ఎమ్మెల్యేను విమర్శించే అర్హత బీఆర్ఎస్‌కు లేదు

ఎమ్మెల్యేను విమర్శించే అర్హత బీఆర్ఎస్‌కు లేదు

ఎమ్మెల్యేను విమర్శించే అర్హత బీఆర్ఎస్‌కు లేదు

- రేవూరి గొప్పతనం పరకాల ప్రజలకు తెలుసు 

మున్సిపల్ చైర్మన్ సునీల్ కుమార్

అక్షరదర్బార్, పరకాల :
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని విమర్శించే స్థాయి బీఆర్ఎస్ నాయకులకు లేదని పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ అన్నారు. ఆదివారం పరకాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముఖ్యఅతిథిగా సునీల్ కుమార్ పాల్గొని మాట్లాడారు.
రేవూరి ప్రకాష్ రెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించిన నాయకుడని, పార్టీలకు అతీతంగా ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయన సేవలను పరకాల ప్రజలు బాగా గుర్తించారని అన్నారు. అలాంటి నాయకుడిపై బీఆర్ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం, దిష్టిబొమ్మ దహనం వంటి చర్యలకు పాల్పడటం సరికాదని విమర్శించారు.ప్రజా సమస్యల పరిష్కారంలో, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నిరంతరం ముందుంటున్నారని తెలిపారు. ప్రజాదరణ కలిగిన నాయకుడిని విమర్శించడం ద్వారా బీఆర్ఎస్ నాయకులు తమ రాజకీయ అసహనాన్ని బయటపెడుతున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, తగిన విధంగా గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. సమావేశంలో కౌన్సిలర్లు బండి శ్రీధర్, కోయ్యడ శ్రీనివాస్ , దశరథం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

చాకిరేవు గుట్టపై అక్రమ మైనింగ్‌కు అనుమతులెలా?

చాకిరేవు గుట్టపై అక్రమ మైనింగ్‌కు అనుమతులెలా? అసైన్డ్‌ భూముల్లో తవ్వకాలకు అనుమతులపై డా. కాళీ ప్రసాద్‌రావు ప్రశ్న అక్షరదర్బార్, పరకాల నడికూడ మండలంలోని కంటాత్మకూర్‌ గ్రామంలోని చాకిరేవు...
Read More...
చాకిరేవు గుట్టపై అక్రమ మైనింగ్‌కు అనుమతులెలా?

ఆ గుట్టపై కాంట్రాక్టర్ కన్ను!

ఆ గుట్టపై కాంట్రాక్టర్ కన్ను! గ్రానైట్ పేరుతో గుప్తనిధుల వేటా?..  చాకిరేవు గుట్ట పరిరక్షణకు గ్రామస్తుల దీక్ష అక్షరదర్బార్,నడికూడనడికూడ మండలంలోని కంఠాత్మకూర్ గ్రామంలోని చాకిరేవు గుట్టపై...
Read More...
ఆ గుట్టపై కాంట్రాక్టర్ కన్ను!

ఏసీబీ వలలో తహశీల్దార్

- రూ.14 వేల లంచం తీసుకుంటూ ప‌ట్టుబడిన సృజన్ - తహసీల్దార్‌ ఆఫీస్ లో కొన‌సాగుతున్న‌ ఏసీబీ సోదాలు- భూమి మార్పిడి కోసం లంచం డిమాండ్‌...
వార్తలు 
Read More...
ఏసీబీ వలలో తహశీల్దార్

ఉద్యోగమంటూ ఘరానా మోసం

- ఏపీకి చెందిన సైబర్ నేరస్తుడి అరెస్ట్
క్రైమ్ 
Read More...
ఉద్యోగమంటూ ఘరానా మోసం

స్కీంలు కాదు.. సీట్లు కావాలి

- ఓబీసీ ప్రెసిడెంట్, కుడా మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్
వార్తలు 
Read More...
స్కీంలు కాదు.. సీట్లు కావాలి