ఏసీబీ వలలో తహశీల్దార్
- రూ.14 వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన సృజన్
- తహసీల్దార్ ఆఫీస్ లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు
- భూమి మార్పిడి కోసం లంచం డిమాండ్
- ఏసీబీ అధికారుల అదుపులో తహసీల్దార్
ఏసీబీకి వలలో తహసీల్దార్
- రూ.14 వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన సృజన్
- తహసీల్దార్ ఆఫీస్ లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు
- భూమి మార్పిడి కోసం లంచం డిమాండ్
- ఏసీబీ అధికారుల అదుపులో తహసీల్దార్
అక్షరదర్బార్, గోవిందరావుపేట: ములుగు జిల్లా గోవిందరావుపేట తహసీల్దార్ సృజన్‌కుమార్ రూ.14 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. వేరే ఒకరి పేర భూమి మార్పిడి ప్రక్రియ కోసం లంచం డిమాండ్ చేసిన ఫిర్యాదుపై ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడి చేసినట్లు తెలిసింది. తహసీల్దార్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు, సోదాలు నిర్వహిస్తున్నారు. లంచం తీసుకున్న ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. భూమి మార్పిడి కోసం కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు డిమాండ్ చేశారన్న ఫిర్యాదుతో ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఏసీబీ అధికారులు తహసీల్దార్ సృజన్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. సోదాలు పూర్తయిన తర్వాత కేసు నమోదు, స్వాధీనం చేసుకున్న నగదు, ఇతర వివరాలపై ఏసీబీ అధికారులు ప్రకటన విడుదల చేయనున్నారు.