పత్తికి మద్దతు ధర కల్పించాలి

పత్తికి మద్దతు ధర కల్పించాలి

పత్తికి మద్దతు ధర కల్పించాలి

ఏనుమాముల మార్కెట్‌లో ధరల తగ్గింపుపై విచారణ జరపాలి
  వరికెల కిషన్ రావు

అక్షరదర్బార్, హనుమకొండ: 
రైతులు పండించిన పత్తికి మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత మార్కెట్ అధికారులదేనని తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వరికెల కిషన్ రావు అన్నారు. మంగళవారం సమితి నాయకులతో కలిసి ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించి పత్తి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మార్కెట్ కమిటీ కార్యదర్శి శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు.ఇతర మార్కెట్లతో పోలిస్తే ఏనుమాములలో పత్తికి తక్కువ ధరలు లభించడంపై విచారణ జరిపించాలని కోరారు. బహిరంగ వేలం పారదర్శకంగా నిర్వహించి, వ్యాపారుల కుమ్మక్కు, ధరల నియంత్రణకు అడ్డుకట్ట వేయాలన్నారు. తేమశాతం, నాణ్యత పేరుతో రైతులకు అన్యాయం చేయకుండా నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించాలని సూచించారు. వర్షాభావంతో పత్తి దిగుబడులు తగ్గి పెట్టుబడులు కూడా తిరిగిరాని పరిస్థితుల్లో రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు రక్షణ సమితి నాయకులు హింగే భాస్కర్, చౌళ్ల రామారావు, సురాబు బాబురావు, నాగుర్ల రాజీరు, భాషబోయిన కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:
మీకు నచ్చే మరిన్ని

పత్తికి మద్దతు ధర కల్పించాలి

పత్తికి మద్దతు ధర కల్పించాలి ఏనుమాముల మార్కెట్‌లో ధరల తగ్గింపుపై విచారణ జరపాలి    వరికెల కిషన్ రావు అక్షరదర్బార్, హనుమకొండ: రైతులు పండించిన పత్తికి మద్దతు ధర...
Read More...
పత్తికి మద్దతు ధర కల్పించాలి

వరికి ప్రత్యామ్నాయ పంటలే మేలు

  రైతులు వ్యవసాయ భూముల సంరక్షణ, నేల ఆరోగ్యం, నీటి వనరుల పరిరక్షణతో పాటు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని అదనపు కలెక్టర్ రవి సూచించారు. హసన్‌పర్తి
వరంగల్ 
Read More...
వరికి ప్రత్యామ్నాయ పంటలే మేలు

వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం

వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం నీటి వనరులను సంరక్షిస్తూ ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించాలి అదనపు కలెక్టర్ రవి అక్షరదర్బార్,హసన్‌పర్తి:  రైతులు వరి పెట్టుబడి...
వరంగల్ 
Read More...
వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం

నాణ్యమైన కరెంటు ఇస్తాం

- డిజిటల్ మీడియా ప్రతినిధుల చిట్ చాట్ లో టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి
వార్తలు 
Read More...
నాణ్యమైన కరెంటు ఇస్తాం

నకిలీ విత్తనాలతో నిండా మునిగాం!

నకిలీ విత్తనాలతో నిండా మునిగాం! విక్రమ్ ట్రేడర్స్‌ ఎదుట వరి రైతుల ఆందోళన..  150 ఎకరాల్లో పంట నష్టం..  పరిహారం చెల్లించాలని డిమాండ్‌ అక్షరదర్బార్,పరకాల: నకిలీ వరి...
వరంగల్ 
Read More...
నకిలీ విత్తనాలతో నిండా మునిగాం!