ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడి దారుణ హత్య

ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడి దారుణ హత్య

ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడి దారుణ హత్య

షాప్ మూసి ఇంటికి వెళ్తుండగా ఘటన.. 
పరారీలో నిందితుడు 

అక్షరదర్బార్, రేగొండ: 
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని రంగయ్యపల్లి గ్రామానికి చెందిన జట్టి శ్రావణ్ (35) మండల కేంద్రంలో వైన్స్ షాప్ ఎదుట ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి సుమారు 10 గంటలకు షాప్ మూసి ఇంటికి వెళ్తుండగా మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు అతనిపై దాడి చేసి హత్య చేసినట్లు ఎస్సై దాసరి సుధాకర్ తెలిపారు. హత్యకు గల కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు ఘటన అనంతరం పరారైనట్లు తెలిపారు. మృతుడు శ్రావణ్‌కు భార్య మౌనిక, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై వెల్లడించారు.

Tags:

మళ్లీ మంచి రోజులొస్తాయి

- కాంగ్రెస్‌ను వీడేది లేదు.. రాహుల్‌ను ప్రధాని చేయడమే మా లక్ష్యం- మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి- పదవులు తాత్కాలికం.. ప్రజల ప్రేమే శాశ్వతం...
రాజకీయం 
Read More...
మళ్లీ మంచి రోజులొస్తాయి

పీఎం శ్రీ నిధుల పంచాయితీపై అధికారుల సీరియస్‌!

అక్షరదర్బార్‌ ఎఫెక్ట్‌..  పీఎం శ్రీ నిధుల పంచాయితీపై అధికారుల సీరియస్‌! వరికోల్‌ ఇద్దరు ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు..  నిధుల వినియోగంపై త్వరలో విచారణ అక్షరదర్బార్,నడికూడ:  పీఎంపీఎం...
Read More...
పీఎం శ్రీ నిధుల పంచాయితీపై అధికారుల సీరియస్‌!

మిట్ట మధ్యాహ్నం దొంగల హల్చల్‌!

మిట్ట మధ్యాహ్నం దొంగల హల్చల్‌! కిటికీ తెరిచి.. ఇంట్లోకి చొరబాటు..   12 తులాల బంగారం, వెండి పట్టీలు మాయం అక్షరదర్బార్‌, పరకాల:పరకాల పట్టణ నడిబొడ్డున మిట్ట...
Read More...
మిట్ట మధ్యాహ్నం దొంగల హల్చల్‌!

కేదారి దంపతులది ఆత్మహత్య!

- అవమానంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న దంపతులు
క్రైమ్ 
Read More...
కేదారి దంపతులది ఆత్మహత్య!

తల్లిదండ్రుల ముందే ఉపాధ్యాయుల రగడ!

తల్లిదండ్రుల ముందే ఉపాధ్యాయుల రగడ! పీఎం శ్రీ నిధుల ఖర్చుపై వివాదం..   పరస్పరం ఆరోపణలు..  పోలీసులకు ఫిర్యాదు చేసిన హెడ్మాస్టర్ అక్షరదర్బార్, నడికూడ: సమాజంలో గౌరవప్రదమైన వృత్తిగా...
Read More...
తల్లిదండ్రుల ముందే ఉపాధ్యాయుల రగడ!