నో కాంప్రమైజ్

నో కాంప్రమైజ్

- ఫేమ్ కోసం కాదు.. ఫలితం కోసం పనిచేస్తా

- గంజాయిపై స్పెషల్ నిఘా పెట్టాం.. రంగంలోకి 'సంఘమిత్ర'లు
- గంజాయి సరఫరాదారులపై రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నాం
- పక్కా సమాచారం ఇస్తే తక్షణ దాడులు నిర్వహిస్తాం 
- మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టాం 
- సైబర్ బాధితులకు త్వరిత న్యాయం.. నేరాల అదుపునకు పెట్రోలింగ్ 
- రౌడీయిజానికి నో ఛాన్స్.. సీసీ కెమెరాల పర్యవేక్షణ ఎస్ఐలదే
- కాలనీల్లో నిఘా పటిష్టం.. నేరస్తుల ఆట కట్టిస్తాం
- ఏరియాను బట్టి యాక్షన్ ప్లాన్.. కేయూ, హసన్ పర్తిలో భూ వివాదాలపై దృష్టి 
- భూ సమస్యల్లో ఏకపక్ష జోక్యం వద్దు.. ఎస్ఓపీ దాటితే చట్టపరమైన చర్యలు 
- ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నాం
- ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సైతం సిద్ధం.. ఇప్పటికే వాట్సాప్ ఎఫ్ఐఆర్ లు
- చట్టంపై నమ్మకంతో విధులు.. నేరాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం 
- వరంగల్ పోలీసింగ్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది 
- డిజిటల్ మీడియా చిట్ చాట్ లో వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేతారెడ్డి

నో కాంప్రమైజ్ 

- ఫేమ్ కోసం కాదు.. ఫలితం కోసం పనిచేస్తా

- గంజాయిపై స్పెషల్ నిఘా పెట్టాం.. రంగంలోకి 'సంఘమిత్ర'లు
- గంజాయి సరఫరాదారులపై రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నాం
- పక్కా సమాచారం ఇస్తే తక్షణ దాడులు నిర్వహిస్తాం 
- మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టాం 
- సైబర్ బాధితులకు త్వరిత న్యాయం.. నేరాల అదుపునకు పెట్రోలింగ్ 
- రౌడీయిజానికి నో ఛాన్స్.. సీసీ కెమెరాల పర్యవేక్షణ ఎస్ఐలదే
- కాలనీల్లో నిఘా పటిష్టం.. నేరస్తుల ఆట కట్టిస్తాం
- ఏరియాను బట్టి యాక్షన్ ప్లాన్.. కేయూ, హసన్ పర్తిలో భూ వివాదాలపై దృష్టి 
- భూ సమస్యల్లో ఏకపక్ష జోక్యం వద్దు.. ఎస్ఓపీ దాటితే చట్టపరమైన చర్యలు 
- ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నాం
- ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సైతం సిద్ధం.. ఇప్పటికే వాట్సాప్ ఎఫ్ఐఆర్ లు
- చట్టంపై నమ్మకంతో విధులు.. నేరాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం 
- వరంగల్ పోలీసింగ్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది 
- డిజిటల్ మీడియా చిట్ చాట్ లో వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేతారెడ్డి


అక్షరదర్బార్, హనుమకొండ 

వరంగల్‌ ప్రాంతంలో నేను తొలిసారిగా పూర్తిస్థాయిలో విధులు నిర్వహిస్తున్న. గతంలో ఒకసారి వచ్చి 15 రోజులు డ్యూటీ చేశాను. వరంగల్‌కు చారిత్రాత్మక నేపథ్యం ఉంది. అంతేకాదు వరంగల్ పోలీసింగ్ కూ ప్రత్యేక గుర్తింపు ఉంది. హైదరాబాద్‌ తర్వాత రాష్ట్రంలో ప్రధాన నగరంగా వరంగల్ ఎదిగింది. ఒకవైపు అర్బన్‌ ప్రాంతం, మరోవైపు రూరల్‌ ప్రాంతాలు ఉండటంతో కమిషనరేట్‌లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. హైదరాబాద్‌ పూర్తిగా అర్బన్‌ కావడంతో అక్కడి పోలీసింగ్‌కు, వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసింగ్‌కు తేడా ఉంటుంది. రెండు ప్రాంతాల పరిస్థితులను బ్యాలెన్స్‌ చేస్తూ ముందుకెళ్లాల్సి ఉంటుందని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేతారెడ్డి అన్నారు. డిజిటల్ మీడియా ప్రతినిధుల చిట్ చాట్ లో ఆమె మాట్లాడారు. ఏమన్నారంటే సీపీ శ్వేతారెడ్డి మాటల్లోనే..

- గంజాయిపై ప్రత్యేక నిఘా 
నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాలను పట్టిపీడిస్తున్న గంజాయిపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టాం. మత్తు పదార్థాల వినియోగం, సరఫరాను అరికట్టేందుకు పోలీసులతో పాటు సమాజ భాగస్వామ్యాన్ని పెంచుతున్నాం. ఇందులో భాగంగా మహిళా సంఘాల సహకారం తీసుకుంటున్నాం. మత్తు పదార్థాల వల్ల కుటుంబాలు, యువతపై పడుతున్న ప్రభావాన్ని తల్లులుగా మహిళలకు బాగా అర్థమవుతుంది. అందుకే వారిని భాగస్వాములను చేస్తున్నామన్నాం. మహిళా సంఘాల సభ్యులకు ‘సంఘమిత్రలు’గా నామకరణం చేసి గంజాయి, ఇతర నేరాలపై అవగాహన కల్పిస్తున్నాం. తాజాగా జనగామలో జిల్లా వ్యాప్తంగా మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించి, గంజాయికి అలవాటు పడిన వారిని గుర్తించడం, మత్తు పదార్థాల ప్రభావం, సమాజంలో జరుగుతున్న నేరాలపై వారికి అవగాహన కల్పించడం జరిగింది. ప్రతి గ్రామంలో మహిళా సంఘాలు అందుబాటులో ఉండటంతో గంజాయి వినియోగం, సరఫరాపై క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించేందుకు ఇది దోహదపడుతుంది.
- రౌడీషీట్ ఓపెన్..
గంజాయి కేసుల్లో పదేపదే పట్టుబడుతున్న వారిపై నిఘా పెంచడంతో పాటు అవసరమైన చోట రౌడీషీట్లు ఓపెన్‌ చేస్తున్నాం. అయితే గంజాయి సరఫరాపై ప్రజల నుంచి పక్కా సమాచారం రావడం లేదు. ‘ఇక్కడ ఉందట.. వాళ్లు తాగుతున్నారట’ అనే సాధారణ సమాచారం కాకుండా, సరఫరా చేసే వ్యక్తులు, ప్రాంతాలు, వాహనాలు తదితరాలపై పక్కా సమాచారం అందిస్తే తక్షణమే దాడులు నిర్వహించి చర్యలు తీసుకుంటాం. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతాం.

- సైబర్‌ క్రైం.. మిల్స్‌ కాలనీపై ప్రత్యేక దృష్టి 
వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో సైబర్‌ నేరాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. సైబర్‌ కేసులను ప్రాపర్‌గా ఇన్వెస్టిగేట్‌ చేసి, బాధితులకు న్యాయం జరిగేలా కేసుల పరిష్కారంపై దృష్టి సారించాం. మరోవైపు క్రైం ఇష్యూలు ఎక్కువగా నమోదవుతున్న మిల్స్‌ కాలనీ పోలీస్‌స్టేషన్‌పై ప్రత్యేక ఫోకస్‌ పెట్టాం. అక్కడ అదనపు ఎస్‌ఐని నియమించి క్రైం కంట్రోల్‌, పెట్రోలింగ్‌, నిఘాను మరింత బలోపేతం చేస్తున్నాం.

- రౌడీయిజానికి నో ఛాన్స్‌ 
రౌడీయిజాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోం. నేర చరిత్ర కలిగిన వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచడంతో పాటు అవసరమైన చోట చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. నగరంలోని కాలనీలు, ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాల పనితీరుపైనా దృష్టి సారించాం. సీసీ కెమెరాల నిర్వహణ, పనితీరును పరిశీలించే బాధ్యతను సంబంధిత పోలీస్‌స్టేషన్ల ఎస్‌ఐలకు అప్పగించాం. కాలనీ సమావేశాలు నిర్వహించి కెమెరాలను సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం.

- ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు ప్రాధాన్యం 
వరంగల్‌ నగరంలో ట్రాఫిక్‌ సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ట్రాఫిక్‌ అనేది నిరంతరం ఉండే సమస్య. పోలీసుల చర్యలతో పాటు వాహనదారులు, ప్రజల సహకారం కూడా అవసరం. ముఖ్యంగా యూటర్న్‌లు, ఫ్రీ లెఫ్ట్‌లు, రోడ్డు సేఫ్టీ అంశాలపై దృష్టి సారిస్తున్నాం. కరుణాపురంలో వైన్స్‌కు పెద్ద పర్మిట్‌ రూమ్‌ ఉండటంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌లు, ప్రమాదాలు చోటుచేసుకుంటున్న దృష్ట్యా ఎక్సైజ్‌ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో మూడు యూటర్న్‌లను మూసివేసినం. దీంతో ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్‌ సాఫీగా సాగుతోంది.

- ప్రజల సేఫ్టీ.. శాఖల సమన్వయంతో చర్యలు 
ప్రజల సేఫ్టీనే పోలీసింగ్‌లో ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాం. ట్రాఫిక్‌, ఫ్రీ లెఫ్ట్‌లు, ఫుట్‌పాత్‌ ఆక్రమణలు వంటి సమస్యలను ఒక్కసారిగా కాకుండా విడతల వారీగా పరిష్కరించుకుంటూ వెళ్తామన్నాం. పోలీసు శాఖ ఒక్కటే అన్ని సమస్యలను పరిష్కరించలేదు. మున్సిపల్‌ కార్పొరేషన్‌, ఎక్సైజ్‌, రెవెన్యూ తదితర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటికే కార్పొరేషన్‌ అధికారులతో సమావేశం నిర్వహించాం. అధికారులు చర్యలు తీసుకున్నా ప్రజల భాగస్వామ్యం లేకుండా సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యం కాదు.

- స్టేషన్ల వారీగా క్రైం మ్యాపింగ్‌ 
కమిషనరేట్‌ పరిధిలోని ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో నమోదవుతున్న కేసుల స్వభావాన్ని ప్రత్యేకంగా పరిశీలిస్తున్నాం. మిల్స్‌ కాలనీ, మట్వాడ, ఇంతేజార్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో క్రైం కేసులు ఎక్కువగా ఉంటే, కేయూ, హసన్‌పర్తి ప్రాంతాల్లో భూ వివాదాలకు సంబంధించిన కేసులు అధికంగా నమోదవుతున్నాయి. స్టేషన్‌ వారీగా క్రైం ప్యాటర్న్‌ను గుర్తించి, ఆయా ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా నివారణ చర్యలు చేపడుతున్నాం.

- భూ వివాదాల్లో ఎస్‌ఓపీనే ప్రామాణికం 
భూ సమస్యల పరిష్కారంలో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం, పోలీస్‌ శాఖ రూపొందించిన ప్రత్యేక స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ)ను పక్కాగా అమలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించిన. భూ వివాదాల్లో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా జోక్యం చేసుకోకుండా ఎస్‌ఓపీ ప్రకారం వ్యవహరించాల్సి ఉంటుంది. నేను కూడా ఎస్‌ఓపీని తప్పనిసరిగా పాటిస్తాను. నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు ఉంటాయి.

- సాంకేతిక వినియోగం...
పరిపాలనా, పోలీసింగ్ పటిష్టత కోసం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వినియోగానికి సన్నద్ధంగా ఉన్నాం. రాష్ట్ర స్థాయిలో తీసుకునే నిర్ణయాలను బట్టి ఏఐ వంటి సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించి ప్రజలకు విస్తృతమైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. ఇప్పటికే వాట్సప్ ఎఫ్ఐర్ లు స్వీకరిస్తున్నం. 
- ఫేమ్‌ కోసం కాదు.. ఫలితం కోసం 
పోలీసు అధికారిగా పేరు, ఫేమ్‌ కోసం పనిచేయను. చట్టాన్ని నమ్మి, దాని ప్రకారమే విధులు నిర్వర్తిస్తా. నాకు చట్టపై నమ్మకం ఉంది. అలాగే శిక్ష పడే వరకు వేచి చూసే ఓపిక కూడా ఉంది. పోలీసింగ్‌ అంటే ప్రభావవంతంగా ఉండటంతో పాటు దాని ఫలితం ప్రజలకు కనిపించాలన్నదే నా లక్ష్యం. ప్రజలకు భద్రత కల్పించడం, నేరాలను నియంత్రించడం, సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం చూపించడంపైనే నా దృష్టి ఉంటుంది.

Tags:

నో కాంప్రమైజ్

- ఫేమ్ కోసం కాదు.. ఫలితం కోసం పనిచేస్తా - గంజాయిపై స్పెషల్ నిఘా.. రంగంలోకి 'సంఘమిత్ర'లు- గంజాయి సరఫరాదారులపై రౌడీ షీట్లు- పక్కా...
వార్తలు 
Read More...
నో కాంప్రమైజ్

నో కాంప్రమైజ్

- ఫేమ్ కోసం కాదు.. ఫలితం కోసం పనిచేస్తా - గంజాయిపై స్పెషల్ నిఘా పెట్టాం.. రంగంలోకి 'సంఘమిత్ర'లు- గంజాయి సరఫరాదారులపై రౌడీ షీట్లు ఓపెన్...
క్రైమ్ 
Read More...
నో కాంప్రమైజ్

పోరాటమే నా పునాది

- 2023 ఎన్నికల్లో గెలిచి లక్ష్యాన్ని ముద్దాడ - నాకు ఏ పదవి వచ్చినా బోనస్సే - వరంగల్ బ్రాండ్ పెంచటమే లక్ష్యం - నా రాజకీయ...
రాజకీయం 
Read More...
పోరాటమే నా పునాది

పాలిటిక్స్ లో 'దయన్న' మార్క్

- మా నాన్నకు నన్ను డాక్టర్ ను చేయాలనే కోరిక ఉండేది - నాకు మాత్రం చదువు కంటే ఎక్కువ రాజకీయాలపై ఇష్టం ఉండే- కక్షసాధింపు...
రాజకీయం 
Read More...
పాలిటిక్స్ లో 'దయన్న' మార్క్

అవమానం పెంచిన కసి

- ఫినోలెక్స్ కంపెనీ ఎంప్లాయ్ టూ స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ - కూతురి స్కూల్ అడ్మిషన్.. గ్రీన్ ఉడ్ స్కూలు ఆవిర్భావం- చలివాగు బ్రిడ్జి పనుల...
రాజకీయం 
Read More...
అవమానం పెంచిన కసి