నిషేధిత కలుపు మందు స్వాధీనం

నిషేధిత కలుపు మందు స్వాధీనం

- పరకాలలో విజిలెన్స్ దాడులు.. 

- 150 లీటర్ల స్పీడ్ పారాక్వాట్ పట్టివేత

నిషేధిత కలుపు మందు స్వాధీనం

- పరకాలలో విజిలెన్స్ దాడులు.. 

- 150 లీటర్ల స్పీడ్ పారాక్వాట్ పట్టివేత

అక్షరదర్బార్, పరకాల: 
పరకాల పట్టణంలోని ఓ ఎరువులు, పురుగుమందుల దుకాణంలో నిషేధిత కలుపు మందును విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని లక్ష్మీ ఏజెన్సీలో నిల్వ ఉంచిన సుమారు 150 లీటర్ల స్పీడ్ పారాక్వాట్ (పారాకుట్) మందును అధికారులు తనిఖీల సందర్భంగా గుర్తించి పట్టుకున్నట్లు సమాచారం.భూమి సారంపై ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు రైతుల ఆరోగ్యానికి హానికరంగా మారే అవకాశం ఉందన్న కారణాలతో ప్రభుత్వం ఈ మందు విక్రయాలు, వినియోగంపై నిషేధం విధించింది. అయినప్పటికీ కొందరు వ్యాపారులు నిబంధనలను ఉల్లంఘిస్తూ రహస్యంగా విక్రయాలు కొనసాగిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించినట్లు తెలిసింది.పట్టణంలోని ఇతర ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లోనూ సమగ్ర తనిఖీలు చేపడితే మరింత పరిమాణంలో నిషేధిత మందులు బయటపడే అవకాశం ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఘటనపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.

Tags:

పీఎం శ్రీ నిధుల పంచాయితీపై అధికారుల సీరియస్‌!

అక్షరదర్బార్‌ ఎఫెక్ట్‌..  పీఎం శ్రీ నిధుల పంచాయితీపై అధికారుల సీరియస్‌! వరికోల్‌ ఇద్దరు ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు..  నిధుల వినియోగంపై త్వరలో విచారణ అక్షరదర్బార్,నడికూడ:  పీఎంపీఎం...
Read More...
పీఎం శ్రీ నిధుల పంచాయితీపై అధికారుల సీరియస్‌!

మిట్ట మధ్యాహ్నం దొంగల హల్చల్‌!

మిట్ట మధ్యాహ్నం దొంగల హల్చల్‌! కిటికీ తెరిచి.. ఇంట్లోకి చొరబాటు..   12 తులాల బంగారం, వెండి పట్టీలు మాయం అక్షరదర్బార్‌, పరకాల:పరకాల పట్టణ నడిబొడ్డున మిట్ట...
Read More...
మిట్ట మధ్యాహ్నం దొంగల హల్చల్‌!

కేదారి దంపతులది ఆత్మహత్య!

- అవమానంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న దంపతులు
క్రైమ్ 
Read More...
కేదారి దంపతులది ఆత్మహత్య!

తల్లిదండ్రుల ముందే ఉపాధ్యాయుల రగడ!

తల్లిదండ్రుల ముందే ఉపాధ్యాయుల రగడ! పీఎం శ్రీ నిధుల ఖర్చుపై వివాదం..   పరస్పరం ఆరోపణలు..  పోలీసులకు ఫిర్యాదు చేసిన హెడ్మాస్టర్ అక్షరదర్బార్, నడికూడ: సమాజంలో గౌరవప్రదమైన వృత్తిగా...
Read More...
తల్లిదండ్రుల ముందే ఉపాధ్యాయుల రగడ!

సేవా కార్యక్రమాలతో ఇనగాల జన్మదిన వేడుకలు

సేవా కార్యక్రమాలతో ఇనగాల జన్మదిన వేడుకలు రక్తదాన శిబిరంలో 132 మంది రక్తదానం..  రక్తదాతలకు టీ-షర్టుల పంపిణీ..   ఘనంగా అన్నదానం అక్షరదర్బార్,పరకాల: హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల...
Read More...
సేవా కార్యక్రమాలతో ఇనగాల జన్మదిన వేడుకలు