రగిలిన కరీంనగర్

రగిలిన కరీంనగర్

  • గంగుల క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత 
  • ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి బీజేపీ కార్యకర్తల యత్నం 
    - కౌశిక్ రెడ్డి కారు, గంగుల క్యాంపు ఆఫీసులోని ఫర్నిచర్ ధ్వంసం 
    - సంజయ్ పై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ కార్యకర్తల దాడి
    - బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులను చదరగొట్టిన పోలీసులు

గంగుల క్యాంపు ఆఫీస్ వద్ద ఉద్రిక్తత 
- ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి బీజేపీ కార్యకర్తల యత్నం 
- కౌశిక్ రెడ్డి కారు, గంగుల క్యాంపు ఆఫీసులోని ఫర్నిచర్ ధ్వంసం 
- సంజయ్ పై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ కార్యకర్తల దాడి
- బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులను చదరగొట్టిన పోలీసులు

అక్షరదర్బార్, కరీంనగర్: కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై బీజేపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. గంగుల క్యాంపు ఆఫీస్ ఆవరణలో ఉన్న కౌశిక్ రెడ్డి కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. కమలాకర్ క్యాంపు కార్యాలయంలోని ఫర్నిచర్ తో పాటు ఇతర వస్తువులను కూడా ధ్వంసం చేశారు. గంగుల క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని, ఉమ్మడి గన్ కల్చర్ వ్యాపిస్తుందని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నా పైనా దుండగులురెక్కి నిర్వహిస్తున్నారని, జిల్లాలో శాంతిభద్రతలపై కేంద్ర, రాష్ట్ర మంత్రులు సమీక్ష నిర్వహించాలని అన్నారు. బండి సంజయ్ తంబాకుతో డ్రగ్స్ కలిపి తీసుకుంటున్నారని, కేటీఆర్ డ్రగ్స్ టెస్టుకు సిద్ధమని, సంజయ్ కూడా టెస్టులకు రావాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పై ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారు. బుఆర్ఎస్, బీజేపీ శ్రేణులు గంగుల క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే చర్యలు చేపట్టారు. బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు గంగుల క్యాంపు కార్యాలయం నుంచి భద్రత నడుమ తీసుకెళ్లారు. తనను చంపడానికే బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.

Tags:

పరకాలకు పారిశుధ్య ముప్పు

  పరకాలకు పారిశుధ్య ముప్పు వర్షాల వేళ వార్డుల్లో పేరుకుపోతున్న చెత్త..  స్వైర విహారం చేస్తున్న పందులు..  దుర్వాసనతో ప్రజల అవస్థలు..  అక్షరదర్బార్,పరకాల:వర్షాకాలంలో పరకాల పట్టణంలో పారిశుధ్య...
Read More...
పరకాలకు పారిశుధ్య ముప్పు

పీడీఎస్ రైస్ పట్టివేత

- 62 బస్తాల బియ్యం స్వాధీనం - టాస్క్‌ఫోర్స్ దాడిలో అక్రమ నిల్వ బట్టబయలు
వార్తలు 
Read More...
పీడీఎస్ రైస్ పట్టివేత

ఏసీబీ వలలో తహశీల్దార్

- చేర్యాల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు - రూ.70 వేల లంచంతో పట్టుబడిన తహశీల్దార్ 
క్రైమ్ 
Read More...
ఏసీబీ వలలో తహశీల్దార్

గోదావరి జలాలను వృదా చేయొద్దు

- వెంటనే కన్నెపల్లి మోటార్లు ప్రారంభించాలి- లేకపోతే 50 వేల మంది రైతులతో వచ్చి పంప్‌హౌస్‌ను మేమే ఆన్ చేస్తాం- కేసీఆర్‌కు వారం రోజులు...
వార్తలు 
Read More...
గోదావరి జలాలను వృదా చేయొద్దు

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు అక్షరదర్బార్,నడికూడ: నడికూడ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మండల జర్నలిస్టుల...
Read More...
నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ