తల్లిదండ్రుల ముందే ఉపాధ్యాయుల రగడ!

తల్లిదండ్రుల ముందే ఉపాధ్యాయుల రగడ!

తల్లిదండ్రుల ముందే ఉపాధ్యాయుల రగడ!

పీఎం శ్రీ నిధుల ఖర్చుపై వివాదం..

 పరస్పరం ఆరోపణలు.. 

పోలీసులకు ఫిర్యాదు చేసిన హెడ్మాస్టర్

అక్షరదర్బార్, నడికూడ: 
సమాజంలో గౌరవప్రదమైన వృత్తిగా భావించే ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెచ్చేలా నడికూడ మండలం వరికోలు ప్రాథమిక పాఠశాలలో ఘటన చోటుచేసుకుంది. పీఎం శ్రీ పథకం నిధుల ఖర్చుపై మంగళవారం విద్యార్థుల తల్లిదండ్రులతో నిర్వహించిన సమావేశంలో ఉపాధ్యాయులు పరస్పరం వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. తల్లిదండ్రుల సమక్షంలోనే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ గొడవకు దిగడం చర్చనీయాంశంగా మారింది.
పీఎం శ్రీ నిధుల ఖర్చుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశానికి గ్రామ సర్పంచ్, పాలకవర్గానికి సమాచారం ఇవ్వకుండా, తమకు అనుకూలంగా ఉన్న కొందరు తల్లిదండ్రులను మాత్రమే పిలిచారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమావేశంలో నిధుల వినియోగం, పంపకాల అంశంపై ఉపాధ్యాయుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలిసింది.

గతంలోనూ నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదులు

పాఠశాల నిధుల వ్యవహారంపై గతంలోనూ వివాదాలు తలెత్తినట్లు సమాచారం. ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు ఫోర్జరీ సంతకాలతో నిధులు దుర్వినియోగం చేశారంటూ కొందరు ఉపాధ్యాయులు జిల్లా విద్యాశాఖ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పీఎంసీ నిధుల వినియోగంలోనూ అవకతవకలు జరిగాయంటూ మండల, జిల్లా విద్యాధికారులకు గతంలో ఫిర్యాదులు అందినట్లు సమాచారం.

మంగళవారం మరోసారి వివాదం 
చోటుచేసుకోవడంతో ప్రధానోపాధ్యాయుడు శరత్ ఉపాధ్యాయుడు అశోక్‌పై పరకాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పాఠశాల నిధుల వినియోగంపై నెలకొన్న వివాదంపై విద్యాశాఖ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు.

Tags:

తల్లిదండ్రుల ముందే ఉపాధ్యాయుల రగడ!

తల్లిదండ్రుల ముందే ఉపాధ్యాయుల రగడ! పీఎం శ్రీ నిధుల ఖర్చుపై వివాదం..   పరస్పరం ఆరోపణలు..  పోలీసులకు ఫిర్యాదు చేసిన హెడ్మాస్టర్ అక్షరదర్బార్, నడికూడ: సమాజంలో గౌరవప్రదమైన వృత్తిగా...
Read More...
తల్లిదండ్రుల ముందే ఉపాధ్యాయుల రగడ!

సేవా కార్యక్రమాలతో ఇనగాల జన్మదిన వేడుకలు

సేవా కార్యక్రమాలతో ఇనగాల జన్మదిన వేడుకలు రక్తదాన శిబిరంలో 132 మంది రక్తదానం..  రక్తదాతలకు టీ-షర్టుల పంపిణీ..   ఘనంగా అన్నదానం అక్షరదర్బార్,పరకాల: హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల...
Read More...
సేవా కార్యక్రమాలతో ఇనగాల జన్మదిన వేడుకలు

పరకాలను అభివృద్ధి చేయాలి

పరకాలను అభివృద్ధి చేయాలి సీఎం సభకు రూ.30 లక్షలు ఖర్చు..  పరకాల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ప్రశ్నించిన ఎమ్మెల్సీ పోచంపల్లి...
Read More...
పరకాలను అభివృద్ధి చేయాలి

ప్రశ్నించటమే నా బలం

- విద్యార్థి దశ నుంచే ప్రజా ఉద్యమాల్లో ఉన్న.. నిర్బంధాలే నన్ను నిలబెట్టాయి- అప్పట్లో నా రాజకీయ గురువు సుధాకర్ గాంధీ- కాంగ్రెసే నా...
రాజకీయం 
Read More...
ప్రశ్నించటమే నా బలం

హైకమాండ్ ను బ్లాక్‌మెయిల్‌ చేశారు

- పట్టుబట్టి నన్ను బర్తరఫ్‌ చేయించారు- సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ ఆరోపణలు - తన కుమార్తె వ్యాఖ్యలకు నన్నెలా బాధ్యురాలిని చేస్తారని నిలదీత...
రాజకీయం 
Read More...
హైకమాండ్ ను బ్లాక్‌మెయిల్‌ చేశారు