ఈత సరదా ప్రాణం తీసింది..

ఈత సరదా ప్రాణం తీసింది..

ఈత సరదా ప్రాణం తీసింది..
 
చలివాగు ప్రాజెక్టు కాలువలో వ్యక్తి గల్లంతు
 
 హెచ్చరికలు లెక్కచేయని యువకులు
 
అక్షరదర్బార్, శాయంపేట:
శాయంపేట మండలం జోగంపల్లి చలివాగు ప్రాజెక్టు వద్ద ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. కాలువలో ఈతకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, గీసుకొండ మండలం మనుగొండకు చెందిన మధ్యబోయిన వెంకన్న (35) పత్తిపాక గ్రామంలో జరిగిన మధ్యబోయిన  మొగిలి దశదిన కర్మ కార్యక్రమానికి హాజరయ్యాడు. అనంతరం బంధువులతో కలిసి చలివాగు ప్రాజెక్టు వద్దకు వెళ్లి కాలువలో ఈతకు దిగగా అదుపుతప్పి గల్లంతైనట్లు తెలిసింది.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా, ప్రాజెక్టు పరిసరాల్లో ఈతకు వెళ్లవద్దని పోలీసులు పలుమార్లు హెచ్చరిస్తూ బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ, వాటిని పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Tags:

పీడీఎస్ రైస్ పట్టివేత

- 62 బస్తాల బియ్యం స్వాధీనం - టాస్క్‌ఫోర్స్ దాడిలో అక్రమ నిల్వ బట్టబయలు
వార్తలు 
Read More...
పీడీఎస్ రైస్ పట్టివేత

ఏసీబీ వలలో తహశీల్దార్

- చేర్యాల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు - రూ.70 వేల లంచంతో పట్టుబడిన తహశీల్దార్ 
క్రైమ్ 
Read More...
ఏసీబీ వలలో తహశీల్దార్

గోదావరి జలాలను వృదా చేయొద్దు

- వెంటనే కన్నెపల్లి మోటార్లు ప్రారంభించాలి- లేకపోతే 50 వేల మంది రైతులతో వచ్చి పంప్‌హౌస్‌ను మేమే ఆన్ చేస్తాం- కేసీఆర్‌కు వారం రోజులు...
వార్తలు 
Read More...
గోదావరి జలాలను వృదా చేయొద్దు

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు అక్షరదర్బార్,నడికూడ: నడికూడ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మండల జర్నలిస్టుల...
Read More...
నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

భర్త హత్యకు భార్య స్కెచ్

- రూ.4 లక్షల సుపారీ- సింగారం మాజీ ఉప సర్పంచ్ యాకయ్య హత్య కేసు చేధన- యాకయ్య మృతి వెనుక అసలు నిజాలు బయటపెట్టిన...
క్రైమ్ 
Read More...
భర్త హత్యకు భార్య స్కెచ్