ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

  • ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పుంటించుకున్న డ్రైవర్
  • వరంగల్ జిల్లా నర్సంపేట బస్ స్టేషన్ వద్ద ఘటన
  • సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆత్మహత్యాయత్నం

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్
 ఆత్మహత్యాయత్నం!
-నర్సంపేట డిపో వద్ద ఉద్రిక్తత.
-రంగంలో దిగిన పోలీసులు.
అక్షరదర్బార్ ,నర్సంపేట; వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద గురువారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు గత రెండు రోజుల నుండి చేపట్టిన నిరసన ప్రదర్శన ఒక్కసారిగా నర్సంపేట డిపో వద్ద హింసాత్మకంగా మారింది. ఆర్టీసీ యాజమాన్యం మరియు అధికారుల మొండి వైఖరిని నిరసిస్తూ నర్సంపేట డిపోకు చెందిన శంకర్ గౌడ్ అనే డ్రైవర్ అందరూ చూస్తుండగానే తన ఒంటికి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడం కలకలం రేపింది. గురువారం తమ డిమాండ్ల సాధన కోసం నర్సంపేట డిపో కార్మికులు సమ్మె చేప‌ట్టారు. ఇందులో భాగంగా  డిపో గేటు ముందు భారీ ధర్నా చేపట్టారు. నిరసన హోరెత్తుతున్న సమయంలో, తీవ్ర మనస్తాపానికి గురైన డ్రైవర్ శంకర్ గౌడ్ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. క్షణాల్లో మంటలు చెలరేగడంతో తోటి కార్మికులు హతాశులయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను ఆర్పివేసి, బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆగ్రహించిన కార్మికులు యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి నిరసనకారులను నిలువరిస్తున్నారు. ఘటనా స్థలంలో భారీగా పోలీసులు మోహరించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గాయపడిన శంకర్ గౌడ్ ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.  అధికారుల వేధింపులు మరియు యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ అఘాయిత్యం జరిగిందని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.

Tags:

మళ్లీ మంచి రోజులొస్తాయి

- కాంగ్రెస్‌ను వీడేది లేదు.. రాహుల్‌ను ప్రధాని చేయడమే మా లక్ష్యం- మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి- పదవులు తాత్కాలికం.. ప్రజల ప్రేమే శాశ్వతం...
రాజకీయం 
Read More...
మళ్లీ మంచి రోజులొస్తాయి

పీఎం శ్రీ నిధుల పంచాయితీపై అధికారుల సీరియస్‌!

అక్షరదర్బార్‌ ఎఫెక్ట్‌..  పీఎం శ్రీ నిధుల పంచాయితీపై అధికారుల సీరియస్‌! వరికోల్‌ ఇద్దరు ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు..  నిధుల వినియోగంపై త్వరలో విచారణ అక్షరదర్బార్,నడికూడ:  పీఎంపీఎం...
Read More...
పీఎం శ్రీ నిధుల పంచాయితీపై అధికారుల సీరియస్‌!

మిట్ట మధ్యాహ్నం దొంగల హల్చల్‌!

మిట్ట మధ్యాహ్నం దొంగల హల్చల్‌! కిటికీ తెరిచి.. ఇంట్లోకి చొరబాటు..   12 తులాల బంగారం, వెండి పట్టీలు మాయం అక్షరదర్బార్‌, పరకాల:పరకాల పట్టణ నడిబొడ్డున మిట్ట...
Read More...
మిట్ట మధ్యాహ్నం దొంగల హల్చల్‌!

కేదారి దంపతులది ఆత్మహత్య!

- అవమానంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న దంపతులు
క్రైమ్ 
Read More...
కేదారి దంపతులది ఆత్మహత్య!

తల్లిదండ్రుల ముందే ఉపాధ్యాయుల రగడ!

తల్లిదండ్రుల ముందే ఉపాధ్యాయుల రగడ! పీఎం శ్రీ నిధుల ఖర్చుపై వివాదం..   పరస్పరం ఆరోపణలు..  పోలీసులకు ఫిర్యాదు చేసిన హెడ్మాస్టర్ అక్షరదర్బార్, నడికూడ: సమాజంలో గౌరవప్రదమైన వృత్తిగా...
Read More...
తల్లిదండ్రుల ముందే ఉపాధ్యాయుల రగడ!