జ్యువెలరీ షాపులో కాల్పులు

జ్యువెలరీ షాపులో కాల్పులు

- కస్టమర్స్ లా షాప్ లోకి ప్రవేశించిన ఐదుగురు దుండగులు 
- జ్యువెలరీ చూపించిన షాపులోని సిబ్బందిపై కాల్పులు 
- సిబ్బందిని కట్టేసి నగలను పట్టుకెళ్ళిన దుండగులు
- కాల్పుల్లో ముగ్గురికి గాయాలు.. ఆసుపత్రికి తరలింపు
- కరీంనగర్ లో కలకలం రేపిన దోపిడి 

జ్యువెలరీ షాపులో కాల్పులు
- కస్టమర్స్ లా షాప్ లోకి ప్రవేశించిన ఐదుగురు దుండగులు 
- జ్యువెలరీ చూపించిన షాపులోని సిబ్బందిపై కాల్పులు 
- సిబ్బందిని కట్టేసి నగలను పట్టుకెళ్ళిన దుండగులు
- కాల్పుల్లో ముగ్గురికి గాయాలు.. ఆసుపత్రికి తరలింపు
- కరీంనగర్ లో కలకలం రేపిన దోపిడి 

అక్షరదర్బార్, కరీంనగర్

కరీంనగర్ నగరంలో ఈరోజు ఉదయం సుమారు 11 గంటల సమయంలో జరిగిన సాయుధ దోపిడీ ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. కరీంనగర్ లోని పీఎంజే జ్యువెలరీ షాప్ కు దుండగులు బైక్ పై వచ్చారు. కస్టమర్సులా ఐదుగురు జ్యువెలరీ షాపులోకి ప్రవేశించారు. సిబ్బందిని జ్యువెలరీ చూపాలని అడిగారు. దీంతో షాపులోని సిబ్బంది జ్యువెలరీ చూపించారు. ఈ క్రమంలో గన్ తో షాపులోని సిబ్బందిని బెదిరించారు. తర్వాత సిబ్బంది కట్టేశారు. జ్యువెలరీ చూపించిన సిబ్బందిపై కాల్పులు జరిపి ఆ సిబ్బంది తమకు చూపించిన నగలను పట్టుకెళ్లారు. దుండగుల కాల్పుల్లో షాపులోని ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందగానే పీఎంజే జ్యువెలరీ షాప్ వద్దకు చేరుకున్న పోలీసులు జరిగిన ఘటనపై సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.
- తనిఖీలు 
నిందితులు తప్పించుకోకుండా నగరం అంతటా పోలీసులు నాకాబందీ నిర్వహించి, వాహనాలను తనిఖీ చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఘటనస్థలిలో బుల్లెట్లను గుర్తించారు. జువెలరీ షాప్ సమీపంలోని డ్రైనేజీలో కత్తెర, ప్లాస్టర్, తుపాకి మ్యాగ్జిన్ కనుగొన్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఘటన స్థలం వద్దకు చేరుకుని విచారణ జరుపుతున్నారు. నగరం నడిబొడ్డున, అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఇలాంటి సాహసోపేత దోపిడీ జరగడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. డ్రైనేజీలో కత్తెర ప్లాస్టరు ఘటనస్థలిలో బుల్లెట్లను పోలీసులు గుర్తించారు పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

Tags:

పరకాలకు పారిశుధ్య ముప్పు

  పరకాలకు పారిశుధ్య ముప్పు వర్షాల వేళ వార్డుల్లో పేరుకుపోతున్న చెత్త..  స్వైర విహారం చేస్తున్న పందులు..  దుర్వాసనతో ప్రజల అవస్థలు..  అక్షరదర్బార్,పరకాల:వర్షాకాలంలో పరకాల పట్టణంలో పారిశుధ్య...
Read More...
పరకాలకు పారిశుధ్య ముప్పు

పీడీఎస్ రైస్ పట్టివేత

- 62 బస్తాల బియ్యం స్వాధీనం - టాస్క్‌ఫోర్స్ దాడిలో అక్రమ నిల్వ బట్టబయలు
వార్తలు 
Read More...
పీడీఎస్ రైస్ పట్టివేత

ఏసీబీ వలలో తహశీల్దార్

- చేర్యాల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు - రూ.70 వేల లంచంతో పట్టుబడిన తహశీల్దార్ 
క్రైమ్ 
Read More...
ఏసీబీ వలలో తహశీల్దార్

గోదావరి జలాలను వృదా చేయొద్దు

- వెంటనే కన్నెపల్లి మోటార్లు ప్రారంభించాలి- లేకపోతే 50 వేల మంది రైతులతో వచ్చి పంప్‌హౌస్‌ను మేమే ఆన్ చేస్తాం- కేసీఆర్‌కు వారం రోజులు...
వార్తలు 
Read More...
గోదావరి జలాలను వృదా చేయొద్దు

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు అక్షరదర్బార్,నడికూడ: నడికూడ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మండల జర్నలిస్టుల...
Read More...
నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ