సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

27 మందికి సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

పేద ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు సీఎం సహాయ నిధి

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు


అక్షరదర్బార్, శాయంపేట: 
శాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం నిర్వహించిన సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) 30వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు 27 మంది లబ్ధిదారులకు రూ.6,85,500 విలువైన చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో కవర్ కాని వైద్య చికిత్సలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు పేర్కొన్నారు.
నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద రోగులు ఆసుపత్రి నుంచి ఎస్టిమేషన్ కాపీ సమర్పిస్తే ప్రభుత్వం ఎల్‌ఓసీ మంజూరు చేసి చికిత్సకు అవసరమైన సహాయాన్ని అందిస్తోందని చెప్పారు. పేద ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు.
కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Tags:

మళ్లీ మంచి రోజులొస్తాయి

- కాంగ్రెస్‌ను వీడేది లేదు.. రాహుల్‌ను ప్రధాని చేయడమే మా లక్ష్యం- మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి- పదవులు తాత్కాలికం.. ప్రజల ప్రేమే శాశ్వతం...
రాజకీయం 
Read More...
మళ్లీ మంచి రోజులొస్తాయి

పీఎం శ్రీ నిధుల పంచాయితీపై అధికారుల సీరియస్‌!

అక్షరదర్బార్‌ ఎఫెక్ట్‌..  పీఎం శ్రీ నిధుల పంచాయితీపై అధికారుల సీరియస్‌! వరికోల్‌ ఇద్దరు ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు..  నిధుల వినియోగంపై త్వరలో విచారణ అక్షరదర్బార్,నడికూడ:  పీఎంపీఎం...
Read More...
పీఎం శ్రీ నిధుల పంచాయితీపై అధికారుల సీరియస్‌!

మిట్ట మధ్యాహ్నం దొంగల హల్చల్‌!

మిట్ట మధ్యాహ్నం దొంగల హల్చల్‌! కిటికీ తెరిచి.. ఇంట్లోకి చొరబాటు..   12 తులాల బంగారం, వెండి పట్టీలు మాయం అక్షరదర్బార్‌, పరకాల:పరకాల పట్టణ నడిబొడ్డున మిట్ట...
Read More...
మిట్ట మధ్యాహ్నం దొంగల హల్చల్‌!

కేదారి దంపతులది ఆత్మహత్య!

- అవమానంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న దంపతులు
క్రైమ్ 
Read More...
కేదారి దంపతులది ఆత్మహత్య!

తల్లిదండ్రుల ముందే ఉపాధ్యాయుల రగడ!

తల్లిదండ్రుల ముందే ఉపాధ్యాయుల రగడ! పీఎం శ్రీ నిధుల ఖర్చుపై వివాదం..   పరస్పరం ఆరోపణలు..  పోలీసులకు ఫిర్యాదు చేసిన హెడ్మాస్టర్ అక్షరదర్బార్, నడికూడ: సమాజంలో గౌరవప్రదమైన వృత్తిగా...
Read More...
తల్లిదండ్రుల ముందే ఉపాధ్యాయుల రగడ!