జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా వెంకన్న

 జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా వెంకన్న

  • ఆయన స్వస్థలం మరిపెడ
  • అదనపు బాధ్యతల నుంచి కలెక్టర్ రిలీవ్ 

జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా వెంకన్న
- ఆయన స్వస్థలం మరిపెడ 
- అదనపు బాధ్యతల నుంచి కలెక్టర్ రిలీవ్ 

అక్షరదర్బార్, వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన బదిలీ ఉత్తర్వుల మేరకు ప్రస్తుతం హెచ్‌ఎండీఏలో కోర్ అర్బన్ రీజియన్, మెట్రో రైల్ విభాగం జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న టి వెంకన్న ను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ నియమించింది. ఈ మేరకు ఇప్పటి వరకు జీడబ్ల్యూఎంసీ మున్సిపల్ కమిషనర్ పదవికి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయిని ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన కమిషనర్ టి వెంకన్న త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. వెంకన్న స్వస్థలం మహబూబాబాద్ జిల్లా మరిపెడ. 2007లో గ్రూప్-1 అధికారిగా మున్సిపల్ కమిషనర్ గా ఎంపికయ్యారు. ఇప్పటివరకు జీడబ్ల్యూఎంసీ కమిషనర్ గా ఐఏఎస్ అధికారులను నియమించిన ప్రభుత్వం తాజాగా గ్రూప్ -1 అధికారిని నియమించటం చర్చనీయమైంది.

Tags:

పరకాలకు పారిశుధ్య ముప్పు

  పరకాలకు పారిశుధ్య ముప్పు వర్షాల వేళ వార్డుల్లో పేరుకుపోతున్న చెత్త..  స్వైర విహారం చేస్తున్న పందులు..  దుర్వాసనతో ప్రజల అవస్థలు..  అక్షరదర్బార్,పరకాల:వర్షాకాలంలో పరకాల పట్టణంలో పారిశుధ్య...
Read More...
పరకాలకు పారిశుధ్య ముప్పు

పీడీఎస్ రైస్ పట్టివేత

- 62 బస్తాల బియ్యం స్వాధీనం - టాస్క్‌ఫోర్స్ దాడిలో అక్రమ నిల్వ బట్టబయలు
వార్తలు 
Read More...
పీడీఎస్ రైస్ పట్టివేత

ఏసీబీ వలలో తహశీల్దార్

- చేర్యాల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు - రూ.70 వేల లంచంతో పట్టుబడిన తహశీల్దార్ 
క్రైమ్ 
Read More...
ఏసీబీ వలలో తహశీల్దార్

గోదావరి జలాలను వృదా చేయొద్దు

- వెంటనే కన్నెపల్లి మోటార్లు ప్రారంభించాలి- లేకపోతే 50 వేల మంది రైతులతో వచ్చి పంప్‌హౌస్‌ను మేమే ఆన్ చేస్తాం- కేసీఆర్‌కు వారం రోజులు...
వార్తలు 
Read More...
గోదావరి జలాలను వృదా చేయొద్దు

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు అక్షరదర్బార్,నడికూడ: నడికూడ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మండల జర్నలిస్టుల...
Read More...
నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ