షార్ట్‌సర్క్యూట్‌తో మొక్కజొన్న చేనులలో మంటలు

షార్ట్‌సర్క్యూట్‌తో మొక్కజొన్న చేనులలో మంటలు

గాలి బీభత్సం..

 షార్ట్‌సర్క్యూట్‌తో మొక్కజొన్న చేనులలో మంటలు

హుస్సేన్‌పల్లి శివారులో రైతుల్లో ఆందోళన.. 

అదుపులోకి రాని అగ్నిజ్వాలలు

అక్షరదర్బార్, శాయంపేట:
శాయంపేట మండలంలోని హుస్సేన్‌పల్లి గ్రామ శివారులో హనుమాన్ టెంపుల్ ప్రాంతంలో ఆదివారం గాలి బీభత్సానికి విద్యుత్ తీగలు తాకి షార్ట్‌సర్క్యూట్ ఏర్పడటంతో మొక్కజొన్న చేనుల్లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు గాలికి వేగంగా వ్యాపించి పంటచేలను ఆవరించాయి.ఈ ప్రాంతంలో కొంతమంది రైతుల మొక్కజొన్న పంట ఇంకా కోతకు రాకపోవడంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. స్థానిక రైతులు, గ్రామస్థులు కలిసి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ గాలివేగం కారణంగా మంటలు అదుపులోకి రావడం లేదని తెలిపారు.ఆరుగాలం శ్రమించి పండించిన పంట అగ్నికి ఆహుతి అయితే తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తేవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Tags:

పరకాలకు పారిశుధ్య ముప్పు

  పరకాలకు పారిశుధ్య ముప్పు వర్షాల వేళ వార్డుల్లో పేరుకుపోతున్న చెత్త..  స్వైర విహారం చేస్తున్న పందులు..  దుర్వాసనతో ప్రజల అవస్థలు..  అక్షరదర్బార్,పరకాల:వర్షాకాలంలో పరకాల పట్టణంలో పారిశుధ్య...
Read More...
పరకాలకు పారిశుధ్య ముప్పు

పీడీఎస్ రైస్ పట్టివేత

- 62 బస్తాల బియ్యం స్వాధీనం - టాస్క్‌ఫోర్స్ దాడిలో అక్రమ నిల్వ బట్టబయలు
వార్తలు 
Read More...
పీడీఎస్ రైస్ పట్టివేత

ఏసీబీ వలలో తహశీల్దార్

- చేర్యాల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు - రూ.70 వేల లంచంతో పట్టుబడిన తహశీల్దార్ 
క్రైమ్ 
Read More...
ఏసీబీ వలలో తహశీల్దార్

గోదావరి జలాలను వృదా చేయొద్దు

- వెంటనే కన్నెపల్లి మోటార్లు ప్రారంభించాలి- లేకపోతే 50 వేల మంది రైతులతో వచ్చి పంప్‌హౌస్‌ను మేమే ఆన్ చేస్తాం- కేసీఆర్‌కు వారం రోజులు...
వార్తలు 
Read More...
గోదావరి జలాలను వృదా చేయొద్దు

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు అక్షరదర్బార్,నడికూడ: నడికూడ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మండల జర్నలిస్టుల...
Read More...
నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ