మిట్ట మధ్యాహ్నం దొంగల హల్చల్‌!

మిట్ట మధ్యాహ్నం దొంగల హల్చల్‌!

మిట్ట మధ్యాహ్నం దొంగల హల్చల్‌!

కిటికీ తెరిచి.. ఇంట్లోకి చొరబాటు..

 12 తులాల బంగారం, వెండి పట్టీలు మాయం

అక్షరదర్బార్‌, పరకాల:
పరకాల పట్టణ నడిబొడ్డున మిట్ట మధ్యాహ్నం దొంగలు హల్‌చల్‌ చేయడం కలకలం రేపింది. పరకాల పట్టణంలోని మెయిన్‌రోడ్డులో ఉన్న ఓ కిరాణా దుకాణం యజమాని ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి సుమారు 12 తులాల బంగారంతో పాటు రెండు జతల వెండి పట్టీలు అపహరించినట్లు ఇంటి యజమాని ముక్క ప్రకాశం పోలీసులకు సమాచారం ఇచ్చారు. కిరాణా దుకాణం యజమాని, కుటుంబ సభ్యులు మాసికానికి వెళ్లి తిరిగి వచ్చే సమయానికి ఇంటి వెనుక కిటికీ తెరిచి కనిపించింది. అనుమానం వచ్చిన వారు ఇంట్లో పరిశీలించగా బీరువాలో ఉంచిన బంగారం, వెండి ఆభరణాలు కనిపించకపోవడంతో వెంటనే పరకాల పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. చోరీ జరిగిన తీరుపై దర్యాప్తు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
ఇదే దుకాణంలో గతంలోనూ సుమారు రూ.3 వేల నగదు చోరీకి గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. తాజా ఘటనతో దొంగతనానికి పాల్పడింది పరిచయం ఉన్న వ్యక్తులేనా? అనే అనుమానాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయంపై పోలీసులు ఎలాంటి నిర్ధారణ చేయలేదు. చోరీకి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Tags:

మిట్ట మధ్యాహ్నం దొంగల హల్చల్‌!

మిట్ట మధ్యాహ్నం దొంగల హల్చల్‌! కిటికీ తెరిచి.. ఇంట్లోకి చొరబాటు..   12 తులాల బంగారం, వెండి పట్టీలు మాయం అక్షరదర్బార్‌, పరకాల:పరకాల పట్టణ నడిబొడ్డున మిట్ట...
Read More...
మిట్ట మధ్యాహ్నం దొంగల హల్చల్‌!

కేదారి దంపతులది ఆత్మహత్య!

- అవమానంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న దంపతులు
క్రైమ్ 
Read More...
కేదారి దంపతులది ఆత్మహత్య!

తల్లిదండ్రుల ముందే ఉపాధ్యాయుల రగడ!

తల్లిదండ్రుల ముందే ఉపాధ్యాయుల రగడ! పీఎం శ్రీ నిధుల ఖర్చుపై వివాదం..   పరస్పరం ఆరోపణలు..  పోలీసులకు ఫిర్యాదు చేసిన హెడ్మాస్టర్ అక్షరదర్బార్, నడికూడ: సమాజంలో గౌరవప్రదమైన వృత్తిగా...
Read More...
తల్లిదండ్రుల ముందే ఉపాధ్యాయుల రగడ!

సేవా కార్యక్రమాలతో ఇనగాల జన్మదిన వేడుకలు

సేవా కార్యక్రమాలతో ఇనగాల జన్మదిన వేడుకలు రక్తదాన శిబిరంలో 132 మంది రక్తదానం..  రక్తదాతలకు టీ-షర్టుల పంపిణీ..   ఘనంగా అన్నదానం అక్షరదర్బార్,పరకాల: హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల...
Read More...
సేవా కార్యక్రమాలతో ఇనగాల జన్మదిన వేడుకలు

పరకాలను అభివృద్ధి చేయాలి

పరకాలను అభివృద్ధి చేయాలి సీఎం సభకు రూ.30 లక్షలు ఖర్చు..  పరకాల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ప్రశ్నించిన ఎమ్మెల్సీ పోచంపల్లి...
Read More...
పరకాలను అభివృద్ధి చేయాలి