మూడు తరాలుగా సేవా సంకల్పం
మూడు తరాలుగా సేవా సంకల్పం
‘సేవా సంకల్ప్ అభియాన్’లో డా. సిరంగి సౌందరయ్య మనవడు రక్తదానం
అక్షరదర్బార్,పరకాల:
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్ల సేవా ప్రస్థానం పూర్తిచేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా ఆదివారం పరకాలలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. బీజేవైఎం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు పున్నం వేణు ఆధ్వర్యంలో పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా ‘నేను సైతం..’ అంటూ బీజేపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ సిరంగి సంతోష్‌కుమార్ కుమారుడు, డాక్టర్ సిరంగి సౌందరయ్య మనవడు డాక్టర్ సిరంగి రాజచైతన్య రక్తదానం చేశారు. బీజేపీ కోసం మూడు తరాలుగా సేవలందిస్తున్న సిరంగి సౌందరయ్య కుటుంబం నుంచి యువతరం కూడా సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం విశేషంగా నిలిచింది.
డాక్టర్ సిరంగి సౌందరయ్య నుంచి ఆయన కుమారుడు డాక్టర్ సిరంగి సంతోష్‌కుమార్, మనవడు డాక్టర్ సిరంగి రాజచైతన్య వరకు మూడు తరాలు బీజేపీకి సేవలందించడం ఆ కుటుంబానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది.