చైర్మన్‌గా కొలుగూరి రాజేశ్వరరావు ప్రమాణ స్వీకారం.

చైర్మన్‌గా కొలుగూరి రాజేశ్వరరావు ప్రమాణ స్వీకారం.

కుంకుమేశ్వర ఆలయ అభివృద్ధికి కృషి

చైర్మన్‌గా కొలుగూరి రాజేశ్వరరావు ప్రమాణ స్వీకారం..

 సేవా దృక్పథంతో పనిచేయాలి
 ఎమ్మెల్యే రేవూరి

అక్షరదర్బార్,పరకాల: 
పరకాల పట్టణంలోని కుంకుమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్‌గా కొలుగూరి రాజేశ్వరరావు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఆశీస్సులతో గతంలో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన సమయంలో దేవస్థానానికి సంబంధించిన 4.11 ఎకరాల భూమిని సాధించడంతో పాటు హద్దులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహా రుద్రయాగం, హిందూ సమ్మేళనం, కార్తీక మాస ఉత్సవాలను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించినట్లు పేర్కొన్నారు.
మరోసారి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో దేవస్థానం ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు, ఆదాయ వనరుల కోసం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం దిశగా కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే ఆశీస్సులు, కమిటీ సభ్యులు, భక్తుల సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.

ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ చైర్మన్ కొలుగూరి రాజేశ్వరరావుతో పాటు నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ చైర్మన్ పదవిని లాభాపేక్ష లేకుండా సేవా దృక్పథంతో నిర్వహించాలని సూచించారు. కమిటీ సభ్యుల గుణగణాలను పరిశీలించి, దేవుడి సేవ చేయగలరనే నమ్మకంతోనే బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. రాజేశ్వరరావుకు గతంలో చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఉందన్నారు.
మాజీ చైర్మన్ గందె వెంకటేశ్వర్లు కూడా ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, పార్టీలకు అతీతంగా ఆయనను మరోసారి చైర్మన్‌గా కొనసాగించాలని తాను కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మొలుగూరి భిక్షపతి సర్పంచ్‌గా ఉన్నప్పటి నుంచి ఆలయ భూమి కోసం ప్రయత్నించారని, తన హయాంలో భూమి రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
కుంకుమేశ్వర ఆలయ అభివృద్ధికి రూ.5 కోట్లతో చేపట్టే పనులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతిని కలిసి ఆలయ కుంభాభిషేకం నిర్వహించే విషయంపై చర్చించినట్లు చెప్పారు. కుంకుమేశ్వర స్వామి ఆశీస్సులతో పరకాల పట్టణ అభివృద్ధికి ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్, మున్సిపల్ సిబ్బంది, పుర ప్రముఖులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

చైర్మన్‌గా కొలుగూరి రాజేశ్వరరావు ప్రమాణ స్వీకారం.

కుంకుమేశ్వర ఆలయ అభివృద్ధికి కృషి చైర్మన్‌గా కొలుగూరి రాజేశ్వరరావు ప్రమాణ స్వీకారం..   సేవా దృక్పథంతో పనిచేయాలి  ఎమ్మెల్యే రేవూరి అక్షరదర్బార్,పరకాల: పరకాల పట్టణంలోని కుంకుమేశ్వర స్వామి దేవస్థానం...
Read More...
చైర్మన్‌గా కొలుగూరి రాజేశ్వరరావు ప్రమాణ స్వీకారం.

నా పనితీరే నా బలం

- భూపాలపల్లే నా కుటుంబం.. అభివృద్ధే నా శ్వాస! 
రాజకీయం 
Read More...
నా పనితీరే నా బలం

వీధి కుక్కల దాడిలో 12 గొర్రె పిల్లలు మృతి

వీధి కుక్కల దాడిలో 12 గొర్రె పిల్లలు మృతి రూ.60 వేలకుపైగా నష్టం..   ప్రభుత్వం పరిహారం చెల్లించాలని బాధితుడి వేడుకోలు అక్షరదర్బార్, నడికూడ: నడికూడ మండలంలోని కంటాత్మకూరు...
Read More...
వీధి కుక్కల దాడిలో 12 గొర్రె పిల్లలు మృతి

జనసభలోనే నా ప్రయాణం!

- ఓడినా వెనుకడుగు వేయలేదు.. ప్రజల మధ్యే నిరంతర పోరాటం
రాజకీయం 
Read More...
జనసభలోనే నా ప్రయాణం!

ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం టీపీయూఎస్‌ జిల్లా స్థాయి పురస్కారాలు అక్షరదర్బార్ నడికూడ: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్‌) వరంగల్‌–హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం...
Read More...
ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం