దొంగతనం కేసు ఛేదన

దొంగతనం కేసు ఛేదన

ఆరుగురు నిందితుల అరెస్టు..

రూ.1.50 లక్షల నగదు స్వాధీనం

అక్షరదర్బార్, కాళేశ్వరం:
గత ఏడాది నిర్వహించిన సరస్వతీ పుష్కరాల సందర్భంగా భక్తుల కోసం ఏర్పాటు చేసిన టెంట్ సిటీలోని ఎనిమిది ఏసీ ఔటర్ యూనిట్లు దొంగిలించిన కేసును కాళేశ్వరం పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.1.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. టెంట్ సిటీ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కాళేశ్వరం పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 59/2025 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా కాళేశ్వరం గ్రామానికి చెందిన మహేందర్, నారాయణ, జావేద్, సమ్మయ్య, సృజన్, సాయిలను అదుపులోకి తీసుకుని విచారించగా, టెంట్ సిటీలో ఏర్పాటు చేసిన ఎనిమిది ఏసీ ఔటర్ యూనిట్లను దొంగిలించినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. దొంగిలించిన ఏసీ ఔటర్ యూనిట్లను గుర్తు తెలియని వ్యక్తికి విక్రయించి పొందిన రూ.1.50 లక్షల నగదును నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులపై చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఎస్‌ఐ, సిబ్బందికి అభినందనలు

కేసును వేగంగా ఛేదించి నిందితులను గుర్తించి అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన కాళేశ్వరం ఎస్‌ఐ తమాషా రెడ్డి, పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

Tags:

పరకాలకు పారిశుధ్య ముప్పు

  పరకాలకు పారిశుధ్య ముప్పు వర్షాల వేళ వార్డుల్లో పేరుకుపోతున్న చెత్త..  స్వైర విహారం చేస్తున్న పందులు..  దుర్వాసనతో ప్రజల అవస్థలు..  అక్షరదర్బార్,పరకాల:వర్షాకాలంలో పరకాల పట్టణంలో పారిశుధ్య...
Read More...
పరకాలకు పారిశుధ్య ముప్పు

పీడీఎస్ రైస్ పట్టివేత

- 62 బస్తాల బియ్యం స్వాధీనం - టాస్క్‌ఫోర్స్ దాడిలో అక్రమ నిల్వ బట్టబయలు
వార్తలు 
Read More...
పీడీఎస్ రైస్ పట్టివేత

ఏసీబీ వలలో తహశీల్దార్

- చేర్యాల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు - రూ.70 వేల లంచంతో పట్టుబడిన తహశీల్దార్ 
క్రైమ్ 
Read More...
ఏసీబీ వలలో తహశీల్దార్

గోదావరి జలాలను వృదా చేయొద్దు

- వెంటనే కన్నెపల్లి మోటార్లు ప్రారంభించాలి- లేకపోతే 50 వేల మంది రైతులతో వచ్చి పంప్‌హౌస్‌ను మేమే ఆన్ చేస్తాం- కేసీఆర్‌కు వారం రోజులు...
వార్తలు 
Read More...
గోదావరి జలాలను వృదా చేయొద్దు

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు అక్షరదర్బార్,నడికూడ: నడికూడ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మండల జర్నలిస్టుల...
Read More...
నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ