మళ్లీ మంచి రోజులొస్తాయి

మళ్లీ మంచి రోజులొస్తాయి

- కాంగ్రెస్‌ను వీడేది లేదు.. రాహుల్‌ను ప్రధాని చేయడమే మా లక్ష్యం
- మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి
- పదవులు తాత్కాలికం.. ప్రజల ప్రేమే శాశ్వతం
- బర్తరఫ్ పై బాధ లేదు.. అకారణంగా తొలగించారనే వేదన ఉంది
- ఈస్ట్‌లో 24 డివిజన్లు గెలుస్తాం.. వచ్చే ఎన్నికల్లో పోటీ నాదే
- మాజీ మంత్రి కొండా సురేఖ స్పష్టం
- కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం 

మళ్లీ మంచి రోజులొస్తాయి
- కాంగ్రెస్‌ను వీడేది లేదు.. రాహుల్‌ను ప్రధాని చేయడమే మా లక్ష్యం
- మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి
- పదవులు తాత్కాలికం.. ప్రజల ప్రేమే శాశ్వతం
- బర్తరఫ్ పై బాధ లేదు.. అకారణంగా తొలగించారనే వేదన ఉంది
- ఈస్ట్‌లో 24 డివిజన్లు గెలుస్తాం.. వచ్చే ఎన్నికల్లో పోటీ నాదే
- మాజీ మంత్రి కొండా సురేఖ స్పష్టం
- కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం 

అక్షరదర్బార్, వరంగల్: వరంగల్ లోని ఎంకే నాయుడు హోటల్‌లో వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలు, కొండా అభిమానులతో మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఆదివారం సమావేశం నిర్వహించారు. మంత్రి పదవి నుంచి సురేఖ బర్తరఫ్ అయిన తర్వాత తొలిసారిగా నిర్వహించిన ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, నియోజకవర్గ ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.
- మాట కోసం నిలబడే తత్వం మాది.. కొండా మురళి
సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మాట్లాడుతూ.. "కొండా సురేఖను సారీ చెప్పాలని కొందరు సూచించారు. కానీ, పదవి ఉన్నా లేకున్నా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే ప్రసక్తే లేదని నా భార్య స్పష్టం చేసింది. కొండా సురేఖ గెలుపు వెనుక రాహుల్ గాంధీ పాత్ర ఉంది. రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే మా ప్రధాన లక్ష్యం. పదవులు వస్తుంటాయి.. పోతుంటాయి, కానీ కృతజ్ఞత అనేది మా రక్తం, కుటుంబంలో ఉంది. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు" అని తేల్చిచెప్పారు.
- ప్రజల్లో చిరస్థాయిగా ఉండటమే మా లక్ష్యం.. కొండా సురేఖ
మాజీ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. "పదవి నుంచి తొలగించిన తర్వాత ఆందోళనలు చేయాలని కొందరు కార్యకర్తలు ఫోన్ చేశారు. కానీ, పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని వారందరికీ నచ్చజెప్పాను. నా నిర్ణయానికి కట్టుబడిన కార్యకర్తలకు ధన్యవాదాలు" అని తెలిపారు.
ప్రస్తుతం రాజకీయాల్లో అవకాశవాదం ఎక్కువైందని, ఉదయం ఒక పార్టీలో ఉండి సాయంత్రానికి మరో పార్టీలోకి మారే సంస్కృతి పెరిగిందని విమర్శించారు. "గతంలో రాజశేఖర్ రెడ్డి గారి కోసం మంత్రి పదవికి ರಾజీనామా చేశా. ఆ తర్వాత కొంతమంది గుంటనక్కల వల్ల కాంగ్రెస్ టికెట్ రాకపోతే కేసీఆర్ పిలిచి వరంగల్ ఈస్ట్ టికెట్ ఇచ్చారు. నాడు అధికారంలో ఉన్న మంత్రిని ఓడించి గెలిచాం. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ రాకతో నాకు మళ్లీ మంత్రి బాధ్యతలు వచ్చాయి. ఎలాంటి మచ్చ లేకుండా పదవి నిర్వహించాను" అని వివరించారు.
- రాబోయే ఎన్నికల్లో టికెట్ నాదే
మంత్రి పదవి పోయినందుకు బాధ లేదని, కానీ అకారణంగా తొలగించారనే వేదన మాత్రం ఉందన్నారు. "పదవి అనేది కేవలం ఒక అలంకారం మాత్రమే. పదవి లేకపోయినా ప్రజల్లోనే ఉంటాం. మళ్లీ మంచి రోజులు వస్తాయి. త్వరలో జరగబోయే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వరంగల్ తూర్పు పరిధిలోని 24 డివిజన్లను గెలుచుకుంటాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచే పోటీ చేస్తాను, వందకు వంద శాతం కాంగ్రెస్ టికెట్ నాకే వస్తుంది. గెలిచి మళ్లీ మీ ముందుకు వస్తాను" అని ధీమా వ్యక్తం చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలని అన్నారు.

Tags:

మళ్లీ మంచి రోజులొస్తాయి

- కాంగ్రెస్‌ను వీడేది లేదు.. రాహుల్‌ను ప్రధాని చేయడమే మా లక్ష్యం- మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి- పదవులు తాత్కాలికం.. ప్రజల ప్రేమే శాశ్వతం...
రాజకీయం 
Read More...
మళ్లీ మంచి రోజులొస్తాయి

పీఎం శ్రీ నిధుల పంచాయితీపై అధికారుల సీరియస్‌!

అక్షరదర్బార్‌ ఎఫెక్ట్‌..  పీఎం శ్రీ నిధుల పంచాయితీపై అధికారుల సీరియస్‌! వరికోల్‌ ఇద్దరు ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు..  నిధుల వినియోగంపై త్వరలో విచారణ అక్షరదర్బార్,నడికూడ:  పీఎంపీఎం...
Read More...
పీఎం శ్రీ నిధుల పంచాయితీపై అధికారుల సీరియస్‌!

మిట్ట మధ్యాహ్నం దొంగల హల్చల్‌!

మిట్ట మధ్యాహ్నం దొంగల హల్చల్‌! కిటికీ తెరిచి.. ఇంట్లోకి చొరబాటు..   12 తులాల బంగారం, వెండి పట్టీలు మాయం అక్షరదర్బార్‌, పరకాల:పరకాల పట్టణ నడిబొడ్డున మిట్ట...
Read More...
మిట్ట మధ్యాహ్నం దొంగల హల్చల్‌!

కేదారి దంపతులది ఆత్మహత్య!

- అవమానంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న దంపతులు
క్రైమ్ 
Read More...
కేదారి దంపతులది ఆత్మహత్య!

తల్లిదండ్రుల ముందే ఉపాధ్యాయుల రగడ!

తల్లిదండ్రుల ముందే ఉపాధ్యాయుల రగడ! పీఎం శ్రీ నిధుల ఖర్చుపై వివాదం..   పరస్పరం ఆరోపణలు..  పోలీసులకు ఫిర్యాదు చేసిన హెడ్మాస్టర్ అక్షరదర్బార్, నడికూడ: సమాజంలో గౌరవప్రదమైన వృత్తిగా...
Read More...
తల్లిదండ్రుల ముందే ఉపాధ్యాయుల రగడ!