మల్లక్కపేట ఆలయంలో దొంగల కలకలం!

మల్లక్కపేట ఆలయంలో దొంగల కలకలం!

మల్లక్కపేట ఆలయంలో దొంగల కలకలం!

హుండీ మాయం..

 23 నుంచి పనిచేయని సీసీ కెమెరాలు 

పోలీసులకు సమాచారం

అక్షరదర్బార్, పరకాల: 
పరకాల ప్రాంతంలోని ప్రముఖ మల్లక్కపేట అభయాంజనేయ స్వామి ఆలయంలో శనివారం రాత్రి దొంగలు చొరబడిన ఘటన కలకలం రేపింది. ఆలయానికి ప్రతిరోజూ వెళ్లే జగన్నాథ ఆచార్యులు ఆదివారం ఉదయం పూజల కోసం ఆలయానికి వెళ్లి చూడగా హుండీ కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
మల్లక్కపేట అభయాంజనేయ స్వామి ఆలయం పరకాల ప్రాంతంలోనే కాకుండా తెలంగాణలో రెండో కొండగట్టుగా ప్రాచుర్యం పొందింది. శ్రీరామనవమి, హనుమాన్‌ జయంతి, కార్తీక మాస పూజలు తదితర వేడుకలు ఇక్కడ వైభవంగా నిర్వహిస్తుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. అలాంటి ఆలయంలో చోరీ జరగడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పిడుగు పడటంతో సీసీ కెమెరాలు బంద్‌!

ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ నాలుగైదు రోజుల క్రితం పిడుగు పడటంతో ఈ నెల 23వ తేదీ నుంచి అవి పనిచేయడం లేదని తెలుస్తోంది. ఇదే సమయంలో చోరీ జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. రోడ్డు పక్కనే ఉన్న ఆలయంలో దొంగలు చొరబడటంతో ఆలయ పరిస్థితులపై అవగాహన ఉన్నవారే ఈ ఘటనకు పాల్పడ్డారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై పోలీసుల దర్యాప్తులో పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

హుండీలో ఎంత నగదు?

ఆలయ హుండీని సాధారణంగా ఆరు నెలలకు ఒకసారి లెక్కిస్తారు. గత మే నెలలో హనుమాన్‌ జయంతి అనంతరం హుండీని లెక్కించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హుండీలో రూ.10 వేల లోపు నగదు ఉండే అవకాశం ఉందని సమాచారం. ఆలయానికి భద్రత పెంచి భక్తుల విశ్వాసానికి భరోసా కల్పించాలని పలువురు భక్తులు కోరుతున్నారు.

Tags:

మల్లక్కపేట ఆలయంలో దొంగల కలకలం!

మల్లక్కపేట ఆలయంలో దొంగల కలకలం! హుండీ మాయం..   23 నుంచి పనిచేయని సీసీ కెమెరాలు  పోలీసులకు సమాచారం అక్షరదర్బార్, పరకాల: పరకాల ప్రాంతంలోని ప్రముఖ మల్లక్కపేట అభయాంజనేయ...
Read More...
మల్లక్కపేట ఆలయంలో దొంగల కలకలం!

రబీ ప్రణాళికపై అధికారుల సమన్వయ సమావేశం

రబీ ప్రణాళికపై అధికారుల సమన్వయ సమావేశం కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుపై చర్చ..  ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం అక్షర దర్బార్, హనుమకొండ: రబీ సీజన్‌ కార్యాచరణ...
Read More...
రబీ ప్రణాళికపై అధికారుల సమన్వయ సమావేశం

మమతానగర్‌లో  గణేష్‌ నవరాత్రి ముగింపు

మమతానగర్‌లో  గణేష్‌ నవరాత్రి ముగింపు రూ.45,116కు లడ్డూ ప్రసాదం.. అక్షరదర్బార్, పరకాల:పరకాల పట్టణంలోని మమతానగర్‌ కాలనీలో గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు బుధవారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా...
Read More...
మమతానగర్‌లో  గణేష్‌ నవరాత్రి ముగింపు

విద్యే ఆయుధం.. వివక్షే నా కసి!

- డిజిటల్ మీడియా ప్రతినిధుల చిట్ చాట్ లో బీజేపీ నేత, పరకాల నియోజకవర్గం కాంటెస్టెడ్ అభ్యర్థి డాక్టర్ పగడాల కాళీప్రసాద్ రావు
రాజకీయం 
Read More...
విద్యే ఆయుధం.. వివక్షే నా కసి!

లక్ష్మణ్ బాపూజీ పోరాటం స్ఫూర్తిదాయకం

లక్ష్మణ్ బాపూజీ పోరాటం స్ఫూర్తిదాయకం   కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అక్షరదర్బార్, శాయంపేట: తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన...
Read More...
లక్ష్మణ్ బాపూజీ పోరాటం స్ఫూర్తిదాయకం