డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు

డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు

డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు 

  పారిశుద్ధ కార్మికులకు దుస్తులు పంపిణీ చేసిన 9 వ వార్డు కౌన్సిలర్ పూర్ణచారి 

కౌన్సిలర్ పూర్ణ చారిని అభినందించిన కార్మికులు.

అక్షరదర్బార్, పరకాల:
 పరకాల అసెంబ్లీ నియోజకవర్గ కాంటెస్టెంట్ డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని 9వ వార్డు బీజేపీ కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణచారి  మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు దుస్తుల పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ పూర్ణచారి మాట్లాడుతూ బీజేపీ బలోపేతానికి కృషి చేస్తున్న డాక్టర్ కాళీ ప్రసాద్ రావు జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. పట్టణాన్ని పారిశుద్ధంగా ఉంచేందుకు నిత్యం శ్రమిస్తున్న కార్మికులను గౌరవించాలనే సదుద్దేశంతో వారికి దుస్తులు అందజేసినట్లు తెలిపారు. తమ సేవలను గుర్తించి గౌరవించిన కౌన్సిలర్‌కు పారిశుద్ధ కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి బీజేపీ నాయకులు సంఘ పురుషోత్తం దర్న నారాయణ దాస్, దాసరి వెంకన్న, మెంతుల సురేష్, వేముల అశోక్, నరేష్ కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

విద్యే ఆయుధం.. వివక్షే నా కసి!

- డిజిటల్ మీడియా ప్రతినిధుల చిట్ చాట్ లో బీజేపీ నేత, పరకాల నియోజకవర్గం కాంటెస్టెడ్ అభ్యర్థి డాక్టర్ పగడాల కాళీప్రసాద్ రావు
రాజకీయం 
Read More...
విద్యే ఆయుధం.. వివక్షే నా కసి!

లక్ష్మణ్ బాపూజీ పోరాటం స్ఫూర్తిదాయకం

లక్ష్మణ్ బాపూజీ పోరాటం స్ఫూర్తిదాయకం   కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అక్షరదర్బార్, శాయంపేట: తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన...
Read More...
లక్ష్మణ్ బాపూజీ పోరాటం స్ఫూర్తిదాయకం

చెల్లిని కాపాడబోయి అక్క..

- నీటి కుంటలో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి- కాసిందేవిపేట గ్రామంలో విషాదం
క్రైమ్ 
Read More...
చెల్లిని కాపాడబోయి అక్క..

చాకిరేవు గుట్టపై అక్రమ మైనింగ్‌కు అనుమతులెలా?

చాకిరేవు గుట్టపై అక్రమ మైనింగ్‌కు అనుమతులెలా? అసైన్డ్‌ భూముల్లో తవ్వకాలకు అనుమతులపై డా. కాళీ ప్రసాద్‌రావు ప్రశ్న అక్షరదర్బార్, పరకాల నడికూడ మండలంలోని కంటాత్మకూర్‌ గ్రామంలోని చాకిరేవు...
Read More...
చాకిరేవు గుట్టపై అక్రమ మైనింగ్‌కు అనుమతులెలా?

ఆ గుట్టపై కాంట్రాక్టర్ కన్ను!

ఆ గుట్టపై కాంట్రాక్టర్ కన్ను! గ్రానైట్ పేరుతో గుప్తనిధుల వేటా?..  చాకిరేవు గుట్ట పరిరక్షణకు గ్రామస్తుల దీక్ష అక్షరదర్బార్,నడికూడనడికూడ మండలంలోని కంఠాత్మకూర్ గ్రామంలోని చాకిరేవు గుట్టపై...
Read More...
ఆ గుట్టపై కాంట్రాక్టర్ కన్ను!