ఊరి మధ్యలో రైస్‌మిల్లు వద్దంటూ రోడ్డెక్కిన ప్రజలు!

ఊరి మధ్యలో రైస్‌మిల్లు వద్దంటూ రోడ్డెక్కిన ప్రజలు!

ఊరి మధ్యలో రైస్‌మిల్లు వద్దంటూ రోడ్డెక్కిన ప్రజలు!

ఆవాసాల మధ్య నిర్మాణంపై తీవ్ర అభ్యంతరం..

 పనులు నిలిపివేయాలంటూ గ్రామసభలో వినతి.. 
చిన్ననాగారం–ఎర్రబెల్లిగూడెం రహదారిపై బైఠాయింపు

అక్షరదర్బార్, ఇనుగుర్తి: ఆవాస ప్రాంతాలకు ఆనుకుని ప్రైవేట్‌ రైస్‌ మిల్లు నిర్మాణం చేపట్టడంపై చిన్ననాగారం గ్రామస్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరుగుతోందని ఆరోపిస్తూ శుక్రవారం గ్రామసభలో అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం నిర్మాణ స్థలం వద్ద, చిన్ననాగారం–ఎర్రబెల్లిగూడెం ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.రైస్‌ మిల్లు ఏర్పాటుతో దుమ్ము, తవుడు, బూడిద తదితర కాలుష్యంతో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. భారీ యంత్రాల శబ్దంతో ప్రజల ప్రశాంతతకు భంగం కలుగుతుందని, పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. మిల్లు నిర్వహణ కోసం వలస కార్మికులు పెద్ద సంఖ్యలో వస్తే సామాజిక, శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం తగదన్నారు. జిల్లా కలెక్టర్‌, కాలుష్య నియంత్రణ మండలి, రెవెన్యూ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని, నిర్మాణానికి సంబంధించిన అనుమతులను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పనులు నిలిపివేయకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేసి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
నిరసనలో గుండాల లక్ష్మారెడ్డి, బైరు రమేష్, ఉడుత సోమయ్య, బొబ్బల దేవరాజు, గుగులోతు లక్ష్మి, మాదగాని ఉమేష్, వోడపల్లి వెంకన్న, ఆలకుంట్ల సోమయ్య, బత్తిని ఐలయ్య, మునిగంటి రమేష్, గుండాల దర్గా స్వామి, నిడిగంటి బిక్షం, గుగులోతు జానీ, మద్దబోయిన సాంబరాజుతో పాటు గ్రామ రైతులు, మహిళలు పాల్గొన్నారు.

Tags:

ఊరి మధ్యలో రైస్‌మిల్లు వద్దంటూ రోడ్డెక్కిన ప్రజలు!

ఊరి మధ్యలో రైస్‌మిల్లు వద్దంటూ రోడ్డెక్కిన ప్రజలు! ఆవాసాల మధ్య నిర్మాణంపై తీవ్ర అభ్యంతరం..   పనులు నిలిపివేయాలంటూ గ్రామసభలో వినతి.. చిన్ననాగారం–ఎర్రబెల్లిగూడెం రహదారిపై బైఠాయింపు అక్షరదర్బార్, ఇనుగుర్తి:...
Read More...
ఊరి మధ్యలో రైస్‌మిల్లు వద్దంటూ రోడ్డెక్కిన ప్రజలు!

తలొంచి బతకడం తెలియదు

- డిజిటల్ మీడియా ప్రతినిధుల చిట్ చాట్ లో తెలంగాణ ఉద్యమకారుల ‘ఐక్యవేదిక’ రాష్ట్ర చైర్మన్ గుడిమళ్ళ రవికుమార్
రాజకీయం 
Read More...
తలొంచి బతకడం తెలియదు

చైర్మన్‌గా కొలుగూరి రాజేశ్వరరావు ప్రమాణ స్వీకారం.

కుంకుమేశ్వర ఆలయ అభివృద్ధికి కృషి చైర్మన్‌గా కొలుగూరి రాజేశ్వరరావు ప్రమాణ స్వీకారం..   సేవా దృక్పథంతో పనిచేయాలి  ఎమ్మెల్యే రేవూరి అక్షరదర్బార్,పరకాల: పరకాల పట్టణంలోని కుంకుమేశ్వర స్వామి దేవస్థానం...
Read More...
చైర్మన్‌గా కొలుగూరి రాజేశ్వరరావు ప్రమాణ స్వీకారం.

నా పనితీరే నా బలం

- భూపాలపల్లే నా కుటుంబం.. అభివృద్ధే నా శ్వాస! 
రాజకీయం 
Read More...
నా పనితీరే నా బలం

వీధి కుక్కల దాడిలో 12 గొర్రె పిల్లలు మృతి

వీధి కుక్కల దాడిలో 12 గొర్రె పిల్లలు మృతి రూ.60 వేలకుపైగా నష్టం..   ప్రభుత్వం పరిహారం చెల్లించాలని బాధితుడి వేడుకోలు అక్షరదర్బార్, నడికూడ: నడికూడ మండలంలోని కంటాత్మకూరు...
Read More...
వీధి కుక్కల దాడిలో 12 గొర్రె పిల్లలు మృతి