పరకాలకు పారిశుధ్య ముప్పు

పరకాలకు పారిశుధ్య ముప్పు

 పరకాలకు పారిశుధ్య ముప్పు

వర్షాల వేళ వార్డుల్లో పేరుకుపోతున్న చెత్త.. 

స్వైర విహారం చేస్తున్న పందులు.. 

దుర్వాసనతో ప్రజల అవస్థలు.. 

అక్షరదర్బార్,పరకాల:
వర్షాకాలంలో పరకాల పట్టణంలో పారిశుధ్య సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని 22 వార్డుల్లో అనేక ప్రాంతాల్లో చెత్త కుప్పలు పేరుకుపోవడంతో పందులు స్వైర విహారం చేస్తున్నాయని, దీంతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.
ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల సమీపంలో చెత్త పేరుకుపోవడంతో పందులు గుంపులుగా తిరుగుతున్నాయని, అక్కడి నుంచి వెళ్లే విద్యార్థులు, ప్రజలు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. వర్షాల కారణంగా చెత్త నుంచి దుర్గంధం వెదజల్లుతుండడంతో పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పట్టణంలో పారిశుధ్య నిర్వహణపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, చెత్తను సకాలంలో తొలగించడం, కాలువలను శుభ్రం చేయడం వంటి చర్యలు చేపట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని పట్టణవాసులు కోరుతున్నారు.

Tags:

మళ్లీ మంచి రోజులొస్తాయి

- కాంగ్రెస్‌ను వీడేది లేదు.. రాహుల్‌ను ప్రధాని చేయడమే మా లక్ష్యం- మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి- పదవులు తాత్కాలికం.. ప్రజల ప్రేమే శాశ్వతం...
రాజకీయం 
Read More...
మళ్లీ మంచి రోజులొస్తాయి

పీఎం శ్రీ నిధుల పంచాయితీపై అధికారుల సీరియస్‌!

అక్షరదర్బార్‌ ఎఫెక్ట్‌..  పీఎం శ్రీ నిధుల పంచాయితీపై అధికారుల సీరియస్‌! వరికోల్‌ ఇద్దరు ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు..  నిధుల వినియోగంపై త్వరలో విచారణ అక్షరదర్బార్,నడికూడ:  పీఎంపీఎం...
Read More...
పీఎం శ్రీ నిధుల పంచాయితీపై అధికారుల సీరియస్‌!

మిట్ట మధ్యాహ్నం దొంగల హల్చల్‌!

మిట్ట మధ్యాహ్నం దొంగల హల్చల్‌! కిటికీ తెరిచి.. ఇంట్లోకి చొరబాటు..   12 తులాల బంగారం, వెండి పట్టీలు మాయం అక్షరదర్బార్‌, పరకాల:పరకాల పట్టణ నడిబొడ్డున మిట్ట...
Read More...
మిట్ట మధ్యాహ్నం దొంగల హల్చల్‌!

కేదారి దంపతులది ఆత్మహత్య!

- అవమానంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న దంపతులు
క్రైమ్ 
Read More...
కేదారి దంపతులది ఆత్మహత్య!

తల్లిదండ్రుల ముందే ఉపాధ్యాయుల రగడ!

తల్లిదండ్రుల ముందే ఉపాధ్యాయుల రగడ! పీఎం శ్రీ నిధుల ఖర్చుపై వివాదం..   పరస్పరం ఆరోపణలు..  పోలీసులకు ఫిర్యాదు చేసిన హెడ్మాస్టర్ అక్షరదర్బార్, నడికూడ: సమాజంలో గౌరవప్రదమైన వృత్తిగా...
Read More...
తల్లిదండ్రుల ముందే ఉపాధ్యాయుల రగడ!