మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రలు ప్రారంభం

మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రలు ప్రారంభం

రైతులు దళాలను నమ్మొద్దు..

 ప్రభుత్వ కేంద్రాల్లోనే అమ్మాలి

ఏఎంసీ చందుపట్ల రాజిరెడ్డి

అక్షరదర్బార్, పరకాల:
నడికూడ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో, మార్కాఫెడ్ సౌజన్యంతో మాదారం ఆధ్వర్యంలో, నార్లాపూర్‌లో ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం, మార్కఫెడ్ ఆధ్వర్యంలో హకా ఎఫ్ ఎస్ సి ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరకాల ఏఎంసీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు దళాలను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే తమ పంటను విక్రయించి లాభం పొందాలని సూచించారు. మొక్కజొన్నకు కనీస మద్దతు ధరగా రూ. 2400 ఇవ్వనున్నట్లు, వారి ధాన్యానికి రూ.2389, 2369లు మద్దతు ధర వెల్లడించారు.కార్యక్రమంలో నడికూడ తహసిల్దార్ రాణి, సొసైటీ స్పెషల్ ఆఫీసర్ జ్యోతి, పిఎసిఎస్ సీఈవో రాజేందర్, ఏపిఎం నాగేశ్వరరావు, నార్లపూర్ గ్రామ సర్పంచ్ రవీందర్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బుర్ర దేవేందర్ గౌడ్, నాయకులు పర్నం మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

పరకాలకు పారిశుధ్య ముప్పు

  పరకాలకు పారిశుధ్య ముప్పు వర్షాల వేళ వార్డుల్లో పేరుకుపోతున్న చెత్త..  స్వైర విహారం చేస్తున్న పందులు..  దుర్వాసనతో ప్రజల అవస్థలు..  అక్షరదర్బార్,పరకాల:వర్షాకాలంలో పరకాల పట్టణంలో పారిశుధ్య...
Read More...
పరకాలకు పారిశుధ్య ముప్పు

పీడీఎస్ రైస్ పట్టివేత

- 62 బస్తాల బియ్యం స్వాధీనం - టాస్క్‌ఫోర్స్ దాడిలో అక్రమ నిల్వ బట్టబయలు
వార్తలు 
Read More...
పీడీఎస్ రైస్ పట్టివేత

ఏసీబీ వలలో తహశీల్దార్

- చేర్యాల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు - రూ.70 వేల లంచంతో పట్టుబడిన తహశీల్దార్ 
క్రైమ్ 
Read More...
ఏసీబీ వలలో తహశీల్దార్

గోదావరి జలాలను వృదా చేయొద్దు

- వెంటనే కన్నెపల్లి మోటార్లు ప్రారంభించాలి- లేకపోతే 50 వేల మంది రైతులతో వచ్చి పంప్‌హౌస్‌ను మేమే ఆన్ చేస్తాం- కేసీఆర్‌కు వారం రోజులు...
వార్తలు 
Read More...
గోదావరి జలాలను వృదా చేయొద్దు

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు అక్షరదర్బార్,నడికూడ: నడికూడ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మండల జర్నలిస్టుల...
Read More...
నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ