వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు

వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు

వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు

కాంట వేసి 10 రోజులు దాటినా ఖాతాల్లో జమ కాని చెల్లింపులు

ట్యాబ్‌లో నమోదు ఆలస్యం, ఒటీపీ సమాచారం లేక రైతుల ఆందోళన

ఎరువులు, విత్తనాల కొనుగోలుకు ఇబ్బందులు

అక్షరదర్బార్, శాయంపేట:
వరిధాన్యం విక్రయించిన రైతులకు చెల్లింపుల జాప్యం తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. శాయంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్మి 9 నుంచి 10 రోజులు గడిచినా ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.రైతుల వివరాల ప్రకారం, ధాన్యం కొనుగోలు అనంతరం కేంద్రాల ఇన్‌చార్జీలు ట్యాబ్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉండగా, కొన్ని కేంద్రాల్లో ఈ ప్రక్రియ పూర్తికాలేదని చెబుతున్నారు. వివరాలు నమోదు చేసినా ఒటీపీ సంబంధిత సమాచారాన్ని రైతులకు తెలియజేయడం లేదని వారు ఆరోపిస్తున్నారు. దీంతో చెల్లింపుల ప్రక్రియ ఎక్కడ నిలిచిపోయిందో తెలియక రైతులు అయోమయంలో ఉన్నారు. మరోవైపు, రుతుపవనాల రాక సమీపిస్తున్న నేపథ్యంలో సాగు సన్నాహకాలకు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయాల్సి ఉన్నా చేతిలో నగదు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం అమ్మిన సొమ్ము సమయానికి అందకపోవడం వల్ల వ్యవసాయ పనులు ప్రభావితమవుతున్నాయని వాపోతున్నారు.

అధికారులు స్పందించాలంటున్న రైతులు

ఐకేపీ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాల రికార్డులను ఉన్నతాధికారులు తనిఖీ చేసి, ధాన్యం కొనుగోలు వివరాల నమోదులో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. పెండింగ్‌లో ఉన్న చెల్లింపులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags:

మళ్లీ మంచి రోజులొస్తాయి

- కాంగ్రెస్‌ను వీడేది లేదు.. రాహుల్‌ను ప్రధాని చేయడమే మా లక్ష్యం- మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి- పదవులు తాత్కాలికం.. ప్రజల ప్రేమే శాశ్వతం...
రాజకీయం 
Read More...
మళ్లీ మంచి రోజులొస్తాయి

పీఎం శ్రీ నిధుల పంచాయితీపై అధికారుల సీరియస్‌!

అక్షరదర్బార్‌ ఎఫెక్ట్‌..  పీఎం శ్రీ నిధుల పంచాయితీపై అధికారుల సీరియస్‌! వరికోల్‌ ఇద్దరు ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు..  నిధుల వినియోగంపై త్వరలో విచారణ అక్షరదర్బార్,నడికూడ:  పీఎంపీఎం...
Read More...
పీఎం శ్రీ నిధుల పంచాయితీపై అధికారుల సీరియస్‌!

మిట్ట మధ్యాహ్నం దొంగల హల్చల్‌!

మిట్ట మధ్యాహ్నం దొంగల హల్చల్‌! కిటికీ తెరిచి.. ఇంట్లోకి చొరబాటు..   12 తులాల బంగారం, వెండి పట్టీలు మాయం అక్షరదర్బార్‌, పరకాల:పరకాల పట్టణ నడిబొడ్డున మిట్ట...
Read More...
మిట్ట మధ్యాహ్నం దొంగల హల్చల్‌!

కేదారి దంపతులది ఆత్మహత్య!

- అవమానంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న దంపతులు
క్రైమ్ 
Read More...
కేదారి దంపతులది ఆత్మహత్య!

తల్లిదండ్రుల ముందే ఉపాధ్యాయుల రగడ!

తల్లిదండ్రుల ముందే ఉపాధ్యాయుల రగడ! పీఎం శ్రీ నిధుల ఖర్చుపై వివాదం..   పరస్పరం ఆరోపణలు..  పోలీసులకు ఫిర్యాదు చేసిన హెడ్మాస్టర్ అక్షరదర్బార్, నడికూడ: సమాజంలో గౌరవప్రదమైన వృత్తిగా...
Read More...
తల్లిదండ్రుల ముందే ఉపాధ్యాయుల రగడ!