మహిళా ఉద్యోగులకు వేధింపులు

మహిళా ఉద్యోగులకు వేధింపులు

మహిళా ఉద్యోగులకు వేధింపులు
 
- ఓ ప్రభుత్వ కార్యాలయంలో కలకలం

- ఉన్నతాధికారిపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం

అక్షరదర్బార్, హనుమకొండ: హనుమకొండ జిల్లా డివిజన్‌లోని ఓ ఉన్నతాధికారిపై మహిళా ఉద్యోగులు వేధింపుల ఆరోపణలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన కింద పనిచేసే మహిళా సిబ్బందితో సదరు ఉన్నతాధికారి అనుచితంగా ప్రవర్తిస్తూ మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.
ఈ వ్యవహారంపై స్థానిక ఎమ్మెల్యేకు కూడా కొందరు మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తాము పనిచేస్తున్న కార్యాలయంలో విధులు నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్నాయని, ఇక్కడ పనిచేయడం కంటే సెలవులు తీసుకోవడమే మేలని కొందరు మహిళా ఉద్యోగులు తమ సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది.
సదరు అధికారి వద్ద పనిచేయడానికి భద్రతాభావం లేకపోవడంతో పలువురు మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. అవసరమైతే సంబంధిత అధికారిని బదిలీ చేయాలని, లేదంటే మహిళా ఉద్యోగులకు ప్రత్యామ్నాయంగా బదిలీలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags:

పరకాలకు పారిశుధ్య ముప్పు

  పరకాలకు పారిశుధ్య ముప్పు వర్షాల వేళ వార్డుల్లో పేరుకుపోతున్న చెత్త..  స్వైర విహారం చేస్తున్న పందులు..  దుర్వాసనతో ప్రజల అవస్థలు..  అక్షరదర్బార్,పరకాల:వర్షాకాలంలో పరకాల పట్టణంలో పారిశుధ్య...
Read More...
పరకాలకు పారిశుధ్య ముప్పు

పీడీఎస్ రైస్ పట్టివేత

- 62 బస్తాల బియ్యం స్వాధీనం - టాస్క్‌ఫోర్స్ దాడిలో అక్రమ నిల్వ బట్టబయలు
వార్తలు 
Read More...
పీడీఎస్ రైస్ పట్టివేత

ఏసీబీ వలలో తహశీల్దార్

- చేర్యాల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు - రూ.70 వేల లంచంతో పట్టుబడిన తహశీల్దార్ 
క్రైమ్ 
Read More...
ఏసీబీ వలలో తహశీల్దార్

గోదావరి జలాలను వృదా చేయొద్దు

- వెంటనే కన్నెపల్లి మోటార్లు ప్రారంభించాలి- లేకపోతే 50 వేల మంది రైతులతో వచ్చి పంప్‌హౌస్‌ను మేమే ఆన్ చేస్తాం- కేసీఆర్‌కు వారం రోజులు...
వార్తలు 
Read More...
గోదావరి జలాలను వృదా చేయొద్దు

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు అక్షరదర్బార్,నడికూడ: నడికూడ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మండల జర్నలిస్టుల...
Read More...
నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ