సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి

సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి

సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి

తెలంగాణ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి

 గుజ్జల ప్రేమేందర్‌రెడ్డి

అక్షరదర్బార్,పరకాల:
 సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు గుజ్జల ప్రేమేందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం పరకాల బీజేపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1948 సెప్టెంబర్‌ 17న సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ చేపట్టిన పోలీసు చర్య అనంతరం హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైందన్నారు. తెలంగాణ చరిత్ర, ఉద్యమాలను పాఠ్యపుస్తకాల్లో చేర్చి విద్యార్థులకు బోధించాలని కోరారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎంఐఎంతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.

బీజేపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్‌ పగడాల కాళీప్రసాద్‌రావు మాట్లాడుతూ.. రజాకారుల దాడులు, అకృత్యాలను చరిత్రలో గుర్తుంచుకోవాలని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహిస్తామని గత ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కాలేదని విమర్శించారు. పరకాలకు వైద్య కళాశాల ఎవరూ తీసుకొచ్చినా స్వాగతిస్తామని, గత పదేళ్లలో ఎందుకు ఏర్పాటు కాలేదని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని ప్రశ్నించారు. కార్యక్రమంలో పరకాల మున్సిపల్ కౌన్సిలర్లు కుక్కల విజయకుమార్, బెజ్జంకి పూర్ణ చారి, ఆకుల లావణ్య శ్రీధర్, జిల్లా కోశాధికారి ఎర్రం రామన్న, పట్టణ ప్రధాన కార్యదర్శి పాలకుర్తి తిరుపతి, దంచనాధుల కిరణ్, మాజీ మున్సిపల్ చైర్మన్ మార్త రాజభద్రయ్య,ఓబీసీ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి ఉడుత చిరంజీవి,జిల్లా నాయకులు బాసాని సోమరాజు, బీసీ మోర్చా మండల అధ్యక్షులు పైండ్ల రంజిత్, నాయకులు కోడెల లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Tags:

సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి

సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి తెలంగాణ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి   గుజ్జల ప్రేమేందర్‌రెడ్డి అక్షరదర్బార్,పరకాల:  సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా బీజేపీ...
Read More...
సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి

మళ్లీ మంచి రోజులొస్తాయి

- కాంగ్రెస్‌ను వీడేది లేదు.. రాహుల్‌ను ప్రధాని చేయడమే మా లక్ష్యం- మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి- పదవులు తాత్కాలికం.. ప్రజల ప్రేమే శాశ్వతం...
రాజకీయం 
Read More...
మళ్లీ మంచి రోజులొస్తాయి

పీఎం శ్రీ నిధుల పంచాయితీపై అధికారుల సీరియస్‌!

అక్షరదర్బార్‌ ఎఫెక్ట్‌..  పీఎం శ్రీ నిధుల పంచాయితీపై అధికారుల సీరియస్‌! వరికోల్‌ ఇద్దరు ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు..  నిధుల వినియోగంపై త్వరలో విచారణ అక్షరదర్బార్,నడికూడ:  పీఎంపీఎం...
Read More...
పీఎం శ్రీ నిధుల పంచాయితీపై అధికారుల సీరియస్‌!

మిట్ట మధ్యాహ్నం దొంగల హల్చల్‌!

మిట్ట మధ్యాహ్నం దొంగల హల్చల్‌! కిటికీ తెరిచి.. ఇంట్లోకి చొరబాటు..   12 తులాల బంగారం, వెండి పట్టీలు మాయం అక్షరదర్బార్‌, పరకాల:పరకాల పట్టణ నడిబొడ్డున మిట్ట...
Read More...
మిట్ట మధ్యాహ్నం దొంగల హల్చల్‌!

కేదారి దంపతులది ఆత్మహత్య!

- అవమానంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న దంపతులు
క్రైమ్ 
Read More...
కేదారి దంపతులది ఆత్మహత్య!