ఆర్టీసీ డ్రైవర్ మృతి పట్ల నాగుర్ల దిగ్భ్రాంతి

ఆర్టీసీ డ్రైవర్ మృతి పట్ల నాగుర్ల దిగ్భ్రాంతి

డ్రైవర్ మృతి పట్ల నాగుర్ల దిగ్భ్రాంతి

ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శలు

 కుటుంబానికి రూ.1 కోటి, ఉద్యోగం డిమాండ్

అక్షరదర్బార్, పరకాల : 
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, శంకర్ గౌడ్ మృతి ఆత్మహత్య కాదని, ప్రభుత్వ మొండి వైఖరి వల్ల జరిగిన ఘటనగా పేర్కొన్నారు. కార్మికుల సమస్యలను పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి విషాదాలు చోటుచేసుకుంటున్నాయని విమర్శించారు.మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి ఈ కష్ట సమయంలో మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆందోళన చెందవద్దని, క్షణికావేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మిక సంఘాలను చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.కార్మికుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. మృతుడి కుటుంబానికి రూ.1 కోటి ఆర్థిక సాయం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

Tags:

పరకాలకు పారిశుధ్య ముప్పు

  పరకాలకు పారిశుధ్య ముప్పు వర్షాల వేళ వార్డుల్లో పేరుకుపోతున్న చెత్త..  స్వైర విహారం చేస్తున్న పందులు..  దుర్వాసనతో ప్రజల అవస్థలు..  అక్షరదర్బార్,పరకాల:వర్షాకాలంలో పరకాల పట్టణంలో పారిశుధ్య...
Read More...
పరకాలకు పారిశుధ్య ముప్పు

పీడీఎస్ రైస్ పట్టివేత

- 62 బస్తాల బియ్యం స్వాధీనం - టాస్క్‌ఫోర్స్ దాడిలో అక్రమ నిల్వ బట్టబయలు
వార్తలు 
Read More...
పీడీఎస్ రైస్ పట్టివేత

ఏసీబీ వలలో తహశీల్దార్

- చేర్యాల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు - రూ.70 వేల లంచంతో పట్టుబడిన తహశీల్దార్ 
క్రైమ్ 
Read More...
ఏసీబీ వలలో తహశీల్దార్

గోదావరి జలాలను వృదా చేయొద్దు

- వెంటనే కన్నెపల్లి మోటార్లు ప్రారంభించాలి- లేకపోతే 50 వేల మంది రైతులతో వచ్చి పంప్‌హౌస్‌ను మేమే ఆన్ చేస్తాం- కేసీఆర్‌కు వారం రోజులు...
వార్తలు 
Read More...
గోదావరి జలాలను వృదా చేయొద్దు

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు అక్షరదర్బార్,నడికూడ: నడికూడ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మండల జర్నలిస్టుల...
Read More...
నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ