ఓటరు జాబితా సవరణపై బీజేపీ కార్యశాల

ఓటరు జాబితా సవరణపై బీజేపీ కార్యశాల

ఓటరు జాబితా సవరణపై బీజేపీ కార్యశాల

హడావుడిగా ఆసుపత్రి ప్రారంభం..

 తెరుచుకోని హాస్పిటల్‌

డాక్టర్‌ పగడాల కాళీప్రసాద్‌రావు

అక్షరదర్బార్,పరకాల: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) రెండో దశ కార్యక్రమంలో భాగంగా పరకాల బీజేపీ పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్‌ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి కార్యశాల నిర్వహించారు. కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పరకాల కాంటెస్టెడ్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ పగడాల కాళీప్రసాద్‌రావు, ఎస్‌ఐఆర్‌ జిల్లా ప్రముఖ్‌ రావు అమరేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు సిరంగి సంతోష్‌కుమార్‌ హాజరయ్యారు.

ఈ సందర్భంగా డాక్టర్‌ కాళీప్రసాద్‌రావు మాట్లాడుతూ పరకాల ప్రభుత్వ ఆసుపత్రిని హడావుడిగా ప్రారంభించారని, ప్రస్తుతం అది మూతపడే పరిస్థితిలో ఉందని ఆరోపించారు. ఆసుపత్రి పరిస్థితిపై ప్రభుత్వం ప్రజలకు వాస్తవాలను వెల్లడించాలని, ప్రారంభోత్సవ సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని కోరారు.

సిరంగి సంతోష్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదలను కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షకు పరకాల బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్‌ ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.
కార్యశాలలో బీజేపీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆర్‌.పీ. జయంత్‌లాల్‌, దేవునూరి మేఘనాథ్‌, పరకాల కౌన్సిలర్లు బెజ్జంకి పునాచారి, ఆకుల లావణ్య శ్రీధర్‌, మండల అధ్యక్షులు కాసగాని రాజ్‌కుమార్‌, ఉప్పుగల శ్రీకాంత్‌రెడ్డి, వేల్పుల రాజ్‌కుమార్‌, మాజీ చైర్‌పర్సన్‌ మార్త రాజభద్రయ్య ఓబీసీ, ఎస్సీ మోర్చా నాయకులు, మండల, పట్టణ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Tags:

అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల ఉక్కుపాదం

అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల ఉక్కుపాదం నడికూడ గుట్టపై నిర్మాణాల కూల్చివేత ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలురెవెన్యూ అధికారులు అక్షరదర్బార్,నడికూడ: నడికూడ మండలంలోని నడికూడ...
Read More...
అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల ఉక్కుపాదం

వృద్ధురాలి హత్య.. దోపిడీ కేసులో నిందితుడి అరెస్ట్

వృద్ధురాలి హత్య.. దోపిడీ కేసులో నిందితుడి అరెస్ట్ పైకప్పు ద్వారా ఇంట్లోకి ప్రవేశం..   కేకలు వేయడంతో ఇనుపరాడ్‌తో దాడి రెండు బంగారు పుస్తెలు, రక్తపు మరకల దుస్తులు...
Read More...
వృద్ధురాలి హత్య.. దోపిడీ కేసులో నిందితుడి అరెస్ట్

సోషల్‌ మీడియా మాట నమ్మి మందులు వాడొద్దు

సోషల్‌ మీడియా మాట నమ్మి మందులు వాడొద్దు రసాయన మందులతో పంటలకు నష్టం మాజీ తెలంగాణ రైతు రుణ విమోచన కమిటీ చైర్మన్‌ నాగూర్ల అక్షరదర్బార్,పరకాల: పంటల్లో...
Read More...
సోషల్‌ మీడియా మాట నమ్మి మందులు వాడొద్దు

గురుకులంలో ‘పాము’ కలకలం!

గురుకులంలో ‘పాము’ కలకలం! పాము నుండి తప్పించుకునే క్రమంలో గాయపడ్డ ఐదో తరగతి విద్యార్థిని..  పాములు, కోతుల సంచారంపై తల్లిదండ్రుల ఆందోళన అక్షరదర్బార్, ఇనుగుర్తి: ఇనుగుర్తి సాంఘిక...
Read More...
గురుకులంలో ‘పాము’ కలకలం!

ఊరి మధ్యలో రైస్‌మిల్లు వద్దంటూ రోడ్డెక్కిన ప్రజలు!

ఊరి మధ్యలో రైస్‌మిల్లు వద్దంటూ రోడ్డెక్కిన ప్రజలు! ఆవాసాల మధ్య నిర్మాణంపై తీవ్ర అభ్యంతరం..   పనులు నిలిపివేయాలంటూ గ్రామసభలో వినతి.. చిన్ననాగారం–ఎర్రబెల్లిగూడెం రహదారిపై బైఠాయింపు అక్షరదర్బార్, ఇనుగుర్తి:...
Read More...
ఊరి మధ్యలో రైస్‌మిల్లు వద్దంటూ రోడ్డెక్కిన ప్రజలు!