వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా
- రిజర్వేషన్లు మారితే నా సతీమణి బరిలో ఉంటారు
- పార్టీ నిర్ణయిస్తే మేయర్ గా బరిలోకి..
- నేను పార్టీ విధేయుడిని.. పార్టీ నిర్ణయమే శిరోధార్యం
- అఫీషియల్ ప్రోగ్రాం కావటం వల్లే సీఎం సభకు అటెండ్ కాలేదు
- ఒకటి రెండు రోజుల్లో 'పశ్చిమ' డివిజన్ కమిటీల ప్రకటన
- దసరా వరకు పార్టీ ఆఫీసు నిర్మాణానికి శంకుస్థాపన
- డిజిటల్ మీడియా చిట్ చాట్ లో డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామిరెడ్డి
వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా
- రిజర్వేషన్లు మారితే నా సతీమణి బరిలో ఉంటారు
- పార్టీ నిర్ణయిస్తే మేయర్ గా బరిలోకి..
- నేను పార్టీ విధేయుడిని.. పార్టీ నిర్ణయమే శిరోధార్యం
- అఫీషియల్ ప్రోగ్రాం కావటం వల్లే సీఎం సభకు అటెండ్ కాలేదు
- ఒకటి రెండు రోజుల్లో 'పశ్చిమ' డివిజన్ కమిటీల ప్రకటన
- దసరా వరకు పార్టీ ఆఫీసు నిర్మాణానికి శంకుస్థాపన
- డిజిటల్ మీడియా చిట్ చాట్ లో డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామిరెడ్డి
అక్షరదర్బార్, హనుమకొండ
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇనుగాల పోటీలో ఉండటం ఖాయమని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామిరెడ్డి ప్రకటించారు. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) జరిగి తనకు పోటీ చేసే అవకాశం రాకపోతే తన సతీమణి అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉంటారని ఆయన స్పష్టం చేశారు. హనుమకొండలోని తన నివాసంలో మంగళవారం డిజిటల్ మీడియా చిట్ చాట్ లో వెంకట్రామిరెడ్డి మాట్లాడారు. ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. 2010 నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న. ప్రధానంగా 2012 నుంచి పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్న. తాను పూర్తిగా పార్టీ విధేయుడిని. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేసే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ తనకు కల్పించింది. ఓటమి ఎదురైనప్పటికీ నిరుత్సాహపడకుండా పార్టీ పటిష్టత కోసం పనిచేశాను. పరకాల శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జీరో నుంచి నెంబర్ వన్ స్థానానికి చేరుకోవడంలో కీలకపాత్ర వహించాను. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో, తర్వాత 2023 శాసనసభ ఎన్నికల్లో పరకాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆశించాను. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు పోటీ చేయకుండా రెండు సార్లు కూడా అభ్యర్థిత్వం బరిలో నుంచి తప్పుకున్న. మొదటి నుంచి కూడా ఒక కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటున్న. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధిష్టానం కచ్చితంగా తనకు పోటీ చేసే అవకాశం కల్పిస్తుందని విశ్వసిస్తున్న. ఎందుకంటే రెండుసార్లు వద్దని చెప్పిన పార్టీ మూడోసారి కూడా పోటీ ఊరుకోమని చెప్పదని నమ్ముతున్న. ఈసారి కచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఇనుగాల పోటీలో ఉండటం పక్కా. డీలిమిటేషన్ వల్ల రిజర్వేషన్లు మారి పోటీ చేయటానికి నాకు అవకాశం లేకపోతే నా సతీమణి బరిలో ఉంటారు.
- పార్టీ నిర్ణయిస్తే మేయర్ గా..
పార్టీ నిర్ణయమే నాకు శిరోధార్యం. త్వరలో జరిగే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించనుంది. పార్టీ ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లలో 46 నుంచి 48 డివిజన్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్లు రిపోర్టు వచ్చింది. కార్పొరేషన్ ఎన్నికలకు మరికొంత సమయం ఉన్నందున కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే డివిజన్ల సంఖ్య మరింత పెరగనుంది. నాకు ఈ పదవి కావాలని అడుగను. పార్టీ నిర్ణయిస్తే జీడబ్ల్యూఎంసీ మేయర్ పదవిని వద్దనను.
- అది అఫీషియల్ ప్రోగ్రాం
పరకాలలో ఈనెల 16న జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ పర్యటన అఫీషియల్ ప్రోగ్రాం. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా బహిరంగ సభ జరిగింది. అది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదు. ప్రభుత్వ కార్యక్రమం కావటం వల్ల నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న బహిరంగ సభకు హాజరు కాలేదు. పార్టీ కార్యక్రమం కాదనే నేను ఆ బహిరంగ సభకు దూరంగా ఉన్న.
- త్వరలో పార్టీ ఆఫీసుకు శంకుస్థాపన
హనుమకొండలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన జరగనుంది. దసరా వరకు జరగవచ్చు. జిల్లా పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం ముఖ్య నేతలతో ప్రత్యేకంగా కమిటీ ఏర్పడింది. ఇప్పటివరకు డీసీసీ పరిధిలో వివిధ కమిటీల ఎన్నిక జరిగింది. జిల్లాలో పార్టీ గ్రామ, మండల కమిటీల ఎన్నిక కూడా జరిగింది. నగరంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోగల డివిజన్ల కమిటీలను కూడా ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తాం.