4.45 గంటల పర్యటన

4.45 గంటల పర్యటన


- మధ్యాహ్నం 3 మూడు గంటలకు కాళేశ్వరం చేరుకోనున్న సీఎం 
- శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం అనంతరం మేడిగడ్డకు 
- సాయంత్రం 6.30 గంటలకు నస్తురుపల్లి వద్ద సభలో రైతు భరోసా నిధుల విడుదల

4.45 గంటల పర్యటన 
- మధ్యాహ్నం 3 మూడు గంటలకు కాళేశ్వరం చేరుకోనున్న సీఎం 
- శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం అనంతరం మేడిగడ్డకు 
- సాయంత్రం 6.30 గంటలకు నస్తురుపల్లి వద్ద సభలో రైతు భరోసా నిధుల విడుదల

అక్షరదర్బార్, కాటారం: రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి 20వ తేదీ సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన జిల్లాలో 4.45 గంటల పాటు కొనసాగనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు జిల్లాలోని కాళేశ్వరం చేరుకునే సీఎం రేవంత్ రెడ్డి కాటారం మండలంలోని మస్తురిపల్లి వద్ద జరిగే బహిరంగ సభ ముగిసిన తర్వాత రాత్రి 7:45 గంటలకు హైదరాబాద్ బయలుదేరుతారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటన షెడ్యూల్ ఆదివారం విడుదలైంది. ఆయన పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి..

మధ్యాహ్నం 1.45 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి తమ నివాసం నుంచి బయలుదేరి 2.00 గంటలకు బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 3.00 గంటలకు కాళేశ్వరం ఆలయానికి చేరుకుంటారు.
3.05 నుండి 3.25 గంటల మధ్య శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం చేసి, ఆలయంలో భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు.
3.30 గంటలకు కాళేశ్వరం నుంచి బయలుదేరి 3.45 గంటలకు మహాదేవపూర్ మండలం మేడిగడ్డకు చేరుకుంటారు. అక్కడ 3.45 నుండి 4.30 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజ్ ప్రాంతాన్ని పరిశీలిస్తారు.
4.35 నుండి 5.30 గంటల వరకు అంబట్‌పల్లి గెస్ట్ హౌస్‌లో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం 5.35 నుండి 6.00 గంటల వరకు మీడియా సమావేశంలో పాల్గొంటారు.
6.00 గంటలకు మేడిగడ్డ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 6.30 గంటలకు కాటారం మండలం నస్తూరుపల్లి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ 6.30 నుండి 7.45 గంటల వరకు  రైతు భరోసా పథకం రెండో విడత నిధులను విడుదల చేసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభ ముగిసిన తర్వాత రాత్రి 7.45 గంటలకు నస్తూరుపల్లి నుంచి బయలుదేరి రాత్రి 11.15 గంటలకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకుంటారు.IMG-20260419-WA0008

Tags:

పీడీఎస్ రైస్ పట్టివేత

- 62 బస్తాల బియ్యం స్వాధీనం - టాస్క్‌ఫోర్స్ దాడిలో అక్రమ నిల్వ బట్టబయలు
వార్తలు 
Read More...
పీడీఎస్ రైస్ పట్టివేత

ఏసీబీ వలలో తహశీల్దార్

- చేర్యాల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు - రూ.70 వేల లంచంతో పట్టుబడిన తహశీల్దార్ 
క్రైమ్ 
Read More...
ఏసీబీ వలలో తహశీల్దార్

గోదావరి జలాలను వృదా చేయొద్దు

- వెంటనే కన్నెపల్లి మోటార్లు ప్రారంభించాలి- లేకపోతే 50 వేల మంది రైతులతో వచ్చి పంప్‌హౌస్‌ను మేమే ఆన్ చేస్తాం- కేసీఆర్‌కు వారం రోజులు...
వార్తలు 
Read More...
గోదావరి జలాలను వృదా చేయొద్దు

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు అక్షరదర్బార్,నడికూడ: నడికూడ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మండల జర్నలిస్టుల...
Read More...
నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

భర్త హత్యకు భార్య స్కెచ్

- రూ.4 లక్షల సుపారీ- సింగారం మాజీ ఉప సర్పంచ్ యాకయ్య హత్య కేసు చేధన- యాకయ్య మృతి వెనుక అసలు నిజాలు బయటపెట్టిన...
క్రైమ్ 
Read More...
భర్త హత్యకు భార్య స్కెచ్