తీర్మానం లేకుండా నిధుల డ్రా.. 

తీర్మానం లేకుండా నిధుల డ్రా.. 

తీర్మానం లేకుండా నిధుల డ్రా.. 
వార్డు సభ్యుల ఆగ్రహం

అక్షర దర్బార్, శాయంపేట: 
గ్రామపంచాయతీలో తీర్మానం చేసి వార్డు సభ్యుల అనుమతితోనే నిధులు డ్రా చేయాలని కోరుతూ శాయంపేట గ్రామపంచాయతీ వార్డు సభ్యులు శాయంపేట ఎంపీడీవోతో పాటు హనుమకొండ జిల్లా డీపీఓకు సోమవారం వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామపంచాయతీలో నిధుల వినియోగంపై తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. గ్రామపంచాయతీ సమావేశంలో తీర్మానం చేయకుండా, వార్డు సభ్యుల సంతకాలు లేకుండానే సర్పంచి, ఉపసర్పంచి, కార్యదర్శి ఆధ్వర్యంలో నిధులు డ్రా చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఎన్నుకున్న వార్డు సభ్యులుగా ఉన్నప్పటికీ పంచాయతీలో జరుగుతున్న వ్యవహారాలపై తమకు సమాచారం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. నిధులు ఏ పనుల కోసం ఖర్చు చేశారనే వివరాలు అడిగినా స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇకపై గ్రామపంచాయతీ తీర్మానం అనంతరం సభ్యుల అనుమతితోనే నిధులు డ్రా చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో కూడా సర్పంచి ఏకపక్షంగా వ్యవహరించారని, తమ వార్డుల్లో అర్హులు ఉన్నప్పటికీ వార్డు సభ్యులకు సమాచారం ఇవ్వకుండా లబ్ధిదారులను ఎంపిక చేశారని ఆరోపించారు. ఈ విషయంపై ప్రశ్నించినా సరైన సమాధానం ఇవ్వలేదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Tags:

పరకాలకు పారిశుధ్య ముప్పు

  పరకాలకు పారిశుధ్య ముప్పు వర్షాల వేళ వార్డుల్లో పేరుకుపోతున్న చెత్త..  స్వైర విహారం చేస్తున్న పందులు..  దుర్వాసనతో ప్రజల అవస్థలు..  అక్షరదర్బార్,పరకాల:వర్షాకాలంలో పరకాల పట్టణంలో పారిశుధ్య...
Read More...
పరకాలకు పారిశుధ్య ముప్పు

పీడీఎస్ రైస్ పట్టివేత

- 62 బస్తాల బియ్యం స్వాధీనం - టాస్క్‌ఫోర్స్ దాడిలో అక్రమ నిల్వ బట్టబయలు
వార్తలు 
Read More...
పీడీఎస్ రైస్ పట్టివేత

ఏసీబీ వలలో తహశీల్దార్

- చేర్యాల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు - రూ.70 వేల లంచంతో పట్టుబడిన తహశీల్దార్ 
క్రైమ్ 
Read More...
ఏసీబీ వలలో తహశీల్దార్

గోదావరి జలాలను వృదా చేయొద్దు

- వెంటనే కన్నెపల్లి మోటార్లు ప్రారంభించాలి- లేకపోతే 50 వేల మంది రైతులతో వచ్చి పంప్‌హౌస్‌ను మేమే ఆన్ చేస్తాం- కేసీఆర్‌కు వారం రోజులు...
వార్తలు 
Read More...
గోదావరి జలాలను వృదా చేయొద్దు

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు అక్షరదర్బార్,నడికూడ: నడికూడ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మండల జర్నలిస్టుల...
Read More...
నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ