గోదావరి జలాలను వృదా చేయొద్దు

గోదావరి జలాలను వృదా చేయొద్దు

- వెంటనే కన్నెపల్లి మోటార్లు ప్రారంభించాలి
- లేకపోతే 50 వేల మంది రైతులతో వచ్చి పంప్‌హౌస్‌ను మేమే ఆన్ చేస్తాం
- కేసీఆర్‌కు వారం రోజులు ప్రాజెక్టు అప్పగించండి.. తెలంగాణకు నీళ్లు అందించి చూపిస్తాం
- రాజకీయ కక్షతో కాళేశ్వరాన్ని నిర్వీర్యం చేస్తున్నారు.. రైతుల జీవితాలతో చెలగాటమాడొద్దు
- కాళేశ్వరం వద్ద కేటీఆర్ ఫైర్.. రేవంత్ సర్కార్‌పై తీవ్ర విరుచుకుపాటు
- పోలీసుల అడ్డంకుల మధ్య కన్నెపల్లి చేరుకున్న కేటీఆర్.. భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు

గోదావరి జలాలను వృథా చేయొద్దు
- వెంటనే కన్నెపల్లి మోటార్లు ప్రారంభించాలి
- లేకపోతే 50 వేల మంది రైతులతో వచ్చి పంప్‌హౌస్‌ను మేమే ఆన్ చేస్తాం
- కేసీఆర్‌కు వారం రోజులు ప్రాజెక్టు అప్పగించండి.. తెలంగాణకు నీళ్లు అందించి చూపిస్తాం
- రాజకీయ కక్షతో కాళేశ్వరాన్ని నిర్వీర్యం చేస్తున్నారు.. రైతుల జీవితాలతో చెలగాటమాడొద్దు
- కాళేశ్వరం వద్ద కేటీఆర్ ఫైర్.. రేవంత్ సర్కార్‌పై తీవ్ర విరుచుకుపాటు
- పోలీసుల అడ్డంకుల మధ్య కన్నెపల్లి చేరుకున్న కేటీఆర్.. భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు

అక్షరదర్బార్, కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయ కక్షసాధింపుతో నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆదివారం కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గోదావరి జలాలు లక్ష క్యూసెక్కుల చొప్పున ప్రతిరోజూ సముద్రంలో కలిసిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వెంటనే కన్నెపల్లి పంప్‌హౌస్ మోటార్లను ప్రారంభించి తెలంగాణ రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్ నుంచి కన్నెపల్లి పర్యటనకు బయలుదేరిన కేటీఆర్ కాన్వాయ్‌ను పోలీసులు పలు చోట్ల అడ్డుకున్నారు. భారీ పోలీసు బందోబస్తుతో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను నిలిపివేయడంతో బీఆర్ఎస్ నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. జంగావ్ జిల్లా పెంబర్తి, భూపాలపల్లి జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో కాన్వాయ్‌ను కొంతసేపు నిలిపివేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ కేటీఆర్ తన పర్యటనను కొనసాగించి కన్నెపల్లి పంప్‌హౌస్‌కు చేరుకున్నారు.

ముందుగా ఫోర్‌బే బ్రిడ్జిపై నుంచి గోదావరి ప్రవాహాన్ని పరిశీలించిన కేటీఆర్, అనంతరం పంప్‌హౌస్ గేట్లను సందర్శించారు. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లి గోదావరిలో నుంచి వృథాగా సముద్రంలోకి వెళ్తున్న నీటిని పరిశీలించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఘాటుగా విమర్శలు చేశారు.

కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద ప్రస్తుతం 97 మీటర్ల నీటి మట్టం ఉందని, 93 మీటర్ల నీరు ఉన్నా పంపులను ప్రారంభించి తెలంగాణకు సాగునీరు అందించవచ్చని కేటీఆర్ పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం కావాలనే పంపులను ఆన్ చేయడం లేదని ఆరోపించారు. ప్రతిరోజూ లక్ష క్యూసెక్కుల గోదావరి నీరు సముద్రంలో కలుస్తోంది. ఈ నీటిని ఎత్తిపోస్తే రాష్ట్రంలోని లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. రైతుల కళ్ల ముందే నీటిని వృథా చేయడం దారుణం అని అన్నారు.

వెంటనే మోటార్లు ప్రారంభించండి. లేకపోతే తెలంగాణ నలుమూలల నుంచి 50 వేల మంది రైతులతో వచ్చి కన్నెపల్లి పంప్‌హౌస్‌ను మేమే ప్రారంభించి రైతులకు నీళ్లు అందిస్తాం. రైతుల ప్రయోజనాల కోసం ఎలాంటి పోరాటానికైనా వెనుకాడం అని కేటీఆర్ హెచ్చరించారు.

ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వహించే సామర్థ్యం లేకపోతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పది రోజుల పాటు అప్పగించాలని సవాల్ విసిరారు. కేసీఆర్‌కు పది రోజులు ప్రాజెక్టు అప్పగించండి. అన్ని పనులు పూర్తి చేసి తెలంగాణ రైతులకు నీళ్లు అందించి చూపిస్తాం. చేతకాకపోతే పక్కకు తప్పుకోండి అని వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ కక్షతో కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రాజెక్టును వినియోగించకుండా మూసివేయడం రైతులకు చేస్తున్న అన్యాయం. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనే ఆలోచనతో కాళేశ్వరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. రైతుల భవిష్యత్తుతో చెలగాటమాడే హక్కు ఎవరికీ లేదు అని విమర్శించారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి అవగాహనతో మాట్లాడాలని సూచించారు. ముందు ప్రాజెక్టు గురించి తెలుసుకోండి. ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయొద్దు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కాళేశ్వరం నీళ్లే రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి చేరుతున్నాయి. మీ నియోజకవర్గంలోని చివరి గ్రామానికి కూడా కాళేశ్వరం నీరే వెళ్తుంది అని అన్నారు.

మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులపై స్పందించిన కేటీఆర్, రెండు పిల్లర్ల మరమ్మతులకు సుమారు రూ.400 కోట్లు అవసరమని, ఆ మొత్తాన్ని నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టి భరించేందుకు సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం 30 నెలలుగా పనులు ప్రారంభించలేదని ఆరోపించారు. రాజకీయ కక్షతో పనులు నిలిపివేశారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేల్కొని మేడిగడ్డ మరమ్మతులు పూర్తి చేసి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగించాలి  అని డిమాండ్ చేశారు.

పోలవరం ప్రాజెక్టు దశాబ్దాలుగా పూర్తికాలేదని, కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ దూరదృష్టితో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పునర్వ్యవస్థీకరించి గోదావరి-ప్రాణహిత సంగమ ప్రాంతంలో సమగ్ర సర్వేలు నిర్వహించి మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించారని కేటీఆర్ వివరించారు. మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, పర్యావరణ శాఖల నుంచి అన్ని అనుమతులు సాధించి కేవలం నాలుగేళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకాలలో ఒకటైన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని చెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం కాంక్రీట్ నిర్మాణం కాదు.. ఇది తెలంగాణ రైతుల జీవనాడి. ఈ ప్రాజెక్టును నిలిపివేయడం అంటే తెలంగాణ భవిష్యత్తును నిలిపివేయడమే. గోదావరి జలాలను సముద్రంలో కలపడం రైతుల పట్ల చేస్తున్న క్షమించరాని తప్పు అని కేటీఆర్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మాట్లాడుతూ, ప్రభుత్వానికి నిజంగా దమ్ముంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కన్నెపల్లి పంప్‌హౌస్‌కు రావాలి. మేము రెండు రోజులైనా ఇక్కడే ఉంటాం. అందరం కలిసి పంపులను ప్రారంభించి తెలంగాణ రైతులకు నీళ్లు అందిద్దాం. హెలికాప్టర్లలో తిరుగుతూ విమర్శలు చేయడం కాదు.. క్షేత్రస్థాయికి వచ్చి వాస్తవాలు చూడాలి అని సవాల్ విసిరారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు పెద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు పల్లె రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.IMG-20260705-WA0013IMG-20260705-WA0014

Tags:

గోదావరి జలాలను వృదా చేయొద్దు

- వెంటనే కన్నెపల్లి మోటార్లు ప్రారంభించాలి- లేకపోతే 50 వేల మంది రైతులతో వచ్చి పంప్‌హౌస్‌ను మేమే ఆన్ చేస్తాం- కేసీఆర్‌కు వారం రోజులు...
వార్తలు 
Read More...
గోదావరి జలాలను వృదా చేయొద్దు

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు అక్షరదర్బార్,నడికూడ: నడికూడ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మండల జర్నలిస్టుల...
Read More...
నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

భర్త హత్యకు భార్య స్కెచ్

- రూ.4 లక్షల సుపారీ- సింగారం మాజీ ఉప సర్పంచ్ యాకయ్య హత్య కేసు చేధన- యాకయ్య మృతి వెనుక అసలు నిజాలు బయటపెట్టిన...
క్రైమ్ 
Read More...
భర్త హత్యకు భార్య స్కెచ్

దొంగతనం కేసు ఛేదన

దొంగతనం కేసు ఛేదన ఆరుగురు నిందితుల అరెస్టు.. రూ.1.50 లక్షల నగదు స్వాధీనం అక్షరదర్బార్, కాళేశ్వరం: గత ఏడాది నిర్వహించిన సరస్వతీ పుష్కరాల సందర్భంగా భక్తుల కోసం...
Read More...
దొంగతనం కేసు ఛేదన

సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

27 మందికి సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ పేద ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు సీఎం సహాయ నిధి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు...
Read More...
సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ