లంచం అడిగితే నా దృష్టికి తేండి

లంచం అడిగితే నా దృష్టికి తేండి

- పేదల సంక్షేమంలో రాజీ లేదు.. నియోజకవర్గ అభివృద్ధియే మా లక్ష్యం
- వరంగల్ ఎయిర్‌పోర్ట్ ఆలస్యానికి కేంద్ర ప్రభుత్వమే కారణం
- ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
- అభివృద్ధిపై చర్చకు సిద్ధమని బీజేపీ, బీఆర్ఎస్‌లకు సవాల్

లంచాలు అడిగితే 
నా దృష్టికి తీసుకురండి
- పేదల సంక్షేమంలో రాజీ లేదు.. నియోజకవర్గ అభివృద్ధియే మా లక్ష్యం
- వరంగల్ ఎయిర్‌పోర్ట్ ఆలస్యానికి కేంద్ర ప్రభుత్వమే కారణం
- ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
- అభివృద్ధిపై చర్చకు సిద్ధమని బీజేపీ, బీఆర్ఎస్‌లకు సవాల్
- రూ.2.10 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

అక్షరదర్బార్, హనుమకొండ: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిలో భాగంగా 53వ డివిజన్ పరిధిలోని లష్కర్ నగర్ సింగారం, గోపాల్పూర్ జంక్షన్ ప్రాంతాల్లో సుమారు రూ.2.10 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానికంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి జరిగిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని, లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో ఒక్కో డివిజన్‌కు నామమాత్రంగా నిధులు కేటాయించి చేతులు దులుపుకునేవారని విమర్శించారు. కానీ ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో ప్రతి డివిజన్‌కు రూ.10 కోట్ల నుండి రూ.20 కోట్ల వరకు నిధులు కేటాయించి అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నామని తెలిపారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి కాలనీకి మెరుగైన రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
- లంచాలు అడిగితే వెంటనే నా దృష్టికి తీసుకురండి
రేషన్ కార్డులు, పెన్షన్లు లేదా ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ఎవరైనా రాజకీయ నాయకులు గానీ, అధికారులు గానీ డబ్బులు అడిగితే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పేదలకు సంబంధించిన ప్రతి పథకం పూర్తిగా ఉచితమని, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లబ్ధిదారుల చేతికే నేరుగా ప్రయోజనాలు చేరేలా పారదర్శక వ్యవస్థను అమలు చేస్తున్నామని చెప్పారు. ఎవరైనా లంచాలు ఇచ్చి ప్రోత్సహిస్తే సమాజానికి అన్యాయం చేసినట్లవుతుందని హితవు పలికారు. ఇప్పటికే పెన్షన్లు, రేషన్ కార్డుల అర్హుల జాబితాలను డివిజన్ వారీగా తుది దశకు తీసుకువచ్చామని వెల్లడించారు.
- అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. విపక్షాలకు సవాల్
నియోజకవర్గ అభివృద్ధిపై తాము ఎప్పుడూ చర్చకు సిద్ధమేనని, ఆధారాలు లేకుండా విమర్శలు చేయడం సరికాదని విపక్షాలకు ఎమ్మెల్యే నాయిని స్పష్టం చేశారు. విమర్శలు చేసే ముందు తాము చేసిన పనులేంటో చెప్పాలని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు. వరంగల్ ఎయిర్‌పోర్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే వందల కోట్ల రూపాయలు వెచ్చించి భూసేకరణ పూర్తి చేసి, కేంద్రానికి అప్పగించినా కేంద్రం విమానాశ్రయ అభివృద్ధిని వేగవంతం చేయలేదని విమర్శించారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు వరంగల్‌కు ఎయిర్‌పోర్ట్ తీసుకురాకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక విధానాల పేరుతో లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను సైతం బలహీనపరుస్తూ ప్రైవేటీకరణకు ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు క్షేత్రస్థాయి అభివృద్ధిని పట్టించుకోకుండా కేవలం అనవసర రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారని దుయ్యబట్టారు. ఎవరు అభివృద్ధి చేస్తున్నారో, ఎవరు కేవలం మాటలకే పరిమితమవుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని, వారే సరైన తీర్పు ఇస్తారని అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల అధికారులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

Tags:

లంచం అడిగితే నా దృష్టికి తేండి

- పేదల సంక్షేమంలో రాజీ లేదు.. నియోజకవర్గ అభివృద్ధియే మా లక్ష్యం- వరంగల్ ఎయిర్‌పోర్ట్ ఆలస్యానికి కేంద్ర ప్రభుత్వమే కారణం- ఎమ్మెల్యే నాయిని రాజేందర్...
వార్తలు 
Read More...
లంచం అడిగితే నా దృష్టికి తేండి

లంచాలు అడిగితే నా దృష్టికి తేండి

పేదల సంక్షేమంలో రాజీ లేదు.. నియోజకవర్గ అభివృద్ధియే మా లక్ష్యం- వరంగల్ ఎయిర్‌పోర్ట్ ఆలస్యానికి కేంద్ర ప్రభుత్వమే కారణం- ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి...
వార్తలు 
Read More...
లంచాలు అడిగితే నా దృష్టికి తేండి

తీర్మానం లేకుండా నిధుల డ్రా.. 

తీర్మానం లేకుండా నిధుల డ్రా.. వార్డు సభ్యుల ఆగ్రహం అక్షర దర్బార్, శాయంపేట: గ్రామపంచాయతీలో తీర్మానం చేసి వార్డు సభ్యుల అనుమతితోనే నిధులు డ్రా చేయాలని కోరుతూ...
Read More...
తీర్మానం లేకుండా నిధుల డ్రా.. 

సీఐ, ఎస్సై సస్పెన్షన్

- ఒకే కేసులో సీఐ, ఎస్ఐలను సస్పెన్షన్ చేసిన వరంగల్ సీపీ - విచారణలో అవినీతి ఆరోపణలు నిజమని తేలటంతో నిర్ణయం
క్రైమ్ 
Read More...
సీఐ, ఎస్సై సస్పెన్షన్

జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా వెంకన్న

ఆయన స్వస్థలం మరిపెడ అదనపు బాధ్యతల నుంచి కలెక్టర్ రిలీవ్ 
వార్తలు 
Read More...
 జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా వెంకన్న