వరంగల్
క్రైమ్  వరంగల్ 

వ‌రంగల్ డీటీవోపై వేటు.. ర‌వాణాశాఖ‌లో క‌ల‌క‌లం

వ‌రంగల్ డీటీవోపై వేటు.. ర‌వాణాశాఖ‌లో క‌ల‌క‌లం నిన్న డీటీసీ శ్రీనివాస్ ఇళ్లల్లో ఏసీబీ రైడ్స్‌.. అరెస్ట్‌ ఇవాళ ర‌వాణాశాఖ జిల్లా అధికారి ల‌క్ష్మి బ‌దిలీ  ఉత్త‌ర్వులు జారీచేసిన ఉన్న‌తాధికారులు ఇన్‌చార్జి డీటీవోగా ఎంవీఐ శోభన్ బాబుకు అదనపు బాధ్యతలు  అవినీతికి అడ్డాగా వరంగల్ రవాణాశాఖ కార్యాలయం ! దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగిన ప్ర‌భుత్వం.. అక్ష‌ర‌ద‌ర్బార్‌, వ‌రంగ‌ల్‌: వరంగల్ రవాణాశాఖ కార్యాలయం అవినీతికి అడ్డాగా...
Read More...
క్రైమ్  వరంగల్ 

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వరంగల్‌ డీటీసీ అరెస్టు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వరంగల్‌ డీటీసీ అరెస్టు   10 గంట‌ల‌కుపైగా విచారించిన ఏసీబీ.. వ‌రంగ‌ల్‌, జ‌గిత్యాల‌, హైద‌రాబాద్‌లో ఏక‌కాలంలో సోదాలు రూ. కోట్ల‌ల్లో అక్ర‌మాస్తులు గుర్తింపు విలువైన ప‌త్రాలు, ద‌స్తావేజులు స్వాధీనం ర‌వాణాశాఖ‌లో క‌ల‌క‌లం అక్ష‌ర‌ద‌ర్బార్‌, వ‌రంగ‌ల్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లా రవాణాశాఖ ఉప కమిషనర్‌ (డీటీసీ) పుప్పాల శ్రీనివాస్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. డీటీసీ శ్రీనివాస్‌ ఇళ్లల్లో ఏసీబీ...
Read More...
రాజకీయం  వరంగల్ 

పరువు నష్టం దావా వేస్తా..

పరువు నష్టం దావా వేస్తా.. కొన్ని దొంగ యూట్యూబ్ ఛానెల్స్ బురద జల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి కారకులను శిక్షించాలని ముఖ్యమంత్రికి లేఖ రాశా.. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అక్ష‌ర‌ద‌ర్బార్‌, హనుమకొండ: కొన్ని దొంగ యూట్యూబ్ ఛానెల్స్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మండిప‌డ్డారు. కాంగ్రెస్ పార్టీలోని కొందరు అసమ్మతి ఎమ్మెల్యేలు...
Read More...
క్రైమ్  వరంగల్ 

మహిళను చంపి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన కేసులో కీలక ములుపు..

మహిళను చంపి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన కేసులో కీలక ములుపు.. ఐదుగురు నిందుతుల అరెస్ట్.. పరారీలో మరొకరు భ‌ర్త‌, అత్త‌మామ‌, ఆడ‌బిడ్డ‌లే హంత‌కులు వివ‌రాలు వెల్ల‌డించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్  అక్ష‌ర‌ద‌ర్బార్‌, మ‌హబూబాబాద్‌: జ‌న‌వ‌రి 16న మహబూబాబాద్ పట్టణం సిగ్నల్ కాలనీలోని భూపతి అంజయ్య  ఇంట్లో మహిళ దారుణ హ‌త్య‌కు సంబంధించిన‌ కేసును పోలీసులు ఛేదించారు. అనుమానాస్పద మృతిగా భావించిన మహబూబాబాద్ టౌన్...
Read More...
క్రైమ్  వరంగల్ 

గిరిజ‌న యువ‌కుడిపై పెద్దవంగర ఎస్సై క్రాంతి కుమార్ దాష్టీకం

గిరిజ‌న యువ‌కుడిపై పెద్దవంగర ఎస్సై క్రాంతి కుమార్ దాష్టీకం లంచం ఇవ్వ‌లేద‌ని పోలీస్‌స్టేష‌న్‌లో చిత‌క‌బాదిన వైనం పోలీస్ వాహ‌నంలోనే ద‌వాఖాన‌కు త‌ర‌లించిన సిబ్బంది హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్న బాధితుడు   అక్షర దర్బార్, తొర్రూరు : అడిగినంత లంచం ఇవ్వకపోవడంతో ఎస్సై ఓ యువకుడిని చితకబాదాడు. ఈ ఘటన శనివారంరాత్రి మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం...పెద్దవంగర మండలం శంకర్ తండాకు చెందిన...
Read More...
వార్తలు  వరంగల్ 

ఎస్పీ, జ‌డ్జి చిత్ర‌ప‌టాల‌కు పాలాభిషేకం.. ఎందుకంటే ?

ఎస్పీ, జ‌డ్జి చిత్ర‌ప‌టాల‌కు పాలాభిషేకం.. ఎందుకంటే ? అక్ష‌ర‌ద‌ర్బార్‌, మహబూబాబాద్ : జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్, న్యాయమూర్తి తిరుపతి చిత్రపటాలకు ఓ వ్య‌క్తి పాలాభిషేకం చేసి త‌న అభిమానం చాటుకున్నారు. హైదరాబాద్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సీటు ఇప్పిస్తానంటూ దళారి తీసుకున్న రెండు లక్షల  రూపాయలను తిరిగి ఇప్పించి లోక్ అదాలత్ లో ఇరువురి కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించినందుకు కృత‌జ్ఞ‌త‌గా...
Read More...
వరంగల్ 

ధడేల్.. ధడేల్

ధడేల్.. ధడేల్ ధడేల్.. ధడేల్  * రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా * నిబంధ‌న‌లు ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా దందా * అధికారుల అండ‌తో బ‌రితెగింపు.. * ఇష్టారాజ్యంగా మందుగుండుతో పేళుల్లు.. * మాయమ‌వుతున్న గుట్టలు..  * యథేచ్చ‌గా ప్రకృతి సంపద దోపిడీ.. * గతంలో మైనింగ్ సర్వే పేరుతో ఐదు లక్షలు నొక్కేసిన అధికారులు ! * ఎమ్మెల్యే జీఎస్సార్ ఆదేశాలు భేఖాత‌ర్‌.. * ఆఫీస‌ర్ల తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న స్థానికులు - అక్ర‌మ మైనింగ్‌ను అడ్డుకోవాల‌ని డిమాండ్‌ అక్షర దర్బార్, శాయంపేట : మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. నిబంధ‌న‌లు ఉల్లంఘించి ప్ర‌కృతి సంప‌ద‌ను య‌థేచ్ఛ‌గా దోచుకెళ్తోంది. దీంతో క్రమక్రమంగా గుట్టలు మాయమైపోతున్నాయి. శాయంపేట మండలంలో కొందరు బడా వ్యక్తులు మైనింగ్ మాఫియాను నడిపిస్తున్నారు. తూతూమంత్రంగా అనుమతులు పొంది అక్రమంగా గుట్ట‌ల‌ను మింగుతున్నారు. మరికొందరు లీజు గడువు ముగిసినప్పటికీ అధికారులతో కుమ్మ‌క్కై ఇష్టారాజ్యంగా దందా కొన‌సాగిస్తున్నారు. ముఖ్యంగా శాయంపేట మండలంలో 'ప్రగతి' కోసం పేరు మారిన వాగు అవతల గల గ్రామంలోని ఓ క్రషర్ నిర్వాహ‌కులు అక్రమ మైనింగ్‌కు పాల్ప‌డుతున్నార‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. గుట్టపై నుండి 120 ఫీట్ల లోపల మందుగుండు సామాగ్రి అమర్చి బోర్ బ్లాస్టింగ్ చేయడం వల్ల గ్రామంలోని ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారని చెబుతున్నారు. బోర్ బ్లాస్టింగ్ వల్ల పెద్ద పెద్ద శబ్దంతో దుమ్ముధూళి అంతా ఇళ్లల్లోకి చేరుతోంద‌ని వాపోతున్నారు. బ్లాస్టింగ్ వాళ్ళ ఇళ్ల గోడ‌ల‌కు ప‌గ‌ల్లు ఏర్ప‌డుతున్నాయ‌ని, ఇంటిపై రేకులు పగిలిపోతున్నాయని స్థానికులు ఆవేద‌న వ్య‌క్తంచేస్తున్నారు. క్రషర్ యజమాని దృష్టికి తీసుకెళ్లినా ప‌ట్టించుకోవ‌డంలేద‌ని వాపోతున్నారు.గుట్ట నుంచి కంకర గ్రానైట్ తవ్వ‌కాల కోసం రెవెన్యూశాఖ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ ఓ సి), భూగర్భ గనుల (మైనింగ్) శాఖ నుంచి లీజు పత్రంతోపాటు పీసీబీ (పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్) నుంచి కన్సల్ట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ (సీఎఫ్ ఓ) అనుమతులు తీసుకోవాల్సి ఉంది. కానీ స‌ద‌రు క్రషర్ నిర్వాహ‌కుల‌కు ఎలాంటి అనుమతులు లేవని సమాచారం. అంతేగాక మైనింగ్ చేయడానికి ఐదు హెక్టార్లకు మించితే స్థానికుల అభిప్రాయాలను సేకరించాల్సి ఉంది. ఇవేమీ లేకుండా పీసీబీ, రెవెన్యూ, మైనింగ్ అధికారుల సమన్వయంతో క్రషర్‌కు సహకరిస్తున్నారని ఆరోపణలు వ‌స్తున్నాయి. - రాత్రి, పగలు తేడా లేకుండా బ్లాస్టింగ్ బ్లాస్టింగ్ చేయాలంటే మైనింగ్, పోలీసుల అనుమతితో పాటు స్థానిక ప్రజల ఇల్లు తదితర వాటిని పరిశీలించి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ స‌ద‌రు క్రషర్కు ఎలాంటి అనుమతులు లేకుండానే కంప్రెషర్ తో బ్లాస్టింగ్ చేస్తున్నారని పేలుడు ధాటికి ఇల్లు కంపించడంతోపాటు నెర్రలు బారుతున్నాయని  ప్రజలు వాపోతున్నారు. రాత్రిపగలు తేడా లేకుండా గుట్టలో బ్లాస్టింగ్ జరుగుతుండడంతో పొలాలకు వెళ్లే రైతులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక స‌ద‌రు క్రషర్ నుండి నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా కంకర, డస్ట్ అంతా టన్నుల కొద్ది తరలిపోతున్న‌ది. నిత్యం వందలాది టిప్పర్లతో వచ్చే దుమ్ముతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని రోడ్లు కూడా ధ్వంసం అవుపోతున్నదని స్థానికులు చెబుతున్నారు. - ఎమ్మెల్యే ఆదేశాలు బేఖాతర్‌ భూపాపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదేశాల‌ను అధికారులు బేఖాతర్ చేస్తున్నారు. ఇటీవల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ఎమ్మెల్యే స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈసంద‌ర్బంగా ఆయ‌న మండ‌లంలోని క్ర‌ష‌ర్ల‌పై ఆగ్రహం వ్య‌క్తంచేశారు. మండలంలో మైనింగ్ అంతా దుర్వినియోగం అవుతోందని,  మైనింగ్ పై సర్వే చేయాలని అధికారులను ఆదేశించ‌గా వారు క్రషర్ యజమానులతో ఐదు లక్షలతో డీల్ మాట్లాడుకుని కుమ్మక్కయ్యారని స్వయంగా ఎమ్మెల్యే ఆరోపించారు. క్రషర్ నుండి ఆదనపు మోతాదులో ట్రాక్టర్ టిప్పర్ వెళితే వాటిపై జరిమానా విధించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. కానీ అధికారులు అవేమీ పట్టనట్టు వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం మండ‌లంలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది.
Read More...
క్రైమ్  వరంగల్ 

క‌ల్తీ స‌రుకులు.. కాలంచెల్లిన ఉత్ప‌త్తులతో నయా దందా..

క‌ల్తీ స‌రుకులు.. కాలంచెల్లిన ఉత్ప‌త్తులతో నయా దందా.. వ‌రంగ‌ల్‌లోని కిరాణ‌షాపు య‌జ‌మాని మాయాజాలం ప‌క్కా స‌మాచారంతో టాస్క్‌ఫోర్స్ దాడులు భారీగా కల్తీ, నకిలీ, కాలంచెల్లిన ఐట‌మ్స్ గుర్తింపు సుమారు రూ. 8 లక్షల విలువ గల 196 రకాల ప‌దార్థాలు స్వాధీనం  షాప్ య‌జ‌మానిపై కేసు..  అక్ష‌ర‌ద‌ర్బార్‌, వ‌రంగ‌ల్‌:  టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ ఆధ్వర్యంలో వ‌రంగ‌ల్‌లోని సంతోష్ కుమార్ కిరణం & జనరల్ స్టోర్స్‌లో...
Read More...
క్రైమ్  వరంగల్ 

ఎంజీఎంలో మ‌హిళా ఉద్యోగిపై దాడి కేసు.. 

ఎంజీఎంలో మ‌హిళా ఉద్యోగిపై దాడి కేసు..  అక్ష‌ర‌ద‌ర్బార్‌, వరంగ‌ల్ : వ‌రంగ‌ల్ ఎంజీఎంలో ఉద్యోగిని కొట్టి బలవంతంగా డబ్బులు లాక్కున్న కిలాడీ లేడీని మ‌ట్టెవాడ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేర‌కు ఏసీపీ నందిరాం నాయ‌క్ అరెస్టుకు సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డించారు.  బిల్ల సుమలత అనే మహిళ  15 సంవత్సరాల నుండి ఎంజీఎంలో ఔట్ సోర్సింగ్‌లో రెండు ఏళ్లుగా పేషెంట్ కేర్‌గా ఉద్యోగం...
Read More...
వరంగల్ 

వరంగల్ బిడ్డ మ‌రో ప్ర‌పంచ రికార్డు

వరంగల్ బిడ్డ మ‌రో ప్ర‌పంచ రికార్డు 400 మీట‌ర్ల టీ - 20 విభాగం ఫైన‌ల్లో దీప్తికి కాంస్య ప‌త‌కం స్వ‌గ్రామం క‌ల్లెడ‌లో హ‌ర్షాతిరేకాలు వరంగల్ జిల్లాకు చెందిన యువ అథ్లెట్ దీప్తి జివాంజీ మ‌రో అరుదైన రికార్డు నెల‌కొల్పారు. పారీస్ పారాలింపిక్స్‌లో తెలుగు తేజం దీప్తి జివాంజి చ‌రిత్ర సృష్టించారు. పారాలింపిక్స్ హిస్ట‌రీలో ప‌త‌కం సాధించిన తొలి తెలుగు క్రీడాకారిణిగా రికార్డుల‌కెక్కారు....
Read More...
క్రైమ్  వరంగల్ 

ఎన్‌కౌంట‌ర్‌లో మావోయిస్టు అగ్ర‌నేత జగన్ హ‌తం

ఎన్‌కౌంట‌ర్‌లో మావోయిస్టు అగ్ర‌నేత జగన్ హ‌తం స్వస్థలం టేకులగూడెంలో విషాదఛాయలు  1980వ సంవత్సరంలో పీపుల్స్‌వార్‌లో చేరిక‌ అంచెలంచెలుగా కేంద కమిటీ స్థాయికి.. అక్ష‌ర‌ద‌ర్బార్‌, వ‌రంగ‌ల్ :  మావోయిస్టు అగ్రనేత, పార్టీ తొలిత‌రం నాయ‌కుడు మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ అలియాస్ దాదా రణదేవ్ ఛత్తీస్‌గ‌ఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. కేంద్ర మిలిటరీ ఇంచార్జ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గ‌ఢ్ బార్డర్ ఇన్చార్జిగా కొనసాగుతున్న రణదేవ్...
Read More...
వరంగల్ 

వ‌ర‌ద‌ల‌కు కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్‌..

వ‌ర‌ద‌ల‌కు కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్‌.. సికింద్రాబాద్-విజయవాడ మధ్య‌నిలిచిపోయిన 25 రైళ్లు..అక్ష‌ర‌ద‌ర్బార్‌, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో కుండ‌పోత వర్షానికి జ‌న‌జీవ‌నం అత‌లాకుత‌లం అయింది. రోడ్లు, రైల్వేలైన్లు దెబ్బ‌తిన‌డంతో ప్ర‌జా ర‌వాణా స్తంభించింది. కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి సమీపంలో భారీ వర్షానికి రైల్వే ట్రాక్ పూర్తిగా ధ్వంసమైంది. పట్టాలపై కంకర కొట్టుకుపోవ‌డంతో తాళ్లపూసలపల్లి వద్ద రైల్వేట్రాక్‌ వరదనీటితో నిండిపోయింది. రైల్వే సిబ్బంది...
Read More...