ఫోన్ కాల్.. ఆపై మృతి!

ఫోన్ కాల్.. ఆపై మృతి!

ఫోన్ కాల్.. ఆపై మృతి!

పరకాలలో యువకుడి అనుమానాస్పద మరణం.. 
హత్యేనని కుటుంబ సభ్యుల ఆరోపణ

అక్షరదర్బార్, పరకాల: 
నడికూడ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన మమ్మద్ షరీఫుద్దీన్‌ (35) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం పరకాల పట్టణంలో కలకలం రేపింది. మంగళవారం రాత్రి వచ్చిన ఫోన్ కాల్ అనంతరం బయటకు వెళ్లిన ఆయన తిరిగి ఇంటికి చేరకపోగా, కొద్దిసేపటికే వెల్లంపల్లి రోడ్డులో మృతదేహంగా లభ్యమైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఉద్యోగ రీత్యా పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న భార్యతో కలిసి పరకాలలో నివాసం ఉంటున్న షరీఫుద్దీన్‌కు ఎలాంటి వ్యక్తిగత శత్రుత్వాలు లేవని భార్య  పేర్కొన్నారు. ఫోన్ కాల్ వచ్చిన కొద్ది గంటల్లోనే ఆయన మృతి చెందడం అనేక అనుమానాలకు తావిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
షరీఫుద్దీన్‌ను రేకుల షెడ్డులో హత్య చేసి అనంతరం రోడ్డుపై పడేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆయనకు ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు? ఎక్కడికి పిలిచారు? చివరిసారిగా ఎవరిని కలిశారు? అనే అంశాలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతున్నారు.
కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించి మృతి వెనుక ఉన్న వాస్తవాలను వెలికితీయాలని పోలీసు ఉన్నతాధికారులను కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

Tags:

పోరాటమే నా పునాది

- 2023 ఎన్నికల్లో గెలిచి లక్ష్యాన్ని ముద్దాడ - నాకు ఏ పదవి వచ్చినా బోనస్సే - వరంగల్ బ్రాండ్ పెంచటమే లక్ష్యం - నా రాజకీయ...
రాజకీయం 
Read More...
పోరాటమే నా పునాది

పాలిటిక్స్ లో 'దయన్న' మార్క్

- మా నాన్నకు నన్ను డాక్టర్ ను చేయాలనే కోరిక ఉండేది - నాకు మాత్రం చదువు కంటే ఎక్కువ రాజకీయాలపై ఇష్టం ఉండే- కక్షసాధింపు...
రాజకీయం 
Read More...
పాలిటిక్స్ లో 'దయన్న' మార్క్

అవమానం పెంచిన కసి

- ఫినోలెక్స్ కంపెనీ ఎంప్లాయ్ టూ స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ - కూతురి స్కూల్ అడ్మిషన్.. గ్రీన్ ఉడ్ స్కూలు ఆవిర్భావం- చలివాగు బ్రిడ్జి పనుల...
రాజకీయం 
Read More...
అవమానం పెంచిన కసి

రూ.1.25 కోట్ల గంజాయి సీజ్

- అంతర్‌రాష్ట్ర స్మగ్లర్ అరెస్ట్- దామెర పోలీసుల భారీ ఆపరేషన్- 251 కిలోల గంజాయి, బైక్, నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం- వరంగల్ సీపీ...
క్రైమ్ 
Read More...
రూ.1.25 కోట్ల గంజాయి సీజ్

ఓటరు జాబితా సవరణపై బీజేపీ కార్యశాల

ఓటరు జాబితా సవరణపై బీజేపీ కార్యశాల హడావుడిగా ఆసుపత్రి ప్రారంభం..   తెరుచుకోని హాస్పిటల్‌ డాక్టర్‌ పగడాల కాళీప్రసాద్‌రావు అక్షరదర్బార్,పరకాల: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)...
Read More...
ఓటరు జాబితా సవరణపై బీజేపీ కార్యశాల