ఫర్టిలైజర్ షాపులకు బంద్ పిలుపు...

ఫర్టిలైజర్ షాపులకు బంద్ పిలుపు...

ఫర్టిలైజర్ షాపులకు బంద్ పిలుపు...

స్వచ్చందంగా మూసివేతకు డీలర్లకు విజ్ఞప్తి

రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొలం సత్యనారాయణ రెడ్డి

అక్షరదర్బార్, హనుమకొండ:
వరంగల్ జిల్లా ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శివనగర్‌లోని అసోసియేషన్ భవనంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అఖిల భారత మరియు తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్లు ఇచ్చిన బంద్ పిలుపుకు మద్దతుగా వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని ఫర్టిలైజర్ దుకాణాలను సోమవారం స్వచ్చందంగా మూసివేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొలం సత్యనారాయణ రెడ్డి డీలర్లను కోరారు.ఎరువుల సరఫరాలో ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
సమావేశంలో రాష్ట్ర కార్యదర్శులు పల్లె రాజేందర్ రెడ్డి, గాయపు రాంచంద్రారెడ్డి, జిల్లా కోశాధికారి బి.యన్. రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ లాహోటి, అచ్చ పరమేశ్వర్, కల్చరల్ సెక్రటరీలు దేసు ప్రవీణ్, ముక్కెర యతీష్, జాయింట్ సెక్రటరీ గోమాత సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

పరకాలకు పారిశుధ్య ముప్పు

  పరకాలకు పారిశుధ్య ముప్పు వర్షాల వేళ వార్డుల్లో పేరుకుపోతున్న చెత్త..  స్వైర విహారం చేస్తున్న పందులు..  దుర్వాసనతో ప్రజల అవస్థలు..  అక్షరదర్బార్,పరకాల:వర్షాకాలంలో పరకాల పట్టణంలో పారిశుధ్య...
Read More...
పరకాలకు పారిశుధ్య ముప్పు

పీడీఎస్ రైస్ పట్టివేత

- 62 బస్తాల బియ్యం స్వాధీనం - టాస్క్‌ఫోర్స్ దాడిలో అక్రమ నిల్వ బట్టబయలు
వార్తలు 
Read More...
పీడీఎస్ రైస్ పట్టివేత

ఏసీబీ వలలో తహశీల్దార్

- చేర్యాల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు - రూ.70 వేల లంచంతో పట్టుబడిన తహశీల్దార్ 
క్రైమ్ 
Read More...
ఏసీబీ వలలో తహశీల్దార్

గోదావరి జలాలను వృదా చేయొద్దు

- వెంటనే కన్నెపల్లి మోటార్లు ప్రారంభించాలి- లేకపోతే 50 వేల మంది రైతులతో వచ్చి పంప్‌హౌస్‌ను మేమే ఆన్ చేస్తాం- కేసీఆర్‌కు వారం రోజులు...
వార్తలు 
Read More...
గోదావరి జలాలను వృదా చేయొద్దు

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు అక్షరదర్బార్,నడికూడ: నడికూడ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మండల జర్నలిస్టుల...
Read More...
నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ