్యాంటును స్వాధీనం చేసుకున్నారు. నేను సైతం లో భాగంగా ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని ఏసిపి పేర్కొన్నారు.
కేసును చాకచక్యంగా ఛేదించిన ఎస్‌హెచ్‌ఓ ప్రవీణ్‌కుమార్‌, ఎస్సైలు పవన్‌, రఘుపతిని ఏసీపీ సతీష్‌బాబు అభినందించారు. వారికి తగిన రివార్డు అందించనున్నట్లు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ పేర్కొన్నారు.

సోషల్‌ మీడియా మాట నమ్మి మందులు వాడొద్దు
సోషల్‌ మీడియా మాట నమ్మి మందులు వాడొద్దు

రసాయన మందులతో పంటలకు నష్టం

మాజీ తెలంగాణ రైతు రుణ విమోచన కమిటీ చైర్మన్‌ నాగూర్ల

అక్షరదర్బార్,పరకాల:
పంటల్లో అధిక దిగుబడుల కోసం విషపూరిత రసాయన మందులను అధికంగా వినియోగించి రైతులు నష్టపోవద్దని మాజీ తెలంగాణ రైతు రుణ విమోచన కమిటీ చైర్మన్‌ నాగూర్ల వెంకటేశ్వరరావు సూచించారు. శనివారం పరకాల పట్టణంలోని స్వర్ణ గార్డెన్లో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న వివిధ రకాల మందులను విచక్షణ లేకుండా వినియోగించడం వల్ల రైతులు నష్టపోతున్నారని తెలిపారు. అధిక దిగుబడులపై మోజుతో పంటలకు ఎక్కువ మొత్తంలో రసాయన మందులు వాడొద్దని సూచించారు. లాభాల కంటే నాణ్యమైన పంటల ఉత్పత్తికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
భూమి సారాన్ని కాపాడకుండా అధిక దిగుబడులు సాధించడం సాధ్యం కాదన్నారు. నేల సారాన్ని పెంచేందుకు సేంద్రియ ఎరువులను వినియోగించడంతో పాటు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులనే ఉపయోగించాలని సూచించారు. సదస్సులో పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాలకు చెందిన రైతులతో పాటు పలువురు శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

aksharadarbar-03-10-2026

గురుకులంలో ‘పాము’ కలకలం!
గురుకులంలో ‘పాము’ కలకలం!

పాము నుండి తప్పించుకునే క్రమంలో గాయపడ్డ ఐదో తరగతి విద్యార్థిని..

పాములు, కోతుల సంచారంపై తల్లిదండ్రుల ఆందోళన

అక్షరదర్బార్, ఇనుగుర్తి: ఇనుగుర్తి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో శుక్రవారం రాత్రి పాము కలకలం రేపింది. పాము నుంచి తప్పించుకునే క్రమంలో ఐదో తరగతి విద్యార్థిని ఎన్‌.అక్షయ కాలు బండరాయికి తగిలి స్వల్పంగా గాయపడింది. పాము కాటు వేసిందనే భయంతో విద్యార్థినులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వైద్య సిబ్బంది పరీక్షించి పాము కాటు కాలేదని నిర్ధారించడంతో ఊపిరి పీల్చుకున్నారు.

పారిశుధ్య లోపాలపై ఆగ్రహం

పాఠశాల ఆవరణలో పిచ్చిమొక్కలు, కంపచెట్లు ఏపుగా పెరగడంతో పాములు, కోతులు సంచరిస్తున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వెంటనే కంపచెట్లను తొలగించి, తగిన విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు సోలార్‌ ఫెన్సింగ్‌, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి విద్యార్థినుల భద్రతకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఊరి మధ్యలో రైస్‌మిల్లు వద్దంటూ రోడ్డెక్కిన ప్రజలు!
ఊరి మధ్యలో రైస్‌మిల్లు వద్దంటూ రోడ్డెక్కిన ప్రజలు!

ఆవాసాల మధ్య నిర్మాణంపై తీవ్ర అభ్యంతరం..

పనులు నిలిపివేయాలంటూ గ్రామసభలో వినతి..
చిన్ననాగారం–ఎర్రబెల్లిగూడెం రహదారిపై బైఠాయింపు

అక్షరదర్బార్, ఇనుగుర్తి: ఆవాస ప్రాంతాలకు ఆనుకుని ప్రైవేట్‌ రైస్‌ మిల్లు నిర్మాణం చేపట్టడంపై చిన్ననాగారం గ్రామస్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరుగుతోందని ఆరోపిస్తూ శుక్రవారం గ్రామసభలో అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం నిర్మాణ స్థలం వద్ద, చిన్ననాగారం–ఎర్రబెల్లిగూడెం ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.రైస్‌ మిల్లు ఏర్పాటుతో దుమ్ము, తవుడు, బూడిద తదితర కాలుష్యంతో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. భారీ యంత్రాల శబ్దంతో ప్రజల ప్రశాంతతకు భంగం కలుగుతుందని, పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. మిల్లు నిర్వహణ కోసం వలస కార్మికులు పెద్ద సంఖ్యలో వస్తే సామాజిక, శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం తగదన్నారు. జిల్లా కలెక్టర్‌, కాలుష్య నియంత్రణ మండలి, రెవెన్యూ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని, నిర్మాణానికి సంబంధించిన అనుమతులను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పనులు నిలిపివేయకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేసి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
నిరసనలో గుండాల లక్ష్మారెడ్డి, బైరు రమేష్, ఉడుత సోమయ్య, బొబ్బల దేవరాజు, గుగులోతు లక్ష్మి, మాదగాని ఉమేష్, వోడపల్లి వెంకన్న, ఆలకుంట్ల సోమయ్య, బత్తిని ఐలయ్య, మునిగంటి రమేష్, గుండాల దర్గా స్వామి, నిడిగంటి బిక్షం, గుగులోతు జానీ, మద్దబోయిన సాంబరాజుతో పాటు గ్రామ రైతులు, మహిళలు పాల్గొన్నారు.

తలొంచి బతకడం తెలియదు
తలొంచి బతకడం తెలియదు
- మ్యాజిక్ వేదికే నాకు మాట.. నాయకత్వం నేర్పింది
- నెత్తురొడిన వరంగల్ ఉద్యమానికి దారి చూపింది
- టిఆర్ఎస్ పార్టీ పుట్టినరోజు గులాబీ కండువా కప్పుకున్న
- ఉద్యమంలో ముందున్నా.. అధికారానికి దూరమయ్యా
- కుట్రలతోనే రాజకీయ అవకాశాలకు దూరం
- న్యాయస్థానంలో వివక్షను ఢీకొని పేదలకు అండగా నిలిచా
- ఉద్యమ కేసుల్లో పైసా తీసుకోకుండా వాదించినా దక్కని గుర్తింపు
- వరంగల్ చారిత్రక, అస్తిత్వాన్ని, పోరాట పటిమను దెబ్బతీశారు
- ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు
- ఉద్యమకారులకు రూ.10 వేల కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
- డిజిటల్ మీడియా ప్రతినిధుల చిట్ చాట్ లో తెలంగాణ ఉద్యమకారుల ‘ఐక్యవేదిక’ రాష్ట్ర చైర్మన్ గుడిమళ్ళ రవికుమార్

అక్షరదర్బార్, హనుమకొండ

"తలవంచి బతకడం నాకు తెలియదు. సమస్యలను ప్రశ్నిస్తూ, ఎదురిస్తూనే నా జీవితం సాగింది. తెలంగాణ ఉద్యమానికి కరదీపికగా పనిచేసిన నాలాంటి ఉద్యమకారులు, స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలో భాగస్వామ్యం కావడానికి ఎందుకు పనికిరాకుండా పోయారు?" అని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ గుడిమళ్ళ రవికుమార్ ప్రశ్నించారు. తెలంగాణ డిజిటల్ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన తన బాల్యం, సామాజిక నేపథ్యం, న్యాయవాద వృత్తితో పాటు తెలంగాణ ఉద్యమంలో ఎదుర్కొన్న అనుభవాలను పంచుకున్నారు.
- మ్యాజిక్ వేదికే నా తొలి పాఠశాల
వరంగల్‌లో పుట్టి రంగంపేటలో పెరిగిన గుడిమళ్ళ రవికుమార్ తల్లి గుడిమళ్ళ పుష్పలీల ఎంజీఎంలో నర్సుగా, తండ్రి రాఘవేందర్‌రావు ఫార్మసిస్ట్‌గా పనిచేశారు. కులాంతర వివాహం చేసుకున్న తల్లిదండ్రుల వద్ద పెరగడం వల్ల చిన్నతనం నుంచే సామాజిక అసమానతలపై అవగాహన పెరిగింది. ప్రముఖ మెజీషియన్ ఉమాపతి వద్ద మ్యాజిక్ నేర్చుకుని వందలాది ప్రదర్శనలు ఇచ్చారు. ఈ వేదికలే ఆయనలోని బిడియాన్ని పోగొట్టి, పదిమందిలో ధైర్యంగా మాట్లాడే శక్తిని, నాయకత్వ లక్షణాలను ఇచ్చాయి. 1982లో 'మూన్‌లైట్ యూత్' ద్వారా వ్యాయామశాల, 'నవచైతన్య అసోసియేషన్' ద్వారా కమ్యూనిటీ హాల్ నిర్మాణం, వరద బాధితులకు సాయం, మహిళా విద్యార్థినులకు రక్షణ వంటి కార్యక్రమాలు చేపట్టారు. మండల్ కమిషన్ పోరాటాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు.
- నెత్తురోడిన వరంగల్‌కు శాంతియుత ఉద్యమ బాట
1980–2000 మధ్య కాలంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలకొన్న ఎన్‌కౌంటర్లు, మందుపాతరలు, అమాయకుల మరణాలు తనను తీవ్రంగా కలచివేశాయని రవికుమార్ తెలిపారు. తెలంగాణ వెనుకబాటుతనమే ఈ హింసకు మూలమని గ్రహించి, ప్రత్యేక రాష్ట్ర సాధనే శాశ్వత పరిష్కారమని నమ్మారు. ప్రొఫెసర్ జయశంకర్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు, గాంధేయవాది భూపతి కృష్ణమూర్తి, ఆచార్య బి. జనార్ధన్‌రావు, ఆచార్య కూరపాటి వెంకటనారాయణ వంటి మహానీయులతో కలిసి వేదికలు పంచుకుంటూ ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతపై విస్తృత ప్రచారం చేశారు.
- కోర్టులోనూ పోరాటమే.. రూపాయి తీసుకోకుండా ఉద్యమ కేసులు
1995లో న్యాయవాద వృత్తిలోకి వచ్చిన రవికుమార్ కోర్టుల్లో ఉన్న వర్గ, కుల వివక్షను ఢీకొని నిలదొక్కుకున్నారు. 'మ్యాజిషియన్ రవికుమార్' నుంచి 'అడ్వకేట్ గుడిమళ్ళ రవికుమార్'గా గుర్తింపు తెచ్చుకున్నారు. పేదలకు, ఉద్యమకారులకు ఎలాంటి పారితోషికం తీసుకోకుండా కేసులను వాదించారు. 1998లో 'యువ న్యాయవాదుల సంఘం' ఏర్పాటు చేసి యువ లాయర్ల నైపుణ్యాభివృద్ధికి కృషి చేశారు.
- జలదృశ్యంలో గులాబీ అడుగు.. పల్లెపల్లెనా జెండా పండుగ
కొత్త రాజకీయ పార్టీ ఆవశ్యకతపై 1998–99లోనే ప్రొఫెసర్ జయశంకర్‌తో చర్చించిన రవికుమార్, 2001లో పార్టీ ఆవిర్భావ రోజే హైదరాబాద్‌లోని జలదృశ్యంలో ఏడుగురు న్యాయవాదులతో కలిసి తొలిసారిగా గులాబీ కండువా కప్పుకున్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులతో పాటు పలువురు ముఖ్య నేతలపై నమోదైన కేసులను రూపాయి ఆశించకుండా వాదించారు. యువజన విభాగం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా రాత్రింబవళ్లు పనిచేసి గ్రామీణ ప్రాంతాల్లో జెండాలు, గద్దెలు ఏర్పాటు చేశారు. ఆటోడ్రైవర్లను, పూల వర్తకులను యూనియన్లుగా సంఘటితం చేసి ఉద్యమంలోకి తీసుకెళ్లారు.
- కుట్రలతోనే దూరమైన ఎంపీ టికెట్
చట్ట పరిజ్ఞానం, వాగ్ధాటి, భాషా నైపుణ్యం కలిగిన రవికుమార్‌కు వరంగల్ ఎంపీ టికెట్ దాదాపు ఖరారైనప్పటికీ చివరకు దక్కకుండా పోయింది. తాను గెలిచి వస్తే తమ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది కలుగుతుందని భావించిన కొందరు స్వార్థ నేతలు, పార్టీ అధిష్ఠానానికి తప్పుడు నివేదికలు ఇచ్చి టికెట్ దక్కకుండా కుట్రలు చేశారని ఆరోపించారు. ఉద్యమంలో ప్రాణాలు, జీవితాలు పణంగా పెట్టిన వారికి స్వరాష్ట్రంలో తగిన ప్రాధాన్యం దక్కలేదని, తొమ్మిదేళ్ల పాలనలో ఉద్యమకారులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
- ఓరుగల్లు అస్తిత్వానికి విఘాతం
వరంగల్‌ను రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామన్న హామీలు నీటిమూటలుగానే మిగిలిపోయాయని రవికుమార్ విమర్శించారు. జిల్లాల విభజన వల్ల ఓరుగల్లు చారిత్రక అస్తిత్వం దెబ్బతిన్నదని, ప్రజాప్రతినిధులు అధిష్ఠానాల వద్ద విధేయత చూపడానికే ప్రాధాన్యమిస్తూ ప్రజల తరఫున ప్రశ్నించడం మరచిపోయారని మండిపడ్డారు.
- ఉద్యమకారుల సంక్షేమమే లక్ష్యం
ఉద్యమకారుల కుటుంబాల పరిస్థితిని తెలుసుకునేందుకు సెప్టెంబర్ 17న వరంగల్ అమరవీరుల స్తూపం వద్ద ప్రారంభించిన 4 రోజుల 'ఓదార్పు యాత్ర' ద్వారా 126 బాధిత కుటుంబాలను పరామర్శించినట్లు తెలిపారు. ఉద్యమంలో త్యాగాలు చేసిన వారి ఇళ్లలో నేటికీ సంతోషం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
- ఐక్యవేదిక ప్రధాన డిమాండ్లు
ప్రతి తెలంగాణ ఉద్యమకారుడికి 250 గజాల నివాస స్థలం కేటాయించాలి. ఉద్యమకారుల కోసం రూ.10,000 కోట్లతో సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. బాధిత ఉద్యమకారుల కుటుంబాల్లోని సభ్యులకు సముచిత ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. "ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి పదవులు పొందే రాజకీయాలకు నేను చాలా దూరం. ఉద్యమకారులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు, వారి హక్కుల సాధన కోసం తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మా పోరాటం ఆగదు" అని గుడిమళ్ళ రవికుమార్ స్పష్టం చేశారు.

చైర్మన్‌గా కొలుగూరి రాజేశ్వరరావు ప్రమాణ స్వీకారం.
కుంకుమేశ్వర ఆలయ అభివృద్ధికి కృషి

చైర్మన్‌గా కొలుగూరి రాజేశ్వరరావు ప్రమాణ స్వీకారం..

సేవా దృక్పథంతో పనిచేయాలి
ఎమ్మెల్యే రేవూరి

అక్షరదర్బార్,పరకాల:
పరకాల పట్టణంలోని కుంకుమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్‌గా కొలుగూరి రాజేశ్వరరావు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఆశీస్సులతో గతంలో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన సమయంలో దేవస్థానానికి సంబంధించిన 4.11 ఎకరాల భూమిని సాధించడంతో పాటు హద్దులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహా రుద్రయాగం, హిందూ సమ్మేళనం, కార్తీక మాస ఉత్సవాలను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించినట్లు పేర్కొన్నారు.
మరోసారి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో దేవస్థానం ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు, ఆదాయ వనరుల కోసం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం దిశగా కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే ఆశీస్సులు, కమిటీ సభ్యులు, భక్తుల సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.

ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ చైర్మన్ కొలుగూరి రాజేశ్వరరావుతో పాటు నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ చైర్మన్ పదవిని లాభాపేక్ష లేకుండా సేవా దృక్పథంతో నిర్వహించాలని సూచించారు. కమిటీ సభ్యుల గుణగణాలను పరిశీలించి, దేవుడి సేవ చేయగలరనే నమ్మకంతోనే బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. రాజేశ్వరరావుకు గతంలో చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఉందన్నారు.
మాజీ చైర్మన్ గందె వెంకటేశ్వర్లు కూడా ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, పార్టీలకు అతీతంగా ఆయనను మరోసారి చైర్మన్‌గా కొనసాగించాలని తాను కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మొలుగూరి భిక్షపతి సర్పంచ్‌గా ఉన్నప్పటి నుంచి ఆలయ భూమి కోసం ప్రయత్నించారని, తన హయాంలో భూమి రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
కుంకుమేశ్వర ఆలయ అభివృద్ధికి రూ.5 కోట్లతో చేపట్టే పనులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతిని కలిసి ఆలయ కుంభాభిషేకం నిర్వహించే విషయంపై చర్చించినట్లు చెప్పారు. కుంకుమేశ్వర స్వామి ఆశీస్సులతో పరకాల పట్టణ అభివృద్ధికి ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్, మున్సిపల్ సిబ్బంది, పుర ప్రముఖులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

aksharadarbar-02-10-2026

akshara Darbar special

aksharadarbar-01-10-2026

నా పనితీరే నా బలం
నా పనితీరే నా బలం

- భూపాలపల్లే నా కుటుంబం.. అభివృద్ధే నా శ్వాస!
- విద్యార్థి దశలోనే ఉద్యమాల బాట.. అకాడమిక్ ఇయర్ నష్టపోయినా వెనకడుగు వేయలే
- 1989లో పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన..
- 13 ఏళ్ల పాటు డీసీసీ అధ్యక్షుడిగా రికార్డ్ సేవలు
- రాజకీయాల్లో తడిగుడ్డతో గొంతు కోసే కుట్రలను ఎదుర్కొన్నా
- ఎమ్మెల్సీ గెలుపు నుంచి మంత్రి పదవి వరకు.. సొంత పార్టీలోనే కుట్రలు
- టీడీపీ నుంచి ఆఫర్ వచ్చిన వెళ్లలే.. నా సిద్ధాంతానికే కట్టుబడ్డ
- పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఎదుగుదల.. ఎంతో కష్టపడ్డ
- కేసీఆర్ తో ప్రత్యేక అనుబంధం.. సమస్యల పరిష్కారంలో ఆయన చొరవే వేరు
- భూపాలపల్లి రూపురేఖలు మార్చాను.. మెడికల్ కాలేజ్, ఆస్పత్రులు తెచ్చింది నేనే
- నాపై భూకబ్జా ఆరోపణలు కుట్రే.. అభివృద్ధి చేసినందుకు ఆరోపణలు
- కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో తీవ్ర అసహనం
- నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తా..‌ మోసాలను ప్రజలకు వివరిస్తా
- మహిళ రిజర్వేషన్ వస్తే బరిలో గండ్ర జ్యోతి
- గౌతమ్ ఎప్పుడు వచ్చినా రాజకీయాల్లోకి స్వాగతిస్తా.. భవిష్యత్తులో కేటీఆర్ టీమ్ లోనే!
- డిజిటల్ మీడియా ప్రతినిధుల చిట్ చాట్ లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

అక్షరదర్బార్, హనుమకొండ

రాజకీయాల్లో గెలుపోటములు సహజమే.. కానీ ప్రజల కోసం చేసిన పనులు, ఎదుర్కొన్న పోరాటాలే తన రాజకీయ ప్రస్థానానికి పునాది. తన రాజకీయ జీవితంలో ఎన్నో కుట్రలు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. తన పనితీరే తన ఎదుగుదలకు కారణమైందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గాన్ని కుటుంబంగా భావించి అభివృద్ధి కోసం పనిచేశాను. మళ్లీ ప్రజలు ఆశీర్వదిస్తే రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు. తెలంగాణ డిజిటల్‌ మీడియా ప్రతినిధుల చిట్‌చాట్‌లో గండ్ర వెంకటరమణారెడ్డి తన వ్యక్తిగత, రాజకీయ జీవితానికి సంబంధించిన ఆసక్తికర అంశాలను వెల్లడించారు. ఏమన్నారంటే ఆయన మాటల్లోనే..

- పరకాల గడ్డపై పుట్టి.. వ్యవసాయంతో అనుబంధం

నేను పరకాల గడ్డపై పుట్టాను. పరకాలలో రెండో తరగతి వరకు చదువుకున్న. హన్మకొండ సెయింట్‌ జోసఫ్‌ స్కూల్‌లో పదో తరగతి వరకు చదివి, హైదరాబాద్‌లో పాలిటెక్నిక్‌ పూర్తి చేశాను. చిన్నప్పటి నుంచే ఉద్యోగం చేయాలనే ఆలోచన నాకు లేదు. ఏదైనా అడ్వెంచర్‌ చేయాలనే ఆలోచన ఉండేది. ఆ దిశగానే నా అడుగులు పడ్డాయి. వ్యవసాయం అంటే చిన్నప్పటి నుంచే నాకు చాలా ఇష్టం. ఇప్పటికీ ఖాళీ సమయం దొరికితే పొలాల వద్దకు వెళ్తాను. వ్యవసాయ పనులన్నీ నాకు తెలుసు. మా కుటుంబానికి చిన్నప్పటి నుంచే భూములు ఉన్నాయి. అప్పట్లో కూలీలు మా ఇంటికి వచ్చి తిండికి అడిగితే జొన్నలు ఇచ్చేవాళ్లం. పని సీజన్‌లో వచ్చి కూలీ తీసుకోకుండా కూడా పనిచేసేవాళ్లు. అప్పట్లో ఆ నియత్‌ ఉండేది.

- పాలిటెక్నిక్‌లోనే ఉద్యమాల బాట

పాలిటెక్నిక్‌ చదువుతున్న సమయంలోనే విద్యార్థి నాయకుడిగా పనిచేశాను. పాలిటెక్నిక్‌ చదివిన విద్యార్థులకు బీటెక్‌ సెకండియర్‌లో అడ్మిషన్లు వచ్చేలా చేసిన పోరాటాలు మా ఉద్యమాల వల్లే జరిగాయి. ఆ ఉద్యమాల కారణంగా నేను అకాడమిక్‌ ఇయర్‌ లాస్‌ అయ్యాను. ‘ఊ అంటే ఉద్యమాలు చేస్తున్నావు’ అంటూ నన్ను ట్రాన్స్‌ఫర్‌ చేశారు. నేను చదువుకున్న కాలేజీలోనే దివంగత పీజేఆర్‌ కూడా చదువుకున్నారు. మా కాలేజీ ప్రిన్సిపాల్‌ నా దూకుడు చూసి.. ‘పీజేఆర్‌ మన కాలేజీలోనే చదువుకున్నాడు.. ఆయన లీడర్‌ అయ్యాడు.. నువ్వు కూడా లీడర్‌ అవుతావు. తొందరపడకు’ అని చెప్పేవారు. ఆ మాట ఇప్పటికీ గుర్తుంది. ఎన్టీఆర్‌ను సీఎం పదవి నుంచి తొలగించినప్పుడు అన్యాయం జరిగిందనే ఆలోచనతో బస్సు టైర్లలో గాలి తీశాం. ఇలా ఎన్నో ఉద్యమాలు చేశాం. అప్పట్లో చాలా దూకుడుగా ఉండేవాడిని. ఒకసారి హయగ్రీవాచారి దగ్గరకు వెళ్లినప్పుడు.. ‘నీ వయస్సు నా అనుభవమంతా లేదు.. ఇంత దురుసు ఎందుకు?’ అంటూ ఆయన కన్నెర్ర చేశారు.

- 1989 నుంచి పూర్తిస్థాయి రాజకీయాలు

1989 నుంచి పూర్తిస్థాయి నాయకుడిగా పనిచేశాను. యూత్‌ కాంగ్రెస్‌లో జిల్లా స్థాయిలో పనిచేశాను. ఆ రోజుల్లో నక్సల్స్‌ ప్రభావం ఎక్కువగా ఉండేది. పరకాలలో మా ఇల్లు రోడ్డుకు ఉండేది. రాజకీయాల్లో యాక్టివ్‌గా తిరుగుతుంటే నన్ను తీసుకెళ్లారు. మా ఇంటిని పేల్చేశారు. నాన్న రాజకీయాలు వద్దనేవారు. కానీ నా పట్టుదల, పోరాటం చూసి తర్వాత నాకు అండగా నిలిచారు. 1999లో అసెంబ్లీ టికెట్‌ కోసం ప్రయత్నించాను. కానీ రాలేదు. 2001లో ఉమ్మడి వరంగల్‌ జిల్లా డీసీసీ అధ్యక్షుడినయ్యాను. 13 ఏళ్ల పాటు సుదీర్ఘంగా, రికార్డు స్థాయిలో పనిచేశాను. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎంతో కష్టపడ్డాను. అప్పట్లో సోషల్‌ మీడియా ఎక్కడిది? టీవీలు, పేపర్లే ఉండేవి. రోజూ కార్యక్రమాలు చేస్తూ ప్రజల కోసం కొట్లాడేవాళ్లం. 2004లో ప్రభుత్వం రావడంలో కీలకంగా పనిచేశాను. 2014 వరకు డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగాను. ఆ సమయంలో నన్నెవరూ తీసేయలేదు. నేనే తప్పుకున్న. అప్పట్లో ఏ న్యూస్‌ చానల్‌ పెట్టినా నేను కనిపించేవాడిని. అంతగా కష్టపడ్డ.

- టీడీపీ నుంచి ఆఫర్ వచ్చినా వెళ్లలేదు

2004లో టీడీపీ నుంచి నాకు టికెట్‌ ఆఫర్‌ వచ్చింది. కానీ నేను చేసిన పోరాటం అంతా టీడీపీకి వ్యతిరేకంగానే. అలాంటి పార్టీలోకి వెళ్లి టికెట్‌ తెచ్చుకోవడం సరికాదని భావించి వెళ్లలేదు. ఎన్టీఆర్‌ అంటే నటుడిగా నాకు అభిమానం. ఆయన కొన్ని పాలనా సంస్కరణలు తీసుకొచ్చారు. నా తరం చూసినంత మార్పును ఇంకే తరం చూసి ఉండదు.. చూడదు కూడా. చాలా వేగంగా మార్పులు జరిగాయి. అన్ని మార్పులను ఆస్వాదించాల్సిందే. నేను కరువును రెండుసార్లు చూశాను.

- నా పనితీరే నా ఎదుగుదలకు కారణం

ఎలాంటి పొలిటికల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండానే ఈ స్థాయికి ఎదిగాను. అప్పట్లో కొంతమంది హవా నడిచేది. వారిని ఓవర్‌కమ్‌ చేసి ఎదిగాను. ఎంతో కష్టపడ్డాను. నా పెర్ఫార్మెన్స్ నా ఎదుగుదలకు కారణం. రాజకీయాలంటేనే కుట్ర. తడిగుడ్డతో గొంతు కోస్తారు. నవ్వుతూనే ప్రాణం తీస్తారు. నన్ను తొక్కేందుకు, నాకు అవకాశాలు రాకుండా చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నించారు. నేను కడక్‌గా ఉండేవాడిని. భయపడేవాడిని కాదు. అందుకే నెట్టుకొచ్చాను.

- ఎమ్మెల్సీగా గెలుపు.. అదీ ఓ రాజకీయ కుట్రే

2007లో ఎమ్మెల్సీగా అవకాశం రావడం కూడా ఒక రాజకీయ కుట్రే. కానీ గెలిచి చూపించాను. హనుమకొండ నుంచి నన్ను ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని వైఎస్‌ ఆలోచించారు. అక్కడ అవకాశం లేకపోవడంతో వరంగల్‌ ఎంపీగా పోటీ చేయాలని అన్నారు. నాకు టికెట్‌ ఇచ్చేందుకు లైన్‌ క్లియర్‌ అయింది. నేను కూడా పోటీకి సిద్ధమయ్యాను. అప్పుడు కుట్రలు జరిగాయి. నేను పోటీ చేస్తానని తట్టుకోలేక పొత్తులో భాగంగా రెండు ఎంపీ టికెట్లను పొత్తులో అప్పటి టీఆర్ఎస్‌కు ఇచ్చారు. ఆ తర్వాత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్థానాలు ఉండేవి. అయితే అందులో అప్పటికే ఓ రెడ్డికి టికెట్‌ ఖరారైంది. దీంతో నేను వద్దనుకున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి వెళ్లాను. అప్పుడు కాంగ్రెస్‌ బలం తక్కువ. ఓడిపోతారని అందరూ అనుకున్నారు. కానీ కేసీఆర్‌ ఇచ్చిన మాట మేరకు పొత్తులో టీఆర్ఎస్‌ సంపూర్ణంగా సహకరించింది. 115 ఓట్లతో నేను గెలిచాను.

- రెండుసార్లు చేజారిన మంత్రి పదవి

2011లో మంత్రి అయ్యే అవకాశం మిస్‌ అయింది. పార్టీ అధిష్ఠానం నుంచి నా పేరు వచ్చింది. కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ‘డన్‌.. నీ పేరు వచ్చింది’ అన్నారు. మరుసటి రోజు గవర్నర్‌ వద్ద ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పారు. నేను ఇంటికి వచ్చాను. ఉదయం నాకు ఫోన్‌ రాలేదు. అక్కడ ప్రమాణ స్వీకారం అయిపోయింది. హటాహుటిన అక్కడికి వెళ్తే రోశయ్య ‘గండ్ర.. నీ పేరు కేబినెట్‌లో ఎలా మిస్‌ అయింది?’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మంత్రి వర్గ విస్తరణ సమయంలోనూ అలాగే కుట్రలు జరిగాయి. రెండోసారి కూడా మంత్రి పదవి మిస్‌ అయింది. హైకమాండ్‌ నుంచి ప్రెషర్‌ ఉన్నా స్థానిక కుట్రలతో అవకాశం రాలేదు. కానీ ఎదుగుదలను ఎవరూ ఆపలేరు. 2012లో చీఫ్‌ విప్‌ అయ్యాను. 2018లో ఫస్ట్‌ స్పీచ్‌ నాదే అసెంబ్లీలో.

- 2019లో బీఆర్ఎస్‌లోకి..

2019లో అప్పటి పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్‌లో చేరాను. కేటీఆర్‌తో ఉద్యమ సమయం నుంచే పరిచయం ఉంది. కేసీఆర్‌తో మంచి అనుబంధం ఉంది. ఆయన వర్కింగ్‌ సిస్టమ్‌ వేరే. కేసీఆర్‌ కలవడం లేదు.. కలవడం లేదు అంటారు. కానీ కలిసిన రోజు సమస్యలన్నీ తీరిపోతాయి. పెండింగ్‌ పనులన్నీ క్లియర్‌ అవుతాయి. 30 నిమిషాలో, గంట సమయమో అనుకుంటే ఒక్కోసారి రోజు, ఓ పూట అంతా ఆయనే సమయం తీసుకుంటారు. కేసీఆర్‌కు ప్రతి విషయంలో అవగాహన ఉంది. ఏ విషయంపైనైనా, ఏ సమస్యపైనైనా అనర్గళంగా మాట్లాడుతారు.

- డబ్బే రాజకీయాల్లో ప్రధాన సమస్య

చిన్నప్పటి నుంచి కొంత ఉన్న కుటుంబం కావడంతో పెద్దగా ఇబ్బందులు పడలేదు. డబ్బులే రాజకీయాల్లో ప్రధాన సమస్య. అవి ఉంటే రాజకీయ ప్రయాణం సాఫీగానే సాగుతుంది. రాజకీయం అంటే డబ్బులతో ముడిపడిన అంశం. అందుకే బిజినెస్‌ వైపు కూడా అడుగులు వేశాను. రిజర్వేషన్‌ కలిసి రావడంతో 2005లో నా భార్య గండ్ర జ్యోతిని వరంగల్‌ మేయర్‌ చేయాలనుకున్న. నాకు టికెట్లు మిస్‌ కావడంతో వైఎస్‌తో మాట్లాడి బరిలో నిలిచాం. కానీ కార్పొరేటర్ గా గెలిచిన తర్వాత జరిగిన కుట్రలతో అదీ మిస్‌ అయింది. రాజకీయంలో ఎదగకుండా కుట్రలు సైలెంట్‌గా చేస్తుంటారు.

- భూపాలపల్లే నా కుటుంబం

భూపాలపల్లి నియోజకవర్గానికి తొలి ఎమ్మెల్యేగా నేను ఎన్నికయ్యాను. అప్పట్లో భూపాలపల్లి సమస్యలకు కేరాఫ్‌గా ఉండేది. డిగ్రీ, ఇంటర్‌ కాలేజీలు తీసుకొచ్చాను. మొదట్లో పీహెచ్ సీ మాత్రమే ఉండేది. ఇప్పుడు మెడికల్‌ కాలేజీ, 100 పడకల ఆస్పత్రితో మెరుగైన వైద్యం అందుబాటులోకి తెచ్చాను. సింగరేణి కార్మికుల కోసం 2 వేల క్వార్టర్స్‌ కట్టించాం. చెక్‌డ్యామ్‌లు, లిఫ్ట్‌ ఇరిగేషన్స్, రహదారులు, వంతెనలు, రోడ్ల వెడల్పు.. ఇలా ఒకటి కాదు, రెండు కాదు అనేక పనులు చేశాం. బైపాస్‌ రోడ్డు మంజూరైంది కానీ మొదలుకాలేదు. మొత్తం సమస్యలన్నీ పోయినయని కాదు. ఇంకా కొన్ని మేజర్‌ సమస్యలు ఉన్నాయి. పబ్లిక్‌ను సాటిస్‌ఫై చేయడం అంత ఈజీ కాదు. నేను నిధుల కోసం బారాబర్‌గా నిలదీసి తెచ్చేవాడిని. భూపాలపల్లి పట్టణం సమ్మిళితం. ఇక్కడ కార్మికులు ఎక్కువ. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు ఉంటారు. నా ప్రయాణం అంతా భూపాలపల్లితోనే. నా కుటుంబమే భూపాలపల్లి. భూపాలపల్లి డెవలప్‌మెంటే నా లక్ష్యం. మళ్లీ ఆశీర్వదిస్తే రాష్ట్రంలో నంబర్‌వన్‌గా చేసేందుకు ప్రయత్నిస్తాను.

- భూకబ్జాలంటూ నిందలు వేస్తున్నారు

నా మీద భూకబ్జాలంటూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, సీఎంపై పరువు నష్టం కేసు వేశాను. ఎకో పార్క్‌ పెట్టిందే నేను. వాకర్స్‌ కోసం వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేశాను. భూమిని కాపాడాలని కోర్టుకు వెళ్లి పోరాడిన నేను భూకబ్జా చేశానంటూ కుట్రలు చేస్తున్నారు. బట్టకాల్చి మీద వేయాలని చూస్తున్నారు. నాకు భూకబ్జాలు చేయాల్సిన అవసరం లేదు. భూపాలపల్లిలో ఆధ్యాత్మిక వాతావరణం కోసం గుడి కడితే దాన్ని కూడా రాజకీయం చేశారు. ప్రభుత్వ భూమిలో కట్టిన గుడిపై కేసులు వేశారు. నిర్మాణంలో అడుగడుగునా ఇబ్బంది పెట్టారు.

- రిజర్వేషన్‌ వస్తే బరిలో గండ్ర జ్యోతి

గండ్ర జ్యోతి నుంచి నాకు ఫుల్‌ సపోర్ట్‌ ఉంటుంది. మహిళలతో ఆమెకు మంచి అటాచ్‌మెంట్‌ ఉంటుంది. మహిళా రిజర్వేషన్‌ వస్తే తప్పకుండా ఎమ్మెల్యే బరిలో గండ్ర జ్యోతి ఉంటుంది. ఇప్పటికే వరంగల్‌ జెడ్పీ చైర్ పర్సన్ గా చేశారు. భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్‌ అధ్యక్షురాలు కూడా. మహిళల్లో ఆమెకు ఉన్న అనుబంధం, రాజకీయ అనుభవం ఉపయోగపడతాయి.

- అన్ని వర్గాలను మోసం చేసిన సర్కార్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని వర్గాలకు మాయమాటలు చెప్పి గద్దెనెక్కింది. ప్రభుత్వ పాలన తీరు ఎలా ఉందో సగటు రైతులే చెబుతారు. పెన్షన్‌, రైతు భరోసా, బీమా, ఆడబిడ్డలకు రూ.2,500, యూరియా కష్టాలు.. ఇలా ఒక్కటేమిటి.. అన్ని సమస్యలే. అన్ని మోసాలే. ప్రజలంతా మాయ నుంచి తేరుకున్నారు. రేవంత్‌ సర్కార్‌ను అనాస్థీషియా ఇచ్చి మళ్లీ పడుకోబెట్టే కాలం దగ్గర్లోనే ఉంది. ప్రస్తుత ఎమ్మెల్యే దీపం ఉండగానే సక్కబెట్టుకోవాలనే చందంగా పనిచేస్తున్నాడు. కుటుంబ సభ్యులు, బంధువులకు వసూళ్ల కోసం శాఖలను పంచిండు. ఆయన తీరుతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.

- పనికి గుర్తింపు లేకుండా పోయింది

ప్రస్తుత రాజకీయంలో గెలుపు, ఓటములకు పనులతో సంబంధం లేకుండా పోయింది. గతంలో పని చేసే వ్యక్తిని గుర్తించి ఎన్నుకునేవారు. ఇప్పుడు ఎంత పని చేసినా ఓటు వేసే వరకు భయపడే పరిస్థితి వచ్చింది. గతంలో ప్రజలు విలువలున్న రాజకీయ నాయకులను ఎన్నుకునేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మళ్లీ నియోజకవర్గమంతా పాదయాత్ర చేస్తాను. జరిగిన మోసాలను ప్రజలకు వివరిస్తా. నేను చేసిన పనులను కూడా ప్రజలకు చెబుతా. ప్రజలతో నాకు ఉన్న అనుబంధమే నా బలం. భూపాలపల్లి అభివృద్ధి కోసం నేను చేసిన పనులను, ఇంకా చేయాల్సిన పనులను ప్రజల ముందుంచుత.

- గౌతమ్‌ ఎప్పుడు వచ్చినా వద్దనేది లేదు

నా కొడుకు గండ్ర గౌతమ్‌ రాజకీయ ప్రవేశం ఆయన ఇష్టం. ఆయన ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చినా వద్దనేది లేదు. తనకు నచ్చిన సమయంలో రాజకీయాల్లోకి రావచ్చు. అయితే రానున్న రోజుల్లో ఆయన కేటీఆర్‌ టీంలో ఉంటారు. యువత రాజకీయాల్లోకి రావాలి. గౌతమ్‌ కూడా తనకు నచ్చిన సమయంలో రాజకీయాల్లోకి వచ్చి ప్రజల కోసం పనిచేయాలని నేను కోరుకుంటా.

aksharadarbar-30-09-2026

వీధి కుక్కల దాడిలో 12 గొర్రె పిల్లలు మృతి
వీధి కుక్కల దాడిలో 12 గొర్రె పిల్లలు మృతి

రూ.60 వేలకుపైగా నష్టం..

ప్రభుత్వం పరిహారం చెల్లించాలని బాధితుడి వేడుకోలు

అక్షరదర్బార్, నడికూడ:
నడికూడ మండలంలోని కంటాత్మకూరు గ్రామంలో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. గ్రామానికి చెందిన గాదం రాజయ్య తన ఇంటి దొడ్డిలో కట్టివేసిన గొర్రె పిల్లలపై వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. ఈ ఘటనలో 12 గొర్రె పిల్లలు మృతి చెందాయి. ఒక్కో గొర్రె పిల్ల విలువ సుమారు రూ.5 వేల చొప్పున ఉండటంతో మొత్తం రూ.60 వేలకుపైగా నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు. వీధి కుక్కల దాడితో తీవ్రంగా నష్టపోయానని, ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని గాదం రాజయ్య కోరారు.

aksharadarbar-29-09-2026

జనసభలోనే నా ప్రయాణం!
జనసభలోనే నా ప్రయాణం!

- పదిహేను రోజుల వ్యవధిలోనే పోటీ చేసినా పట్టభద్రులు ఆదరించారు
- ఓడినా వెనుకడుగు వేయలేదు.. ప్రజల మధ్యే నిరంతర పోరాటం
- పార్టీ అధినేత కేసీఆర్ ఇచ్చిన ధైర్యంతో ముందడుగు
- ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కాళ్లకు చక్రాలు కట్టుకుని పర్యటించా
- నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ ఆటలాడుతుంది
- నోటిఫికేషన్లు లేక నిరుద్యోగుల బతుకులు బుగ్గిపాలు
- నిరుద్యోగం అతిపెద్ద సామాజిక సమస్య..
- యూపీఎస్సీ తరహాలో నిర్దిష్ట 'జాబ్ క్యాలెండర్' తక్షణ అవసరం
- కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
- పీఆర్సీ, సీపీఎస్ రద్దుపై ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం
- రెండున్నరేళ్లుగా ప్రజాక్షేత్రంలోనే పట్టభద్రుల హక్కుల కోసం పోరాడుతున్న
- రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటమి తప్పదు
- రాబోయే బీఆర్ఎస్‌ ప్రభుత్వానికి వారధిగా నిలుస్తా
- కేటీఆర్ నాయకత్వమే జెన్- జీ తరానికి దిక్సూచి
- డిజిటల్ మీడియా ప్రతినిధుల చిట్ చాట్ లో బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేష్ రెడ్డి

అక్షరదర్బార్, హనుమకొండ: రాజకీయాల్లో గెలుపోటములు సహజమైన పరిణామాలని, చట్టసభలో అడుగుపెట్టే అవకాశం రాకపోయినా 'జనసభ'లో ప్రజలతో కలిసి పనిచేసే అవకాశం దక్కిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్‌రెడ్డి అన్నారు. ఓటమితో ఎక్కడా నిరాశ చెందలేదని, పార్టీ అధినేత కేసీఆర్ ఇచ్చిన స్ఫూర్తితో గత రెండున్నరేళ్లుగా ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని 34 నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజా సమస్యలపై పోరాడుతున్నానని ఆయన చెప్పారు. బీఆర్ఎస్‌లో చేరిన కొద్దిరోజులకే పార్టీ అధిష్ఠానం తనపై నమ్మకం ఉంచి గత ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా కేవలం 15 రోజుల ముందు అభ్యర్థిగా అవకాశం ఇచ్చిందని రాకేష్‌రెడ్డి గుర్తుచేసుకున్నారు. సమయం తక్కువగా ఉన్నప్పటికీ అన్ని వర్గాల పట్టభద్రులు విశేషంగా ఆదరించారన్నారు. ఆ ఎన్నికల్లో కొద్దిపాటి తేడాతో ఓటమి చెందిన తర్వాత కేసీఆర్ తనను పిలిచి మాట్లాడి "గో హెడ్ రాకేష్.." అంటూ ఇచ్చిన ధైర్యం, మార్గదర్శకత్వమే తనను ప్రజాక్షేత్రంలో ముందుకు నడిపిస్తోందన్నారు. చట్టసభలోకి వెళ్లలేకపోయాననే బాధ కంటే జనసభలో పనిచేసే అవకాశం లభించిందనే భావనతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు.  తెలంగాణ డిజిటల్ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో రాకేష్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానం, నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలపై చేపట్టిన పోరాటాలను వివరించారు. ఏమన్నారంటే ఆయన మాటల్లో...

- రెండున్నరేళ్లుగా నిరంతర పోరాటం..

గత రెండున్నరేళ్లుగా విద్యార్థి నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం ఉద్యమాలు నిర్వహిస్తున్న. జీఓ 46, జీఓ 29, గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ వివాదాలు, నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాం, నిలదీశాం. ప్రభుత్వ తీరును ప్రజల ముందుకు తీసుకెళ్లే క్రమంలో పలుమార్లు నిర్బంధాలకు గురైనా వెనుకడుగు వేయలేదు. ఉద్యోగులకు సంబంధించిన అత్యంత కీలకమైన సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తున్న. నిరుద్యోగ బాకీ కార్డు ఉద్యమం చేపట్టాం. జలవిహార్‌లో భారీ సభ నిర్వహించాం, యువసంగ్రామం సభ చేపట్టాం. హైదరాబాద్‌ కేంద్రంగా ఉద్యమాలు కొనసాగిస్తూనే ఉమ్మడి వరంగల్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరిగిన. ఆయా ప్రాంతాల్లో విద్యార్థి నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రైవేట్‌ ఉద్యోగులను కలిసి వారి సమస్యలను దగ్గరగా తెలుసుకున్న. ఈ రెండున్నరేళ్ల కాలంలో నాకు ఎంతో అనుభవం, పరిణతి లభించింది.

నిరుద్యోగం ప్రస్తుతం తీవ్రమైన సామాజిక సమస్యగా మారింది. యూపీఎస్సీ తరహాలో నిర్దిష్టమైన జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసే వ్యవస్థ రాష్ట్రంలో లేకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో తెలియక ఏళ్ల తరబడి పట్టణాల్లో అద్దె గదుల్లో ఉంటూ కోచింగ్‌లు తీసుకుంటున్నారు. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు.

హన్మకొండలోని సెంట్రల్‌ లైబ్రరీకి వెళ్లి చూస్తే అక్కడి పరిస్థితి అర్థమవుతుంది. నిరుద్యోగులు రూ.5 భోజనంతో రోజులు గడుపుతున్నారు. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం నోటిఫికేషన్లు లేకపోవడంతో ఏళ్ల తరబడి ఎదురుచూస్తూ చాలామంది నిరుద్యోగులు వయసును కోల్పోతున్నారు. ఉద్యోగం లేక, చేతిలో పని లేక, సొంతంగా భూమి లేక, తల్లిదండ్రుల కష్టాలు కళ్లముందు కనిపిస్తూ, బంధువుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అనేక మంది దిక్కుతోచని పరిస్థితికి వెళ్తున్నారు. పెళ్లిళ్లు కూడా కాక తీవ్ర మానసిక ఒత్తిడికి గురై కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ ప్రాంతానికి చెందిన వేణు ఆత్మహత్య నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆయన రాసిన సూసైడ్‌ లెటర్‌ చదివితే గుండె తరుక్కుపోతుంది. ఈ దారుణ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉంది.

- కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు భద్రత కల్పించాలి..

రాష్ట్రంలోని కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలపై కూడా విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో సుమారు 8 లక్షల మంది ఉద్యోగులు ఉంటే, అందులో దాదాపు 5 లక్షల మంది కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులే. వారి సమస్యలపై విస్తృతంగా అధ్యయనం చేశాను. వారి కష్టాలను దగ్గర నుంచి చూశాను.

పర్మినెంట్‌ ఉద్యోగులతో సమానమైన వేతనాలు కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు లభించడం లేదు. కొద్దిపాటి జీతాలు కూడా నెలనెలా అందడం లేదు. రెండు నెలలు, మూడు నెలలు.. ఒక్కోసారి ఐదారు నెలలకు ఒకసారి వేతనాలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వారి కుటుంబాలు ఎలా జీవించాలి? పిల్లలను ఎలా చదివించాలి? సమాజంలో గౌరవంగా ఎలా జీవించాలి?. ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామని కాంగ్రెస్‌ ప్రభుత్వం చెబుతోంది‌ అయితే ఒకటో తేదీన జీతం పొందడం ఉద్యోగుల హక్కు. జీవించే హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి వారికి భద్రత కల్పించాలి. నెలనెలా వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలి.

- శిఖర సమాన నేత కేసీఆర్‌.. జెన్‌జీకి సరైన నాయకుడు కేటీఆర్‌..

కేసీఆర్‌ శిఖర సమాన నాయకుడు. తెలంగాణ సమాజం ఏ సమస్యల నుంచి, ఏ బాధల నుంచి విముక్తి పొందాలని కోరుకుందో, ఏ ఆత్మగౌరవం కోసం పోరాడిందో వాటన్నింటికీ స్వరాష్ట్రంలో పరిష్కారం చూపేందుకు అద్భుతమైన కార్యాచరణతో ముందుకు నడిపించిన మహానేత కేసీఆర్‌. ఉద్యమ సమయంలో కేసీఆర్‌ తిరగని ఊరు లేదు. పలకరించని పల్లె లేదు. తొక్కని గడప లేదు. అన్ని వర్గాల ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూసినందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అద్భుతమైన పాలన అందించారు.

పదేళ్ల పాలనలో వ్యవసాయాన్ని పండుగ చేశారు. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులను బాగుచేయించారు. ప్రాజెక్టులు నిర్మించి సాగునీరు అందించారు. రైతుల కోసం రైతుబంధు, రైతుబీమా, దళితుల కోసం దళితబంధు వంటి కార్యక్రమాలు అమలు చేశారు. కార్మికుల కోసం అనేక పథకాలు, అన్ని విభాగాల్లో ఉద్యోగాల భర్తీ, విద్యారంగ బలోపేతం, వృత్తుల ప్రోత్సాహం, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ వంటి కార్యక్రమాలతో తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో తలెత్తుకుని బతికేలా రాష్ట్రాన్ని ముందుకు నడిపించారు.

జెన్‌జీ తరానికి కేటీఆర్‌ సరైన నాయకుడు. నేటి తరం సమస్యలు, వాటి పరిష్కారాలపై ముందుచూపుతో కేటీఆర్‌ పనిచేశారు. టీ-హబ్‌, టీఎస్‌ఐపాస్‌, ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ హబ్‌ల ఏర్పాటు వంటి కార్యక్రమాల ద్వారా పదేళ్ల క్రితమే జెన్‌జీ తరం గురించి ఆలోచించారు. రాజకీయాలను కొత్త కోణంలో చూడాలని, నేటి తరానికి చేరువ కావాలని, ప్రజల్లోకి వెళ్లాలని నిరంతరం ఆలోచించే విలక్షణ నాయకుడు కేటీఆర్. అంతర్జాతీయ ప్రాజెక్టులను తీసుకురావడంలో, హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

- ఉద్యోగాలన్నీ బీఆర్ఎస్‌ ప్రభుత్వమే ఇచ్చింది..

తెలంగాణ ఏర్పాటుతో ప్రజలు కోరుకున్న ఆకాంక్షలను పదేళ్ల బీఆర్ఎస్‌ పాలనలో నిజం చేశాం. అన్ని విభాగాల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టాం. పోలీసు, ఉపాధ్యాయ, ఇతర శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగుల కలలను నిజం చేశాం. సింగరేణిలో కారుణ్య నియామకాలు చేపట్టి అనేక ఏళ్ల సమస్యకు పరిష్కారం చూపాం. అయితే బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో విడుదలైన అనేక ఉద్యోగ నోటిఫికేషన్లు ఎన్నికల కోడ్‌ వంటి కారణాలతో ఆగిపోయాయి. ఇప్పుడు వాటిని కాంగ్రెస్‌ ప్రభుత్వం భర్తీ చేస్తూ తామే ఉద్యోగాలు ఇచ్చామని చెబుతోంది.

కాంగ్రెస్‌ ప్రభుత్వం మూడేళ్ల కాలంలో కొత్తగా ఇచ్చిన ఉద్యోగాలు ఏమీ లేవు. మేము పోరాడిన తర్వాత ఇటీవల కొన్ని పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేసింది. అవి కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేస్తోంది. అబద్ధాల మీద ప్రభుత్వం నడుస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి.

గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినా ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తూ విద్యార్థి నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడుతున్నా. రామకోటి రాసిన దానికంటే ఎక్కువగా గత రెండేళ్లలో విద్యార్థి నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను ప్రస్తావించాను. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా అధిష్ఠానం మరోసారి అవకాశం ఇస్తుందన్న నమ్మకం ఉంది. అన్ని వర్గాల ప్రజల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం విశ్వాసం కోల్పోయింది. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ విషయం తేలిపోతుంది. రాబోయే బీఆర్ఎస్‌ ప్రభుత్వానికి వారధిగా నిలుస్తా.

- బిట్స్‌ పిలానీలో డ్యుయెల్‌ డిగ్రీ.. ఆర్థిక అంశాలపై ప్రత్యేక దృష్టి

మాది గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని హసన్‌పర్తి మండలం వంగపహాడ్‌ గ్రామం. తల్లిదండ్రులు ఏనుగుల కోమల, గోపాల్‌రెడ్డి. వ్యవసాయ కుటుంబానికి చెందిన నేను పదో తరగతి వరకు వరంగల్‌ పబ్లిక్‌ స్కూల్‌లో, ఇంటర్‌ గుంటూరులోని విజ్ఞాన్‌ కాలేజీలో చదివాను. ఇంటర్‌లో స్టేట్‌ తొమ్మిదో ర్యాంకు సాధించడంతో బిట్స్‌ పిలానీలో అడ్మిషన్‌ లభించింది. అక్కడ ఐదేళ్ల డ్యుయెల్‌ డిగ్రీ పూర్తి చేసి, విద్యార్థి నాయకుడిగా పనిచేశాను. అనంతరం ఏడేళ్ల పాటు బెంగళూరు, అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేశాను.

విద్యార్థి దశ నుంచే జాతీయ భావాలతో ఉన్న నేను 2013లో బీజేపీలో చేరాను. అనంతరం పదేళ్లపాటు వరంగల్‌లో బీజేపీ బలోపేతానికి కీలకంగా పనిచేశాను. ముఖ్యంగా మురికివాడల ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశాను‌. వరదల సమయంలో ఇంటింటికీ వెళ్లి తనవంతు సహాయం అందించాను. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొన్ని అనివార్య కారణాల వల్ల బీఆర్ఎస్‌లో చేరాను.

ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం
ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

టీపీయూఎస్‌ జిల్లా స్థాయి పురస్కారాలు

అక్షరదర్బార్ నడికూడ:
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్‌) వరంగల్‌–హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సామ జగన్మోహన్‌ స్మారక భవనంలో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ సన్మాన సభ నిర్వహించారు. వ్యాస మహర్షి జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో నడికూడ మండలానికి చెందిన నలుగురు ఉపాధ్యాయులను సన్మానించారు.
పులిగిల్ల ఎంపీయూపీఎస్‌ ఉపాధ్యాయురాలు కె.కవిత, నార్లాపూర్‌ ఎంపీపీఎస్‌ ఉపాధ్యాయురాలు ఎం.శ్రీదేవి, కౌకొండ ఎస్‌ఏ (ఆర్ట్స్‌) సాంబరాజు, నడికూడ జెడ్పీహెచ్‌ఎస్‌ ఉపాధ్యాయురాలు జ్యోత్స్నలను వృత్తిపట్ల అంకితభావం, నిబద్ధతతో సేవలందిస్తున్నందుకు శాలువా, జ్ఞాపిక, ప్రశంసాపత్రాలతో సన్మానించారు.గత 20 ఏళ్లుగా ఎలాంటి దరఖాస్తు విధానం లేకుండా వివిధ కేటగిరీల్లో ఉత్తమ సేవలందిస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి సన్మానించే సంప్రదాయాన్ని టీపీయూఎస్‌ కొనసాగిస్తోందని జిల్లా అధ్యక్షుడు మాచర్ల భిక్షపతి తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంటయ్యతోపాటు జిల్లా నాయకులు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మూడు తరాలుగా సేవా సంకల్పం
మూడు తరాలుగా సేవా సంకల్పం

‘సేవా సంకల్ప్ అభియాన్‌’లో డా. సిరంగి సౌందరయ్య మనవడు రక్తదానం

అక్షరదర్బార్,పరకాల:
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్ల సేవా ప్రస్థానం పూర్తిచేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్‌’లో భాగంగా ఆదివారం పరకాలలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. బీజేవైఎం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు పున్నం వేణు ఆధ్వర్యంలో పాత మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా ‘నేను సైతం..’ అంటూ బీజేపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్‌ సిరంగి సంతోష్‌కుమార్‌ కుమారుడు, డాక్టర్‌ సిరంగి సౌందరయ్య మనవడు డాక్టర్‌ సిరంగి రాజచైతన్య రక్తదానం చేశారు. బీజేపీ కోసం మూడు తరాలుగా సేవలందిస్తున్న సిరంగి సౌందరయ్య కుటుంబం నుంచి యువతరం కూడా సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం విశేషంగా నిలిచింది.
డాక్టర్‌ సిరంగి సౌందరయ్య నుంచి ఆయన కుమారుడు డాక్టర్‌ సిరంగి సంతోష్‌కుమార్‌, మనవడు డాక్టర్‌ సిరంగి రాజచైతన్య వరకు మూడు తరాలు బీజేపీకి సేవలందించడం ఆ కుటుంబానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది.

మల్లక్కపేట ఆలయంలో దొంగల కలకలం!
మల్లక్కపేట ఆలయంలో దొంగల కలకలం!

హుండీ మాయం..

23 నుంచి పనిచేయని సీసీ కెమెరాలు

పోలీసులకు సమాచారం

అక్షరదర్బార్, పరకాల:
పరకాల ప్రాంతంలోని ప్రముఖ మల్లక్కపేట అభయాంజనేయ స్వామి ఆలయంలో శనివారం రాత్రి దొంగలు చొరబడిన ఘటన కలకలం రేపింది. ఆలయానికి ప్రతిరోజూ వెళ్లే జగన్నాథ ఆచార్యులు ఆదివారం ఉదయం పూజల కోసం ఆలయానికి వెళ్లి చూడగా హుండీ కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
మల్లక్కపేట అభయాంజనేయ స్వామి ఆలయం పరకాల ప్రాంతంలోనే కాకుండా తెలంగాణలో రెండో కొండగట్టుగా ప్రాచుర్యం పొందింది. శ్రీరామనవమి, హనుమాన్‌ జయంతి, కార్తీక మాస పూజలు తదితర వేడుకలు ఇక్కడ వైభవంగా నిర్వహిస్తుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. అలాంటి ఆలయంలో చోరీ జరగడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పిడుగు పడటంతో సీసీ కెమెరాలు బంద్‌!

ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ నాలుగైదు రోజుల క్రితం పిడుగు పడటంతో ఈ నెల 23వ తేదీ నుంచి అవి పనిచేయడం లేదని తెలుస్తోంది. ఇదే సమయంలో చోరీ జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. రోడ్డు పక్కనే ఉన్న ఆలయంలో దొంగలు చొరబడటంతో ఆలయ పరిస్థితులపై అవగాహన ఉన్నవారే ఈ ఘటనకు పాల్పడ్డారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై పోలీసుల దర్యాప్తులో పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

హుండీలో ఎంత నగదు?

ఆలయ హుండీని సాధారణంగా ఆరు నెలలకు ఒకసారి లెక్కిస్తారు. గత మే నెలలో హనుమాన్‌ జయంతి అనంతరం హుండీని లెక్కించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హుండీలో రూ.10 వేల లోపు నగదు ఉండే అవకాశం ఉందని సమాచారం. ఆలయానికి భద్రత పెంచి భక్తుల విశ్వాసానికి భరోసా కల్పించాలని పలువురు భక్తులు కోరుతున్నారు.

aksharadarbar-27-09-2026

aksharadarbar-26-09-2026

రబీ ప్రణాళికపై అధికారుల సమన్వయ సమావేశం
రబీ ప్రణాళికపై అధికారుల సమన్వయ సమావేశం

కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుపై చర్చ..

ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం

అక్షర దర్బార్, హనుమకొండ:
రబీ సీజన్‌ కార్యాచరణ ప్రణాళిక, కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుపై వ్యవసాయ, అనుబంధ రంగాల జిల్లా అధికారులు, శాస్త్రవేత్తలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యవసాయాధికారి వి. విజయచంద్ర అధ్యక్షతన కలెక్టరేట్‌లోని జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో సమావేశం జరిగింది. రబీలో అపరాలు, ఆరుతడి, ఉద్యాన, ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాల ద్వారా రైతుల ఆదాయం పెంచేలా కార్యాచరణ చేపట్టాలని తెలిపారు.
ఆత్మనిర్భర్‌ భారత్‌/మిషన్‌ పథకం కింద అపరాలు, జాతీయ ఆహార భద్రత–పోషకాహార మిషన్‌ (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం) కింద మక్కజొన్న, వరి, వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు తదితర పంటలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, అవసరమైన ఇన్‌పుట్స్‌ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎరువులను ఫెర్టిలైజర్‌ సేల్‌ యాప్‌ ద్వారా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రకృతి వ్యవసాయంపై అన్ని మండలాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
ఉద్యానవన, మత్స్య, ఇరిగేషన్‌, సహకార శాఖల అధికారులు తమ పరిధిలోని రబీ కార్యాచరణను వివరించారు. రైతులకు సమగ్ర సేవలు అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా వ్యవసాయాధికారి సూచించారు. అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

aksharadarbar-25-09-2026

aksharadarbar-24-09-2026

మమతానగర్‌లో గణేష్‌ నవరాత్రి ముగింపు
మమతానగర్‌లో  గణేష్‌ నవరాత్రి ముగింపు

రూ.45,116కు లడ్డూ ప్రసాదం..

అక్షరదర్బార్, పరకాల:
పరకాల పట్టణంలోని మమతానగర్‌ కాలనీలో గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు బుధవారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, నిత్య అన్నదానాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. నరేన్‌ రాక్‌స్టార్‌ యూత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డూ వేలంలో మాటూరి రాజేందర్‌ దంపతులు రూ.45,116కు లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. అనంతరం కాలనీవాసులు ఆటపాటలతో సందడి చేస్తూ గణనాథుని నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు.

aksharadarbar-23-09-2026

akshara Darbar special

aksharadarbar-22-09-2026

విద్యే ఆయుధం.. వివక్షే నా కసి!
విద్యే ఆయుధం.. వివక్షే నా కసి!

- నాన్న కోరికతోనే డాక్టర్ ని అయ్యా.. 'దొరల'ని చూసే చదువుపై ఆసక్తి పెరిగింది
- ఎంబీబీఎస్ లోనే కుల వివక్ష అనుభవించా.. అదే నన్ను ఉన్నతంగా ఎదిగేలా చేసింది
- చదువుతోనే వెనుకబడిన వర్గాల భవిష్యత్తు.. సామాజిక జ్ఞానోదయం రావాలి
- ఫ్రెండ్ డాక్టర్ యాకయ్య నా మిత్రుడే కాదు.. నా ఆత్మ
- మిషన్లు వచ్చాయి.. రోగి 'నాడి' పట్టుకునే డాక్టర్ కరువయ్యాడు
- నవ్వుకున్న చోటే గార్డియన్ ఆసుపత్రి నిర్మించా.. 24 గంటలూ రోగులకు అందుబాటులో ఉంటా
- వైద్యుడిగా ఎదిగినా.. రాజకీయాలపై మొదటి నుంచే ఆసక్తి
- ఈటల రాజేందరే నా రాజకీయ గురువు.. ఆయన వెంటే నా ప్రయాణం
- ఓటమికి బాధపడలేదు... పరకాల ప్రజలను విడిచి పెట్టేదే లేదు
- రాజకీయాలను కోర్సులా చదువుతున్నా.. డబ్బు సంపాదన కోసం రాజకీయం చేయడం లేదు
- డీలిమిటేషన్ ప్రచారమంతా ఊహాజనితమే
- వైద్యరంగం నుంచి రాజకీయ ప్రయాణం వరకు..
- డిజిటల్ మీడియా ప్రతినిధుల చిట్ చాట్ లో బీజేపీ నేత, పరకాల నియోజకవర్గం కాంటెస్టెడ్ అభ్యర్థి డాక్టర్ పగడాల కాళీప్రసాద్ రావు

అక్షరదర్బార్, హనుమకొండ

బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉన్నతంగా ఎదగాలంటే విద్య తప్ప మరో మార్గం లేదని, ముందుగా సామాజికంగా జ్ఞానోదయం రావాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర నేత, పరకాల నియోజకవర్గం కాంటెస్టెడ్ అభ్యర్థి డాక్టర్  పగడాల కాళీప్రసాద్‌రావు అన్నారు. హక్కుల కోసం బీసీలు ఉద్యమించాలని, అదే సమయంలో అగ్రవర్ణాలనూ దూరం పెట్టకుండా తమ సమస్యలను వివరించి వారిని కూడా భాగస్వాములను చేసుకుంటేనే సామాజిక మార్పు సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. డిజిటల్‌ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో తన బాల్యం, చదువు, వైద్య ప్రస్థానం, ఎంబీబీఎస్‌లో ఎదురైన కుల వివక్ష, వైద్య రంగంలో వచ్చిన మార్పులు, గార్డియన్‌ ఆస్పత్రి నిర్మాణం, ఐఎంఏలో తన ప్రయాణం, బీసీ సామాజిక చైతన్యం, రాజకీయ రంగ ప్రవేశం, ఈటల రాజేందర్‌తో తన అనుబంధం, పరకాల నియోజకవర్గంతో తనకు ఉన్న బంధం తదితర అంశాలను ఆయన పంచుకున్నారు. గ్రామీణ నేపథ్యం నుంచి వైద్యుడిగా ఎదిగి, వైద్య సంస్థను నిర్మించి, ఇప్పుడు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేయాలని సాగుతున్న ఆయన ప్రయాణం ఆసక్తికరంగా సాగింది.

- విద్యతోనే వెనుకబడిన వర్గాల ఎదుగుదల

బీసీలతోపాటు ఎస్సీ, ఎస్టీలు ఉన్నత స్థాయికి ఎదగాలంటే విద్యే ప్రధాన ఆయుధమని కాళీప్రసాద్‌రావు స్పష్టం చేశారు. కేవలం హక్కుల కోసం నినదించడం కాకుండా వాటిని సాధించేందుకు సామాజికంగా చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉందన్నారు. బీసీలు ఉద్యమించాలని, తమ హక్కుల కోసం పోరాడాలని చెప్పారు. అయితే ఈ పోరాటం ఇతరులను దూరం చేసే విధంగా ఉండకూడదని, అగ్రవర్ణాలకు కూడా తమ ఉద్యమం గురించి వివరించి కలుపుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. సమాజంలో మార్పు రావాలంటే విద్య, చైతన్యం, ఐక్యత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

- ‘నన్ను డాక్టర్‌ చేయాలనేది నాన్న కోరిక’
భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాక తన స్వగ్రామమని కాళీ ప్రసాద్‌రావు తెలిపారు. తల్లిదండ్రులు పగడాల వెంకటనర్సయ్య, వజ్రమ్మ అని చెప్పారు. తమ్ముడు, చెల్లి ఉన్నారని తెలిపారు. తండ్రి టీచర్‌గా పనిచేయడంతో ఉద్యోగరీత్యా బదిలీ అయిన ప్రతిచోటికీ కుటుంబం వెళ్లాల్సి వచ్చేదన్నారు. టెన్త్‌ వరకు గ్రామాల్లోనే చదివానని, పదో తరగతి చిట్యాలలో పూర్తి చేశానని, ఇంటర్‌ పరకాలలో చదివానని చెప్పారు. చిన్ననాటి నుంచి చదువుపైనే ఎక్కువ దృష్టి ఉండేదన్నారు. తన తండ్రికి తనను డాక్టర్‌ చేయాలనే కోరిక బలంగా ఉండేదని కాళీ ప్రసాద్‌రావు తెలిపారు. అందుకే తన చదువు విషయంలో తండ్రి చాలా కఠినంగా ఉండేవారని చెప్పారు. తోటిపిల్లలంతా ఆటలకు వెళ్లినా తాను మాత్రం పుస్తకం ముందేసుకుని కూర్చోవాల్సి వచ్చేదన్నారు. తండ్రి ఎప్పుడైనా ఊరికి వెళ్తే ఆటకు వెళ్లేందుకు అవకాశం దొరికేదని, అప్పుడు తల్లిని బతిమిలాడుకుని బయటకు వెళ్లేవాడినని చిన్ననాటి జ్ఞాపకాలను నవ్వుతూ గుర్తుచేసుకున్నారు. చిన్నతనంలోనే చదువుపై ఏర్పడిన ఆ అలవాటు తర్వాత తన జీవితాన్ని మలిచిందన్నారు.

- దొర కుటుంబాలను చూసి.. చదువుపై ఆసక్తి

తనలో చదువుపై ఆసక్తి పెరగడానికి గ్రామంలోని ఉన్నత కుటుంబాలను చూడటం కూడా ఒక కారణమైందని కాళీ ప్రసాద్‌రావు చెప్పారు. రిటైర్డ్‌ జడ్జి రఘునందన్‌రావు గ్రామానికి వచ్చినప్పుడు ఆయనను, ఆయన పిల్లలను చూసేందుకు గ్రామస్థులు వెళ్లేవారని తెలిపారు. వారి డ్రెస్సింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడే విధానం తనను ఆకట్టుకునేవన్నారు. తాను కూడా బాగా చదువుకుంటే అలాంటి స్థాయికి ఎదగవచ్చనే ఆలోచన అప్పుడే తనలో కలిగిందన్నారు. ఆ తర్వాత చదువుపై మరింత ఆసక్తి పెంచుకున్నానని చెప్పారు.

- మూడో ప్రయత్నంలో మెడికల్ సీటు
తన తాత బుచ్చిరామయ్య సర్పంచ్‌గా పనిచేశారని, తనను ఎంతో ప్రత్యేకంగా చూసుకునేవారని కాళీ ప్రసాద్‌రావు తెలిపారు. మనవళ్లందరిలో తనపై తాతకు ప్రత్యేకమైన అభిమానం ఉండేదన్నారు. తన కూతురు కొడుకు కూడా తన తాత పేరు పెట్టడానికి కూడా ఆ అనుబంధమే కారణమన్నారు. ఎంసెట్‌ను రెండుసార్లు రాసి మూడో ప్రయత్నంలో మెడికల్‌ సీటు సాధించానని తెలిపారు. కాకతీయ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌, పీజీ పూర్తి చేశానన్నారు. చదువు పూర్తయ్యాక తొలుత కొద్దికాలం ఏటూరునాగారంలో పనిచేశానని, అనంతరం 12 సంవత్సరాలపాటు ఎంజీఎంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేశానన్నారు. 1992లో వివాహం జరిగిందని, తన భార్య స్వర్ణలత ఎంబీబీఎస్‌, డీజీఓ వైద్యురాలని చెప్పారు. తన వ్యక్తిత్వం, తండ్రి టీచర్‌ కావడం వంటి విషయాలను చూసి తన మామ ఆకుల ఆనందం తనను వెతికి మరీ వివాహం చేశారని నవ్వుతూ తెలిపారు.

- ఎంబీబీఎస్‌లోనే కుల వివక్ష అనుభవం

ఇంటర్‌ వరకు కులం గురించి తనకు పెద్దగా తెలియదని, ఎంబీబీఎస్‌లో చేరిన తర్వాతే కుల వివక్షను ప్రత్యక్షంగా అనుభవించానని కాళీ ప్రసాద్‌రావు తెలిపారు. ఇంటర్‌లో నలుగురు స్నేహితులతో కలిసి ఒక గదిలో ఉండేవాళ్లమని, అప్పుడు ఎలాంటి సామాజిక భేదాల గురించి ఆలోచన రాలేదన్నారు. మెడికల్‌ కాలేజీలో చేరిన తర్వాత కొందరికి నమస్కారం పెట్టినా స్పందించకపోవడంతో కారణమేంటో అర్థం కాక చాలా కాలం ఆలోచించానన్నారు. మొదట తన డ్రెస్సింగ్‌ వల్ల కావచ్చని భావించానని, తన వద్ద 2 జతల బట్టలు మాత్రమే ఉండేవని చెప్పారు.

- వివక్షే కసిగా మారింది

ఎంబీబీఎస్‌లో కుల ఆధారిత గ్రూపులు, పరస్పరం సహకరించుకోవడం, కలిసి పార్టీలు చేసుకోవడం వంటి అంశాలను గమనించడానికి తనకు ఏడాదికి పైగా సమయం పట్టిందని కాళీప్రసాద్‌రావు తెలిపారు. బీసీల పట్ల కనిపించిన నిర్లక్ష్యం, తాను ఎదుర్కొన్న వివక్ష తనను బాధపెట్టినా అదే తనలో మరింత కసిని పెంచిందన్నారు. ఆ కసిని చదువు, పని, ఎదుగుదల వైపు మళ్లించానని చెప్పారు. తన జీవితంలో ఎదురైన ఆ అనుభవాలే తర్వాత మరింత పెద్ద స్థాయికి ఎదగాలనే పట్టుదలను పెంచాయని వివరించారు.

- యాకయ్య.. మిత్రుడే కాదు.. నా ఆత్మ

తన జీవితంలో మిత్రుడు రాజబోయిన యాకయ్య పాత్ర ఎంతో కీలకమని కాళీ ప్రసాద్‌రావు తెలిపారు. ముదిరాజ్‌ సామాజికవర్గానికి చెందిన యాకయ్య తనకు మిత్రుడే కాకుండా ఆత్మ అని అన్నారు. తాను, యాకయ్య కలిసి కష్టపడ్డామని, ప్రతి దశలో ఆయన తనకు అండగా నిలిచారని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీసీలు మెడికల్‌ కాలేజీ చైర్మన్లుగా ఉన్న కాలేజీ ఆర్వీఎం అని పేర్కొంటూ, యాకయ్య తనకు దొరకడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. డాక్టర్‌ వృత్తిలోనూ ఎంతో కష్టపడ్డానని కాళీప్రసాద్‌రావు తెలిపారు. జయ, రోహిణి ఆసుపత్రుల్లో పనిచేసినట్లు చెప్పారు. ప్రతిరోజూ ఒక ప్రాంతానికి వెళ్లి వైద్యం అందించేవాడినన్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు పనిచేసిన రోజులు ఎన్నో ఉన్నాయన్నారు. 10 సంవత్సరాలపాటు నిరంతరం కష్టపడ్డానని చెప్పారు. చివరి దశలో ఉన్న ఎంతోమంది రోగులను కాపాడినట్లు తెలిపారు. ప్రాణాలు నిలబెట్టినప్పుడు కలిగే అనుభూతి వేరుగా ఉంటుందని అన్నారు. రఘురామ్‌, సత్యనారాయణమూర్తి సార్‌లంటే తనకు ఎంతో గౌరవమని, వారు తనకు విలువలు నేర్పారని చెప్పారు.

- ‘నాడి పట్టుకునే డాక్టర్‌ కరువయ్యాడు’

ప్రస్తుత వైద్య వ్యవస్థపై కాళీ ప్రసాద్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్లు రోగులకు దూరమయ్యారని, మిషన్లు, డబ్బులు దగ్గరయ్యాయని అన్నారు. గతంలో డాక్టర్‌ రోగి నాడి పట్టి, వివరాలు అడిగి, సమస్యను అర్థం చేసుకుని వ్యాధిపై ఒక అంచనాకు వచ్చి చికిత్స చేసేవాడని చెప్పారు. ఇప్పుడు పరీక్షలు, మిషన్లపై ఆధారపడే పరిస్థితి పెరిగిందన్నారు. పరీక్షలు చేయకపోతే రోగులే ఆందోళన చెందుతున్నారని చెప్పారు. వైద్యం ఖర్చు పెరుగుతోందని, భవిష్యత్‌లో వైద్య వ్యవస్థ మరింత దిగజారే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.

- నవ్వుకున్న చోటే.. గార్డియన్‌ ఆస్పత్రి

2008లో గార్డియన్‌ ఆస్పత్రికి శంకుస్థాపన చేసినప్పుడు చాలామంది తనను చూసి నవ్వుకున్నారని కాళీ ప్రసాద్‌రావు తెలిపారు. ములుగు రోడ్డులో ఆస్పత్రి నిర్మాణం ప్రారంభించినప్పుడు ‘ఇక్కడ ఏం డెవలప్‌మెంట్‌ ఉంటుంది’ అని పలువురు నిరుత్సాహపరిచారని చెప్పారు. అయితే తన విజన్‌పై నమ్మకంతో ఆస్పత్రి నిర్మించానన్నారు. 2010లో ఉద్యోగానికి రాజీనామా చేసి గార్డియన్‌ ఆస్పత్రిని ప్రారంభించానని తెలిపారు. రోగులకు 24/7 అందుబాటులో ఉండాలనే ఆలోచనతో ఆస్పత్రి పై అంతస్తులోనే ఇల్లు ఏర్పాటు చేసుకున్నానన్నారు. ఉద్యోగ ప్రస్థానం నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజూ రాత్రి 11 గంటల వరకు పేషెంట్లను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటానన్నారు.

- ‘పేదోళ్లకు న్యాయం జరగాలే’

తాను ప్రజలతో సత్సంబంధాలు, ప్రజాప్రతినిధులతో మంచి అనుబంధం కొనసాగిస్తానని అన్నారు. ఎమ్మెల్యేలు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ప్రజా ప్రతినిధులు తమ గ్రామస్తులను ఆస్పత్రికి పంపిస్తారని చెప్పారు. బిల్లుల్లోనూ పేదలకు వీలైనంత వెసులుబాటు కల్పిస్తానన్నారు. పేదలకు న్యాయం జరగాలన్నదే తన సిద్ధాంతమని స్పష్టం చేశారు. ట్రామా సర్జరీల్లో తెలంగాణలో తనకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.

- వైద్యంతో గౌరవం.. ఐఎంఏలో మరో అడుగు

1997లో ఐఎంఏ సభ్యత్వం తీసుకున్నానని కాళీ ప్రసాద్‌రావు తెలిపారు. ఐఎంఏ సమావేశం ఏది జరిగినా హాజరయ్యేవాడినన్నారు. 2023లో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశానని చెప్పారు. ఐఎంఏలో బీసీలు అధ్యక్షులుగా ఎదగడానికి గతంలో అనేక ఇబ్బందులు ఉండేవని, అలాంటి పరిస్థితిని సులభతరం చేసేందుకు తన వంతు కృషి చేశానన్నారు. వైద్య వృత్తి ద్వారా ఎంతో గౌరవం సంపాదించుకున్నానని చెప్పారు.

- ఇద్దరు బిడ్డలూ డాక్టర్లే

తన ఇద్దరు కుమార్తెలూ వైద్య రంగంలోనే ఉన్నారని కాళీ ప్రసాద్‌రావు తెలిపారు. పెద్ద కుమార్తె తేజస్వీ ఎంఎస్‌ ఆప్తల్మాలజీ పూర్తి చేశారని, అల్లుడు అనురాగ్‌ ఆర్థోపెడిక్‌ వైద్యుడని చెప్పారు. చిన్న కుమార్తె యశస్వి ఎండీ జనరల్‌ పూర్తి చేసిందన్నారు. రానున్న రోజుల్లో ఆస్పత్రిని మరింత అభివృద్ధి చేసి వారికే అప్పగించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఎన్టీఆర్‌ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి రాజకీయాలపై ఆసక్తి పెరిగిందని కాళీ ప్రసాద్‌రావు చెప్పారు. 1983లో ఎన్టీఆర్‌ పరకాలకు వస్తున్నారని తెలిసి స్నేహితులతో కలిసి రేపాక నుంచి సైకిళ్లపై పరకాలకు వచ్చామని గుర్తుచేసుకున్నారు. ఒక్కో సైకిల్‌పై ముగ్గురం వచ్చామన్నారు. టీడీపీ నాయకులతో తిరిగేవాడినని తెలిపారు. అయితే తన తాత కాంగ్రెస్‌ అభిమాని కావడంతో తనను మందలించేవారని చెప్పారు. 2004 నుంచి 2014 వరకు మున్నూరుకాపు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశానన్నారు.

- ఈటలే నా రాజకీయ గురువు

ఫ్రెండ్ రాజబోయిన యాకయ్య ద్వారానే ఈటల రాజేందర్‌తో పరిచయం ఏర్పడిందని కాళీ ప్రసాద్‌రావు తెలిపారు. ఈటల సహకారంతోనే మెడికల్‌ కాలేజీ ప్రారంభించానన్నారు. తనకు రాజకీయ గురువు ఈటల రాజేందర్‌ అని స్పష్టం చేశారు. ఎప్పటికైనా ఆయన వెంటే తన నడక ఉంటుందని చెప్పారు. పరకాల టికెట్‌ రావడం వెనుక ఈటల పాత్ర ఉందన్నారు. తాను టికెట్‌ కోసం ఈటలను ఎప్పుడూ ఒత్తిడి చేయలేదని చెప్పారు. తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఈటల కూడా పోటీ చేస్తారని ఒక కార్యక్రమంలో చెప్పిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు.

- పరకాల ప్రజలతోనే నేను

ఈటల రాజేందర్‌ ప్రోత్సాహంతోనే పరకాల నియోజకవర్గంలో పనిచేస్తున్నానని కాళీ ప్రసాద్‌రావు తెలిపారు. పరకాల ప్రజల కోసం పనిచేస్తున్నానన్నారు. గత ఎన్నికల్లో చాలామంది ఓటర్లు తనపై నమ్మకంతో ఓటు వేశారని చెప్పారు. ఎన్నికల్లో ఓడిపోయినందుకు బాధపడలేదన్నారు. అయితే బీసీలు అధికంగా ఉన్న ప్రాంతంలో బీసీ బిడ్డగా తనను కాదని ఇతర వర్గాలకు చెందిన వారిని ఆదరించడం బాధ కలిగించిందన్నారు. అయినా నియోజకవర్గాన్ని విడిచిపెట్టలేదని, ఫలితం వచ్చిన మరుసటి రోజు నుంచే ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నానన్నారు.
- చిన్నప్పటి నుంచే రాజకీయాలపై ఆసక్తి
చిన్నప్పటి నుంచే రాజకీయాలపై ఆసక్తి ఉందని కాళీ ప్రసాద్‌రావు చెప్పారు. అందుకేనేమో తన బుర్రలో ఎప్పుడూ ‘పాలిటిక్స్‌.. పాలిటిక్స్‌’ తిరుగుతుంటుందని నవ్వుతూ అన్నారు. 2004లో 50 మంది డాక్టర్లతో కలిసి వినోద్‌కుమార్‌ సహకారంతో కేసీఆర్‌ను కలిసి హన్మకొండ టికెట్‌ అడిగినట్లు తెలిపారు. అయితే పొత్తు వల్ల అవకాశం దక్కలేదన్నారు. 2005లో కార్పొరేషన్‌ మేయర్‌ అవకాశం కూడా వచ్చినట్లు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి కూడా ఆఫర్‌ వచ్చిందని, పరకాలలో బీసీగా తనను బరిలో దింపేందుకు ప్రయత్నాలు జరిగాయని చెప్పారు. అయితే తన రాజకీయ ప్రయాణం ఈటలతోనే అని స్పష్టం చేసినట్లు తెలిపారు.

- రాజకీయాలను కోర్సులా చదువుతున్నా

రాజకీయాలను కూడా ఒక కోర్సులా చదువుతున్నానని కాళీ ప్రసాద్‌రావు చెప్పారు. కసితో ముందుకు సాగుతున్నానన్నారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తనవంతు సహాయం చేస్తున్నానన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తన ఆస్పత్రికి వచ్చే వారికి బిల్లుల్లోనూ వెసులుబాటు కల్పిస్తున్నానన్నారు. రాజకీయాల్లోకి డబ్బు కోసం రాలేదని, డబ్బే కావాలంటే వైద్య రంగంలోనే సంపాదించుకునే అవకాశం తనకు ఉందన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తారనే నమ్మకం తనకు వచ్చిందన్నారు.

- ‘చదువుకున్నవాళ్లు రాజకీయాల్లోకి రావాలి’

ప్రస్తుతం రాజకీయాల్లో డబ్బు పెట్టాలి.. సంపాదించుకోవాలనే ధోరణి ఉందని కాళీ ప్రసాద్‌రావు అన్నారు. ఆ ధోరణి మారాలని ఆకాంక్షించారు. రాజకీయాల్లోకి చదువుకున్నవారు రావాలని, రాజకీయాలను బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. రాజకీయాల్లో బాస్‌ ఉండాలని, లేకపోతే రాజకీయాలు చేయకూడదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రజల కోసం పనిచేసే నాయకత్వం అవసరమన్నారు.

- డీలిమిటేషన్‌పై ఊహాగానాలే

డీలిమిటేషన్‌పై వస్తున్న ప్రచారం అంతా ఊహాజనితమేనని కాళీ ప్రసాద్‌రావు అన్నారు. డీలిమిటేషన్‌కు సంబంధించిన అసలు అంశాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు తప్ప ఎవరికీ తెలియవని వ్యాఖ్యానించారు. అధికారికంగా నిర్ణయం వెలువడే వరకు డీలిమిటేషన్‌పై వస్తున్న ప్రచారాలను నమ్మాల్సిన అవసరం లేదన్నారు. ఒక గ్రామీణ కుటుంబం నుంచి వచ్చిన కాళీ ప్రసాద్‌రావు ప్రయాణంలో చదువు, వైద్యం, సామాజిక అనుభవాలు, బీసీ చైతన్యం, రాజకీయ ఆసక్తి అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి కనిపిస్తున్నాయి. ఎంబీబీఎస్‌లో ఎదురైన కుల వివక్ష తనలో కసిని పెంచిందని చెప్పిన ఆయన.. అదే కసితో వైద్య రంగంలో ఎదిగానని చెబుతున్నారు. ఇప్పుడు బీసీలకు విద్య, చైతన్యం, హక్కుల కోసం పోరాటం అవసరమంటున్నారు. ఈటల రాజేందర్‌ను రాజకీయ గురువుగా పేర్కొంటూ పరకాలతో తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. వైద్యుడిగా రోగి నాడిని పట్టిన కాళీప్రసాద్‌రావు.. ఇప్పుడు పరకాల ప్రజల రాజకీయ నాడిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.

లక్ష్మణ్ బాపూజీ పోరాటం స్ఫూర్తిదాయకం
లక్ష్మణ్ బాపూజీ పోరాటం స్ఫూర్తిదాయకం

కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి

అక్షరదర్బార్, శాయంపేట:
తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ కోసం జీవితాంతం పోరాడిన ఉద్యమ నేత, స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. ఆయన సేవలు, త్యాగాలు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దుబాసి కృష్ణమూర్తి, బాసాని రవి, మారపల్లి రాజేందర్, వరదరాజు, వడ్డేపల్లి శ్రీనివాస్, వినుకొండ శంకరాచారి, అంకేశ్వరపు కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

చెల్లిని కాపాడబోయి అక్క..
చెల్లిని కాపాడబోయి అక్క..
- నీటి కుంటలో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి
- కాసిందేవిపేట గ్రామంలో విషాదం

అక్షరదర్బార్, ములుగు:
సంతోషంగా సాగిపోతున్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా చీకట్లు అలుముకున్నాయి. తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటారనుకున్న ఇద్దరు కుమార్తెలు కళ్లముందే అనంత లోకాలకు వెళ్లడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. నీటి కుంట రూపంలో వచ్చిన ప్రమాదం ఇద్దరు అక్కాచెల్లెళ్లను బలితీసుకుంది. ములుగు మండలం కాసిందేవిపేట గ్రామంలో ఆదివారం ఈ హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది.
- ఏం జరిగిందంటే..?
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాసిందేవిపేట గ్రామానికి చెందిన అంజద్ పాషా తన రోజువారీ పొలం పనుల కోసం కుమార్తెలు సమిత్ (18), ఆసియా (9)లను వెంటబెట్టుకొని వెళ్లాడు. తండ్రి పొలంలో పనులు చేసుకుంటుండగా, చిన్న కుమార్తె ఆసియా నీళ్ల కోసం సమీపంలోని నీటి కుంట వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి కుంటలో పడిపోయింది.
- చెల్లిని కాపాడేందుకు వెళ్లి..
కుంటలో పడి నీటిలో మునుగుతున్న చెల్లి ఆసియాను గమనించిన పెద్ద కుమార్తె సమిత్ (18) ఎలాగైనా కాపాడుకోవాలని తల్లడిల్లిపోయింది. ఆలోచించకుండా వెంటనే కుంటలోకి దిగింది. అయితే నీటి లోతు ఎక్కువగా ఉండటం, సమిత్‌కు ఈత రాకపోవడంతో చెల్లితో పాటు అక్క కూడా నీటిలోనే మునిగిపోయింది. పొలం పనిలో ఉన్న తండ్రి గమనించి వచ్చేలోపే ఇద్దరూ నీట మునిగి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు.
- కన్నీరు మున్నీరవుతున్న తల్లిదండ్రులు
కళ్లముందే ఇద్దరు బిడ్డలు ప్రాణాలు విడవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వారు ఏడుస్తున్న తీరు స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ఒకేసారి ఇద్దరు కుమార్తెలు మృతి చెందడంతో కాసిందేవిపేట గ్రామంలో తీవ్ర సోకసంద్రం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

aksharadarbar-20-09-2026

చాకిరేవు గుట్టపై అక్రమ మైనింగ్‌కు అనుమతులెలా?
చాకిరేవు గుట్టపై అక్రమ మైనింగ్‌కు అనుమతులెలా?

అసైన్డ్‌ భూముల్లో తవ్వకాలకు అనుమతులపై డా. కాళీ ప్రసాద్‌రావు ప్రశ్న

అక్షరదర్బార్, పరకాల
నడికూడ మండలంలోని కంటాత్మకూర్‌ గ్రామంలోని చాకిరేవు గుట్టపై మైనింగ్‌కు అనుమతులు ఎలా ఇచ్చారో అధికారులు స్పష్టం చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు డా. కాళీ ప్రసాద్‌రావు డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన జాక్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. చాకి రేవు గుట్ట పరిసరాల్లోని 717/28 సర్వే నంబర్‌లో సుమారు 12 ఎకరాల అసైన్డ్‌ భూములు ఉన్నాయని తెలిపారు. అందులో సుమారు ఐదు ఎకరాల గుట్టకు కాంట్రాక్టర్‌ అనుమతులు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
గుట్టపై తవ్వకాలు జరిగితే తాళ్లతో జీవనం సాగించే సుమారు 200 కుటుంబాలతోపాటు ముదిరాజుల జీవనోపాధిపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. అసైన్డ్‌ భూముల్లో మైనింగ్‌కు మైనింగ్‌ శాఖ ఏ ప్రాతిపదికన అనుమతులు ఇచ్చిందో పరిశీలించాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే ఈ అంశాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి

చాకిరేవు గుట్ట ప్రాంతాన్ని నడికూడ జాక్‌ ఆధ్వర్యంలో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని డా. కాళీ ప్రసాద్‌రావు కోరారు. కాకతీయుల కాలం నాటి నిర్మాణాలకు సంబంధించిన ఆనవాళ్లు ఈ ప్రాంతంలో ఉన్నాయని తెలిపారు. రజకుల మండేలయ్య, పురాతన శివాలయం వంటి చారిత్రక ప్రదేశాలు ఉన్నాయని, నిధుల కోసం తవ్విన ఆనవాళ్లు కూడా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.

కాకతీయుల కాలంలో నిర్మించిన ‘మాటు’ ఇప్పటికీ రైతులకు సాగునీరు అందించేందుకు ఉపయోగపడుతోందని తెలిపారు. చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం ఉన్న ఈ ప్రాంతాన్ని సంరక్షించడంతోపాటు పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అక్రమ మైనింగ్‌ తవ్వకాలపై జాక్‌ ద్వారా పోరాటం చేస్తామని డా. కాళీ ప్రసాద్‌రావు తెలిపారు.

ఆ గుట్టపై కాంట్రాక్టర్ కన్ను!
ఆ గుట్టపై కాంట్రాక్టర్ కన్ను!

గ్రానైట్ పేరుతో గుప్తనిధుల వేటా?..

చాకిరేవు గుట్ట పరిరక్షణకు గ్రామస్తుల దీక్ష

అక్షరదర్బార్,నడికూడ
నడికూడ మండలంలోని కంఠాత్మకూర్ గ్రామంలోని చాకిరేవు గుట్టపై వివాదం రాజుకుంటోంది. గ్రానైట్ తవ్వకాల పేరుతో గుట్టను ధ్వంసం చేసి, అందులో ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్న పురాతన ఆనవాళ్లు, నిధులను కొల్లగొట్టేందుకు ఓ బడా కాంట్రాక్టర్ ప్రయత్నిస్తున్నాడని వారు ఆరోపిస్తున్నారు. గుట్టపై కాంట్రాక్టర్ కన్ను పడటం వెనుక అసలు ఉద్దేశం గ్రానైట్ తవ్వకాలేనా.. లేక గుప్తనిధుల కోసమా? అంటూ గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

గుట్టపై శివాలయం, మడేల్లయ్య ఆలయం, అనంత పద్మస్వామి ఆలయ ఆనవాళ్లు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. అంతేకాకుండా గుట్టపై తొమ్మిది దొనలు ఉన్నాయని, వాటిలో వజ్ర వైఢూర్యాలు వంటి విలువైన వస్తువులు ఉన్నట్లు పూర్వీకుల నుంచి కథనాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. దీంతో ఈ గుట్టను మరో అనంతనాభస్వామి ఆలయంగా గ్రామస్తులు అభివర్ణిస్తున్నారు.

పరిరక్షణకు జేఏసీ

గుట్టను కాపాడుకునేందుకు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో అన్ని పార్టీలకు చెందిన నాయకులు, గ్రామస్తులు కలిసి చాకిరేవు గుట్ట పరిరక్షణ కమిటీ (జేఏసీ)గా ఏర్పడ్డారు. గత కొన్ని రోజులుగా గుట్ట పరిరక్షణ కోసం నిరాహార దీక్షలు చేపడుతున్నారు. గుట్ట తమ గ్రామానికి ప్రతిరూపమని, దాని ఉనికిని కాపాడుకునేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమని వారు స్పష్టం చేస్తున్నారు.

తవ్వకాలు నిలిపివేయాలి

చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్నట్లు చెబుతున్న చాకిరేవు గుట్టను గ్రానైట్ తవ్వకాల పేరుతో ధ్వంసం చేయడం సరికాదని గ్రామస్తులు అంటున్నారు. గుట్టపై తవ్వకాలకు సంబంధించిన ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్పందించి గుట్టపై సమగ్రంగా పరిశీలన జరిపి, పురాతన ఆనవాళ్లు, ఆలయాలు, గుట్ట సహజ స్వరూపాన్ని పరిరక్షించాలని కోరుతున్నారు.

aksharadarbar-19-09-2026

ఏసీబీ వలలో తహశీల్దార్
ఏసీబీకి వలలో త‌హ‌సీల్దార్‌
- రూ.14 వేల లంచం తీసుకుంటూ ప‌ట్టుబడిన సృజన్
- తహసీల్దార్‌ ఆఫీస్ లో కొన‌సాగుతున్న‌ ఏసీబీ సోదాలు
- భూమి మార్పిడి కోసం లంచం డిమాండ్‌
- ఏసీబీ అధికారుల అదుపులో తహసీల్దార్‌

అక్షరదర్బార్, గోవిందరావుపేట: ములుగు జిల్లా గోవిందరావుపేట తహసీల్దార్‌ సృజన్‌కుమార్‌ రూ.14 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. వేరే ఒకరి పేర భూమి మార్పిడి ప్రక్రియ కోసం లంచం డిమాండ్‌ చేసిన ఫిర్యాదుపై ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడి చేసినట్లు తెలిసింది. తహసీల్దార్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు, సోదాలు నిర్వహిస్తున్నారు. లంచం తీసుకున్న ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. భూమి మార్పిడి కోసం కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు డిమాండ్‌ చేశారన్న ఫిర్యాదుతో ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఏసీబీ అధికారులు తహసీల్దార్‌ సృజన్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. సోదాలు పూర్తయిన తర్వాత కేసు నమోదు, స్వాధీనం చేసుకున్న నగదు, ఇతర వివరాలపై ఏసీబీ అధికారులు ప్రకటన విడుదల చేయనున్నారు.

aksharadarbar-18-09-2026

ఉద్యోగమంటూ ఘరానా మోసం
ఉద్యోగమంటూ ఘరానా మోసం
- ఏపీకి చెందిన సైబర్ నేరస్తుడి అరెస్ట్

అక్షరదర్బార్, పర్వతగిరి: పీఎం కిసాన్ యోజనలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సైబర్ నేరస్తుడిని పర్వతగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. పర్వతగిరి సర్కిల్ ఇన్ స్పెక్టర్ సంతోష్ తెలిపిన వివరాల ప్రకారం సంఘటన విశేషాలు ఇలా ఉన్నాయి. విజయవాడకు చెందిన మాచర్ల ఆనంద్ సాగర్ అనే వ్యక్తి, పర్వతగిరి మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన కన్నెబోయిన రాజుకు కేంద్ర ప్రభుత్వ ‘పీఎం కిసాన్ యోజన’లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. మాటలు నమ్మిన రాజు నుండి రూ.లక్ష వసూలు చేశాడు. ఎంతకాలమైనా ఉద్యోగం ఇప్పించకపోవడమే కాకుండా, తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు.
- విజయవాడలో అరెస్ట్ - రిమాండ్‌కు తరలింపు
బాధితుడు కన్నెబోయిన రాజు ఫిర్యాదు మేరకు పర్వతగిరి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో విజయవాడలోని నిందితుడు పనిచేస్తున్న ఆఫీసు వద్ద అతడిని పోలీసులు ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని, అతడిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సంతోష్ తెలిపారు.

స్కీంలు కాదు.. సీట్లు కావాలి
స్కీంలు కాదు.. సీట్లు కావాలి!
- బీసీలకు సామాజిక న్యాయం, రాజ్యాధికారమే లక్ష్యంగా ఉద్యమిస్తాం
- జనరల్ సీట్లు అందరివీ.. ఓసీ వర్గానికే ఎందుకు?
- జనరల్ మేయర్ స్థానం బీసీలకే దక్కాలి
- అక్టోబర్ లో పరకాలలో బీసీల బహిరంగ సభ
- ఉమ్మడి వరంగల్ లో 8 సభలకు ప్లాన్.. బీసీలను ఏకం చేస్తాం
- ఓబీసీ ప్రెసిడెంట్, కుడా మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్

అక్షరదర్బార్,
హనుమకొండ

బీసీలకు కేవలం సంక్షేమ పథకాలు అందించడం మాత్రమే సామాజిక న్యాయం కాదని, రాజకీయ అధికారంలో వాటా, చట్టసభల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించినప్పుడే నిజమైన న్యాయం జరుగుతుందని ఓబీసీ ప్రెసిడెంట్, కుడా మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ స్పష్టం చేశారు. "నోట్లు కొందరివి.. ఓట్లు బీసీలవి" అన్న రీతిలో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మార్పు రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. డిజిటల్ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన తన విద్యా, సామాజిక, రాజకీయ ప్రస్థానంతో పాటు వరంగల్ సమగ్ర అభివృద్ధి, బీసీల హక్కుల సాధనపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
- మేయర్ స్థానం బీసీలకే దక్కాలి
రిజర్వేషన్ స్థానాలు మినహా జనరల్ స్థానాలు అన్ని వర్గాల వారు పోటీ చేయడానికి ఉద్దేశించినవని, కానీ అవి ఒక్క వర్గానికే పరిమితమైనట్లు మారడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. వరంగల్ మేయర్ స్థానం జనరల్ కాగానే నిర్దిష్ట సామాజిక వర్గాల పేర్లే ప్రచారంలోకి రావడంపై నిలదీశారు. బీసీలలో సామర్థ్యం ఉన్న నాయకులు లేరా అని ప్రశ్నించిన ఆయన, రాబోయే ఎన్నికల్లో జనరల్ మేయర్ స్థానాన్ని బీసీలకే దక్కేలా ప్రజల్లో చైతన్యం తెస్తామన్నారు.
- అక్టోబర్‌లో పరకాలలో భారీ బహిరంగ సభ
బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్‌తో అక్టోబర్‌లో పరకాలలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 8 ప్రధాన ప్రాంతాల్లో అవగాహన సభలు చేపడతామన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ నాయకులందరినీ ఒకే వేదికపైకి తెచ్చి హక్కుల సాధన కోసం ఉద్యమిస్తామన్నారు.
- ఈడబ్ల్యూఎస్, ఆదాయ పరిమితులపై వివక్ష ఏల?
బీసీలకు రూ.1.50 లక్షల ఆదాయ పరిమితి విధిస్తూ, ఓసీలకు రూ.8 లక్షల పరిమితితో ఈడబ్ల్యూఎస్ వర్తింపజేయడం వెనుక ఉన్న న్యాయమేమిటని నిలదీశారు. 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల బీసీ యువతకు తీవ్ర ఉద్యోగ నష్టం జరుగుతోందని, అన్ని పార్టీలు బీసీల హక్కులపై తమ స్పష్టమైన వైఖరిని బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
- అక్టోబర్ 9న జాబ్ మేళా
బీసీ యువతకు కేవలం రాజకీయ నినాదాలు సరిపోవని, విద్యా, సాంకేతిక నైపుణ్యాలు పెంచడమే లక్ష్యంగా అక్టోబర్ 9న విద్యా మంత్రిత్వ శాఖ సహకారంతో బృహత్ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఓసీలు తమకు శత్రువులు కారని, అయితే బీసీలకు చట్టబద్ధంగా దక్కాల్సిన అవకాశాలను ఇతరులు ఆక్రమించకూడదని స్పష్టం చేశారు.
- వరంగల్ అభివృద్ధికి రూ.500 కోట్ల రాబడి విజన్
కుడా ద్వారా రూ.30 లక్షల లోపు ధరలోనే మధ్యతరగతి కుటుంబాలకు నాణ్యమైన అపార్ట్‌మెంట్లు నిర్మించి ఇవ్వవచ్చని సూచించారు. ప్రభుత్వ స్థలాలు, ప్రైవేట్ భూముల అభివృద్ధి, మార్టిగేజ్ ఛార్జీల వసూలు ద్వారా ఒక్క పశ్చిమ నియోజకవర్గం నుంచే రూ.500 కోట్ల ఆదాయం సమకూర్చవచ్చని వివరించారు.
- ఐటీ టవర్లు, డిస్నీలాండ్ తరహా టూరిజం ప్రాజెక్ట్
వరంగల్‌ను ఐటీ హబ్‌గా మార్చే క్రమంలో అమెరికా పర్యటనలో 13 కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. నగరంలోనే ఐటీ టవర్లు నిర్మిస్తే స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. దేవునూరు గుట్టల్లోని 5 వేల ఎకరాల్లో డిస్నీలాండ్ తరహా పర్యాటక ప్రాజెక్టు, ఓఆర్‌ఆర్ చుట్టూ లాజిస్టిక్ హబ్ ఏర్పాటు చేస్తే వరంగల్ రూపురేఖలు మారతాయని పేర్కొన్నారు.
- తండ్రి స్ఫూర్తితోనే మాస్టర్ జీ ఇన్‌స్టిట్యూట్స్ స్థాపన
1970లో జన్మించిన తనకు తండ్రి లక్ష్మీరాజం ప్రోత్సాహమే జీవితానికి బాటలు వేసిందన్నారు. రూ.1,200 జీతంతో ఉద్యోగ జీవితం ప్రారంభించి, తండ్రి అందించిన ప్రోత్సాహంతో 1992లో మాస్టర్ జీ ఇన్‌స్టిట్యూట్స్ ప్రారంభించినట్లు తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ ప్రేరణతో 2001 నుండి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నానని, పదవులు వచ్చినా రాకపోయినా బీసీల హక్కులు, వరంగల్ నగర సమగ్ర అభివృద్ధి కోసం తన శ్వాస ఉన్నంత వరకు పోరాడుతానని స్పష్టం చేశారు.

కమిషనర్ తీరుపై ఆసక్తికర చర్చ
కమిషనర్ తీరుపై ఆసక్తికర చర్చ

- జాతీయ పతాకానికి సెల్యూట్‌ చేయకుండా నిల్చున్న పవన్
- మరోసారి చర్చనీయం

అక్షరదర్బార్,పరకాల:
జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పరకాల మున్సిపల్‌ కమిషనర్‌ పవన్‌ తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. గత ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకుందని, తాజాగా అమరధామంలో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లోనూ మున్సిపల్ కమిషనర్ పవన్ జాతీయ పతాకానికి సెల్యూట్‌ చేయకపోవటం స్థానికంగా చర్చకు దారి తీసింది. అమరదామంలో ఆగస్టు 15న స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సమయంలో కమిషనర్‌ సెల్యూట్‌ చేయలేదని అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంపై బీజేపీ నాయకులు అధికారులకు ఫిర్యాదు చేసి, జాతీయ పతాకాన్ని గౌరవించలేదని ఆరోపించారు. తాజాగా గురువారం పరకాల పట్టణంలోని అమరధామంలో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ పవన్‌ పాల్గొన్నప్పటికీ పతాకానికి సెల్యూట్‌ చేయకపోవడం విశేషం. యూనిఫాములో లేని అధికారి జెండా వైపు తిరిగి గౌరవంగా నిలబడితే సరిపోతుంది అయితే ఇక్కడ తనతో సహా కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ జెండాకు సెల్యూట్ చేస్తుండగా కమిషనర్ పవన్ సెల్యూట్ చేయకుండా నిల్చుని ఉండటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఒకే తరహా ఘటన రెండోసారి చోటుచేసుకోవడంపై పలువురు ఆసక్తిగా చర్చించుకోవడం కనిపించింది.

aksharadarbar-17-09-2026

akshara Darbar special

aksharadarbar-16-09-2026

'మహా' రూపురేఖలు
'మహా' రూపురేఖలు

- మల్టీ లెవెల్ పార్కింగ్ నుంచి మెగా డ్రైనేజీ ప్రాజెక్టు వరకు!
- పార్కింగ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం
- అశోక హోటల్‌ ఎదురుగా 'మల్టీలెవల్‌ పార్కింగ్‌'
- హన్మకొండ చౌరస్తా రీడెవలప్‌మెంట్‌కు ప్లాన్
- రూ.5 వేల కోట్లతో అండర్‌ డ్రైనేజీ పనులకు సన్నాహాలు
- రూ.500 కోట్లతో తాగునీటి సరఫరా టెండర్ ప్రక్రియ పూర్తి
- చెత్త రహిత నగరం కోసం బయో మైనింగ్, బయో సీఎన్జీ ప్లాంట్లు
- భద్రకాళి, వరంగల్‌ కోట, దేవునూరు గుట్టలపై ప్రత్యేక దృష్టి
- డిజిటల్ మీడియా చిట్ చాట్ లో హనుమకొండ జిల్లా కలెక్టర్‌, కుడా వైస్‌ చైర్ పర్సన్ చాహత్‌ బాజ్‌పాయ్

అక్షరదర్బార్, హనుమకొండ

నగరంలో పెరుగుతున్న పార్కింగ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు హనుమకొండలో మల్టీలెవల్‌ పార్కింగ్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నామని హనుమకొండ జిల్లా కలెక్టర్‌, కుడా వైస్‌ చైర్ పర్సన్ చాహత్‌ బాజ్‌పాయ్ వెల్లడించారు. హనుమకొండలో అశోక హోటల్‌ ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలంలో మల్టీలెవల్‌ కార్‌ పార్కింగ్‌ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయని, ముందు భాగాన్ని వాణిజ్య అవసరాలకు వినియోగించేలా రూపకల్పన చేస్తున్నామని ఆమె తెలిపారు. అదే తరహాలో హనుమకొండ చౌరస్తాలోని ఆర్టీసీ బస్‌స్టేషన్‌ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసే ఆలోచన ఉందన్నారు. నగర అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చాహత్ బాజ్ పాయ్ చెప్పారు. మంగళవారం తన చాంబర్‌లో డిజిటల్‌ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో జిల్లా, నగర అభివృద్ధి పనులపై ఆమె వివరాలు వెల్లడించారు.

- అశోక హోటల్‌ ఎదురుగా మల్టీలెవల్‌ పార్కింగ్‌

హన్మకొండలో పార్కింగ్‌ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోందని చాహత్‌ బాజ్‌పేయి తెలిపారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు మల్టీలెవల్‌ పార్కింగ్‌ వ్యవస్థను అమలు చేసే దిశగా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. అశోక హోటల్‌కు ఎదురుగా ఉన్న కుడా స్థలంలో ఈ నిర్మాణాన్ని చేపట్టేందుకు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. పార్కింగ్‌ కోసం మాత్రమే స్థలాన్ని వినియోగించకుండా ముందు భాగంలో వాణిజ్య దుకాణాలను ఏర్పాటు చేసి లీజుకు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. దీనివల్ల ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడకుండా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని వివరించారు. పార్కింగ్‌ సమస్య పరిష్కారంతో పాటు నగరంలోని వాణిజ్య కార్యకలాపాలకు కూడా ఊతమిచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు.

- హన్మకొండ చౌరస్తా రీడెవలప్‌మెంట్‌

హన్మకొండ చౌరస్తాను సమగ్రంగా రీడెవలప్‌మెంట్‌ చేయాలనే ఆలోచన ఉందని కలెక్టర్‌ తెలిపారు. చౌరస్తాలోని ఆర్టీసీ బస్‌స్టేషన్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న ఖాళీ స్థలాలను కలుపుకొని ప్లాజా నిర్మాణం చేపట్టే ప్రతిపాదనపై ఆర్టీసీ అధికారులతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ఈ ప్రతిపాదనను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ దృష్టికి కూడా తీసుకెళ్లామని తెలిపారు. నగరానికి మరింత ఆకర్షణ తీసుకురావడంతో పాటు ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా, వాణిజ్య వసతులు కల్పించేలా చౌరస్తా అభివృద్ధి చేయాలన్నదే లక్ష్యమన్నారు. మల్టీలెవల్‌ పార్కింగ్‌, ప్లాజా నిర్మాణం పూర్తయితే హన్మకొండ ప్రధాన కూడలిలో ట్రాఫిక్‌ ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని వివరించారు.

- అండర్‌ డ్రైనేజీకి రూ.5 వేల కోట్ల ప్రాజెక్టు

హన్మకొండ, కాజీపేటతో పాటు గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో అండర్‌ డ్రైనేజీ పనులకు సంబంధించిన గ్రౌండ్‌ వర్క్‌ కొనసాగుతోందని చాహత్‌ బాజ్‌పేయి తెలిపారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూముల గుర్తింపు ప్రక్రియలో భాగంగా ఇప్పటికే దాదాపు 10 ఎకరాల భూమిని గుర్తించామని చెప్పారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వర్షపు నీరు, మురుగునీటి నిర్వహణకు శాశ్వత పరిష్కారం చూపించడమే లక్ష్యంగా పనులను ముందుకు తీసుకెళ్తున్నామని వెల్లడించారు. అండర్‌ డ్రైనేజీ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, సంబంధిత అధికారులు పరిశీలన చేస్తున్నారని తెలిపారు. భారీ వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టును దశలవారీగా అమలు చేయనున్నామని చెప్పారు.

- తాగునీటి వ్యవస్థకు రూ.500 కోట్లు

గ్రేటర్‌ వరంగల్‌ వాటర్‌ వర్క్స్‌ అభివృద్ధికి ప్రభుత్వం కొత్తగా రూ.500 కోట్లు మంజూరు చేసిందని కలెక్టర్‌ తెలిపారు. రాబోయే 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిధులతో పనులు చేపట్టనున్నామని చెప్పారు. కొత్త పైపులైన్ల నిర్మాణం, పాత పైపులైన్ల మరమ్మతులు, నీటి సరఫరా వ్యవస్థ బలోపేతం, కొత్త నిర్మాణాలు, వాటర్‌ ట్యాంకులు, వాటర్‌ ప్లాట్ల ఏర్పాటు వంటి పనులకు నిధులను వినియోగించనున్నామని వివరించారు. నగరంలో 30, 40 ఏళ్ల భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి త్వరలోనే ఈ పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారని చెప్పారు.

- భద్రకాళి, వరంగల్‌ కోటకు పర్యాటక హంగులు

భద్రకాళి ఆలయ అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.90 కోట్ల ఎస్డీపీ నిధులు కేటాయించిందని చాహత్‌ బాజ్‌పేయి తెలిపారు. ఈ నిధులతో చేపట్టాల్సిన పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. భద్రకాళి ఆలయం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా పర్యాటక ప్రాంతంగా కూడా మరింత అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. భద్రకాళి బండ్‌ వద్ద స్టోన్‌ వర్క్‌ పనులు పెండింగ్‌లో ఉన్నాయని, ఇందుకోసం రూ.19 కోట్లతో టెండర్లు పిలిచామని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అభివృద్ధి పనులను ఆయనకు చూపించే ఆలోచన ఉందన్నారు.

- వరంగల్ కోట చుట్టూ..
వరంగల్‌ కోట చుట్టూ ఉన్న సుమారు 4 కిలోమీటర్ల రక్షణ కందకాన్ని పునరుద్ధరించి బోటింగ్‌ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఖిలా వరంగల్‌ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రపంచ బ్యాంకు సహకారం తీసుకుంటున్నామని వెల్లడించారు. నగరంలో ముంపు సమస్యను తగ్గించేందుకు రిటర్న్‌ వాల్‌, డ్రైనేజీలు, నాలాల అభివృద్ధి పనులు కూడా చేపట్టామని వివరించారు.

- దేవునూరు గుట్టలు టూరిజం స్పాట్‌గా

ధర్మసాగర్‌ మండలంలోని దేవునూరు గుట్టలను అటవీశాఖ సహకారంతో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే ఆలోచన ఉందని కలెక్టర్‌ తెలిపారు. ధర్మసాగర్‌ రిజర్వాయర్‌తో పాటు అటవీ విస్తీర్ణం ఉన్న దేవునూరు గుట్టలను అభివృద్ధి చేస్తే ప్రజలకు ఆహ్లాదకరమైన ప్రదేశం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. దీనిపై గతంలోనే ప్రతిపాదనలు రూపొందించారని, ప్రస్తుతం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధి అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందితే స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు.

- డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్వహణపై దృష్టి

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రగతిలో ఉందని, పనుల్లో మరింత వేగం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చాహత్‌ బాజ్‌పేయి తెలిపారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ వందశాతం పూర్తయిందని చెప్పారు. అయితే కొన్ని ప్రాంతాల్లో నీటి వసతి, డ్రైనేజీ సమస్యలు లబ్ధిదారులు తమ దృష్టికి తీసుకొస్తున్నారని తెలిపారు. అంబేద్కర్‌నగర్‌లోని డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల సముదాయంలో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కార్పొరేషన్‌ అధికారులు టెండర్లు పిలిచారని, త్వరలో పనులు పూర్తవుతాయని చెప్పారు. కేటాయించిన ఇళ్లలో లబ్ధిదారులు నివసిస్తున్నారా లేదా అనే అంశంపై ఆక్యుపెన్సీ వెరిఫికేషన్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు. అర్హులైన వారు ఇళ్లను వినియోగించుకోవాలన్నదే ఈ ప్రక్రియ ఉద్దేశమన్నారు.

- బయోమైనింగ్‌, పారిశుధ్యానికి ప్రాధాన్యం

నగరంలో శానిటేషన్‌ క్లియరెన్స్‌ను సవాల్‌గా తీసుకుని పనిచేస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. చెత్తను డంపింగ్‌ చేయకుండా బయోమైనింగ్‌, బయో సీఎజీ ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి పెట్టామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. డంపింగ్‌ యార్డు విషయంలో కొత్తగా వెతుకులాట చేయడం లేదని, అందుబాటులో ఉన్న వ్యవస్థను మెరుగుపరిచే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. నగర పరిశుభ్రత, వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.

- అర్హులైన ఓటర్ల పేర్లు తొలగకుండా చర్యలు

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ కొనసాగుతోందని, ఈ ప్రక్రియపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించామని చాహత్‌ బాజ్‌పేయి తెలిపారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. బూత్‌ లెవల్‌ అధికారులు కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని వెల్లడించారు. ప్రతి అర్హుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడటంతో పాటు, అనర్హుల పేర్లను నిబంధనల ప్రకారం గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ప్రజలు తమ ఓటరు వివరాలను పరిశీలించుకుని సవరణలు అవసరమైతే సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.

- ఐఏఎస్‌ కావాలన్న లక్ష్యంతో సివిల్స్‌లోకి

మధ్యప్రదేశ్‌లోని గుణలో టెన్త్‌ వరకు చదువుకున్నానని, ఇంటర్‌ విద్యను గ్వాలియర్‌లో పూర్తి చేశానని చాహత్‌ బాజ్‌పేయి తెలిపారు. 2016లో ఐఐటీ కాన్పూర్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశానని చెప్పారు. తన తండ్రి ఇంజనీరింగ్‌ విభాగంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారని, ఆయన ఉన్నతాధికారులతో పనిచేసిన అనుభవాలు, కలెక్టర్‌ స్థాయి బాధ్యతల గురించి చెప్పే విధానం తనపై ప్రభావం చూపిందన్నారు. ప్రజలకు ఎక్కువగా సేవ చేసే అవకాశం సివిల్‌ సర్వీసుల్లో ఉంటుందని భావించి ఆ దిశగా అడుగులు వేశానని తెలిపారు. ఇంజనీరింగ్‌ చివరి సంవత్సరంలోనే తొలిసారి సివిల్స్‌ పరీక్ష రాశానని, మూడో ప్రయత్నంలో విజయం సాధించానని చెప్పారు. సివిల్స్‌ శిక్షణ సమయంలోనే వరుణ్‌ రెడ్డితో పరిచయం ఏర్పడిందని తెలిపారు.

కాలేజీ గ్రౌండా.. నీటి మడుగా!
కాలేజీ గ్రౌండా.. నీటి!

చినుకు పడితే చిత్తడే..

విద్యార్థులు, వాకర్లకు తీవ్ర ఇబ్బందులు

ఎలిఫ్యాడ్‌ కోసం వేసిన సీసీని తొలగించకుండా వదిలేయడంతో సమస్య

అక్షరదర్బార్, పరకాల:
పరకాల ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానం చినుకు పడితే చిత్తడిగా.. భారీ వర్షం కురిస్తే నీటిమడుగుగా మారుతోంది. విద్యార్థులు, పట్టణ ప్రజలు నిత్యం వినియోగించే ఈ మైదానం అధికారుల నిర్లక్ష్యంతో అధ్వానంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పట్టణ ప్రజలు మైదానంలో వాకింగ్‌ చేస్తుంటారు. పరకాలతోపాటు పరిసర ప్రాంతాల నుంచి ప్రాథమిక పాఠశాల నుంచి డిగ్రీ వరకు విద్యార్థులు వివిధ విద్యాసంస్థలకు రాకపోకలు సాగిస్తుంటారు. ఇంత ప్రాధాన్యం ఉన్న ప్రాంగణంలో వర్షపు నీరు నిలిచిపోవడంతో విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఎలిఫ్యాడ్‌ కోసం వేసిన సీసీనే సమస్యగా..

పరకాలకు ముఖ్యమంత్రి వచ్చిన సందర్భంగా హెలికాప్టర్‌ ల్యాండింగ్‌ కోసం మైదానంలో సీసీతో ఎలిఫ్యాడ్‌ ఏర్పాటు చేశారు. కార్యక్రమం పూర్తయిన అనంతరం ఆ సీసీ నిర్మాణాన్ని పూర్తిగా తొలగించకుండా అక్కడే పగులగొట్టి వదిలేయడంతో శిథిలాలు పేరుకుపోయాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో పిల్లలు ఆడుకునేందుకు, ప్రజలు వాకింగ్‌ చేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అదే ప్రాంతంలో వర్షపు నీరు భారీగా నిలిచిపోతోందని పేర్కొంటున్నారు.

మైదానాన్ని అభివృద్ధి చేయాలి

నూతన డిగ్రీ కళాశాల నిర్మాణంపై దృష్టి సారిస్తున్న అధికారులు, విద్యార్థులు వినియోగించే కళాశాల మైదానాన్ని మాత్రం పట్టించుకోకపోవడం ఏమిటని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మైదానంలోని సీసీ శిథిలాలు, వ్యర్థాలను తొలగించి, అవసరమైన చోట మొరం, క్రషర్‌ డస్ట్‌ పోసి చదును చేయాలని కోరుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే స్పందించి మైదానాన్ని పరిశీలించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విద్యార్థులు, పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి
సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి

తెలంగాణ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి

గుజ్జల ప్రేమేందర్‌రెడ్డి

అక్షరదర్బార్,పరకాల:
సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు గుజ్జల ప్రేమేందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం పరకాల బీజేపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1948 సెప్టెంబర్‌ 17న సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ చేపట్టిన పోలీసు చర్య అనంతరం హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైందన్నారు. తెలంగాణ చరిత్ర, ఉద్యమాలను పాఠ్యపుస్తకాల్లో చేర్చి విద్యార్థులకు బోధించాలని కోరారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎంఐఎంతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.

బీజేపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్‌ పగడాల కాళీప్రసాద్‌రావు మాట్లాడుతూ.. రజాకారుల దాడులు, అకృత్యాలను చరిత్రలో గుర్తుంచుకోవాలని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహిస్తామని గత ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కాలేదని విమర్శించారు. పరకాలకు వైద్య కళాశాల ఎవరూ తీసుకొచ్చినా స్వాగతిస్తామని, గత పదేళ్లలో ఎందుకు ఏర్పాటు కాలేదని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని ప్రశ్నించారు. కార్యక్రమంలో పరకాల మున్సిపల్ కౌన్సిలర్లు కుక్కల విజయకుమార్, బెజ్జంకి పూర్ణ చారి, ఆకుల లావణ్య శ్రీధర్, జిల్లా కోశాధికారి ఎర్రం రామన్న, పట్టణ ప్రధాన కార్యదర్శి పాలకుర్తి తిరుపతి, దంచనాధుల కిరణ్, మాజీ మున్సిపల్ చైర్మన్ మార్త రాజభద్రయ్య,ఓబీసీ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి ఉడుత చిరంజీవి,జిల్లా నాయకులు బాసాని సోమరాజు, బీసీ మోర్చా మండల అధ్యక్షులు పైండ్ల రంజిత్, నాయకులు కోడెల లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.

మళ్లీ మంచి రోజులొస్తాయి
మళ్లీ మంచి రోజులొస్తాయి
- కాంగ్రెస్‌ను వీడేది లేదు.. రాహుల్‌ను ప్రధాని చేయడమే మా లక్ష్యం
- మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి
- పదవులు తాత్కాలికం.. ప్రజల ప్రేమే శాశ్వతం
- బర్తరఫ్ పై బాధ లేదు.. అకారణంగా తొలగించారనే వేదన ఉంది
- ఈస్ట్‌లో 24 డివిజన్లు గెలుస్తాం.. వచ్చే ఎన్నికల్లో పోటీ నాదే
- మాజీ మంత్రి కొండా సురేఖ స్పష్టం
- కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం

అక్షరదర్బార్, వరంగల్: వరంగల్ లోని ఎంకే నాయుడు హోటల్‌లో వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలు, కొండా అభిమానులతో మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఆదివారం సమావేశం నిర్వహించారు. మంత్రి పదవి నుంచి సురేఖ బర్తరఫ్ అయిన తర్వాత తొలిసారిగా నిర్వహించిన ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, నియోజకవర్గ ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.
- మాట కోసం నిలబడే తత్వం మాది.. కొండా మురళి
సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మాట్లాడుతూ.. "కొండా సురేఖను సారీ చెప్పాలని కొందరు సూచించారు. కానీ, పదవి ఉన్నా లేకున్నా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే ప్రసక్తే లేదని నా భార్య స్పష్టం చేసింది. కొండా సురేఖ గెలుపు వెనుక రాహుల్ గాంధీ పాత్ర ఉంది. రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే మా ప్రధాన లక్ష్యం. పదవులు వస్తుంటాయి.. పోతుంటాయి, కానీ కృతజ్ఞత అనేది మా రక్తం, కుటుంబంలో ఉంది. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు" అని తేల్చిచెప్పారు.
- ప్రజల్లో చిరస్థాయిగా ఉండటమే మా లక్ష్యం.. కొండా సురేఖ
మాజీ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. "పదవి నుంచి తొలగించిన తర్వాత ఆందోళనలు చేయాలని కొందరు కార్యకర్తలు ఫోన్ చేశారు. కానీ, పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని వారందరికీ నచ్చజెప్పాను. నా నిర్ణయానికి కట్టుబడిన కార్యకర్తలకు ధన్యవాదాలు" అని తెలిపారు.
ప్రస్తుతం రాజకీయాల్లో అవకాశవాదం ఎక్కువైందని, ఉదయం ఒక పార్టీలో ఉండి సాయంత్రానికి మరో పార్టీలోకి మారే సంస్కృతి పెరిగిందని విమర్శించారు. "గతంలో రాజశేఖర్ రెడ్డి గారి కోసం మంత్రి పదవికి ರಾజీనామా చేశా. ఆ తర్వాత కొంతమంది గుంటనక్కల వల్ల కాంగ్రెస్ టికెట్ రాకపోతే కేసీఆర్ పిలిచి వరంగల్ ఈస్ట్ టికెట్ ఇచ్చారు. నాడు అధికారంలో ఉన్న మంత్రిని ఓడించి గెలిచాం. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ రాకతో నాకు మళ్లీ మంత్రి బాధ్యతలు వచ్చాయి. ఎలాంటి మచ్చ లేకుండా పదవి నిర్వహించాను" అని వివరించారు.
- రాబోయే ఎన్నికల్లో టికెట్ నాదే
మంత్రి పదవి పోయినందుకు బాధ లేదని, కానీ అకారణంగా తొలగించారనే వేదన మాత్రం ఉందన్నారు. "పదవి అనేది కేవలం ఒక అలంకారం మాత్రమే. పదవి లేకపోయినా ప్రజల్లోనే ఉంటాం. మళ్లీ మంచి రోజులు వస్తాయి. త్వరలో జరగబోయే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వరంగల్ తూర్పు పరిధిలోని 24 డివిజన్లను గెలుచుకుంటాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచే పోటీ చేస్తాను, వందకు వంద శాతం కాంగ్రెస్ టికెట్ నాకే వస్తుంది. గెలిచి మళ్లీ మీ ముందుకు వస్తాను" అని ధీమా వ్యక్తం చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలని అన్నారు.

aksharadarbar-13-09-2026

aksharadarbar-12-09-2026

aksharadarbar-11-09-2026

aksharadarbar-10-09-2026