వృద్ధురాలి హత్య.. దోపిడీ కేసులో నిందితుడి అరెస్ట్

వృద్ధురాలి హత్య.. దోపిడీ కేసులో నిందితుడి అరెస్ట్

వృద్ధురాలి హత్య.. దోపిడీ కేసులో నిందితుడి అరెస్ట్

పైకప్పు ద్వారా ఇంట్లోకి ప్రవేశం..

 కేకలు వేయడంతో ఇనుపరాడ్‌తో దాడి

రెండు బంగారు పుస్తెలు, రక్తపు మరకల దుస్తులు స్వాధీనం

అక్షరదర్బార్,పరకాల: 
ఆకులవాడలో వృద్ధ మహిళలపై దాడి చేసి ఒకరిని హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ఘటనకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేరెళ్ల రమేష్‌(38)ను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రెండు బంగారు పుస్తెలు, హత్యకు ఉపయోగించిన ఇనుపరాడ్‌, రక్తపు మరకలున్న దుస్తులను స్వాధీనం చేసుకున్నారు.
పరకాల ఏసీపీ సతీష్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఆకులవాడలో వృద్ధ మహిళలపై దాడి, హత్యకు సంబంధించి పరకాల పోలీస్‌స్టేషన్‌లో క్రైం నంబర్‌ 291/2026 కింద బీఎన్‌ఎస్‌ 103(1), 109(1), 329(4) సెక్షన్లతో కేసు నమోదైంది. ఇన్‌స్పెక్టర్‌ ఏ.ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులను చూసి పరుగులు..

శనివారం వెల్లంపల్లి రోడ్డులోని మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లే మార్గంలో పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. పోలీసులను గమనించి పారిపోయేందుకు ప్రయత్నించడంతో అతడిని పట్టుకుని విచారించారు. అతడు రాంనగర్‌కు చెందిన నేరెళ్ల రమేష్‌(38), సదయ్య కుమారుడు, సెంట్రింగ్‌ కార్మికుడిగా గుర్తించారు.

కేకలు వేయడంతో ఇనుపరాడ్‌తో దాడి..

సెప్టెంబరు 30 అర్ధరాత్రి ఆకులవాడలో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధ మహిళల ఇంట్లోకి పైకప్పు ద్వారా ప్రవేశించినట్లు నిందితుడు విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. తనను చూసి మహిళలు కేకలు వేయడంతో పక్కనే ఉన్న ఇనుపరాడ్‌తో దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో కోడెల సుగుణ మృతి చెందగా.. కోడెల లసుమక్క తీవ్రంగా గాయపడ్డారు.
అనంతరం వారి వద్ద ఉన్న రెండు బంగారు పుస్తెలు, రూ.1,000 నగదును తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. మద్యానికి బానిసై, భార్య తనను విడిచి వెళ్లడంతో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు నిందితుడు చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు.

బంగారు పుస్తెలు.. రక్తపు మరకల దుస్తులు స్వాధీనం

నిందితుడి నుంచి సుమారు 2 గ్రాముల బరువున్న రెండు బంగారు పుస్తెలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.30 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితుడు చూపించిన ప్రదేశంలో హత్యకు ఉపయోగించిన ఇనుపరాడ్‌తో పాటు రక్తపు మరకలున్న ఆకుపచ్చ షర్టు, నీలం రంగు జీన్స్‌ ప్యాంటును స్వాధీనం చేసుకున్నారు. నేను సైతం లో భాగంగా ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని ఏసిపి పేర్కొన్నారు.
కేసును చాకచక్యంగా ఛేదించిన ఎస్‌హెచ్‌ఓ ప్రవీణ్‌కుమార్‌, ఎస్సైలు పవన్‌, రఘుపతిని ఏసీపీ సతీష్‌బాబు అభినందించారు. వారికి తగిన రివార్డు అందించనున్నట్లు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ పేర్కొన్నారు.

Tags:

వృద్ధురాలి హత్య.. దోపిడీ కేసులో నిందితుడి అరెస్ట్

వృద్ధురాలి హత్య.. దోపిడీ కేసులో నిందితుడి అరెస్ట్ పైకప్పు ద్వారా ఇంట్లోకి ప్రవేశం..   కేకలు వేయడంతో ఇనుపరాడ్‌తో దాడి రెండు బంగారు పుస్తెలు, రక్తపు మరకల దుస్తులు...
Read More...
వృద్ధురాలి హత్య.. దోపిడీ కేసులో నిందితుడి అరెస్ట్

సోషల్‌ మీడియా మాట నమ్మి మందులు వాడొద్దు

సోషల్‌ మీడియా మాట నమ్మి మందులు వాడొద్దు రసాయన మందులతో పంటలకు నష్టం మాజీ తెలంగాణ రైతు రుణ విమోచన కమిటీ చైర్మన్‌ నాగూర్ల అక్షరదర్బార్,పరకాల: పంటల్లో...
Read More...
సోషల్‌ మీడియా మాట నమ్మి మందులు వాడొద్దు

గురుకులంలో ‘పాము’ కలకలం!

గురుకులంలో ‘పాము’ కలకలం! పాము నుండి తప్పించుకునే క్రమంలో గాయపడ్డ ఐదో తరగతి విద్యార్థిని..  పాములు, కోతుల సంచారంపై తల్లిదండ్రుల ఆందోళన అక్షరదర్బార్, ఇనుగుర్తి: ఇనుగుర్తి సాంఘిక...
Read More...
గురుకులంలో ‘పాము’ కలకలం!

ఊరి మధ్యలో రైస్‌మిల్లు వద్దంటూ రోడ్డెక్కిన ప్రజలు!

ఊరి మధ్యలో రైస్‌మిల్లు వద్దంటూ రోడ్డెక్కిన ప్రజలు! ఆవాసాల మధ్య నిర్మాణంపై తీవ్ర అభ్యంతరం..   పనులు నిలిపివేయాలంటూ గ్రామసభలో వినతి.. చిన్ననాగారం–ఎర్రబెల్లిగూడెం రహదారిపై బైఠాయింపు అక్షరదర్బార్, ఇనుగుర్తి:...
Read More...
ఊరి మధ్యలో రైస్‌మిల్లు వద్దంటూ రోడ్డెక్కిన ప్రజలు!

తలొంచి బతకడం తెలియదు

- డిజిటల్ మీడియా ప్రతినిధుల చిట్ చాట్ లో తెలంగాణ ఉద్యమకారుల ‘ఐక్యవేదిక’ రాష్ట్ర చైర్మన్ గుడిమళ్ళ రవికుమార్
రాజకీయం 
Read More...
తలొంచి బతకడం తెలియదు