దుగ్గొండిలో విద్యార్థులకు అందని అల్పాహారం!
దుగ్గొండిలో విద్యార్థులకు అందని అల్పాహారం!
ఉదయం 10 గంటలు దాటినా పంపిణీ శూన్యం
అధికారుల నిర్లక్ష్యంపై ఏబీఎస్ఎఫ్ ఆగ్రహం
అక్షరదర్బార్,దుగ్గొండి:
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బ్రేక్‌ఫాస్ట్ పథకం దుగ్గొండి మండలంలో అమలుకు నోచుకోవడం లేదని ఏబీఎస్ఎఫ్ వరంగల్ జిల్లా కార్యదర్శి బొట్ల నరేష్ ఆరోపించారు. ఉదయం 9.59 గంటలు దాటినా పలు పాఠశాలల్లో అల్పాహారం అందకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కలెక్టర్ డాక్టర్ సత్యశారద దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. విద్యాశాఖ అధికారులు పథకం అమలుపై సరైన సమాచారం ఇవ్వకపోగా, సాంకేతిక సమస్యలతో అల్పాహారం పంపిణీ చేయలేకపోతున్నామని స్థానిక అధికారులు చెప్పినట్లు పేర్కొన్నారు. కలెక్టర్ వెంటనే స్పందించి విద్యార్థులకు అల్పాహారం అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని బొట్ల నరేష్ కోరారు.