ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

టీపీయూఎస్‌ జిల్లా స్థాయి పురస్కారాలు

అక్షరదర్బార్ నడికూడ: 
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్‌) వరంగల్‌–హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సామ జగన్మోహన్‌ స్మారక భవనంలో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ సన్మాన సభ నిర్వహించారు. వ్యాస మహర్షి జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో నడికూడ మండలానికి చెందిన నలుగురు ఉపాధ్యాయులను సన్మానించారు.
పులిగిల్ల ఎంపీయూపీఎస్‌ ఉపాధ్యాయురాలు కె.కవిత, నార్లాపూర్‌ ఎంపీపీఎస్‌ ఉపాధ్యాయురాలు ఎం.శ్రీదేవి, కౌకొండ ఎస్‌ఏ (ఆర్ట్స్‌) సాంబరాజు, నడికూడ జెడ్పీహెచ్‌ఎస్‌ ఉపాధ్యాయురాలు జ్యోత్స్నలను వృత్తిపట్ల అంకితభావం, నిబద్ధతతో సేవలందిస్తున్నందుకు శాలువా, జ్ఞాపిక, ప్రశంసాపత్రాలతో సన్మానించారు.గత 20 ఏళ్లుగా ఎలాంటి దరఖాస్తు విధానం లేకుండా వివిధ కేటగిరీల్లో ఉత్తమ సేవలందిస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి సన్మానించే సంప్రదాయాన్ని టీపీయూఎస్‌ కొనసాగిస్తోందని జిల్లా అధ్యక్షుడు మాచర్ల భిక్షపతి తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంటయ్యతోపాటు జిల్లా నాయకులు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Tags:

ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం టీపీయూఎస్‌ జిల్లా స్థాయి పురస్కారాలు అక్షరదర్బార్ నడికూడ: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్‌) వరంగల్‌–హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం...
Read More...
ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

మూడు తరాలుగా సేవా సంకల్పం

మూడు తరాలుగా సేవా సంకల్పం ‘సేవా సంకల్ప్ అభియాన్‌’లో డా. సిరంగి సౌందరయ్య మనవడు రక్తదానం అక్షరదర్బార్,పరకాల: ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్ల...
Read More...
మూడు తరాలుగా సేవా సంకల్పం

మల్లక్కపేట ఆలయంలో దొంగల కలకలం!

మల్లక్కపేట ఆలయంలో దొంగల కలకలం! హుండీ మాయం..   23 నుంచి పనిచేయని సీసీ కెమెరాలు  పోలీసులకు సమాచారం అక్షరదర్బార్, పరకాల: పరకాల ప్రాంతంలోని ప్రముఖ మల్లక్కపేట అభయాంజనేయ...
Read More...
మల్లక్కపేట ఆలయంలో దొంగల కలకలం!

రబీ ప్రణాళికపై అధికారుల సమన్వయ సమావేశం

రబీ ప్రణాళికపై అధికారుల సమన్వయ సమావేశం కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుపై చర్చ..  ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం అక్షర దర్బార్, హనుమకొండ: రబీ సీజన్‌ కార్యాచరణ...
Read More...
రబీ ప్రణాళికపై అధికారుల సమన్వయ సమావేశం

మమతానగర్‌లో  గణేష్‌ నవరాత్రి ముగింపు

మమతానగర్‌లో  గణేష్‌ నవరాత్రి ముగింపు రూ.45,116కు లడ్డూ ప్రసాదం.. అక్షరదర్బార్, పరకాల:పరకాల పట్టణంలోని మమతానగర్‌ కాలనీలో గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు బుధవారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా...
Read More...
మమతానగర్‌లో  గణేష్‌ నవరాత్రి ముగింపు