అలియాబాద్‌లో చలివేంద్రం ప్రారంభం

అలియాబాద్‌లో చలివేంద్రం ప్రారంభం

అలియాబాద్‌లో చలివేంద్రం ప్రారంభం

విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్ పంపిణీ చేసిన సర్పంచ్ సనత్.. 

ముఖ్య అతిథిగా ఎస్సై పవన్

అక్షరదర్బార్, పరకాల:
పరకాల మండలం అలియాబాద్ గ్రామంలో గ్రామ ప్రజలు, బాటసారుల సౌకర్యార్థం శాతరాసి సుధాకర్ రావు జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గ్రామ సర్పంచ్ శాతరాశి సనత్ కుమార్ పటేల్ ఆధ్వర్యంలో పరకాల ఎస్సై పవన్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్‌ను అందజేశారు. సర్పంచ్ సనత్ కుమార్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. వేసవి కాలంలో పాఠశాలలు లేక విద్యార్థులు ఈతలకు పోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారని , మొబైల్ ఫోన్లకు అలవాటు పడకుండా క్రీడలపై ఆసక్తి పెంచేందుకు స్పోర్ట్స్ కిట్ పంపిణీ చేసినట్లు చెప్పారు. ప్రతిరోజూ విద్యార్థులతో కలిసి తాను కూడా మైదానంలో పాల్గొంటానని పేర్కొన్నారు.
అలియాబాద్‌ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, గ్రామ ప్రజల సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తామని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్, మాజీ ఉప సర్పంచ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

విద్యే ఆయుధం.. వివక్షే నా కసి!

- డిజిటల్ మీడియా ప్రతినిధుల చిట్ చాట్ లో బీజేపీ నేత, పరకాల నియోజకవర్గం కాంటెస్టెడ్ అభ్యర్థి డాక్టర్ పగడాల కాళీప్రసాద్ రావు
రాజకీయం 
Read More...
విద్యే ఆయుధం.. వివక్షే నా కసి!

లక్ష్మణ్ బాపూజీ పోరాటం స్ఫూర్తిదాయకం

లక్ష్మణ్ బాపూజీ పోరాటం స్ఫూర్తిదాయకం   కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అక్షరదర్బార్, శాయంపేట: తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన...
Read More...
లక్ష్మణ్ బాపూజీ పోరాటం స్ఫూర్తిదాయకం

చెల్లిని కాపాడబోయి అక్క..

- నీటి కుంటలో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి- కాసిందేవిపేట గ్రామంలో విషాదం
క్రైమ్ 
Read More...
చెల్లిని కాపాడబోయి అక్క..

చాకిరేవు గుట్టపై అక్రమ మైనింగ్‌కు అనుమతులెలా?

చాకిరేవు గుట్టపై అక్రమ మైనింగ్‌కు అనుమతులెలా? అసైన్డ్‌ భూముల్లో తవ్వకాలకు అనుమతులపై డా. కాళీ ప్రసాద్‌రావు ప్రశ్న అక్షరదర్బార్, పరకాల నడికూడ మండలంలోని కంటాత్మకూర్‌ గ్రామంలోని చాకిరేవు...
Read More...
చాకిరేవు గుట్టపై అక్రమ మైనింగ్‌కు అనుమతులెలా?

ఆ గుట్టపై కాంట్రాక్టర్ కన్ను!

ఆ గుట్టపై కాంట్రాక్టర్ కన్ను! గ్రానైట్ పేరుతో గుప్తనిధుల వేటా?..  చాకిరేవు గుట్ట పరిరక్షణకు గ్రామస్తుల దీక్ష అక్షరదర్బార్,నడికూడనడికూడ మండలంలోని కంఠాత్మకూర్ గ్రామంలోని చాకిరేవు గుట్టపై...
Read More...
ఆ గుట్టపై కాంట్రాక్టర్ కన్ను!