కసితో ఎమ్మెల్యేనయ్య

కసితో ఎమ్మెల్యేనయ్య

- బిజినెస్ మ్యాన్ ను కావాలనే కాయిస్ ఉండే నాకు 
- మా అన్న ఎమ్మెల్యే కావాలన్న టార్గెట్ ఉండేది 
- అయితే ఒక్క అవమానం నన్ను అసెంబ్లీకి పంపింది
- 2004 ఎన్నికల్లో కేవలం రూ.91 వేలతో నామినేషన్ వేసిన 
- ప్రతి ఎన్నికల్లో నామినేషన్ ఫీజు పొద్దుటూరి గంగారెడ్డి ఇచ్చారు 
- 2005లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసిన 
- డిప్యూటీ మేయర్ పదవి కోసం కార్పొరేటర్ గా పోటీ చేయమన్నారు 
- తర్వాత పార్టీ సిటీ ప్రెసిడెంట్ గా నియమించారు 
- మానవ సంబంధాలే నన్ను వరుసగా గెలిపించాయి
- ఐదు ప్రిన్సిపుల్స్ పై ఎమ్మెల్యేగా పనిచేసిన 
- కార్మికులు, సహకార సంఘాలే నా బలం
- ఉద్యమకారులకు ఆర్థిక సాయం చేశాను 
- ప్రతీకార రాజకీయాలకు దూరం.. ప్రజల సంక్షేమమే నా మంత్రం
- వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్త.. పనితీరుతోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తా
- డిజిటల్ మీడియాతో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ చిట్ చాట్ 

 

కసితో ఎమ్మెల్యేనయ్యా

- బిజినెస్ మ్యాన్ ను కావాలనే కాయిస్ ఉండే నాకు 
- మా అన్న ఎమ్మెల్యే కావాలన్న టార్గెట్ ఉండేది 
- అయితే ఒక్క అవమానం నన్ను అసెంబ్లీకి పంపింది
- 2004 ఎన్నికల్లో కేవలం రూ.91 వేలతో నామినేషన్ వేసిన 
- ప్రతి ఎన్నికల్లో నామినేషన్ ఫీజు పొద్దుటూరి గంగారెడ్డి ఇచ్చారు 
- 2005లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసిన 
- డిప్యూటీ మేయర్ పదవి కోసం కార్పొరేటర్ గా పోటీ చేయమన్నారు 
- తర్వాత పార్టీ సిటీ ప్రెసిడెంట్ గా నియమించారు 
- మానవ సంబంధాలే నన్ను వరుసగా గెలిపించాయి
- ఐదు ప్రిన్సిపుల్స్ పై ఎమ్మెల్యేగా పనిచేసిన 
- కార్మికులు, సహకార సంఘాలే నా బలం
- ఉద్యమకారులకు ఆర్థిక సాయం చేశాను 
- ప్రతీకార రాజకీయాలకు దూరం.. ప్రజల సంక్షేమమే నా మంత్రం
- వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్త.. పనితీరుతోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తా
- డిజిటల్ మీడియాతో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ చిట్ చాట్ 


అక్షరదర్బార్, హనుమకొండ 

పొలిటీషియన్ ను కావాలన్న ఆలోచనతో తన ప్రస్థానం ప్రారంభం కాలేదని, మంచి బిజినెస్ మేన్ గా ఎదగాలన్నదే తన కల అని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. అయితే జీవితంలో ఎదురైన ఒక అవమానం తనలో ఎమ్మెల్యే కావాలనే కసిని రగిలించిందన్నారు. ఓటమిని అధిగమించి గెలుపు సాధించడం నుంచి రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం వరకు సాగిన ప్రస్థానాన్ని ఆయన డిజిటల్ మీడియాతో శుక్రవారం చేసిన చిట్‌చాట్‌లో పంచుకున్నారు.

- ఉమ్మడి కుటుంబంలో పెరిగి..
తమది పెద్ద ఉమ్మడి కుటుంబమని, తండ్రి విద్యుత్ శాఖలో ఉద్యోగం చేసేవారని వినయ్ భాస్కర్ తెలిపారు. చిన్నతనంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నామని, అన్నలు, అక్కలు, తమ్ముళ్లతో కలిసి వడ్డేపల్లిలోని ఇంట్లో ఉండేవారమన్నారు. శనివారం వచ్చిందంటే ఇంట్లో సందడి వాతావరణం ఉండేదని గుర్తుచేసుకున్నారు. తాను రాజకీయ నాయకుడు కావాలని ఎప్పుడూ అనుకోలేదని, మంచి బిజినెస్‌మ్యాన్‌గా ఎదగాలనే కోరిక ఉండేదన్నారు. అందుకు తగ్గట్టుగానే కోకాకోలా డీలర్‌షిప్ తీసుకుని, దాన్ని విస్తరించాలనే ఆలోచనతో ఉన్నట్లు చెప్పారు.

- అన్న రాజకీయాల్లో.. తాను బ్యాక్‌ఎండ్‌లో..
మా అన్న దాస్యం ప్రణయ్ భాస్కర్ రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారని, తాను మాత్రం ఆయనకు తెర వెనుక నుంచి సహకరించేవాడినని దాస్యం తెలిపారు. 1984లో ప్రణయ్ భాస్కర్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ప్రజలతో సంబంధాలను బలోపేతం చేసేందుకు పలు సంఘాలను ఏర్పాటు చేశామన్నారు. 1994లో ఆయన విజయం సాధించి మంత్రి అయ్యారని, అప్పటి నుంచి ఏర్పడిన సంఘాలు తమకు ఇప్పటికీ అండగా నిలుస్తున్నాయని చెప్పారు. అయితే ప్రణయ్ భాస్కర్ అకాల మరణం తమ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టిందన్నారు. ఆయన మరణం తర్వాత రాజకీయాలు వద్దనుకుని, కుటుంబం, వ్యాపారంపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

- ఆ ఒక్క ఘటన.. ఎమ్మెల్యేను చేసింది 
అన్న మరణం తర్వాత వదిన, పిల్లలు హైదరాబాద్‌కు వెళ్తున్న సమయంలో తల్లిదండ్రులతో కలిసి వెళ్లామని వినయ్ భాస్కర్ తెలిపారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉన్న తన అన్న క్వార్టర్‌కు సీల్ వేసి ఉండటం చూసి బాధ కలిగిందన్నారు. ఈ విషయంపై ఈవో కార్యాలయానికి వెళ్లి అడిగితే అక్కడ ఎదురైన నిర్లక్ష్యపూరిత వైఖరి, అవమానం తనలో కసిని పెంచిందని చెప్పారు. ఆ ఘటన తర్వాతే ఎమ్మెల్యే కావాలనే పట్టుదల బలపడిందన్నారు. ఈవోకు సవాల్ చేసి, ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్లీ వచ్చి కలుస్తానని చెప్పానని, అనుకున్నట్లుగానే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వెళ్లి శాలువా కప్పి స్వీటు ఇచ్చి వచ్చానని గుర్తుచేసుకున్నారు.

- అప్పటి రాజకీయాలు వేరు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం ఇప్పటితో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉండేదని వినయ్ భాస్కర్ అన్నారు. రాజకీయ ప్రత్యర్థుల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత స్థాయిలో సత్సంబంధాలు ఉండేవన్నారు. 1998లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన తనకు వామపక్షాలు, కార్మిక సంఘాలు, యూనియన్లు మద్దతుగా నిలిచాయని చెప్పారు. 2004లో కూడా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టికెట్ ఇస్తానని చెప్పినా, రాజకీయ పరిణామాలు, బీజేపీతో పొత్తు నేపథ్యంలో పరిస్థితులు మారిపోయాయని అన్నారు. మరికొందరు నాయకులతో కలిసి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని నిర్ణయించుకున్న సమయంలో చంద్రబాబు వద్దకు వెళ్లినా, నామినేషన్ వేయొద్దని, నామినేటెడ్ పదవి ఇస్తానని చెప్పారని తెలిపారు. అయినప్పటికీ పోటీ చేయాలన్న నిర్ణయం మార్చుకోలేదన్నారు. సమాజ్‌వాదీ పార్టీ నుంచి పోటీ చేయాలనే ఆఫర్ వచ్చినా, వామపక్షాలు, సంఘాల మద్దతుతో ఇండిపెండెంట్‌గానే పోటీ చేశానన్నారు. తనతో పాటు పోటీ చేస్తామని చెప్పిన కొందరు చివరి సమయంలో వెనక్కి తగ్గినా, తాను నమ్ముకున్న సంఘాలు మాత్రం తన వెంట నిలిచాయని చెప్పారు. 2004 ఎన్నికల్లో కేవలం 1,400 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యానని తెలిపారు.

- 2005లో కేసీఆర్‌ను కలిశా..
ఎన్నికల అనంతరం 2005లో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ను కలిసినట్లు వినయ్ భాస్కర్ తెలిపారు. తొలుత కార్పొరేటర్‌గా పోటీ చేయాలని కేసీఆర్ సూచించారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పట్టు పట్టణంలో కూడా పెరగాలంటే కార్పొరేటర్‌గా పోటీ చేయాలని కేసీఆర్ సూచించడంతో అంగీకరించానన్నారు. తనను నమ్ముకున్న వారికి కొన్ని టికెట్లు ఇప్పించాలని కోరగా అందుకు సహకరించారని, అనంతరం పోటీ చేసి విజయం సాధించానని తెలిపారు. ఆ తర్వాత టీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారని చెప్పారు.

- పార్టీ ఆఫీసు ప్రారంభం రోజే టికెట్‌ కన్ఫాం 
టౌన్ అధ్యక్షుడిన అయిన తర్వాత కేయూ జంక్షన్ సమీపంలో పార్టీ కార్యాలయం కోసం భవనాన్ని అద్దెకు తీసుకున్నానని దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. కేసీఆర్ హన్మకొండకు వచ్చినప్పుడు ఆయన చేతుల మీదుగా ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం. అయితే కొందరు తనపై లేనిపోని విషయాలు చెప్పి కేసీఆర్‌ను పార్టీ కార్యాలయానికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తాను స్వయంగా వెళ్లి కార్యాలయానికి రావాలని కోరగా, తొలుత నిరాకరించినా, కార్యాలయం కోసం పడిన కష్టం చెప్పడంతో కేసీఆర్ వచ్చి ప్రారంభించారని తెలిపారు. పార్టీ కార్యాలయ ఏర్పాటును చూసి కేసీఆర్ అభినందించారని, తనకు ఉన్న ప్రజాబలం, గత ఎన్నికల్లో వచ్చిన మద్దతును పరిశీలించిన తర్వాత అక్కడే తనకు పార్టీ టికెట్ ఖరారైందని చెప్పారు.

- ఓటమి నుంచి గెలుపు వరకు..
2004లో ఓడిపోయిన తర్వాత నిరాశ చెందకుండా ప్రజలు, కార్మికులు, వివిధ సంఘాలతో తన సంబంధాలను మరింత బలోపేతం చేసుకున్నట్లు వినయ్ భాస్కర్ తెలిపారు. 44 సంఘాలతో కార్మిక సమాఖ్య ఐక్యవేదికను ఏర్పాటు చేశామని, వారంతా అండగా నిలవడంతో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించానన్నారు. “నేను ఆర్థిక సంబంధాలతో కాదు.. మానవ సంబంధాలతో గెలిచాను” అని ఆయన అన్నారు. అందుకే కార్మిక, సహకార సంఘాలంటే తనకు ప్రత్యేక అభిమానమని, వాటికి ఎప్పుడూ తోడుగా ఉంటానన్నారు.

- ఐదు సూత్రాలు..
తన రాజకీయ, సామాజిక జీవితంలో ఐదు అంశాలను కచ్చితంగా పాటిస్తానని వినయ్ భాస్కర్ తెలిపారు. ఆరోగ్య సమస్యతో ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే అర్ధరాత్రి అయినా స్పందించడం, ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయం చేయడం, పేద విద్యార్థుల ఫీజులకు సహకరించడం, తన క్యాడర్‌కు అన్ని విధాలుగా అండగా నిలవడం, కార్మిక, సహకార సంఘాలకు తోడుగా ఉండడం తన నైజమన్నారు.

- 'కల్పలత’తో విడదీయరాని అనుబంధం..
గతంలో ఉన్న వరంగల్ సెంట్రల్ జైలు ఎదురుగా ఉన్న కల్పలతా సూపర్ బజార్‌తో చిన్ననాటి నుంచే తనకు ప్రత్యేక అనుబంధం ఉందని వినయ్ భాస్కర్ తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాన్ని మూసివేసేందుకు ప్రయత్నాలు జరిగినప్పుడు అడ్డుకున్నానని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కల్పలతాపై ఉన్న అప్పును మాఫీ చేయించడంతో పాటు సభ్యత్వాలను పెంచి, అన్ని వర్గాలతో కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. పెట్రోల్ బంక్ ప్రారంభించి, వచ్చిన సంపదను వినియోగదారులకు చేరేలా లాటరీల ద్వారా బహుమతులు కూడా అందించామని చెప్పారు. అయితే ఇప్పుడు కల్పలతా సూపర్ బజార్‌లో అవినీతి జరిగిందని, దానికి తానే కారణమంటూ కొందరు బురద జల్లుతున్నారని ఆరోపించారు.

- ఉద్యమకారులకు సాయం..
మా అమ్మ ఎప్పుడూ.. చేసిన దానం గుప్తంగా ఉండాలని చెప్పేదని, ఆ మాటను ఇప్పటికీ పాటిస్తున్నానని వినయ్ భాస్కర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో తనతో కలిసి పోరాడి మరణించిన వారి కుటుంబాలకు, కేసుల పాలైన వారికి, గాయపడిన వారికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు సహాయం చేశానన్నారు. ఎంతో మందికి సాయం చేశానని, అది నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదని సాయం పొందిన వారి మనస్సులో ఉంటే చాలన్నారు. అలాగే 833 మంది సభ్యులతో త్రిచక్ర పొదుపు సంఘాన్ని ఏర్పాటు చేయగా అది విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు.

- నో రివేంజ్ పాలిటిక్స్..  
తాను ఎప్పుడూ ప్రతీకార రాజకీయాలు చేయలేదని, చిల్లర వ్యాఖ్యలు చేయడం తన పద్ధతి కాదని వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు. కబ్జాలంటూ పేరు బద్నాం చేశారని, వాటికి నేను సరైనా తీరుగా, సమయంలో స్పందించకపోవడం ముప్పుకొచ్చింది. కరోనా సమయంలో రాజకీయ భేదాలు చూడకుండా కాంగ్రెస్ నాయకుల ఇళ్లకు వెళ్లి మందులు, ఇంజెక్షన్లు అందించిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు. తన ఓటమికి గల కారణాలను ఇప్పటికే గుర్తించానని, వాటిని సరిదిద్దుకునే పనిలో ఉన్నానని తెలిపారు. 2029 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ తప్పకుండా ఉంటుందని, అది చిల్లర రాజకీయాలతో కాదు.. తన పనితీరుతోనే ఉంటుందని స్పష్టం చేశారు.

Tags:

కసితో ఎమ్మెల్యేనయ్య

- బిజినెస్ మ్యాన్ ను కావాలనే కాయిస్ ఉండే నాకు - మా అన్న ఎమ్మెల్యే కావాలన్న టార్గెట్ ఉండేది - అయితే ఒక్క అవమానం నన్ను...
రాజకీయం 
Read More...
కసితో ఎమ్మెల్యేనయ్య

రేవూరి, సీఎంపై వ్యాఖ్యలు సరికాదు

రేవూరి, సీఎంపై వ్యాఖ్యలు సరికాదు - కొండా సుస్మిత పటేల్‌ తీరుపై కాంగ్రెస్‌ నేతల మండిపాటు.. - క్షమాపణ చెప్పాలని డిమాండ్ - ఇక్కడ మంత్రి సుష్మతనా...
Read More...
రేవూరి, సీఎంపై వ్యాఖ్యలు సరికాదు

పరకాల కాంగ్రెస్ లో పొలిటికల్ సెగ

- రేవంత్ వ్యాఖ్యలకు కొండా సుస్మిత కౌంటర్- డైపర్లు వేసుకునే వ్యక్తికి మళ్లీ టికెట్ ఇస్తారా? అని ప్రశ్న- “పరకాల నాదే.. టికెట్ ఇచ్చేది...
రాజకీయం 
Read More...
పరకాల కాంగ్రెస్ లో పొలిటికల్ సెగ

వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా

- రిజర్వేషన్లు మారితే నా సతీమణి బరిలో ఉంటారు- పార్టీ నిర్ణయిస్తే మేయర్ గా బరిలోకి.. - నేను పార్టీ విధేయుడిని.. పార్టీ నిర్ణయమే శిరోధార్యం...
రాజకీయం 
Read More...
వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా

పెద్ది విగ్రహం తొలగింపు

- నర్సంపేటలో భారీగా పోలీసుల మోహరింపు.. ఉద్రిక్తత- బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్
రాజకీయం 
Read More...
పెద్ది విగ్రహం తొలగింపు