నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు

అక్షరదర్బార్,నడికూడ: 
నడికూడ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మండల జర్నలిస్టుల సమావేశంలో నూతన ప్రెస్ క్లబ్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జర్నలిస్టుల అభిప్రాయాలు, సూచనల మేరకు కమిటీని ఏర్పాటు చేశారు.నూతన కమిటీలో అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షుడిగా గడ్డం బాలరాజు, ఉపాధ్యక్షుడిగా ముక్కెర చిరంజీవి, సహాయ కార్యదర్శులుగా ఐలి విజయ్, బొమ్మ అశోక్, భైరి సుధీర్ కుమార్, కోశాధికారిగా ఎం.డి. జమాలుద్దీన్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా బెజ్జంకి రాజేందర్, రజనీకాంత్, తాళ్ల రవి, చుక్క సతీష్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శి పంచమనేని భాస్కరరావు మాట్లాడుతూ తమపై విశ్వాసం ఉంచి ఎన్నుకున్న జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తామని, మండలంలోని పాత్రికేయులు ఎదుర్కొనే సమస్యలను కమిటీ దృష్టికి తీసుకురావాలని కోరారు. వాటి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. అలాగే మండలంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు నూతన ప్రెస్ క్లబ్ కమిటీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Tags:

పరకాలకు పారిశుధ్య ముప్పు

  పరకాలకు పారిశుధ్య ముప్పు వర్షాల వేళ వార్డుల్లో పేరుకుపోతున్న చెత్త..  స్వైర విహారం చేస్తున్న పందులు..  దుర్వాసనతో ప్రజల అవస్థలు..  అక్షరదర్బార్,పరకాల:వర్షాకాలంలో పరకాల పట్టణంలో పారిశుధ్య...
Read More...
పరకాలకు పారిశుధ్య ముప్పు

పీడీఎస్ రైస్ పట్టివేత

- 62 బస్తాల బియ్యం స్వాధీనం - టాస్క్‌ఫోర్స్ దాడిలో అక్రమ నిల్వ బట్టబయలు
వార్తలు 
Read More...
పీడీఎస్ రైస్ పట్టివేత

ఏసీబీ వలలో తహశీల్దార్

- చేర్యాల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు - రూ.70 వేల లంచంతో పట్టుబడిన తహశీల్దార్ 
క్రైమ్ 
Read More...
ఏసీబీ వలలో తహశీల్దార్

గోదావరి జలాలను వృదా చేయొద్దు

- వెంటనే కన్నెపల్లి మోటార్లు ప్రారంభించాలి- లేకపోతే 50 వేల మంది రైతులతో వచ్చి పంప్‌హౌస్‌ను మేమే ఆన్ చేస్తాం- కేసీఆర్‌కు వారం రోజులు...
వార్తలు 
Read More...
గోదావరి జలాలను వృదా చేయొద్దు

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు అక్షరదర్బార్,నడికూడ: నడికూడ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మండల జర్నలిస్టుల...
Read More...
నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ