కేదారి దంపతులది ఆత్మహత్య!
- అవమానంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న దంపతులు
కేదారి దంపతులది ఆత్మహత్య!
- అవమానంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న దంపతులు
- మంటల్లో తీవ్రంగా గాయపడిన కేదారి నిన్న రాత్రి మృతి
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు ఆయన భార్య మృతి
- హనుమకొండలో విషాదం
అక్షరదర్బార్, హనుమకొండ: మంటల్లో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లింగాల కేదారి ఫుడ్ కోర్టు యజమాని కేదారి భార్య లింగాల పుష్పలత మృతి చెందారు. ఆమె కొద్ది సేపటి క్రితం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. హనుమకొండ అదాలత్ జంక్షన్ వద్ద గల లింగాల కేదారి ఫుడ్ కోర్టు యజమాని కేదారి, ఆయన భార్య పుష్పలత బుధవారం రాత్రి మంటల్లో తీవ్రంగా గాయపడగా కేదారి ఆస్పత్రికి తరలించే క్రమంలో మరణించగా ఆయన భార్య పుష్పలత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే అగ్ని ప్రమాదం వల్ల చెలరేగిన మంటల్లో తీవ్రంగా గాయపడి లింగాల కేదారి, ఆయన భార్య పుష్పలత మృతి చెందలేదని, ఈ దంపతులది ఆత్మహత్య అని తెలిసింది. ఇంటి అద్దె బకాయి కోసం చెల్లించాలని ఇంటి ఓనరు తాళం వేయడంతో అవమాన భారం భరించలేక హోటల్ యజమాని లింగాల కేదారి ఆయన భార్య పుష్పలత ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పుటించుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఇంటికి తాళం వేశానని, వచ్చి మీ తల్లిని తీసుకెళ్లాలని ఇంటి ఓనర్ లింగాల కేదారి కొడుకుతో మాట్లాడినట్లు ఉన్న ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లింగాల ఫుడ్ కోర్టు యజమాని కేదారి, ఆయన భార్య మృతి చెందడం హనుమకొండలో విషాదాన్ని నింపింది. కేదారి దంపతుల మృతిపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలిసింది.