తప్పిన పెను అగ్నిప్రమాదం

తప్పిన పెను అగ్నిప్రమాదం

కాలిన కరెంటు వైర్లు, మోటార్ పైపులు

చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై రమేష్ నాయక్

అక్షర దర్బార్,పరకాల: 
పరకాల పట్టణంలోని హుజురాబాద్‌ రోడ్డులో పెట్రోల్‌బంక్‌ ఎదురుగా ఉన్న పంట భూముల్లో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించగా, స్థానిక ఎస్సై రమేష్ నాయక్ చాకచక్యంగా స్పందించి పెను ప్రమాదాన్ని తప్పించారు.స్థానికుల వివరాల ప్రకారం.. భూమిలో పంట అవశేషాలను ఎవరో తగులబెట్టడంతో మంటలు ఒక్కసారిగా వ్యాపించి సమీపంలోని పొలాలకు అంటుకున్నాయి. దీంతో బావుల వద్ద ఉన్న కరెంటు వైర్లు, మోటార్ పైపులు దగ్ధమయ్యాయి. మంటలు ప్రధాన రహదారి సమీపంలో ఉన్న కట్టే కోత యంత్రం (శామిల్ మిల్)వద్దకు చేరడంతో స్థానికులు ఆందోళన చెందారు.
సమాచారం అందుకున్న ఎస్సై రమేష్ నాయక్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఎదురుగా ఉన్న బోర్ మోటార్ నుంచి పైపుల ద్వారా నీరు చల్లి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. స్థానికులను అప్రమత్తం చేసి బకెట్లు, బిందెలతో నీరు పోయించడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. దీంతో భారీ నష్టం తప్పినట్లు సామిల్ మిల్క్ యజమాని తెలిపారు.ఎస్సై రమేష్ నాయక్ చూపిన చొరవను స్థానికులు అభినందించారు.

పంట అవశేషాలు తగులబెట్టొద్దు
ఎస్సై రమేష్ నాయక్ 

పంటలు కోసిన తర్వాత మిగిలిన అవశేషాలను పొలాల్లో తగులబెట్టవద్దని ఎస్సై రమేష్ నాయక్ రైతులకు సూచించారు. ఇలా చేయడం వల్ల చుట్టుపక్కల పొలాలకు, ఆస్తులకు నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. అత్యవసరమైతే రైతులు దగ్గరుండి జాగ్రత్తలతో ఒకేచోట పేరబెట్టి నిర్వహించాలని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రమాదాలకు కారణమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు

Tags:

పరకాలకు పారిశుధ్య ముప్పు

  పరకాలకు పారిశుధ్య ముప్పు వర్షాల వేళ వార్డుల్లో పేరుకుపోతున్న చెత్త..  స్వైర విహారం చేస్తున్న పందులు..  దుర్వాసనతో ప్రజల అవస్థలు..  అక్షరదర్బార్,పరకాల:వర్షాకాలంలో పరకాల పట్టణంలో పారిశుధ్య...
Read More...
పరకాలకు పారిశుధ్య ముప్పు

పీడీఎస్ రైస్ పట్టివేత

- 62 బస్తాల బియ్యం స్వాధీనం - టాస్క్‌ఫోర్స్ దాడిలో అక్రమ నిల్వ బట్టబయలు
వార్తలు 
Read More...
పీడీఎస్ రైస్ పట్టివేత

ఏసీబీ వలలో తహశీల్దార్

- చేర్యాల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు - రూ.70 వేల లంచంతో పట్టుబడిన తహశీల్దార్ 
క్రైమ్ 
Read More...
ఏసీబీ వలలో తహశీల్దార్

గోదావరి జలాలను వృదా చేయొద్దు

- వెంటనే కన్నెపల్లి మోటార్లు ప్రారంభించాలి- లేకపోతే 50 వేల మంది రైతులతో వచ్చి పంప్‌హౌస్‌ను మేమే ఆన్ చేస్తాం- కేసీఆర్‌కు వారం రోజులు...
వార్తలు 
Read More...
గోదావరి జలాలను వృదా చేయొద్దు

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు అక్షరదర్బార్,నడికూడ: నడికూడ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మండల జర్నలిస్టుల...
Read More...
నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ